*దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి యున్నప్పుడే*
*కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే*
*వింతల్మేన జరించనప్పుడె, కురుల్వెల్లెల్ల గానప్పుడే*
*చింతింపన్వలె* *నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!*
[శ్రీ కాళ హస్తీశ్వర శతకం, ధూర్జటి కృతం ]
ఓ ఈశ్వరా, పళ్ళు ఊడిపోకముందే, శరీరంలో బలం తగ్గకముందే, స్త్రీలు తన వృద్ధ రూపాన్ని చూసి అసహ్యించుకోకముందే, ముసలితనంతో బలహీనపడకముందే, శరీరంలో కాంతి, కళ తగ్గకముందే, జుట్టు నెరవకముందే, మనిషి నీ దివ్య పాదాలకు సేవ చేయడం గురించి ఆలోచించాలి.*.
No comments:
Post a Comment