Tuesday, February 28, 2023

********14. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 🔥 *"14"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*

*"అలా మననం చేయబడ్డ విషయాలు మరింత శక్తిని పుంజుకుని తిరిగి చిత్తంలో పై పై నే ఉంటూ మనస్సు భావించినప్పుడల్లా ఎగిరెగిరి మనస్సులోకి వచ్చి రకరకాల అనుభవాలను మనస్సుకు ఇచ్చి తిరిగి చిత్తం లోకి వెళ్లిపోతుంటాయి."*

*"ఎప్పుడయితే మానవుడు ముక్తిని లక్ష్యంగా చేసుకుని విషయాలను మనస్సుతో స్మరించడం ఆపి వేస్తాడో అప్పుడు మనస్సు చిత్తంలోని పాత జ్ఞాపకాలను వెనక్కు తీసికుని మననం చెయ్యాలని ప్రయత్నిస్తుంటుంది."* 

*"అట్టి స్థితిలో మానవుడు తన బుద్ధి బలంతో మనస్సును కట్టడి చేసి చిత్తంలోని పాత విషయాలలోకి మనస్సును వెళ్ళనివ్వకుండా ఆపగలగాలి."* 

*"అప్పుడు చిత్తంలోని పాత విషయాలన్నీ కూడా కొంత కాలానికి చిత్తంలో లేకుండాపోతాయి."* 

*"ఎప్పుడయితే చిత్తంలో విషయాలే లేకుండా పోతాయో అప్పుడు చిత్తమే లేకుండా పోతుంది."*

*"ఎందుకంటే విషయాలకు మరొక పేరే చిత్తం."* 

*"విషయాలు, జ్ఞాపకాలు అంటూ లేని చిత్తం ఎక్కడా ఉండదు.* 

*"చిత్తం లేనట్టి అట్టి స్థితిలో మనస్సు తన స్వస్థానమయిన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది."* 

*"ఇంకా చెప్పాలంటే ఆత్మే అజ్ఞానమనే తనకంటే వేరుగాని మనస్సు అనే బ్రాంతి తనలో తొలగించుకుని “బ్రహ్మానంద” స్థితిలో ఉండిపోతుంది."*

*"అట్టి స్థితిలో ఈ శరీరం జ్ఞప్తికి రాదు."*

*"ఈ శరీరాన్ని ఈ శరీరం నేను అనుకునేది ఆత్మలోనుంచి ఏర్పడ్డ ఈ మనస్సే ."* 

*"మనస్సు  ఆత్మలో లీనమైపోయాక ఇక ఈ శరీరాన్నిగాని ఈ ప్రపంచాన్నిగాని చూసేది ఏముంటుంది."* 

*"ఆ స్తితే మరణాన్ని జయించడం-ముక్తిని పొందడం అంటే."*

*"అలాగే ఈ ప్రపంచంలో మానవుడు వదలాలని అనుకున్నా ఎవరో పట్టుకుని లాగుతున్నట్లుగా వదలలేకపోతున్న ఈ  స్త్రీ పురుష శరీరాలలోని సుఖం ఎంతో ఒకసారి పరిశీలిద్దాం."*

 *"ఈ లోకంలో స్త్రీ శరీరం కోసం పురుషుడు, పురుష శరీరం కోసం స్త్రీ తాపత్రయపడుతున్నారు."*

*"రక్తం, మాంసం, ఎముకలు, చర్మం తప్ప ఈ స్త్రీ పురుష శరీరాలలో ఏం ప్రత్యేకత ఉంది."* 

*"అసలు ఒక పురుషుని శరీరానికి ఒక స్త్రీ శరీరానికి ఒక అడవిలో తిరిగే గాడిద శరీరానికీ భేదం ఏముంది?"* 

*"శరీరాలన్నీ రక్త మాంసాలే గదా!"* 

*"అలా అని ఎందుకనుకోవాలి మాకు వీటినుంచి సుఖానుభవం కలుగుతోంది గదా అని అంటే!"*

*"ఇందులో వున్న సుఖానుభవం ఎంతో ఇప్పుడు చూద్దాం."* 

*"స్త్రీ పురుషుల మద్య “సంగమం” జరిగే సమయంలో ఒకానొక దశలో పురుషుడి శరీరంలోని వీర్యం బయటకు విడవబడుతుంది."*

