త్రివిధ కర్మలు
🔹🔸🔹🔸🔹🔸🔹
మనము శరీరం ద్వారా జరిగేది మాత్రమే కర్మ అనుకోని ఆ శరీరం ద్వారా కొన్ని పుణ్య కర్మలు చేస్తూ వాటి ద్వారా స్వర్గం దొరుకుతుంది అని, పాప కర్మలు చేయకుండా ఉండి వాటి ద్వారా నరకాన్ని తప్పించుకున్నామని భావిస్తాము.
నిజమే ఇది. కానీ శరీరము ద్వారా జరిగే కర్మ కన్నా, ఇంకా రెంటి ద్వారా విశేష కర్మ చేస్తూన్నాము మనము.
అందులో ఒకటి "వాచిక కర్మ"
అంటే మాట.
ఈ మాట ద్వారా మనం మనకి తెలియకుండా ఒక్కోసారి పుణ్యం, ఎక్కువ సార్లు పాపం సంపాదిస్తున్నాము. ఆసత్యము,
అబద్ధములకు మూలం ఈ మాట.
సత్యానికి కూడా మూలం ఈ మాటే.
మనలోని జ్ఞానం బయటకు వ్యక్తమయ్యేది ఈ మాట వల్లనే.
పరమాత్మని స్తుతి చేసేది ఈ మాటతోనో.
ఒకరికి ఆహ్లాదం కలిగిచేది, అంటె వారి మాటల వల్ల వీరితో మళ్ళీ మళ్ళీ మాట్లాడలి అనిపించెది, ఒకరి ఉద్వేగ మాటల వల్ల వారిని శాశ్వతంగా వదిలించుకోవాలి అన్నట్టు ఈ మాటే చేస్తుంది.
ఈ మాటలు ఆపి వేస్తే మనలో ఉన్న పరమాత్మ మాట్లాడటం ప్రారంభిస్తాడు.
కానీ మాటలు ఆపడం రాదు మనకి.
కాబట్టి మాట కూడా ఒక కర్మ ని దానిని ఎరుకతో ఉపయోగించాలి అని తెలుసుకుందాం.
ఇక మూడవ కర్మ మన
మనస్సుతో చెసేది.
ఇదే ఆలోచనలతో చేసే కర్మ.
ఆలోచనలకు మూలము మనలో గూడుకట్టుకున్న జ్ఞానము.
మనలో ఉన్న భావ సంపద.
భావ సంపద అంటే మనలో ఉన్న భావాలు. పరమాత్మ కి శరణాగతిగా ఉండే భావం,
నేనే పరమాత్మని అన్న భావం,
అందరిలో పరమాత్మ ఉన్నాడనే భావం,
అహం భావం,
మమకారం భావం, అరిషడవర్గాల భావం
ఇలా భావాలు ఎన్నో రకాలు.
ఈ భావాలు మన కున్న అనుభవ జ్ఞానంతో ఆలోచనలు రేకిస్తాయి.
ఈ ఆలోచనలు
సకారాత్మకము కావచ్చు, నకారాత్మకము కావచ్చు, నాశన కారి ఆలోచనలు కావచ్చు,
ప్రేరణకారి ఆలోచనలు కావచ్చు.
ఇలా ఆలోచనలు ఎన్నో రకాలు.
ఈ ఆలోచనలు, భావం తో సమన్వయ పరచి చేసుకునేదే మానసిక కర్మ.
ఇలా శరీరం ద్వారా చేసే కర్మ "శారీరక తపస్సు", మాట ద్వారా చేసే కర్మ "వాచక తపస్సు", మనస్సు ద్వారా చేసే కర్మ "మానసిక తప్పస్సు"
జై శ్రీమన్నారాయణ 🙏
🔹🔸🔹🔸🔹🔸🔹🔸
No comments:
Post a Comment