*"సాధన":: అనుష్టాన మార్గము*
*~~~~~*
— సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
*(ప్రశ్న:: _ఆత్మానుభవం కావాలంటే, చెయ్యాల్సిన సాధన ఏమిటి?)_*
*గురుదేవులు::*
_1) ఎవరినీ పరోక్షంలో విమర్శించకూడదు._
_2) గౌరవాన్ని ఆశించకూడదు. పొగడ్తలకు పొంగిపోకూడదు. తెగడ్తలకు కృంగిపోకూడదు._
_3) ఎంత బాధ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఉండాలి. ముఖంలో బాధ ఇసుమంత కూడా కనిపించకూడదు. నవ్వుతూ ప్రశాంతంగా ఉన్నట్లుండాలి. ఎంత బాధ వచ్చినా, నీలో నీవే ఉంచుకోవాలి గానీ, ఎవరికీ కొంచెము కూడా చెప్పకూడదు._
_4) దేనికీ అధైర్యపడకుండా, ధైర్యముతో ఉండాలి. ఎవరికీ భయపడకూడదు. గట్టిగా మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడకూడదు._
_5) ఎవరితోనూ పోట్లాట పెట్టుకోకూడదు. అందరినీ సమానంగా చూడాలి. ఎవరినీ విసుక్కోకూడదు._
_6) అబద్ధం చెప్పకూడదు. పనికి బద్ధకించకూడదు._
_7) అనవసర విషయాల్లో జోక్యం చేసుకోగూడదు._
– జైబాబా –
-----------------------------------
Source::
– దివ్య ప్రవచనములు -6,
Pg:: 274
No comments:
Post a Comment