*adhipatulu*
*ఇంద్రియాలకు అధిపతులు ఎవరు??*
* మనస్సుకు అధిపతి చంద్రుడు
*బుద్దికి అధిపతి బృహస్పతి
* చిత్తమునకు అధిపతి ఆత్మ
* అహంకారమునకు అధిపతి రుద్రుడు
* చెవికి అధిపతులు దిక్పాలకులు, శబ్దమును వినగల శక్తిని ఇచ్చువారు.
* చర్మమునకు అధిపతి వాయువు, స్పర్శ జ్ఞానమును ఇచ్చువారు.
* కండ్లకు అధిపతి సూర్యుడు (అగ్ని), స్వరూప వివరమును తెలుసుకోగలిగే శక్తిని ఇచ్చువారు.
*నాలికకు అధిదేవత వరుణుడు. రుచిని గ్రహించెడి శక్తిని ఇచ్చువారు.
* ముక్కుకు అధిదేవతలు అశ్వనీ దేవతలు, వాసన చూసే శక్తిని ఇచ్చువారు.
* నోటికి అధిపతి అగ్ని. మాట్లాడు శక్తిని ఇచ్చువారు.
* చేతులకు అధిపతి ఇంద్రుడు, పనులు చేయుటకు శక్తిని ఇచ్చువారు.
* పాదములకు అధిదేవత విష్ణువు, నడుచుటకు శక్తిని ఇచ్చువారు.
* గుహ్యమునకు అధిపతి ప్రజాపతి
* గుదమునకు అధిపతి యముడు
ఈ అధిపతులు ఆయాస్థానములందు చేరి ఆయా పనులు చేయించుచున్నారు. ఏదైనా ఒక స్థానములో ఆస్థానాధిపతి లేనినాడు ఆ స్థానము దేహమునకు ఉపయోగించదు.
ఉదాహరణకు: చెవికి అధిపతులు దిక్పాలకులు, ఆస్థానములో వారు ఉండనప్పుడు ఆ చెవి యొక్క ఉపయోగముండదు. అదే చెముడు వచ్చిందందుడు. ఇలాగే ఏ అవయమునకు లోపములు వచ్చినా ఆస్థానములలో ఆ అదిదేవతులు లేరని అర్ధం.
No comments:
Post a Comment