మన కర్మ ప్రకారం మన జీవితంలో అంతా జరుగుతూ ఉంటుంది కానీ
కొంత కర్మ ప్రకారం
కొంత మన స్వేచ్ఛా ఇచ్ఛ తో కూడా
జరుగుతూ ఉంటుంది
స్వేచ్ఛా ఇఛ్ఛ కూడా మన ప్రారబ్ద కర్మ ప్రకారం జరగవలసిన కర్మల పరిధిని దాటి వెళ్లేలా మాత్రం ఉండదు
అంటే ఒకరికి మద్యంతో ఆరోగ్యం నాశనం అయ్యే కర్మ ఉంటే స్వేచ్ఛా ఇఛ్ఛ తో వారికి మద్యం మీద అయిష్టం కలగమన్నా కలగదు
వారి మనసు మద్యం మీదకే లాక్కెళ్తూ ఉంటుంది
అంటే వారి స్వేచ్ఛా ఇఛ్ఛ ప్రారబ్ద కర్మ జరగాల్సి ఉన్న పరిధిలోనే కలుగుతూ ఉంటుంది
ఒకవేళ వారికి మధ్యం తో ఆరోగ్యం నాశనం అయ్యే కర్మ లేకపోయి కూడా
మధ్యం వైపు వారి దృష్టి మళ్ళితే అప్పుడు అది అసలైన స్వేచ్ఛా ఇఛ్ఛ అవుతుంది
అయితే ఏది తన కర్మానుసారం చేస్తున్నాడూ
ఏది స్వతంత్ర నిర్ణయంతో చేస్తున్నాడూ అనేది గ్రహించడం కష్టం
మనిషికి పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలను బట్టే ముఖ్యంగా జీవన యాత్ర జరుగుతూ ఉంటుంది
పూర్వ జన్మలో అత్తగా ఉండి కొడుకు నుంచి కోడల్ని విడదీసిన వ్యక్తి వీరి తదుపరి జన్మలో వీరి కాపురం కూడా భగ్నమయ్యే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది
ఉత్తములు ఏది న్యాయమా
అని ఆలోచిస్తారు
అల్పులు ఏది లాభమా అని ఆలోచిస్తారు
అల్పులు తమకు లాభం కలిగితే చాలు ఇంక న్యాయాన్ని కూడా పట్టించుకోకుండా చేసే పనులే వాళ్లకి అంగవైకల్యాన్ని కలిగేలా చేస్తాయి
అప్పుడు ఇటువంటి పరిస్థితికి బాధ్యత కూడా ఆ వ్యక్తులదే
వారు ఒకప్పుడు చేసిన తప్పుల ఫలితాన్ని
తర్వాత అనుభవించవలసి వస్తుంది అన్నమాట.
ఒకరు పెద్ద భవంతులో జన్మిస్తే, ఇంకొకరు రాజస్థాన్లో తినటానికి తిండి లేని గ్రామం లో జన్మించవచ్చు
అంటే వారి వారి కర్మల ఫలితాలని అనుభవించడానికి ఏ జన్మలు అనుకూలమో అవేవారికి లభిస్తాయి అన్నమాట
No comments:
Post a Comment