Sunday, January 11, 2026

భారతదేశంలో మనోభావాలు ఫేక్ అవుతున్నాయా? | Bitter Truth | అసలు మనోభావాలు ఏంటి? | Ram C Vision

భారతదేశంలో మనోభావాలు ఫేక్ అవుతున్నాయా? | Bitter Truth | అసలు మనోభావాలు ఏంటి? | Ram C Vision

https://youtu.be/4ELI-nsk5PY?si=248RzqwfhDfXeCj5


https://www.youtube.com/watch?v=4ELI-nsk5PY

Transcript:
(00:05) మీ మనోభావాలు తగలయ్యా మన దేశంలో జనాలు ఏమంతా ఖాళీగా ఉన్నారో తెలియదు కానీ ఎక్కడో ఎవడో ఒక మాట అంటే ఇంక ఎక్కడో ఉన్నోడు వచ్చేసి మా మనోభావాలు దెబ్బ తిన్నాయి మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని మొత్తుకుంటా అంటాడు. ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది ఎంతలా అయిందంటే పోసాని కృష్ణ మురళి చెప్తాడు చూసారా టూ మచ్ రేయ్ టూ మచ్ అని అంతలా అయిపోయింది అన్నమాట ఎవడో ఒక గ్రూపు మీదనో ఒక సమూహం మీదనో ఒక వ్యాఖ్యానం చేస్తాడు ఈ గ్రూపులో ఉదాహరణకి 100 మంది ఉన్నారు అనుకుంటే అందులో ఒకరిద్దరికి మాత్రమే మనోభావాలు దెబ్బ తింటాయి మిగిలిన 98 మందికి మనోభావాలు
(00:45) దెబ్బ తినం ఈ ఇద్దరికే ఎందుకు తిన్నాయి అనేది ప్రశ్న అసలు ఎలాంటి ముక్క ఒక పరిచయము లేని ఎలాంటి సంబంధము లేని ఒకే ప్రదేశము కానీ ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి వ్యాఖ్యానం ఇంకెక్కడో ఉన్న ఒక వ్యక్తి మనోభావాన్ని దెబ్బ తీయగలదా అనేది కూడా ప్రశ్నే ఇందులో విచిత్రం ఏంటో తెలుసా మాకు మనోభావాలు దెబ్బ తిన్నాయని ముందుకు వచ్చే వాళ్ళలో చాలామందికి మనోభావాలు అంటే ఏంటో క్లారిటీ కూడా ఉండదు.
(01:14) మనోభావాలు అంటే ఏంటి భావోద్వేగాలు అంటే ఏంటి అవి దెబ్బ తినడం అంటే ఏంటి అనేది అర్థమై ఉండదు. అయినా సరే ముందుకు వచ్చేస్తారు మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అనేసి ఎందుకో మరి తెలియదు. ఈ మనోభావాలు దెబ్బ తిన్నాయి అనే వారిలో నేను మూడు రకాలుగా పిలుస్తానండి ఒకటి ఐడెంటిటీ బూస్ట్ అప్ మనోభావాలు రెండు ఇన్సెక్యూర్ మనోభావాలు మూడు ఇండివిడ్యువల్ మనోభావాలు మన భారతదేశంలో మనోభావాలు దెబ్బతింటే ఈ మూడు రకాలలోనే ఉంటారు.
(01:47) ఈ మూడు రకాలు తెలుసుకున్న తర్వాత ఎవరి మనోభావాలు ఎలాంటివో మీకంటే ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. దీనికంటే ముందు ఇవి మూడు తెలుసుకునే ముందు అసలు మనోభావాలు అంటే ఏంటో మనకు అర్థం కావాలి సింపుల్ గా చెప్తాను మనోభావాలు అంటే బాధ దుఃఖం కోపం ఆశ నిరాశ ఆనందం ఇలాంటివి మనోభావాలు ఎవడైనా ఏదైనా ఒక వ్యాఖ్యానం చేస్తే ఆ వ్యాఖ్యానం కారణంగా ఈ మనోభావాలలో ఏదో ఒకటి దెబ్బ తింటే దాని కారణంగా బయటక వచ్చేదే భావోద్వేగం అంటే మనోభావాలు అంటే మెంటల్ స్టేట్స్ అన్నమాట ఇవి లోపల ఉంటాయి.
