Sunday, January 11, 2026

****మనశ్శక్తి

 మనశ్శక్తి

ఇంద్రియాల సహకారంతో విషయ సుఖాలను భోగిస్తూ, ఆనందిస్తూ ఉంటుంది మనసు. యోగసాధనతో దానిని నిరోధిస్తే మనసు శూన్యమై ఆత్మలో లయమైపోతుంది. అపుడు ఇంద్రియాల ప్రమేయం లేకుండానే విషయాలను గ్రహించగలుగుతుంది ఆత్మ. యోగసాధన తీవ్రతననుసరించి దూరాన్నీ, కాలాన్నీ అధిగమించి సృష్టిలో జరిగిన, జరుగుతున్న, జరగబోవు సమస్త విషయాలను అవలీలగా అవగతం చేసుకోగలగుతుంది. దూరదృష్టి, దూరశ్రవణం, వాక్శుద్ధి, అణిమాది అష్టసిద్ధులు - త్రికాల జ్ఞానం వశమవుతుంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది.

* దయగల హృదయమే దేవుని నిలయం.

* గాఢమైన నిశ్శబ్దము నందే భగవద్వాణి వినిపించును.

* మానవ సేవయే మాధవ సేవ.

* నరుడే నారాయణుడు.

* మానవత్వానికి మించిన మతం లేదు. మంచితనానికి మించిన పూజ లేదు. మంచి స్వభావానికి మించిన ఆభరణం లేదు.

* హృదయంతో ఆలోచించు మెదడుతో కాదు.



No comments:

Post a Comment