🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"15"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం / మోక్ష మార్గం / సృష్టి రహస్యం / ఏడు జన్మలు ఏమిటి ? / నేను అంటే ఎవరు ? / దుఃఖం ఎలా తొలగుతుంది ? / జ్ఞాన విచారణ / మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు "*
*"మనం వెళ్లి ఆ విగ్రహాలకు దణ్ణం పెట్టుకుని ఇక మన పని అయిపోయినట్లుగా భావించి తిరిగి వచ్చేస్తున్నాం.'"*
*"అంటే మన ఉద్దేశ్యంలో భగవంతుడు అంటే ఒక వస్తువా?"*
*"ఒక విగ్రహమా?"*
*"లేక ఒక మానవదేహమా?"*
*"ఇవేవీ భగవంతుడు కాదని గ్రహించండి."*
*"భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇవన్నీ దారి చూపే మార్గాలు."*
*"మార్గాలు ఏర్పరచింది “భగవంతుడు” అనే లక్ష్యం చేరుకోవడానికి."*
*"అంతేగాని ప్రతిసారీ మార్గం వరకూ వెళ్లి లక్ష్యాన్ని వదిలేసి వెనక్కు మరలటానికి కాదు."*
*"భగవంతుడు అంటే ఎప్పటికీ నాశనం అనేది లేనివాడు అనికదా అర్ధం."*
*"మరి ఈ లోకంలోని సకల వస్తువులు శరీరాలు అన్నీ కాలంతో పాటు నశించేవే కదా!"*
*"మరి నశించేవి భగవంతుడు ఎలా అవుతాయి?"*
*"ఏది నశించదో అదే భగవంతుడు. ఏది నశించదు?"*
*"ఏదయితే ఆకారం కాదో అది నశించదు."*
*"అది ఏదంటే వెలుతురును చీకటి చూడగలదా?"*
*చూడలేదు."*
*"అలాగే చీకటిని వెలుతురు చూడగలదా?"*
*చూడలేదు."*
*"ఒకటి వుంటే రెండోది ఉండదు."*
*"కానీ చీకటినీ వెలుతురునీ ఈ రెండింటినీ చూస్తూ ఇది చీకటి ఇది వెలుతురు అని ఏదయితే గ్రహిస్తోందో అదే ‘భగవంతుడు’."*
*"అదే జీవులన్నింటిలోని “ఆత్మ”. ఆత్మకు వెలుతురు కనిపిస్తుంది."*
*చీకటి కనిపిస్తుంది.*
*కానీ వెలుతురుకి చీకటి కనిపించదు.*
*చీకటికి వెలుతురు కనిపించదు."*
*"చీకటీ వెలుతురు అనేవి రెండూ నశించేవి."*
*"వెలుతురు వస్తే చీకటి నశిస్తుంది."*
*"చీకటి వస్తే వెలుతురు నశిస్తుంది."*
*"కానీ ఈ రెండింటినీ చూసేది నశించదు."*
*"అదే ప్రాణులలోని “ఆత్మచైతన్యం”."*
*"తాను కనిపించకుండా అన్నింటినీ చూసేదే “భగవంతుడు” అంటే."*
*"మన ఇంటి పెరటిలో ఒక చెట్టు ఉంది.*
*దాని కొమ్మలు పెరిగి ఇంటి వాకిలికి అడ్డు వస్తున్నాయి. అప్పుడు మనమేమి చేస్తున్నాం."*
*"కత్తితో కొమ్మలను నరికి దారికి అడ్డు తొలగించుకుంటున్నాం."*
*"అలా కాకుండా ఓ వృక్షమా నీ కొమ్మలను వాకిలికి అడ్డుగా రానివ్వకు అని ఆ చెట్టు వినేటట్లు ఆజ్ఞాపించాం అనుకుందాం."*
*"ఆ ఆజ్ఞ వల్ల చెట్టు కొమ్మలు వాకిలికి అడ్డుగా రాకుండా మరొక వైపుగా వెళ్ళిపోతాయా?"*
*"లేదు గదా. ఎందువల్ల?"*
*"మన ఆజ్ఞ ఆ చెట్టు వినదు గనక."*
*ఎందుకు వినదు?*
*"ఎందుకంటే ఆ చెట్టు మనకంటే వేరయిన మనకు సంబంధం లేని బయటి వస్తువు."*
*"ఏదయితే మనం కాదో ఆ మనం కానిదాని యొక్క వృద్ది క్షయం కూడా మన ఆజ్ఞకు లోబడి ఉండదు."*
*"ఈ సిద్దాంతం ప్రకారం ఇప్పుడు మానవ శరీరం యొక్క వ్యవహారం చూద్దాం."*
*"మానవుడు అంటే ఈ శరీరం కాదు అని లోకంలోని ఎందరో జ్ఞానులు సత్యం చెబుతున్నా కాదు కాదు “నేను అంటే నా ఈ శరీరమే” అని మనం నమ్ముతున్నాం గదా!"*
*"ఇప్పుడు ఈ శరీరం దగ్గరకే వద్దాం."*
*"ఈ శరీరంలో జుట్టు పెరిగి ముఖానికి అడ్డుగా వస్తుంటే మనం వెళ్లి కత్తిరించుకుంటున్నాం."*
*"చేతి వ్రేళ్ళ గోళ్ళు పెరిగితే కత్తిరించుకుంటున్నాం."*
*"మరి మనం ఈ శరీరమయితే ఈ శరీరంలోని వెంట్రుకలు, గోళ్ళ పెరుగుదల తరుగుదల మన అదుపులో ఎందుకు ఉండటం లేదు?"*
*"ఈ శరీరంలోని తల వెంట్రుకలు తెల్లబడితే అద్దంలో చూసుకుని అయ్యో నా వెంట్రుకలు అప్పుడే తెల్లగా అయిపోయాయా!"*
*"అని భయపడుతూ రంగు వేసుకుంటున్నాం."*
*"అంతేగాని అవి తెల్లగా మారకుండా మనం ఆపగలుగుతున్నామా?"*
*"పళ్ళు కదులుతుంటే అయ్యో నా పళ్ళు అప్పుడే ఊడిపోతున్నాయా అని భయపడుతున్నాం."*
*"ఈ శరీరం బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్దాప్యం లోకి ప్రవేశిస్తుంది."*
*"ప్రతి మానవుడు యవ్వనాన్ని కోరుకుంటాడు."*
*"వృద్దాప్యం లోకి వెళ్ళాలని ఎవ్వడూ కోరుకోడు."*
*"మరి ఈ శరీరం వృద్దాప్యం లోకి వెళుతుంటే ఈ శరీరాన్ని వృద్దాప్యంలోకి వెళ్ళనివ్వకుండా యవ్వనం లోనే ఎందుకు ఆపలేకపోతున్నాడు."*
*"నేను ఈ శరీరం అనుకునే వాడి ఇష్టా ఇష్టాల ప్రకారం ఈ శరీరంలో ఒక్కటయినా జరుగుతోందా?"*
*"శరీరంలో జరిగే మార్పు చేర్పులను గమనిస్తూ నా కళ్ళల్లో చూపు తగ్గిపోతోందే!"*
*"నా మోకాళ్ళు అరిగిపోతున్నాయే!"*
*"నా చర్మం మునుపటిలా కాంతితో కనిపించడం లేదే అని ఆశ్చర్యపోతున్నాడు గాని.."*
*"శరీరం యొక్క పెరుగుదలను అతడు ఆపగలుగుచున్నాడా?"*
*"ఈ శరీరం నేను అనుకోవడం తప్ప ఈ శరీరం మన మాట ఒక్కటయినా విని ఎక్కడయినా ఆగుతోందా?""*
*"అది ఆగనే ఆగట్లేదు. ఈ శరీరం పుట్టినప్పటి నుంచి నశించేంత వరకు దాని ఇష్ట ప్రకారం అది వెళుతోందిగాని మనం దాన్ని ఎక్కడయినా ఒక్క క్షణం పాటయినా నిలువరించగలిగామా?"*
*"ఇదంతా బహు ఆశ్చర్యకరమయిన విషయం."*
*"ఏ మాత్రం మన అదుపులోలేని దానంతట అది సాగిపోయే శరీరాన్ని చూసుకుని మనం అనుకుంటున్నాం."*
*"ఏదయితే ఈ శరీర యాత్రను బాల్యం నుంచి వృద్దాప్యం వరకూ గమనిస్తూ మనలో ఒక సాక్షి ఉందో దాన్ని మనం చూడలేకపోతున్నాం."*
*"ఎంతటి దుఃఖకరం ఇది. ఈ శరీరాన్ని బాల్యం నుంచి వృద్దాప్యం దాకా చివరకు దీని పతనం వరకూ గూడా దీని యొక్క అన్ని దశలను గమనిస్తూ ఒక సాక్షి ఈ శరీరంలో ఉందో అదే మానవుని రూపం."*
*"మనిషి ఎప్పుడయితే ఆ సాక్షిని ఎరిగి ఈ శరీరం నుంచి తనను తాను వేరు చేసుకుని చూసుకుంటాడో అప్పుడిక ఈ శరీర పతనం అతడి పతనం కాజాలదు."*
*"అలా కాకుండా శరీర మోహం వదల్లేక శరీరాన్నే తగులుకుని వుండి ఈ శరీరమే నేను అనుకుంటూ శరీరం యొక్క లక్షణాలు అయిన బాల్యం, యవ్వనం, వృద్దాప్యం అన్నీ తనకే అనుకుంటూ ఆ శరీర దశలన్నీ ఎవడయితే అనుభవిస్తాడో అతడు శరీరంతో పాటు కూలిపోతాడు."*
*"అలా కూలినవాడు తిరిగి ఇంకో దేహం ధరించి ఈ లోకంలోకి మళ్ళీ వస్తాడు."*
*"మానవుడు ఎప్పటివరకు ఈ శరీరంలో వున్న “ఆత్మ” దర్శనం చేసుకోడో అప్పటి వరకూ జన్మ మరణం అనే అనుభవాలను శరీరంతోపాటే పొందుతూ ఈ లోకంలోకి రాకపోకలు సాగిస్తూనే వుంటాడు."*
*"ఎప్పుడయితే ఏదో ఒక జన్మలో ఈ శరీరాలతో విసిగిపోయి తనలోని వివేకం నిద్ర లేచి తాను కాని ఈ శరీర భ్రమ ను వదిలేసి తన స్వస్వరూపమయిన “ఆత్మ”ను అనుభవంలోకి తెచ్చుకుంటాడో ఇక అతడికి అదే “ఆఖరి జన్మ” అనే బ్రాంతి అవుతుంది."*
*అదే మోక్షం.*
*అదే “బ్రహ్మానందం”.*
*"అట్టి మానవుని యొక్క స్థితే “భగవంతుడు” అనే శబ్దం యొక్క అర్ధం కూడా."*
💖🔥💖🔥💖
💖🕉️💖
No comments:
Post a Comment