(02:31) ఇవి దెబ్బ తిన్నప్పుడు బయటికి ఏదైతే వస్తుందో అది భావోద్వేగం అంటే ఎమోషన్ అది అవుట్పుట్ అన్నమాట బయటికి వస్తుంది. దీని మీద స్పష్టత లేకుండానే మా మనోభావాలన్నీ దెబ్బ తిన్నాయని చాలా మంది ముందుకు వస్తా ఉంటారు. ఇప్పుడు ఆ మూడు రకాల మనోభావాలు ఏంటో తెలుసుకునే ముందు నా స్కూల్ డేస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా క్లాస్మేట్ ఒక కుర్రోడు ఉండేవాడు వాడి పేరు ఎందుకు గానీ మామూలుగా స్కూల్లో ఇంటర్వెల్లోనో మధ్యాహ్నం భోజనం టైం లోనో బెల్లి కొడితే పిల్లలు బయటికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు పిల్లలు సరదాగా ఏదో మాట మాట అనుకుంటారు గిచ్చుకుంటూ వెళ్ళకుంటూ
(03:04) ఉంటారు. ఒక కుర్రోడు ఇంకో కుర్రోడిని ఏదో ఒక చిన్న మాట అంటాడు. వాళ్ళఇద్దరూ పట్టించుకోరు అది అన్నోడు బాగానే ఉంటాడు అనిపించుకున్నోడు బాగానే ఉంటాడు. మధ్యలో ఈడు ఎంటర్ అవుతాడు ఈడు ఎంటర్ అయ్యి ఆ ఎంత మాట అనారా ఈ నిన్ను అంటాడు. అంటనే వాడు దిక్కులు చూసి నలగల్లో నన్ను ఇంత మాట అంటావని వాడి మీదకి గొడవక వెళ్తాడు. గొడవక వెళ్లి వీడు కోపంతో వాడిని ఏదో ఒకటి అంటాడు అంటనే అప్పుడు మళ్ళా వీడు ఎంటర్ అయ్యి ఆ వీడఎంత మాట అన్నారా నిన్ను అంటాడు అంటనే వాళ్ళు ఒకరినొకరు ఒకరి మీద ఒకరి రెచ్చిపోయి కొట్టుకొని తెచ్చేవాళ్ళఅన్నమాట వీడేమో సైలెంట్ గా పక్కనండి నవ్వుకుంటా
(03:38) అంటాడు. ఇలా చేసేవాడు అన్నమాట ఇదంటే కుర్రతనం కానీ దరిద్రం ఏందంటే ఇప్పుడు మనం ఏదో ఏదో గొప్పోళ్ళ అని చెప్పుకునే వాళ్ళలో కూడా ఇలాంటి స్ట్రాటజీలు పనికిమాలని గేమ్లు ప్లే చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నేను త్రీ పాయింట్స్ చెప్తాను ఆ పాయింట్స్ లలో మా ఫ్రెండ్ గాడు ఏ కేటగిరీలోకి వస్తాడో కూడా మీరు కామెంట్ లో చెప్పాలి.
(04:02) ఇప్పుడు మొదటిది ఐడెంటిటీ బూస్ట్ అప్ మనోభావాలు వీళ్ళకు మనోభావాలు దెబ్బతినే అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడు ఇంకెక్కడో ఉన్నవాడిని ఒక వ్యాఖ్యానం చేస్తే ఈయన ఐడెంటిటీ కోసం అరే్ వాడు నిన్ను ఇంత మాట అన్నారురా అనేసి వీన్ని రెచ్చగొట్టి వీని భావోద్వేగాన్ని ప్రేరేపించి ఈయన్ని ముందుకు తీసుకొచ్చి వీడు కూడా వానితో కలిసిపోయి కలుపుకొని మేమిద్దరం ఒకటి అనుకొని మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ అనే సౌండ్ చేస్తాడు.
(04:31) వెళ్లి కేసులు పెడతాం అంటాడు. పాపం అసలు నీకు మనోభావాలు ఏం దెబ్బ తినలే వీడు వెళ్తాడు వీడు వెళ్లి ఆ వ్యాఖ్యానం వల్ల నీకు మనోభావాలు దెబ్బ తిన్నాయి అని వీడు గుర్తు చేస్తాడు వానికి వాడు రెచ్చిపోయే నిజమే నిజమే నాకు మనోభావాలు దెబ్బ తినేసినాయి అనేసి వాడు ముందుకు వచ్చేసి వాడు అరుచాడు అన్నమాట నా మనోభావాలు దెబ్బ తిన్నాయి అనేసి ఇప్పుడు ఎవడైతే రెచ్చగొట్టినాడో ఐడెంటిటీ బూస్ట్ అప్ కోసం వచ్చాడో వాడు నీతిగా నిజాయితీగా తెలివిగా కష్టపడ ఐడెంటిటీని పెంచుకోడు వాడు అది చేత కాదు చేత కానప్పుడే ఇలాంటివి అన్నమాట ఇవి ఈజీ వే కదా గ్రూప్లోకి వచ్చేసి ఈ గ్రూప్
(05:07) అందరికీ నేనే హెడ్నును నేను వీళ్ళని కాపాడడానికి వచ్చాను నేను లేనిదే వీరు లేరు నేను పెద్దకును అని తనని తాను ప్రెసెంట్ చేసుకుంటాడు అన్నమాట గట్టిగా అరుస్తా సౌండ్లు పెంచుతా కేసులు వేస్తా ఇలా చేస్తాడు అన్నమాట ఇలాంటి వాళ్లే మన భారతదేశంలో ఎక్కువమంది ఉన్నారు. మన పూరి జగన్నాథ్ చెప్తాడు చూశరా ఎందుకో తెలిీదు కానీ మన ఇండియాలో మనోభావాలు దెబ్బ తిన్నంత ఎక్కడా దెబ్బ తినవు అనేసి ఇలాంటి వాళ్ళ గురించే ఆయన చెప్పింది.
(05:35) సో ఇవి ఫేక్ మనోభావాలు అన్నమాట. అంటే దొంగ మనోభావాలు ఇవి దెబ్బ తినవు గానీ తిన్నట్టు ప్రెజెంట్ చేస్తారు. అన్నోడు బాగానే ఉన్నాడు అనిపించుకున్నవాడికి ఒక క్లారిటీ ఉంది ఆ వ్యాఖ్యానాలు నన్ను ఏం చేయలేవు అని మధ్యలో ఈడు వచ్చి రసగొట్టుతాడు వాని భావోద్వేగాన్ని ప్రేరేపిస్తాడు అన్నమాట. ఇప్పుడు రెండవది ఇన్సెక్యూర్ మనోభావాలు అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందన్నమాట ఉదాహరణకి ముందు చెప్పాను కదా 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే మనోభావాలు దెబ్బ తింటాయి అని అది ఈ రకం మనుషులక అన్నమాట 98 మందికి ఎందుకు దెబ్బ తినవ అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వాళ్ళ
(06:11) ఐడెంటిటీ స్ట్రాంగ్ గా ఉందనే నమ్మకం వాళ్ళు చేసే పనిలో నిజాయితి ఉంటుంది. వాళ్ళు బాగా ఆలోచన సామర్థ్యం కలిగినవారు తెలివైనవారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడో చేసిన వ్యాఖ్యానం నన్ను ఏమి చేయలేదు అని భావిస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యానాలని పట్టించుకోరు. ఈ ఒకరిద్దరు ఉన్నారు చూశరా వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ వీళ్ళకు ఐడెంటిటీ స్ట్రాంగ్ గా ఉండదున్నమాట ఉండదని వాళ్ళ ఫీలింగ్ వీళ్ళు చేసే పనులు ఉంటే కూడా దొంగ పనులు ఉండవచ్చు అంటే నిజాయితి లేనితనం అన్నమాట అందుకని ఎక్కడో ఎవరో ఒక వ్యాఖ్యానం చేస్తే వీటి కారణంగా వీనికి అది డైరెక్ట్ గా అటాక్లు
(06:52) అనిపిస్తుంది. ఈ అనిపించిన కారణంగా మా మనోభావాలు దెబ్బ తీశరని ముందుకు వస్తాడు ముందుకు వచ్చేవాడు ఈ ఒకరి ఇద్దరు నా మనోభావాలు దెబ్బ తిన్నాయి అనేసి వచ్చి మాట్లాడడమే కాకుండా ఆ 98 మందిని కూడా లాగాలని చూస్తారు ఏ విధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అన్నమాట అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఏమని నువ్వు మావాడివి కాదా నీకు సిగ్గు లేదా నీకు పౌరుషం లేదా ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేదానికి ప్రయత్నం చేస్తా స్తారు ఈ 98 మందిలో బాగా తెలివైనవాడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నవాడో ఇలాంటివన్నీ పట్టించుకొని వాడు సైడ్ అయిపోతాడు కానీ
(07:30) చాలా మంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎట్లా మనం గ్రూపులో ఉగరం కదా తర్వాత గ్రూపులో మనకు విలువ ఉండదేమో గౌరవం ఉండదేమో ఎందుకైనా మంచిది వెళ్లితే పోలా అనేసి వాళ్ళు కూడా మా మనోభావాలు తేపతిన్నాయని నీరసంగా వస్తారన్నమాట అవి కూడా ఫేక్ మనోభావాలే కానీ ఈ రెండు ఒరిజినల్ మనోభావాలే ఎందుకు కారణం ఏదైనా కానీ వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్లనో లేదంటే నిజాయితి లేనితనంగానో ఐడెంటిటీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అవ్వడం వల్ల డైరెక్ట్ గా మా మీద అటాక్ చేశారని వాళ్ళు భావిస్తారు ఆ భావించినప్పుడు వాళ్ళకి
(08:09) నిజంగానే బాధ కలుగుతుంది. వీళ్ళ భావోద్వేగం బయటికి రావడం అనేది నిజమే కానీ వీళ్ళ భావోద్వేగాన్ని రెచ్చగొట్టేంత వ్యాఖ్యానాలు అక్కడ చేసినటివి అయితే కాదు అంత పెద్ద వ్యాఖ్యానాలు అయితే అవి కాదు అందుకే మిగతా 98 మందికి మనోభావాలు దెబ్బ తినల వీళ్ళద్దరికే దెబ్బ తిన్నాయి. ఎందుకు వీళ్ళు వీక్ మైండెడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఇది వ్యాఖ్యానం చేసినోడి తప్పు కాదు వాడు సాధారణ వ్యాఖ్యానాలే చేశాడు.
(08:43) వీడు బాగా మనసుకు తీసుకొని పాపం వీక్ మైండెడ్ కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ కదా వీని మనోభావాలు పాపం అస్తుమాను ట్రిగర్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మూడవది ఇండివిడ్యువల్ మనోభావాలు అంటే వ్యక్తిగత మనోభావాలు అన్నమాట. ఇవి ఒరిజినల్ మనోభావాలు ఎవరైనా సరే ఒక వ్యక్తిని డైరెక్ట్ గా నేరుగా అటాక్ చేస్తే అంటే నీ వల్లే నువ్వే చేశవు నిన్నే అంటున్నాను ఈ విధంగా డైరెక్ట్ గా అటాక్ చేస్తే వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బ తింటాయి.
(09:16) నిజంగానే మనోభవాలు దెబ్బ తిన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు గై గై గై అనే హంగామా చేయరు. తొందరపడి కేసులు పెట్టేస్తామని అడావిడి చేయరు. వాళ్ళు ప్రశాంతంగా ఫస్ట్ బాధ కలిగినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యానాలు నా మీద ఎందుకు వచ్చాయి ఈ వ్యాఖ్యానాలకు నేను అర్హుడినా అనేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు.
(09:41) చెక్ చేసుకొని వ్యాఖ్యానాలు వీళ్ళకే వర్తిస్తాయి అని భావిస్తే దాని నుంచి వాళ్ళు నేర్చుకొని వ్యాఖ్యానాలని రిసీవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకునే పనులు చేయడము ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం లాంటివి చేస్తారు. లేదంటే అనవసరంగా ఏకవచనంతో నీ వల్లే అని చేసిన వ్యాఖ్యానాలు ఇతనికి వర్తించవు అని భావిస్తే అప్పుడు వీళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు అవసరమైతే కేసులు పెట్టడం కూడా మొదలు పెడతారు.
(10:09) అంతేగాని హంగామా చేయరు ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. మీడియాలో ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళ అందరి మనోభావాలు ఫేక్ అంటే కాదు నేను అలా చెప్పట్లేదు. మెజారిటీ ఫేక్ ఉన్నారు ఐడెంటిటీ బూస్ట్ అప్ కోసం తన ఐడెంటిటీని పెంచుకోవడం కోసం నేనే పెద్ద మనిషిని అనుకుంటూ తనని తాను ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు అని చెప్తున్నాను.
(10:31) మీడియా ముందుకు వచ్చే వాళ్ళు పబ్లిక్ లో ఉండి మనోభావాలు దెబ్బ తింటున్నాయి అని చెప్పే వాళ్ళలో కూడా నిజాయిత అయినవాళ్ళు ఉంటారు ఎందుకు ఆ స్థాయి వ్యక్తులు అయినప్పుడు ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్న వ్యక్తులయితే వ్యాఖ్యానాలు చేసినవాడు గాని మనోభావాలు దెబ్బ తిన్నవారు గాని ఆ స్థాయిలోనే వాళ్ళు కౌంటర్స్ ఇచ్చుకోవడమో మీడియాల ముందే వాదించుకోవడమో లేదంటే కేసులు పెట్టుకోవడమో ప్రతిదీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు.
