*శ్రీ గురుభ్యోనమః*
💐💐💐💐💐💐
*ఆధ్యాత్మిక సాధనలో మౌనం వహించే పాత్ర గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏమంటారంటే....*
🌹🌹🌹🌹🌹🌹
*హృదయం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది.*
*ఇదే కేంద్రం.*
*ఇది ఆలోచనల నుండి ఉద్భవిస్తుంది, అవి దానిపై ఆధారపడి ఉంటాయి మరియు అవి అక్కడ పరిష్కరించ బడతాయి.*
*ఆలోచనలు మనస్సు యొక్క విషయాలు, అవి విశ్వాన్ని రూపొందిస్తాయి. సాధనలో మౌనం ఒక భాగమా ? మౌనమే సాధనా ఫలమా ?*
*మనసులో ఏ అలజడిలేని మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు.*
*మౌనం అంటే మాటలు ఆగటం కాదు. విషయాల కోసం మనసు కదలకుండా ఉండటమే మౌనం !*
*మహిళలు తమ నివాసాల్లోనే ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు. అలా చేస్తున్నంతసేపు ఒక్క పిండి వంట విషయంలో కూడా వారికి నోరూరదు. అంటే అన్ని వంటకాల మధ్య రుచుల విషయంలో వారి మనసు మౌనంగానే ఉంటుంది. జ్ఞాని కూడా విషయ ప్రపంచంలో తాను చేయాల్సిన పనులన్నీ చేస్తూనే అలా మౌనంగా ఉంటాడు.*
*మనసుకు అలాంటి మౌనాన్ని అలవర్చటమే ఏ దీక్షకైనా ఫలం. నిజానికి మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఫలంగా పొందటమే దీక్ష. మౌనమే అత్యుత్తమ సాధన, దీక్ష ! మౌనదీక్ష చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారా ?*
*మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు అంటే మిగిలిన సాధనలన్నీ తిరస్కరించమని కాదు. వాటినే పరమావధిగా భావించి అక్కడే ఆగిపోవద్దని మహర్షి బోధ.*
*ఒక గమ్యానికి వెళ్ళదలుచుకున్న వారికి అక్కడికి చేరుకోవడం దీక్ష. బస్సు ఎక్కటం, కార్లో ప్రయాణించటం ఇవన్నీ ఆ దీక్షకు ఉపకరించే విషయాలు మాత్రమే కానీ అవి దీక్ష కాదు. అలాగే సాధనలో ఏ దీక్ష అయినా లక్ష్యంగా ఎంచుకున్న ఆ ఫలం కోసమే. దీక్షలోని మిగిలిన ప్రక్రియలన్నీ ఆ ఫలాన్ని పదేపదే గుర్తుకు తెచ్చేందుకే.*
*మనం ధరించే ప్రత్యేక దుస్తులు కానీ మాలలు కానీ జపించే మంత్రంగాని చేసే ధ్యానంగాని దీక్షకు ఉపకరణాలు మాత్రమే. ఏ మార్గంలోనైనా అందరూ కోరుకునేది మనసు ఆగితే లభించే శాంతినే !*
*మనసుకు మాయ వచ్చి చేరిందా ? మనసే మాయగా ఉందా !*
*మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించటం.*
*ఆధ్యాత్మిక సాధనలో మనసును ఆవరించిన మాయను విడనాడాలని అంటారు. నిజానికి మనసే మాయ అని శ్రీరమణమహర్షి చెప్తున్నారు. ఎందుకంటే *నిద్రలో కేవలం మనం మాత్రమే ఉంటున్నాం. అలా ఉన్నామనే ఆలోచన కానీ అనుకోవటం కానీ లేకుండా కేవలం ఉంటున్నాం అంతే ! కానీ నిద్ర లేవగానే మనసు నేను-అది అనే ద్వైత భావం పొందుతుంది. కనుక మనసుకు మరొక మాయ వచ్చి చేరదు. మెలకువ రాగానే రూపం తీసుకునే మనసే మాయగా ఉంది. సత్య వస్తువుకు ద్వైతం అని, అద్వైతం అని ఏదీలేదు, అది ఉంటుందంతే. మెలకువ రాగానే నేను, ఈ సృష్టి వేర్వేరు అనే ద్వైత భావన వచ్చింది. కాబట్టి అద్వైతం అనే మాట వాడాల్సివస్తుంది.*
*పసి పిల్లవాడికి నీళ్ళకు, నిప్పుకు తేడా తెలియదు. అప్పుడు వాడికున్నది అద్వైత భావన అని చెప్పలేం. ఎందుకంటే అసలు తేడానే తెలియని వాడికి ద్వైతం ఏంటి? అద్వైతం ఏంటి?*
*మాయ ఆవరించిన మనసుకు ద్వైతం అలవడుతుంది. తేడా తెలుస్తుంది. తేడా తెలిసిన తర్వాత అది పోగొట్టు కోవటం కోసం సాధన చేయాలి. ఆ సాధననే అద్వైత సాధన. పుట్టినప్పుడు మనసు లేదు. క్రమంగా పెరుగుతున్న కొద్దీ భౌతిక విషయాల పట్ల కొంత అవగాహన ఏర్పడుతున్న కొద్దీ మనసు ఏర్పడుతుంది. అదే ద్వైతానికి దారి తీస్తుంది. ఆ ద్వైత భావన ఏర్పడిన మనసును మళ్ళీ అద్వైతం లోకి తీసుకువెళ్లాలి. అంటే, మనసు లేని స్థితికి చేరుకోవాలి.*
*పసిపిల్లల్లోని ఉన్న ఆ మనసు మనసు లేని స్థితికి, అద్వైత భావనా స్థితికి, ఆ అద్వైత స్థితినే అలవరచుకునే ప్రయత్నము మనం చేయాలి.*
*ఏ స్థితి నుంచి వచ్చామో, మళ్ళీ అదే స్థితికి చేరుకోవాలి. అదే ఆధ్యాత్మిక సాధన.*
💐🙏💐🙏💐
No comments:
Post a Comment