Wednesday, May 22, 2024

 *జనవరి 12 స్వామి వివేకానంద జయంతి* 
🕉️🌞🌎🏵️🌈🚩
 *వివేకానంద జయంతి సందర్భంగా..* 
 *స్త్రీ తత్వం.. మాతృత్వం..* 

 *ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో* 
 *దాన్ని పొందే పద్దతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి.* 

మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు

బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు..
శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు

*-స్వామి వివేకానంద*

వేద పురుషుల హృదయాన్ని, మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకొని ఆచరణాత్మక విధానాలు రూపొందించినవాడు, తానుగా ఆచరించి చూపినవాడు, మన సంస్క•తి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించిన వాడు, భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పిన వాడు, విశ్వమానవాళి నవశకం వైపు పరుసలు తీయాలని కోరుకున్న వాడు వివేకానందుడు.ఆదిత్యయోగీ..

స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళ నంలో భారతదేశానికి హిందూ మతానికి ప్రాతి నిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబర్‌ 11‌న చికాగోలో ప్రపంచ వ్యాప్తంగా పలు మతాల ప్రతి నిధులు పాల్గొన్న సమ్మేళనంలో ప్రసంగిస్తూ ప్రియ మైన అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆక ట్టుకున్నారు.
 సాధారణంగా లేడిస్‌ అం‌డ్‌ ‌జెంటి ల్‌మెన్‌ అన్న సంబోధనకు అలవాటుపడ్డ వారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది.

ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయి తీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు.

 అమెరికన్‌ ‌పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం సందేశాన్ని ప్రశంసిం చాయి. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.

మన సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం, గౌరవం గురించి మాట్లాడుతూ నేటి భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యలేక పోవటం.
 ఎలాంటి సమస్యనైన విద్య మాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళ విద్యకోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవటం విచారకరమని, వేద కాలం లోనే మహిళలు విద్యను అభ్యసిం చారని గార్గె, హైత్రేయి వంటి మహిళామణులు.. పీఠాలను అలంకరించారని అంటూ చికాగో సభ లో వివేకానందుడు చెప్పాడు. 

తన దేశం అలాంటి స్థితికి రావాలని, చరిత్ర పునరావృతమవుతుందనే ఆకాంక్షని వ్యక్తం చేశారు. భారతీయ మహిళలు ఆదర్శ మహిళలని వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవలసి ఉందని అనేవారు.

భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే.

నిస్వార్ధత, త్యాగశీలత సహనము ఈ గుణాలతో విలసిల్లే స్త్రీ మూర్తియే మాతృమూర్తి అనేవారు. 
స్త్రీ పురుషుల సమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు.
 సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బండికి ఉన్న రెండు చక్రాల వంటి వారని సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలని, ఒక రెక్కతో ఎగరలేదని వివేకానంద చెప్పేవారు.

భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానంద సందేశాలు సూటిగా యువత హృద యాన్ని తాకుతాయి. 
యువ శక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువతకు ఇచ్చిన సందేశాల్లో ఇదో మచ్చు తునక.ఆదిత్యయోగీ..

లేవండి.. మేల్కోండి..
 గమ్యం చేరే వరకు ఎక్కడ నిలవకండి.. 
ఎప్పుడూ జాగృతంగానే ఉండండి. 
బలమే జీవితం, బలహీనతే మరణం.
 ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకునేవాడు.

ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని, తను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారేనని, అలాంటి యువత ముందు బలిష్టంగాను, జీవ సంపన్నులుగాను, ఆత్మ విశ్వా సులు గాను రుజువర్తనులుగాను మారాలని, అలా ంటి యువత వందమంది ఉన్నా చాలని ఈ ప్రపంచాన్నే మార్చవచ్చని యువశక్తిని స్వామి వివే కానంద కొడియారు.

జీవితం మిథ్య అన్న ఆలోచనను పక్కన పడేసి పని చేయడం మొదలు పెట్టాలంటాడు. 
నూరేళ్ల పుణ్యకాలాన్ని గాలికి, ధూళికి, దేవుడికి, దయ్యానికి వదిలిస్తే మనంగా బతికేదెప్పుడు, పనిచేసేదెప్పుడు, పుట్టినందుకు సార్ధకత సాధించేదెప్పుడు అంటాడు వివేకానంద.

 దేవుడు పరీక్షిస్తున్నాడు, కాలం కలిసి రావడం లేదు, అంతా నా తలరాత అంటూ కష్టాన్ని తెచ్చుకుంటూ కూచోడాన్ని ఆయన తీవ్ర ంగా వ్యతిరేకిస్తాడు. 
నీ జీవితానికి నువ్వే కర్తవు, నీ జీవితానికి సంబంధించిన బాధ్యత అంతా నీదే, నీ విధికి నువ్వే కర్తవు.
తలరాత అంటూ వేరే లేదు. 
నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. 
ధాతవు, విధాతవు అన్న నువ్వే అంటాడు.

మనిషి మనిషిగా చక్కగా చల్లగా బతకా లంటే సహనం, శాంతం కావాలి.
 ఒక్క క్షణం సహనంగా ఉండగలిగితే అనేక ప్రమాదాలు తప్పు తాయి. 
క్షణకాలం అసహనంతో అనర్థాలు జరిగి పోతాయి అంటాడు. 
మనిషి రాణించడానికి విజ్ఞా నం, వివేకం ఎలా అవసరమో, శాంతం సహనం కూడా అంతే అవసరం అంటాడు.ఆదిత్యయోగీ..
 లోకంలో చాలా మంది తోచిందనో, తోచ లేదనో ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటారు.

కొన్ని సార్లు వాళ్ల పనులు చెడగొట్టేస్తూ మాట్లాడుతారు.
 అయిన దానికి, కాని దానికి సలహాలు, సూచనలు అడుగు తుంటారు.
 అలా చేసి అందరిని ఇబ్బంది పెట్టడం కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడండి.
 అద్భు తమైన సలహాలిస్తాడు. 
అలా చేయకపోతే జీవితం లో ఒక గొప్ప వ్యక్తితో మా ట్లాడే మధుర అవకా శాన్ని శాశ్వతంగా కోల్పో తారు అంటాడు వివేకా నంద. 
కనుక పక్కవారిని సలహాలు, సూచనలు అడగటానికి ముందు మిమ్మమీరు సంప్రదించండి.

ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది

స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తో
స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటన

భారతీయ తాత్త్వికత విశిష్టతను ఖండాంతరాల్లో తన ఉపన్యాసాల ద్వారా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. 

ప్రధానంగా... ఆయన సందేశాలు యువతకు అత్యంత స్ఫూర్తిప్రదాలు. తనను కలుసుకొని, సమస్యలు విన్నవించుకొనేవారికి... ఆయన చూపించే పరిష్కారాలు విలక్షణంగా ఉండేవి.

ఒకసారి వివేకానందస్వామిని ఆయన ఆశ్రమంలో ఒక వ్యక్తి దర్శించుకున్నాడు. అతను స్వామికి పాదనమస్కారం చేసి... ‘‘స్వామీ! నా జీవితమంతా విచారమే. నేను బాగా చదువుకున్నాను. నేను రోజంతా చాలా కష్టపడి పని చేస్తాను. కానీ సరైన ప్రతిఫలం దొరకడం లేదు. జీవితంలో విజయం సాధించలేకపోతున్నాను. నా సమస్య పరిష్కారానికి మీరే దారి చూపాలి’’ అని కోరాడు. ఆ వ్యక్తి మాటలను, తీరును గమనించిన వివేకానందుడికి అతడి సమస్యేమిటో అర్థమయింది.

వివేకానందుడికి సమీపంలోనే ఆయన పెంపుడు కుక్క ఉంది. అది ఆయన చుట్టూ తిరుగుతోంది. తన సహాయం కోసం వచ్చిన వ్యక్తికి ఆ కుక్కను చూపిస్తూ ‘‘ఈ కుక్కను మీరు కొంత దూరం తీసుకువెళ్ళండి. కాసేపు తిరిగి రండి. ఆ తరువాత మీ సమస్యకు సమాధానం నేను చెబుతాను’’ అన్నారు వివేకానందుడు.

