Wednesday, May 22, 2024

 *మహాభారతంలోకెల్లా అత్యంత శక్తివంతుడైన వ్యక్తి ఎవరు? వారి శక్తికి కారణం ఏమిటి?*
జయం (మహా భారతం అసలు నామం) కృష్ణ పరమాత్మ చేతిలో నడిచింది అయినా , ఆయన సాక్షాత్తు భగవంతుడి సంపూర్ణ అవతారం కాబట్టి , ఆయన బలాన్ని లెక్కగట్టే సాహసం నేను చేయబోను.

ఎన్నిసార్లు చదివినా , ఎన్నిసార్లు చూసినా భారతం లో అత్యన్త శక్తివంతుడు దేవవ్రతుడు అనబడే , గాంగేయుడు అని పిలవబడే భీష్మ పితామహ..

మొత్తం భారతానికి అంటూ హీరో ఎవరంటే ఆయనే అని చెప్పాలి. దానికి కొన్ని కారణాలు చూద్దాం.

పితృవాక్కు పరిపాలన (శ్రీ రామ తత్వం): తండ్రి మనసెరిగి , తన శక్తీ తో మత్యరాజుని కొట్టి సత్యవతిని తీసుకు రాగలడు , కానీ ఆయన తన హక్కులను పణం గా పెట్టి సత్యవతి దేవి ని ఒప్పించాడు.

బాధ్యత: తమ్ముళ్లు విచిత్ర వీరుడు , చిత్రాంగదుడు మరణించినా, రాజ్యాన్ని తీసుకోగలిగిన హక్కు , అవకాశం వున్నా , అన్న మాట మీద నిలబడి , తన బాధ్యతగా రాజ్యాన్ని పాండురాజు వరకూ కాపాడాడు.

మహా వీరుడు: అంబ ని పెళ్లి చేసుకోమని లేకపోతే తన గండ్ర గొడ్డలి కి సంధానం చెప్పాలి అని దండెత్తి వచ్చిన, ప్రపంచాన్ని గడ గడ లాడించిన పరమాత్మ, తన గురువు పరుశురాముడిని యుద్ధం లో తుత్తునీయముగా కొట్టి ఓడించిన మహా ఘనుడు, పరుశురాముడు సాక్షాత్తు దశావతారాలలో ఒక అవతారం అని మనం గుర్తు పెట్టు కోవాలి.

త్యాగం : కురుక్షేత్ర సంగ్రామం లో అయన దాటికి పాండవులు గిల గిల లాడి , సాక్షాత్తు కృష్ణ పరమాత్మని దగ్గరికి వెళ్లి భీష్ముని ఎలా నిరువలించాలని అని అడిగితె అది ఆయన్నే అడగమని చెపితేయ్, ధర్మ రాజు వెళ్లి తాతా నువ్వు ఎం చేస్తే మరణిస్తావ్ అని అడిగితె ..భుజాల మీద మోసిన మనుమడు అడిగిన ఆ ప్రశ్న కు క్షోభ పడక , సికండి వల్ల సాధ్యమని చెప్పిన త్యాగ శీలి ఆయన.

జ్ఞాని : తాను కావాలనుకుం టే చిరంజీవి గా ఉండిపోయే శక్తి వున్నా , మానవ జన్మ శాపం అని దానిని వదిలి తిరిగి తన వసువు రూపం పొందాలని ఏకాదశి గడియల వరకు నిరీక్షించి , ఈ లోకానికి అనేకమైన సందేశాల్ని వదిలి వెళ్లిన మహానీయుడు భీష్మ పితామహ.

ఒక మనిషి పుట్టగానే తల్లి వదిలి , తండ్రి తన కామవాంఛకు రాజ్య బ్రష్ఠుడిని చేసి, సవతి తల్లి సత్యవతి అకారణం గా దూషించినా , అంబ లాంటి వాళ్ళు అర్ధం చేసుకోపోయిన , దృతరాష్ట్రుడు రాజ్యాభిషక్తుడిని చేయలేదని నిందించిన, గుడ్డివాడిని ఇట్చి పెళ్లి చేసావ్ అని గాంధారి శపించినా, నిండు సభలో ద్రౌపదిని వివస్త్రని చేస్తే కురు వృద్ధుడు ఎం చేసాడని ఇప్పటికి లోకం ఆడి పోసుకున్న ... ఎప్పటికి తాను తీసుకున్న కురు వంశ రక్షణ వదలని , చివరి క్షణం వరకు ధర్మం గురించి నిలబడ్డ .. మనిషి జన్మ ఎత్తి మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన భీష్మ పితామహుని తలుచుకునే అవకాశం కలిపించిన మీ ప్రశ్నకు నా ధన్య వాదాలు.


No comments:

Post a Comment