*"అట్టి క్షణాలలో అనిర్వచనీయమయిన సుఖానుభవం ఆ రతి క్రీడలో వున్న ఇరువురికీ కలుగుతుంది."* 

*"ఆ సుఖం శరీరాల వల్లే లభిస్తుందని భావిస్తూ ఒకరి శరీరంకోసం మరొకరు తమ తమ ధన, మాన, ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు."*

*"కానీ ఇందులోని సత్యం జనులు తెలుసుకోలేకపోతున్నారు."* 

*"స్త్రీ పురుషుల మధ్య రతి క్రీడలో సుఖానుభవం కలిగేది రెండు శరీరాల మద్య జరిగే ఘర్షణ వల్ల కాదు."* 

*"వీర్యపాతం జరిగే సమయానికి ఇద్దరి మనసులో ఎట్టి విషయాలు అనేవి లేకుండా పోయి మనస్సు నిర్విషయ స్థితిలోకి వెళ్ళిపోతుంది."* 

*"ఆ స్థితిని శిష్యుల అజ్ఞానం తొలగించడానికి లోకంలోని గురువులు ఆత్మ స్థితితో కూడా పోల్చి చెబుతుంటారు."*

 *"అట్టి మనస్సు యొక్క “నిర్విషయ” స్థితి వల్లే కొద్ది క్షణాలు కృత్రిమమయిన సుఖానుభవం ఇద్దరికీ కలుగుతుంది."* 

*"అంతేగాని వీర్యం బయటకు పోవడం వల్ల కాదని అందరూ ఇక్కడ గ్రహించాలి."* 

*"వీర్యం వల్లే ఆనందం లబించేట్లయితే మరి వీర్యం బయటకు పోనప్పుడు కూడా శరీరంలోనే ఉంది కదా!"* 

*"శరీరంలో వున్నప్పుడు ఆనందం ఎందుకు లభించట్లేదు?"*

*"కాబట్టి ఆత్మస్థితి ఎట్టిదో ఎరిగిన ఋషులు ఇంకా అనేకమంది జీవులు తమ మనస్సులోనుంచి సర్వం త్యజించి ఏకాంతంగా ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లోనో లేక మరో పవిత్ర స్థలంలోనో వుంటూ మనస్సులోకి లోక సంఘటనలు అనే విషయాలు రానివ్వకుండా నిర్విషయ స్థితిలో..."*

 *"[మనసులోకి విషయాలు రానివ్వకుండా విషయరహిత స్థితిలో మనస్సును నిరంతరం నిలిపి ఉంచుకోవడం]"*  

*"మనస్సును దీర్ఘ కాలం పాటు నిలిపి ఉంచి బయట ప్రపంచం వైపు పదే పదే వెళ్ళాలని భావించే మనస్సు యొక్క మాయాశక్తిని తమ బుద్ధి బలంతో అడ్డుకుని కొన్నాళ్ళకు మనస్సును ఆత్మ అనే తమ స్వస్వరూపంలో లయం చేసి స్త్రీపురుష సంభోగసుఖం అనే ఆనందంతో పోలిస్తే దానికి కొన్ని కోట్ల రెట్ల అధికమయిన అకృర్తిమమయిన ఆనందాన్ని క్షణక్షణం నిరంతరాయంగా అనుభవిస్తూ ఆ “బ్రహ్మానంద” స్థితిలో తేలియాడుతున్నారు."*

 *"అట్టి స్థితిలోకి ఒకసారి వెళ్ళినవాడు తిరిగి ఈ లోకంలోకి ఎప్పటికీ రాడు."* 

*"అదే మానవుని స్వస్వరూప మోక్ష సామ్రాజ్యం."*

 *"దానికోసం ఈ మానవజన్మ అనే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి."*

*"అలాగే ఈ లోకంలో ఎన్నో ఋషి ఆశ్రమాలు ఉన్నాయి."*

*"ఎందరో గొప్ప ఋషులు అక్కడ  వుంటున్నారు."*

*"ఆశ్రమాలకు వెళ్లి ఋషులకు దణ్ణం పెట్టి మన భాధ్యత అయిపోయినట్లుగా తిరిగి వచ్చేస్తున్నాం."*

*"ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఈ లోకంలో ఉన్నాయి."* 

*"వాటిల్లో ఎందరివో మహా పురుషుల విగ్రహాలు కొలువై ఉన్నాయి."*
             💖🔥💖🔥💖
                   💖🕉️💖

No comments:

Post a Comment