శునకంతో సహా ఆ వ్యక్తి బయలుదేరాడు. అటూ ఇటూ తిరిగాడు. కొంతసేపటి తరువాత వివేకానందుడి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి ముఖాన్ని వివేకానందుడు గమనించారు. అతనిలో ఎలాంటి అలసటా కనిపించడం లేదు. కానీ కుక్క మాత్రం ఆయాసంతో రొప్పుతోంది.ఆదిత్యయోగీ..

 *‘‘మీరూ, కుక్కా ఒకే దూరం తిరిగారు. కానీ మీలో ఏ మార్పూ లేదు. కానీ కుక్క చాలా అలసిపోయినట్టు కనబడుతోంది. ఏం జరిగింది?’’ అని అడిగారు వివేకానందుడు.* 

 *‘‘స్వామీ! నేను నా దారిలో నేరుగా నడిచాను. కుక్క ఒక చోట కుదురుగా లేకుండా... నా నుంచి దూరంగా పరిగెట్టేది. మళ్ళీ నా దగ్గరకు తిరిగి వచ్చేది. ఆ పరుగుల వల్ల అది బాగా అలసిపోయింది’’ అని చెప్పాడు.* 

 *‘‘ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అదే. మీరు, కుక్క ఒకే దారిలో వెళ్ళారు. దూరం కూడా ఒకటే. కానీ కుక్క అటూ ఇటూ పరుగులెత్తి అలసిపోయింది.* 

 *మీరు ఒక అంతస్తులో నివసిస్తున్నారనుకోండి. నేరుగా అక్కడికి వెళ్ళకుండా... పై అంతస్తుకూ, కింది అంతస్తుకూ తిరుగుతూ ఉంటే శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు.* 

 *మన రోజువారీ జీవితాలకు కూడా అదే వర్తిస్తుంది. మీరొక వైద్యుడు అనుకోండి... ‘నేను ఇంజనీర్‌ని అయితే ఇంకా *బాగా సంపాదించేవాణ్ణి’ అనుకుంటే... ప్రస్తుతం చేస్తున్న పనిలో మీకు తృప్తి ఉండదు.* 
 *ఇంజనీర్‌ చేసే పని మీరు చేయలేరు కదా? ఇక మీకు అసంతృప్తి తప్ప మిగిలేది ఏముంటుంది?* 

 *ఇలాంటి ఆలోచనల వల్ల మీరు చేసే వృత్తి దెబ్బతింటుంది. ఎంత కష్టపడినా ఏకాగ్రత లేకపోతే అంతా వృథా. కాబట్టి మీకు ఏ వృత్తిలో నైపుణ్యం ఉందో... ఆ వృత్తిలో మనసు లగ్నం చెయ్యండి. దృష్టి అంతా మీరు చేసే పనిమీదే ఉంచండి.* 

 *ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. అప్పుడు కష్టపడుతున్నాననే ఆలోచన మీకు రాదు. ఫలితం కూడా సంతృప్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు* *వివేకానందుడు.....* 
.

 *‘‘ఓ తేజస్వరూపా!* *జననమరణాలకు అతీతుడా!* *మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో. మనిషిగా మసలుకో. లే. లెమ్ము"* 

🏵️   *స్వామి వివేకానంద.* 

 *మహామహులను.. .* 
 *ప్రభావితం చేసిన* 
 *మహా స్ఫూర్తి...* 

 *ఆత్మీయ మిత్రులందరికీ* 

 *స్వామి వివేకానంద జయంతి* 
 *మరియు* 
 *యువజన దినోత్సవం* 
 *శుభాకాంక్షలు* 

 *శివోహం శివోహం* 
.
 *సేకరణ* 
🕉️🌞🌎🏵️🌈🚩

No comments:

Post a Comment