Monday, February 27, 2023

****** 🌺నేటి ప్రేమలు 🌺.....అందుకే మానవాళి ప్రేమలన్ని సహజ సిద్ధంగా లేవు.....

 🌺నేటి ప్రేమలు 🌺


🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఎవరైనా మనకి నచ్చగానే, 
    వారికీ మనం నచ్చేసినట్టు అనుకుంటాం 
    పోనీ, వారూ మనని ప్రేమించేయాలని
    ఆశిస్తాం. తీరాచూస్తే అదలా జరగదు. 
    ఎందుకనీ?      

ఎవరైనా మనకి నచ్చటం ఒక సంగతి!
    వారికే మనమూ నచ్చటం మరొక సంగతి!  

     అడవిలో పులి  అందంగా రాచఠీవితో
     భలేగా నచ్చేస్తుంది. కానీ అది మనకి 
     నచ్చినట్టు వుండదే. మనం చెప్పేది 
     దానికి పట్టదు. తేడావస్తే చించి తాట
     వలిచి, వీలైతే భోంచేస్తుంది, మరి అదే
  
     పులి సర్కస్ లోవుంటేనో, సీన్ రివర్స్!
     కూచోమంటే కూచుంటుంది. నించోమంటే
     నించుంటుంది. ట్రెమన్డస్ మార్పు. మరి
     అదెలా సాధ్యం? 

అదేమరి, దాన్ని అలా ట్రైన్ చేస్తారండీ..
     అంటాం simpleగా. అలా చెప్పినంత తేలిగ్గా
     అది జరగటం లేదు! ఒకరి కనుసన్నల్లో అది
     వుంది అంటే, ఆముందు ఒకరెవరో దాని కను       
     చూపులో రెగులర్ గా ఉండివుండాలి. అంటే..

     దానికి నచ్చినట్టు మనం వుండటం,ఎపుడైతే 
     మొదలు పెట్టామో, మనకి నచ్చినట్టు అదీ 
     ఉండటం, స్టార్ట్ చేస్తుంది. మచ్చికంటే ఇదే!

     ఐతే ఈ చిన్నిపదం వెనుక ఎంతో ప్రణాళిక
     వుంది. ప్రయత్నం ఉంది. అంటే.. మొదట  
     దానిని దగ్గర చేసుకోవాలి. దానితో కలిసి
     గడిపే కొన్ని సందర్భాలు రావాలి. వీలైనన్ని

     సార్లు  దాని కనుచూపులో వుంటూ, దానికి 
     ఇష్టమైన ఫీడ్ఇస్తూ ప్రేమని వ్యక్తం చేస్తూ 
     రావాలి. తగిన సాన్నిహిత్యం పెరగాలి.అపుడే 
     దాని మెమోరిలో మనం ఫీడ్ అవగలం. 

    ఇంతకీ, ఈ plan of action  అది  చేయదు.
    ఆ అవకాశం  తీసుకునేది మనం. ఎందుకంటే
    మనకది నచ్చింది. కానీ, దానికి మనం ఇంకా
    నచ్చాల్సివుంది. అలాఐతేనే కనీసం కొన్నాళ్ళ
    కది,మనకి నచ్చేలా మసలుకునే వీలుంది మరి.

     అంటే మనిషిఐనా, మరేప్రాణిఐనా, నీకు 
     నచ్చినట్టు ఉండాలంటే, ముందు నీవూ 
     వారికి నచ్చినట్టువుండాలి. మచ్చికంటే
     దానితో స్నేహం చేయటం. కనీసం స్నేహమే 
     లేకుండా, ప్రేమ ఎలా సాధ్యం? ఉట్టికే ఎగిర
     టం రాకుంటే, ఇక సర్గాన్నెలా చేరెను?
     
 సింపుల్  ఓ పెట్ లవ్  కోసమే, చేయాల్సింది 
    ఇంతవుంటే, మానవుల మధ్య ప్రేమసంబంధాల
    మాటేమిటి?  మనిషితో మరో మనిషికి కలిగే
    ప్రేమ అంత డెడ్ఈజీనా, పోనీ? కాదే...   

