. *కలం - కాగితం*
. ****************
కలం, కాగితం వలననే
ఏ విషయమైనా ఎపుడైనా
అక్షరాలలో నిక్షిప్తం.
పది కాలాల పాటు పదిలం.
కాగితం లేనపుడు
కలం ఉన్నా లేనట్లే.
అట్లే కలం లేనపుడు
కాగితం ఉన్నా లేనట్లే.
పనికొచ్చే మన ఆలోచనలను
భద్రపరచాలనుకున్నపుడు
కాగితంతో, కలంతో పని.
చదువచ్చిన వారికీ
ఇవి అవసరాలు.
అనుకున్నపుడు తెలిసేవి.
మన ఆలోచనలన్నీ
కలం సహాయంతో
కాగితం లోనే పదిలం.
ఎపుడు కావాలనుకుంటే
అపుడు కాగితం చూచి
చదివి తెలుసుకోవచ్చు.
మనసు లోకి చేరనిచ్చి
పదిలంగా ఉంచవచ్చు.
ఇటువంటి కాగితాలన్నీ
కలిస్తే పుస్తకమౌతుంది
పుస్తక మందుకే
జ్ఞాన సమన్వితం.
కలం వలననే
కాగితానికి విలువ.
కాగితమున్నపుడే
కలంతో పని.
కాగితంపై కాలం కదిలితే
జ్ఞానానికి సాకారం.
అక్షరాల రూపంలో
జ్ఞానపపుడె పదిలం.
పుస్తకం తెరిచి చదివి గలిగితే
జ్ఞానము మనకు స్వంతం.
అర్థవంతమైన అక్షరాలే
జ్ఞానమునకు ప్రతీకలు.
కాగితం కలం ఇవి రెండూ
జ్ఞానాన్ని పదిల పరిచే ఆయుధాలు.
అక్షర సాకారానికి
కలం కాగితం రెండూ అవసరాలే !
సనాతన కాలమున
తాటి ఆకులే కాగితాలు.
మొనదేలిన ఘంటమే కలం.
ప్రత్యేకించి గురువులకు
లేఖకులకు రచయితలకు
ఇవి ముఖ్య సాధనములు.
చదువచ్చిన వారికే తెలుస్తుంది
కలం కాగితాల ప్రాధాన్యత.
చదువు రాని వారికేం తెలుసు
కలం కాగితాల అవసరాలు !?
ఎలా ఏర్పడివవొ
సనాతన కాలమున
ఈ కలం కాగితాలు ?!
తద్వారా రామాయణ
భారతాది గ్రంథాలు.
జ్ఞానానికి మూల ప్రతీకలు.
కాగితంలో కాలం వలననే
ఏ విషయమైనా అక్షరాలలో
కల కాలం సుస్థిరం. పదిలం.
ముందు ముందు విషయావగాహనం.
ఏదైనా ఉత్తరం
వ్రాయాలను కున్నపుడో
కవితలు ఇంకేమైనా
వ్రాయాలనుకున్నపుడో
కలం కాగితాలతో పని.
చదువు గలిగిన వారికి
చదివి అర్థం చేసుకునే పని.
తద్వారా ఎనలేని ఉపయోగం.
. శుభం
. ********
రచన :---- రుద్ర మాణిక్యం. (కవి రత్న!
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
*************************************
No comments:
Post a Comment