అతని అక్షరం
అక్షరం అంటే
కాగితం మీద ఒలికించిన సిరా కాదు
గుండె కోతను వినిపించే
సైరన్!
అతని కలం
అడవిలో వెన్నెలను వెతకదు
అడవిని మింగేస్తున్న గొడ్డలిని
అడ్డుకుంటుంది!
అతని మాటలు
ఎండమావులు కావు
దగాపడ్డ గుండెల్లో
మంటలు రేపే నిప్పుకణికలు!
చీకటి రాజ్యంలో
అతని అక్షరం ఒక బాంబు
అమాయకుల నెత్తుటి సాక్షిగా
ఎక్కుపెట్టిన క్షిపణి!
పద్మవ్యూహాల గందరగోళం లేదు
స్పటికమంత స్వచ్ఛం
సామాన్యుడి కన్నీటి చుక్కంత
నిజం!
నిద్రపోయే సమాజానికి
అతని కవిత ఒక నిద్రమాత్ర కాదు
కళ్లు తెరిపించే
మెరుపు తీగ!
మరణం అతనికి ముగింపు కాదు
ప్రతి అక్షరం ఒక జననం
అతను రాసిన ప్రతి చరణం
రేపటి విప్లవానికి ఒక నినాదం!
బురెడ్డి బ్లూమ్స్
No comments:
Post a Comment