*🚩 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🚩🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌷message of the day🌷
*_🌴దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవడం, క్రోధంగా ఉండక పోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనం, పూజాదులు కొనసాగించడం ఇవన్నీ మానవుడు ఆచరించవలసిన ధర్మములని శాస్త్రాలు చెబుతున్నాయి. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే. కానీ కలియుగంలో ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అయితే వీటన్నింటికంటే సర్వాధిక ధర్మమేమంటే అర్థించక పోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనీయడం... ఇటువంటివి సర్వాధికమైన ధర్మములు. వీటిని అందరూ ఆచరించవచ్చును. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోక నాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడు. అందుకే పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు. కనుకనే మనకు ఉన్నంతలో పరోపకారము, సేవలు చేస్తూ ఉండాలి.🌴_*🙏🙏🙏
No comments:
Post a Comment