ఎవరినైనా నీవు ప్రేమిస్తే
     ఆప్రేమ నీకే పరిమితం. అపుడే పేచీలేదు.
     కానీ నిన్నుకూడా సదరువ్యక్తి  ప్రేమించా 
     లని నీ వనుకుంటే మాత్రం, వారితో కబుర్ల   
     స్నేహాలూ,ఆన్లైన్ ప్రేమలూ కాదు. తగిన 
 
     ప్రత్యక్ష స్నేహం అవసరం. ఎవరిని ప్రేమిస్తు
     న్నామో వారికీ, వీలైనంతగా మనని అర్ధం 
     చేసుకునే సావకాశం, సందర్భం, సమయం              
     వస్తున్నాయా లేదాని చూడకపోతే అదేం
     ప్రేమా!

నిజంగానే నువ్వో అద్భుతాన్ని ప్రేమించవచ్చు.
      లేదా నువ్వు ప్రేమించేది అద్భుతంలా నీ కని
      పించవచ్చు. సంగతది కాదు. ఎదుటివారికి            
      నువ్వూ  ఓ అద్భుతమేనా..!?

      వారుఅది తెలుసుకునే సందర్భంవచ్చిందా?
      ఎందుకంటే..నేరుగా ఒకరి ప్రవర్తన కలిగించే 
      ఇంప్రెషన్..ముఖ్యంగా నడవడి, నవ్వు, మాటా
      దృష్టి.. కలగలిసి వ్యక్తమయ్యే ఓ స్నేహభావన 
      నుండి అభిమానమో, ప్రేమో, ఆత్మీయతో,  
      ఆరాధనో కలిగే అవకాశం వుంది.

అదేం ఖర్మో ..
     ఆన్లైన్ పరిచయాలు పెరిగాక, స్నేహం కంటే
     ప్రేమ జపం ఎక్కువైంది. అదికూడా కబుర్లలో 
     కురిపించే ప్రేమ. ఊహల్లో తేలే ప్రేమా. ఊసుల్లో
     ముంచెత్తే ఊకదంపుడు ప్రేమా, మొత్తానికి టైం 
     పాస్ ప్రేమలు!

      పూర్వం మనుషులు నేరుగా పరిచయం 
      అయ్యాక, స్నేహాలు ఏర్పడుతూ వుండేవి. 
      ఒకరి స్వభావం, తత్వం నేరుగా తెలిసేవి.   
      ఇప్పుడా అవకాశం లేదు. అన్నీ ఆన్లైన్!      
      ప్రాబ్లమ్ అంతా ఇదే, ఇక్కడే మరి!

చందమామ అందంగా ఉంది,
      ఇక్కడనుండి చూస్తే.  మరి, వెళ్లి చూస్తే!?
      అందంగా లేదు. రెండూ వాస్తవాలే!
      కనుక ఒకరిని దూరంనుండి  చూడటానికి, 
      ప్రత్యక్షంగా చూడటానికి తేడా అంతమరి!..

 ఒకరి Frnd req ..ఒకే చేసేస్తే
     frnd ఐపోయినట్టు కాదు. అలానే..
     msgలు, ఫోన్ లు తగిన పరిచయాన్ని 
     ఇస్తాయి. ఒకవేళ ప్రత్యక్ష పరిచయం  
     కూడా కలిగితే, అప్పటికిదాకా ఊహల్లో  
     వున్న స్నేహాన్ని మరింత వాస్తవికతలోకి 
     తెస్తుందది.

 ఐతే వాస్తవంలోకి  రాని, రాలేని.. 
     పరిచయాలు కూడా  అనేకం వుంటేవుండొచ్చు.
     ఆదిచ్చే సంతోషం కూడా విలువైనదే. కాదనను. 
     స్నేహపూర్వకమైన ఓ పలరింపు అన్నిబంధా 
     ల్లోనూ అవసరమే. వుండాలికూడా. అలాఅని 

     స్నేహ భావనతో పలకరించటం కూడా వీర .    
     ప్రేమగా భావించేసుకునే ఉత్సాహం కొందరికి,        
     కవితలూ కాకరకాయలు, కొట్టుకొచ్చిన కొటే
     షన్లు msgsలో పెట్టి, వారి గొప్పప్రేమకి అదే 
     గీటురాయి అనే ఆనందం, మరికొందరికి..

