Wednesday, February 1, 2023

కర్మ-ఫలితాలు:

 0510.  1-5.   290123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                *కర్మ-ఫలితాలు:*
                  ➖➖➖✍️

*మనం నిత్య జీవితంలో అనేక కర్మలు చేస్తున్నాం. మనకి ఎదురయ్యే సమస్యలు, వేదనలు, బాధలు ప్రారబ్ధ కర్మ ద్వారా వస్తున్నాయి.*

*నిజానికి వీటి కన్నా , వీటిని ఎదుర్కొంటున్నపుడు మన ప్రతిస్పందన లే చాలా క్రొత్త కర్మ సృష్టిస్తున్నాయి.*

*వీటి కర్మ ఫలితాలూ ఇప్పుడో మరెప్పుడో అనివార్యంగా అనుభవించాలి!*

*వాక్కు రూపంలో చేసే కర్మలకి ఫలితం వర్తమానంలోను, భవిష్యత్తులో కూడా ఉంటుంది.*

*ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కర్మల కి తిరిగి స్పందించకపోతే కర్మ అంటదా? సాక్షి గా మాత్రమే నిలిస్తే కర్మ సృష్టించ బడదా?  మనం పొందుతున్న కర్మ ప్రారబ్ధ కర్మలో భాగమా? కాదా? ఎలా తెలుస్తుంది?*

*మనం ఎదుర్కొంటున్న భిన్న కర్మలకి తిరిగి ఏవిధంగాను స్పందించకపోతే, క్రొత్త కర్మ సృష్టించబడదు. ఇలా ఉండటం చాలా కష్టమైన విషయమే! దీనికి ఎంతో సాధన అవసరం. భక్తులు, యోగులు ఇలాంటి స్థితి ఎదురైనప్పుడు, ఎవరు తమని ఎలా బాధించినా, వారందరు భగవంతుడి రూపాలు గాను, ఎదురైన కర్మ రూపంగా భావించారు.* 

*’మనకి ఎదురైన ప్రతి సమస్య, వేదన, కష్టం అన్నీ ప్రారబ్ధ కర్మ రూపమే!’ అని భావించడమే మంచిది* 

*ఒకవేళ ఇది క్రొత్తగా వస్తున్నా, గతానికి సంబంధం లేక పోయినా, మన మనస్సు ఇలా స్థిరమై దృఢమై భగవచ్చింతన లో ఉంటే ఏ కర్మ మనల్ని బాధించదు.*

*భక్తి జ్ఞానం మన మనస్సు లో నిండి ఉంటే.. ఏఒక్కరు మనల్ని బాధించలేరు.* 

*నిజానికి మనస్సు ఏ రెండు విషయాలని ఒకే కాలం లో ఆలోచించ లేదు కదా.*

*ఈ భక్తి జ్ఞానాలు ఒక యోగస్థితి లోకి తీసుకు వెళ్లి సర్వ విధమైన చిత్త వికారాలను దూరం చేస్తాయి.* 
                          ….P.L.N..ప్రసాద్.

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment