*అవస్థాత్రయం*
అవస్థ అంటే ఏమిటి?మామూలు భాషలో చెపితే *పరిస్థితి,ఆంగ్ల భాషలో *Condition*అంటాం.
అవస్థ అంటే తెలిసింది.
*త్రయం* అంటే మూడు అని తెలుసు.అంటే
3 అవస్థలు అని.మూడే
కాదండోయ్,నాలుగువున్నాయ్. అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి. తురీయము
3 అవస్థలు = జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ.
జాగ్రదావస్థ:సర్వఇంద్రియాల స్పూర్తి,జ్ఞాము వుండే జీవుడిని *విశ్వుడు* అంటారు.
ఇది మేలుకొని ఉన్న అవస్థ. - 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతః కరణాలు(మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం) - ఈ 14 ఇంద్రియాలు పనిచేస్తూ బయట ఉండే స్థూలములైన విషయాలను మనం ఏ సమయంలో అనుభవిస్తూ ఉంటామో ఆ అసమయాన్ని 'జాగ్రదవస్థ' అంటారు.
స్వప్నావస్థ:- నిద్రావస్థలో మానసిక ప్రపంచానుభవము నే స్వప్నం(కల,Dream)
స్వప్నావస్థలో ఉండే జీవుడికి తైజసుడని పేరు.
జాగ్రదావస్థలో అనుభవించిన వస్తువులు, అనుభవాలు మనస్సులో వాసనలుగా(బీజ రూపాలుగా) ముద్రించబడతాయి. మనం నిద్ర లో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, విషయాలూ ఉండవు. అయితే మనస్సులో ముద్రించబడిన వాసనల కారణంగా మనస్సు ఇంద్రియాలుగాను, ఇంద్రియ విషయాలు( శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు) గాను తాత్కాలికంగా రూపాంతరం చెంది (మారిపోయి) అనుభవాలు పొందే సమయం ఏదో అది స్వప్నావస్థ.
సుషుప్తి అవస్థ:- 14 ఇంద్రియాలు వాటికి అసలు కారణమైన అజ్ఞానంలో విలీనమైపోయి, అవి పనిచేయని సమయంలో; ఏ అనుభవమూ లేకుండా, ఏమీ తెలియకుండా, ఆనందంగా ఉండే సమయం ఏదో అదే సుషుప్తి అవస్థ. అన్ని ఇంద్రియాలు (14) పని చేస్తుంటే జాగ్రదవస్థ; ఈ 14 ఇంద్రియాలు పనిచేయక వాటి పనులు మనస్సు చేస్తే స్వప్నావస్థ; 14 పనిచేయక, ఏమీ తెలియక, ఆనందంగా ఉంటే సుషుప్తి అవస్థ.
సుషుప్తి అవస్థలో ఉండే జీవుడికి ప్రాజ్ఞుడని పేరు.
ప్రా+జ్ఞుడు = అన్నీ తెలిసినవాడు.
ప్ర+అజ్ఞుడు = ఏమీ తెలియనివాడు.
సుషుప్తి అంటే ఒళ్లెరుగని గాఢనిద్ర(Sound sleep).
తురీయావస్థ:జ్ఞానము కంటే వేరే ఏదీ లేనిది,బ్రహ్మాకార స్థితి,ప్రజ్ఞాన ఘన రూపము అదే తురీయం.
No comments:
Post a Comment