     పరిచయానికి, స్నేహానికి, అభిమానానికి,
     ఆత్మీయతకి, ప్రేమకి, ఆరాధనకి దానిదైన
     శృతి, శైలి వున్నాయి. ఒకదాన్ని మించి 
     ఒకటి సిద్దించటం గొప్పతపస్సు లాంటిదే.

     ఏళ్ళుగడవటం ఓ పరిచయానికి కొలమానం
     కానేకాదు. ఆ కాలాన్ని సిద్దింప చేసుకోవటం
     లెక్క! దేనికైనా మనదైన యత్నం కౌంటబుల్.
     
ఐతే అన్నీ యత్నాలూ 
     మనకి అనుగుణంగానే ఉంటాయా అంటే,
     వుండనూవచ్చు లేకపోనూవచ్చు. అదికాదు విష
     యం. వరాలిస్తానని చెపితేనే దేవుడ్ని; ప్రేమిస్తా
     నని చెపితేనే లవర్నీ చూద్దాం అనుకునేవారుంటే
     అంతకంటే చెత్త  భక్తి, ప్రేమా  ఉంటాయా?

     ఎవరి ఆనందానికి  ప్రేమకి వారే బాధ్యులు. 
     చివరికి  మోక్షము దైవమూ అదేదైనా సరే, 
     మనమై వెతికి దొరికించు కోవాలి. అన్వేషకు 
     లంతా చేసింది ఇదే. ఇవన్నీ స్వయంసిద్ధం!
       
ఇవేం పట్టకుండా
     దూరంగా కూచొని మనపాటికి మనం
     ధారాళంగా దేనినైనా ప్రేమించేసేయవచ్చు..     
     ఓ పులినో, మనిషినో, రాయినో/దైవాన్నో!

     ఐతే, నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా?అని
     వాటికి చెప్పటం  ప్రేమ కాదు. పైగా నువ్వు      
     ప్రేమిస్తూన్నావు కాబట్టి, అవి నిన్నూ ప్రేమించే 
     తీరాలని రూలూ లేదు పోనీ! కనుక ఏదైనా
     మనకి నచ్చేస్తే ఇష్టపడితే..  అదే లవ్ అను
     కోవటం ఉందే..సరిగ్గా ఇదే..
     ప్రాబ్లమ్ అంతా ఇదే .. ఇక్కడేమరి! 

ప్రేమకి వ్యక్తీకరణ ముఖ్యం! అంటే..
      నీవు ప్రేమించే వారికి
      ప్రేమని వ్యక్తం చేయడం ఒక్కటే కాదు. నిన్ను
      నీ వ్యక్తిత్వాన్ని కూడా సరిగ్గా ఆవిష్కరించటం!

      ఓ పువ్వుని చూసి మనం ముచ్చటపడుతున్నాం
      అంటే, ఓ రంగు/పరిమళం నింపిన ఓ రూపాన్ని 
      దానిదైన ప్రత్యేకతని,  సంపూర్ణతని, సొగసుని 
      అది వ్యక్తికరిస్తోంది. అలా తననితాను అందంగా 
      ఆవిష్కరించు కుంటోందని అర్థం. 

అది ఎవరికి
      ప్రేమించానని చెప్పదు. ఐనా అప్రయత్నంగా       
    . దాన్ని ప్రేమిస్తాం.  దాని పారదర్శకత అలాంటిది
      మరి. ఇదే మనుషులకి తక్కువైంది. అందుకే
      మానవాళి ప్రేమలన్ని సహజ సిద్ధంగా లేవు.....
.🌻సర్వేజనాసుఖినోభవంతు 🔥

No comments:

Post a Comment