*మోక్షం ఎలా -పొందాలి?*
భగవంతుడు ప్రతి మనిషికి....
ఈ శరీరం నీదికాదు. ఇది నీ అద్దె ఇల్లు అని మూడు అవకాశాలు ఇస్తాడు...
ఒకటి కళ్ళకి చత్వారం,
రెండు పళ్ళు ఊడగొడతాడు,
మూడు జుట్టు నెరిసిపోతుంది...
మొదటిది... వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి కళ్ళజోడు తగిలిస్తాం. తెలుసుకోము ఎందుకు జరిగిందని.
రెండోది.. వచ్చినప్పుడు పళ్ళకి టింకరింగ్ వేయిస్తారు, రకరకాల పేస్ట్స్ వాడి ఉన్నవి కూడా ఊడగొట్టుకొని పళ్ళు కట్టించు కుంటారు, అయినా అర్థం కాదు.
మూడు.. తలమెరుపు..!
జుట్టంతా తెల్లబడి మూడో వార్నింగ్ వచ్చినా సరే..
ఊహు ఈ ఇల్లు నాది. అని రంగులు వేస్తారు. అప్పటికీ అర్థంకాదు!
నాలుగు చివరిది..
యముడు దిగుతాడు రంగంలోకి!
మెడకి తాడు వేసి లాక్కొని వెళుతూ...
’ఒరేయ్ ఈ శరీరం నీదికాదు అని ఎన్ని నోటీసులు పంపినా వినకుండా నాది... నాది అంటే దాని ఓనర్ ఊరుకుంటాడా? ఇంటికి అద్దె కట్టే యజమాని అంటే భయం ఉంది గాని ఈ శరీరం అద్దెకిచ్చిన యజమాని అంటే భయం లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా నాది నాది అన్నావ్. ఏది ఇప్పుడు చూపించు నీది అనేది ఏది ఉందో! అని నరకంలో పడేసి నానాయాతనలు పెట్టి.. ఒరేయ్ ఈసారైనా తెలుసుకొని మసులుకోమని పంపుతాడు.
సద్గ్రంధాలు చదివి, సద్గురువులని ఆశ్రయించి, సత్సంగాలు చేస్తూ ఆత్మజ్ఞానం పెంచుకొని సాధనలు చేసి జన్మరహిత్యాన్ని అంటే మోక్షం పొందాలి...
No comments:
Post a Comment