(10:58) వాళ్ళలో కూడా నిజాయితిగా మనోభవాలు దెబ్బ తినే వాళ్ళు ఉంటారు. కానీ చాలా వరకు మన ఇండియాలో మనోభావాలు అనవసరంగా దెబ్బ తింటున్నాయి. మనోభావాలు దెబ్బ తింటున్నాయి అంటే అదేదో పెద్ద గొప్ప విషయం కాదు నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటేనే మనోభావాలు దెబ్బ తింటాయి. అందుకే ప్రతిసారి మన మనసులోని మనలోని మనోభావాలను స్ట్రాంగ్ చేయడం కాదు.
(11:23) మన ఐడెంటిటీని స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే మన ముందుకు వచ్చి మన దృష్టికి మనోభావాలు దెబ్బతిన్నాయని వస్తే మనం ఆలోచించాల్సింది ఏంటి ఇది నిజంగా వ్యక్తిగతంగా మనోభావాలు దెబ్బతిన్నాయా ఇది ఒరిజినల్ేనా లేదంటే ఏదైనా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కారణంగా అనవసరమైన వ్యాఖ్యానాలకి అనవసరంగా వీళ్ళ మనోభావాలు దెబ్బ తింటున్నాయా అనేది ఆలోచించాలి లేక ఇదేమైనా ఐడెంటిటీ కోసం తన గుర్తింపు కోసం కావాలనే ఫేక్ మనోభావాలని ప్రెజెంట్ చేస్తున్నారా బయటికి అనేది ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి.
(12:03) అంతేగానీ ఎవడో వ్యాఖ్యానం చేశాడు ఎవడికో మనోభవాలు దెబ్బ తిన్నాయి అనేసి మన దృష్టికి వస్తే మనం ఇడ కూర్చుండేసి ఆ లేదండి ఆ వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అది తప్పు కాదు అంటారా అని ఒకరంటే అది తప్పు ఎలా అవుతుందండి గతంలో ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యానాలు రాలేదని ఒకరంటే వద్దు ఇవన్నీ పలుగోలు మాటలు అన్నమాట వ్యాఖ్యానం చేసినోడు ఏ ఉద్దేశంతో చేసినాడో తెలియదు మనోభవాలు దెబ్బ తిన్నోడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ మూడు విషయాలలో ఏ రకంగా దెబ్బ తిన్నాయో తెలియదు వాళ్ళిద్దరికీ క్లారిటీ లేకుండా ఉంటే మధ్యలో అవి రెండు విన్న నువ్వు వచ్చేసి వాళ్ళ మనోభావాల గురించి మాట్లాడచ్చావా అది
(12:36) కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని అది ఎలా తెలుస్తుంది చెప్పు వాళ్ళ మనోభావాలు లోపలికి వెళ్లి మనం ఏమనా చూస్తామా తుంగి చూస్తామా దెబ్బ తిన్నాయా లేదా అనేసి ఒక భావోద్వేగం అది వాళ్ళకే అర్థంఅవుతుంది. వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది అంటే నేను డిబేట్స్ లాంటివి చేయొద్దు అని చెప్పట్లేదు కానీ మొత్తానికి అయితే నేను ఫైనల్ గా చెప్పేది ఏందంటే ఫేక్ మనోభవాలు ఎక్కువగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు అబ్బా మన నేను చెప్పడం అది చివరిగా నా వ్యూవర్స్ కి ఒక మాట చెప్తున్నా ఎవరో చేసిన వ్యాఖ్యానాలలో మిమ్మల్ని బలహీన పరచలేవు బలహీన పరచకూడదు
(13:12) కూడా మీరు అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వాలి. ఒకవేళ మీరు గన బలహీన పడుతున్నారు ఒకరి వ్యాఖ్యానల వల్ల అంటే మీలో భయం ఉందని అర్థం కాబట్టి మీలో పెరగాల్సింది భయం కాదు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ నిజాయితి సో ఇది గాయస్ ఈ వీడియో మనోభావాలు అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.
(13:40) ఈ మనోభావాలు అనే కాన్సెప్ట్ మీద మీకు నచ్చిన పాయింట్ ఏదో ఖచ్చితంగా కింద కామెంట్ లో రాయండి లేదంటే నా మనోభవాలు దెబ్బతింటాయి. ఇలాంటి మరెన్నో బ్రెయిన్ సైకాలజీ సైన్స్ ఫిక్స్ అండ్ ఫిలాసఫీ లాంటి వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment