దారి చూపువారు దొరకుట అరుదు. వెలుగు దారి చూపు వారు మరింత అరుదు. అట్టివారిని దుర్వినియోగము చేసుకొనుట తగదు.
అందుబాటులో నున్నాడని మార్గదర్శకుని దుర్వినియోగము చేయుట, దానివలన అతని సమయము వృథా యగుటయేగాక మీ చేతన యందు అలసత్వ మేర్పడును. చేతస్సు బలహీనపడును. ప్రతి చిన్న విషయమునకు సలహా సంప్రదింపులు చేయుట వలన ఇంగిత జ్ఞానము కోల్పోవుదురు.
గొర్రెల మందవలె అనుసరించట ఏ మార్గదర్శికిని తృప్తికరమగు విషయము కాదు. అందించిన వెలుగు నందు నడచుచు పక్షమునకో ,మాసమునకో, ఋతువున కొక మారో సంప్రదింపులు చేయవచ్చును.
నీవు ఉత్తమ సాధకుడవైనచో సంవత్సరమున నాలుగు మార్లుకన్న సంప్రదింపక, అందించిన వెలుగు మార్గమున సాగుచు నీ చేతననే నీవు సంప్రదించుకొనుచు ముందుకు సాగవలెను. అట్లు కానిచో నీ జీవనయానము స్వయం ప్రతిపత్తిలేక సాగును.
మార్గదర్శి అదృశ్యమైనచో జీవిత మగమ్యగోచర మగును. అట్లు జరుగకూడదు. ఈ విషయమున హెచ్చరిక అవసరము.
🌹 🌹 🌹
🙏 ప్రసాద్.
No comments:
Post a Comment