Tuesday, December 9, 2025

 రామో ...
విగ్రహవాన్ ధర్మః 

అనిపిస్తాడు వాల్మీకి 
అసురుడైన మారీచుడి చేత

ఔను నిజమే...
రామో విగ్రహవాన్ సనాతన ధర్మః

*****

అధికారం కోసం
భూమి కోసం, చదువుకోసం 
జరిగిన పోరాటాల చరిత్ర - 

భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది.

సమాజాన్ని 
వర్గాలుగా విడగొట్టి 
అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగానూ

కొన్ని వర్గాలను 
సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నంలో 

మనుధర్మ శాస్త్రానికి 
లక్ష్యంగా రామాయణ రచన జరిగింది. 

*******

'మూర్తీభవించిన ధర్మం రాముడు' 
అంటున్నది రామాయణం. 

ధర్మం పేరిట
సంప్రదాయం పేరిట, 
ఎలాంటి వ్యవస్థను రామాయణం ప్రచారం చేసిందో...

పరిశీలించాల్సిన అవసరం 
ఎంతైనా ఉంది

*******

ప్రకృతిలోని 
రంగులను పరిచయం చేసే 
పసి వయస్సులోనే -

'' ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేముడు...''

అంటూ పిల్లలకు రాముని దైవత్వాన్ని నూరిపోస్తున్న వ్యవస్థ ఇది. 

చిన్నప్పటి నుంచే 
వారికి రాముడంటే ఒక ఇష్టం - 
ఆరాధనా భావం ఏర్పడిపోతాయి.

*******

మత విషయాలను 
ప్రశ్నించటం పాపం కాబట్టి 

రామాయణం 
చెప్పిన విషయాలను గానీ
రామాయణ సంఘటనలను గానీ 
ఎవరూ ప్రశ్నించరు. ఆలోచించరు. 

వాటిని నమ్ముతూ 
ఆదర్శంగా గ్రహిస్తూ వుంటారు.

రామాయణం ప్రవేశపెట్టిన 
సామాజిక ధర్మాల వల్ల నష్టపోతున్న వారు కూడా అంతే. 
అలా ఆలోచించటం నేరం అనే అనుకుంటారు. 

ఈవిధంగా నష్టపోతున్న 
అధిక శాతం ప్రజల గురించి ఆలోచించేవారు మాత్రమే 
ఈ సమస్యను విశ్లేషించారు.

********


ఆధునిక యుగంలో 
మహాత్మా జోతిరావ్‌ ఫూలే, 
డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ లు 

ఈ సామాజిక వ్యవస్థ గురించి తపన పడ్డారు. అసమానతల మూలాలను అన్వేషించే క్రమంలో పురాణాల నేపథ్యాన్ని అధ్యయనం చేశారు.

సమ సమాజం కోసం, 
మానవతా విలువల కోసం 
వారు చేసిన అన్వేషణ- అందించిన సమాచారం అనంతర తరాలకు వెలుగు బాటలయ్యాయి.

******

ప్రాచీన కాలం నుంచీ 
భారతీయ వేదాంతులు - తత్వవేత్తలు, 
సంస్కర్తలు - రాజకీయ నాయకులు 
ఈ సామాజిక ధోరణులను సరిచేస్తున్నామంటూనే ఆ చిక్కుముడులను మరింత బిగిస్తూ వచ్చారు. 

పురాణాలు - 
రామాయణ మహాభారతాలు 
చెప్పిన ధర్మాలను అతిక్రమించే సాహసం చేయలేకపోయారు.

ఈనాటికీ రామాయణం 
జనంపై ప్రభావం చూపుతూనే వున్నది. 
ప్రజల జీవనాన్నే కాక దేశ రాజకీయాలనూ, రామాయణ కథాంశాలు నిర్దేశిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రామాయణం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

*****

ఈ పుస్తకంలో 
రాముడిని అనేక వైపుల నుంచి వివరించారు. 
భోయ విజయ భారతి

భారతీయ సామాజిక చరిత్రలో 
రాముడి పాత్రను అద్భుతంగా విప్పి చెప్పారు. 

రాముడు కేవలం 
ఆధిపత్య భావజాల ప్రతినిధి మాత్రమే కాదని
 
ఆధిపత్య, అసమాన, అమానవీయ వ్యవస్థను కాపాడుతున్నాడని చెప్పడం ఈ పుస్తకం ఉద్దేశం. 

భారతదేశంలో 
విప్లవాత్మక మార్పులు రాకుండా 
అడ్డుకుంటున్న సామాజిక సంబంధాలను 
రాముడి వైపు నుంచి చూసే ప్రయత్నం చేశారు. 

ఈ దృష్టి కోణంతో 
ఆమె భారత సామాజికతను 
కొత్తగా పరిశీలించడానికి తలుపులు తెరిచారు.
 
తద్వారా ‘పురాణాలు`మరో చూపు’ను సమాజానికి ఇచ్చారు.

No comments:

Post a Comment