*శ్రీ రమణాశ్రమం* - *శరన్నవరాత్రి వేడుకలు*
🌷🙏💐🙏🌷🙏💐🙏🌷
*8వ రోజు - (30.09.2025) సరస్వతి*
〰️〰️〰️〰️🌻〰️〰️〰️〰️
తల్లి సరస్వతి జ్ఞానాన్ని మరియు ముక్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు అమ్మవారు సరస్వతిగా దర్శనం ఇస్తున్నారు. సరస్వతి దేవి గురించిన తొలి ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది, ఇక్కడ సరస్వతి ఒక నదిగా మరియు దేవతగా కూడా ప్రస్తావింపబడుతోంది. కవి ఆమెను *‘ అత్యుత్తమ దేవతగా కీర్తిస్తూ , నదులలో ఉత్తమమైనది’* అని కొనియాడి ఆమెను గౌరవిస్తాడు. నిజానికి, ఆమె పేరులో ఆమె మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి. *సరస్వతి 'సార' లేదా 'సారాంశం' మరియు 'స్వ' అనే రెండు సంస్కృత పదాల కలయిక. మరో మాటలో చెప్పాలంటే 'సరస్వతి' అనే పేరుకు 'పుష్కలంగా నీరు కలిగినది' అని అర్ధం కూడా ఉన్నది. సరస్వతి అనే పేరు మరొక సంస్కృత మిశ్రమ పదం 'సురస-వతి' నుండి కూడా ఉద్భవించి ఉండవచ్చు.*
సరస్వతి యొక్క గొప్ప ఆకర్షణకు ఇది నిదర్శనం.
ఆమె స్థాయి తరువాతి వేద కాలం మరియు మధ్యయుగ కాలం వరకు వృద్ధి నొందుతూనే ఉంది. ఆమె భౌగోళికాలను మరియు విశ్వాసాలను దాటగలిగినప్పటికీ స్వచ్ఛత, ధర్మం, జ్ఞానం మరియు కళలకు ఆమె అధిదేవత .
సరస్వతీ రహస్య ఉపనిషత్తులో ఈ క్రింది విధంగా ప్రశంసించబడింది
*1. ఋషులు, నిశ్చయంగా, సముచితమైన భక్తితో, పవిత్రమైన అశ్వాలయనుడిని ఇలా అడిగారు: 'తత్' అనే పదంలోని విషయాన్ని ప్రకాశింపజేసే ఆ జ్ఞానం ఎలా తెలుసుకొనగలము ? పవిత్రాత్మా, ధ్యానం ద్వారా మీరు తెలుసుకున్న సత్యాన్ని మాకు చెప్పండి.*
*2. ఉత్తమ ఋషులారా ! సరస్వతిపై పది శ్లోకాలతో పాటు 'బీజ-అక్షరాలతో' ఈ పది చరణాలను పఠించడం ద్వారా నేను అత్యున్నత పరిపూర్ణతను పొందాను.*
*3. ఋషులు ఇలా అన్నారు: దేవి ఉపాసకులైన ఓ మహర్షి, ఏ ధ్యానం ద్వారా సరస్వతి దేవిని మెప్పించుకొన సాధ్యము ? పవిత్రమైన సరస్వతి దేవిని ఏ విధంగా ఆరాధించవచ్చును ? దయచేసి మాకు తెలియజేయగలరు.*
*4. అశ్వలాయనుడు అప్పుడు ఇలా వివరించెను : సరస్వతి దేవి పై ఉన్న పది శ్లోకాలతో కూడిన ఈ మహామంత్రంలో, నేను ద్రష్టను. ఎనిమిది అక్షరాల 'అనుష్టుప్' అనబడే ఛందస్సు కలిగియున్నవి ; పవిత్రమైన 'వాగీశ్వరి' అనే దైవ శక్తితో నిండిన ఈ శ్లోకములు ‘యద్వక్’ అనే బీజం కలిగి; 'దేవీం వాచం' మరియు 'ప్రణోదేవి' అనబడే మంత్రాలతో కీర్తించబడటం విశేషము.
సేకరణ : *"శ్రీ రమణ మహర్షి"* ముఖపుస్తకం నుండి
No comments:
Post a Comment