2512. 1-6. 070323-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నడమంత్రపు సిరి*
➖➖➖✍️
*బంధువుల మధ్య స్నేహితుల మధ్య గ్యాప్ పెరగటానికి ఒక ముఖ్యమైన కారణం వారి సంపాదన/సంపద.*
*ఇది పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరిగి అసూయ, ద్వేషం అనేవి దూరుతాయి.*
*అందరూ మాములు జీవితాలు గడుపుతున్నప్పుడు అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. అందులో ఎవరైనా కొంచెం సంపాదన పెరిగి సంపాదించడం మొదలు అయితే మెల్లగా దూరం పెరుగుతుంది.*
*ఎందుకని ఇలా జరుగుతోంది? మన సంస్కృతి/సమాజం మనుషుల గౌరవాన్ని వాళ్ళ సంపద ఆధారంగా గౌరవించడం చేస్తోంది.*
*మనుషుల కన్నా వాళ్ళ ఇల్లు, వాళ్ళు వేసుకున్న బంగారు, వాళ్ళు వచ్చిన వాహనం, వాళ్ళ జీతాలు వీటి ఆధారంగా వాళ్ళ విజయాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తిస్తుంది.*
*ఎప్పుడైతే ఈ సంపాదన పెరుగుతుందో వాళ్లకు ఇదంతా అలవాటు అవుతుంది, మెల్ల మెల్లగా వారిలో మేము గొప్పవాళ్ళం అనే ఆలోచనతో అహం నిండుకుంటుంది.*
*ఆటోమాటిక్ గా తోటి బంధువులకు, స్నేహితులకు బాధ కలుగుతుంది, తరువాత కోపం వస్తుంది, తరువాత దూరంగా జరుగుతారు.*
*సంపాదకన్నా మనుషులు ముఖ్యం అని అర్థం చేసుకోవడం, ఆచరించడం అంత సులభమైన విషయం కాదు.*
*అయితే అసాధ్యం కూడా కాదు. ఇక్కడ ఇద్దరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, సంపాదించే వాళ్ళు వారి సంపాదనను ఎదుటివాళ్ళకు ఇవ్వరు, వాళ్ళ సంపాదన మీకు రాదు. మరి అలాంటప్పుడు ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవడం దూరం కావడం ఎందుకు?*
*మరి దీని నుండి బయటపడం ఎలా? బంధువులు స్నేహితులు కలిసినప్పుడు అవతలి వారి మనసును బట్టి వారి ఆలోచను బట్టి మాట్లాడడం సమయాన్ని గడపడం చేయాలి.*
*సంపాదించే వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళతో మీ ఇల్లు కట్టటానికి ఎంతయింది, ఆ ఇంట్లో ఫ్లోరింగ్ ఖర్చు ఎంత? బాత్ రూమ్ కు ఎంత ఖర్చు అయింది, మీరు ఇంతకు కొన్నారు, దాని ధర ఇప్పుడెంత, మీ టివి సైజు దాని ధర, మీరు కొన్న బంగారు నగల విలువ, ఎక్కడ కొన్నారు, ఎంతకు కొన్నారు, మీ కారు ఎంత స్టైల్ గా ఉంది, అందులో ఆ ఫీచర్ ఉంది ఈ ఫీచర్ ఉంది అది మార్కెట్ లో దొరకడం లేదు, మా అబ్బాయి జీతం ఇంత, మా కోడలు కట్టుకున్న జాకెట్ ఖరీదు ఇంత ఇలాంటి ముచ్చట్లు అన్నీ మీ ఫ్లో లో మీరు చెప్పుకుంటూ పోకండి, అవతలి వాళ్ళు అడిగినా సరే ఒకటి రెండు విషయాలు చెప్పి దాటవేసే ప్రయత్నం చేయండి. మరీ మరీ అడిగితె చెప్పండి. అంతే తప్ప మీ సంపదను వచ్చిన వాళ్ళు ముందు మొత్తం వినిపించకండి.*
*సంపాదించేవాళ్ళు కొంచెం మాములు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంకా ఇదే టివి ఉందా కొత్తది కొనలేదా? ఏంటి మీ అయన ఇంకా బైక్ లోనే వెళుతున్నాడా? మీ బాబుకు ఉద్యోగం రాలేదా? ఇలాంటి ప్రశ్నలు అడగకండి, అవసరం అనుకుంటే వాళ్ళు చెబుతారు, ఏదైనా మాటల్లో వస్తే ఒకటి రెండు విషయాలు అడిగి వదిలెయ్యండి. వ్యక్తిగత విశాల గురించి లోతుగా వెళ్లే ప్రయత్నం చేయకండి. వంటలక్క గురించో, జగనన్న గురించో, మోడీ గురించో, కోహ్లీ గురించో, కరోనా గురించో చర్చించి రండి.*
*ఇవి అక్కా చెల్లెల్లు, తోటి కోడళ్ళు, కజిన్స్, ఆఫీస్ కొలీగ్స్, ఇరుగుపొరుగు, స్నేహితులు అందరూ రోజు వారీగా ఎదుర్కొంటూనే ఉంటారు. మీ సంపాదన వలన మీకు గౌరవం పెరుగుతుందేమో అని భ్రమ పడకండి. ఒక వేళ ఎవరైనా గౌరవం ఇచ్చినా అది మీ ముందు మాత్రమే, గోడ అవతల మీ గురించి వారి అభిప్రాయం వేరే విధంగా ఉంటుంది. మీ సంపాదనతో మీరు ఎంజాయ్ చేయండి, దాన్ని ఇతరుల బాధ కొరకు వాడకండి. జీవితం చిన్నది, మీరు ఎంజాయ్ చేయండి, ఎదుటివాళ్లను ఎంజాయ్ చేయనివ్వండి. ఎంజాయ్ మెంట్ కు డబ్బు ఒక చిన్న టూల్ మాత్రమే.అర్థం చేసుకోవచ్చు అని నా మనవి.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment