*:::::::రెండు రకాల ప్రపంచాలు :::::::*
మన చుట్టూ మనుషులు,
వస్తువులు,సంఘటనలు , వ్యవహారాలు, పరిస్థితులతో నిండి, చలిస్తూ , వున్న ఈ ప్రపంచం ఎప్పటికప్పుడు , మనం ఏర్పరచుకున్న సంబంధాన్ని బట్టి ,మనకు రెండు రకాలుగా పరిచయం అవుతూ వుంటుంది.
1) *స్పృహ ను కలిగించే ప్రపంచం* . అంటే మనలను తాకి మనకు సుఖాన్నో దుఃఖాన్నో మిగిల్చిన ప్రపంచం.
నేను వున్నానని, నా చుట్టూ ప్రపంచం వుందని స్పృహ ని కలిగిస్తుంది
2) *స్పృహ లేని ప్రపంచం*. మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపక అలా నడిచి పోతూ వుంటుంది. ఇక్కడ నాకు సంబంధించిన స్పృహ గాని ప్రపంచానికి సంబంధించిన స్పృహ నాకు కలగడం గాని ఏర్పడదు.
అయితే ఎప్పుడు ఏది మనకు ఎదురు పడుతుందో తెలీదు. మనం మొదటి రకం ప్రపంచంలో కాసేపు , రెండవ దాంట్లో కాసేపు ,అటు ఇటు మారుతూ వుంటాం.*ధ్యానం చేద్దాం. ఎలాంటి అస్థిత్వపు స్పృహ లేకుండా జీవిద్దాం.*
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment