😱 Forced Kundalini Activation | ప్రమాదం అని తెలిసినా కుండలిని శక్తితో ఆటలు | Don't Do it..🚨
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fLz9O9iRB5M
Transcript:
(00:06) హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఎవరైనా కుండెలని బలవంతంగా మేలుకొలిపితే ఏమవుతుంది? ఎవరైనా సరే ఎందుకు ఇలా బలవంతంగా తమలోని శక్తిని రెచ్చగొడుతూ తమ శక్తికి మించి అనుభవాలకు మించి సాధనను చేస్తారో విత్తనం భూమిలో నటితే అది తిరిగి పండ్లు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది కదా. సంవత్సరానికి సరిపడా నీళ్లు పోస్తే దాని ఫలితం శూన్యమే కదా ఈ చిన్న విషయం అర్థం చేసుకోగలిగితే పరితపించే మనసు శాంతిస్తుంది.
(00:36) శాంతంగా ఉన్న మనసు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ధ్యానం నెమ్మదిగా నీకు అన్ని రహస్యాలను అనుభవాలలోకి తెస్తుంది. శక్తుల కోసమో సిద్ధుల కోసమో బలవంతంగా నువ్వు నిన్ను కష్టపెట్టిన అది సాధనను పాడుచేస్తుంది. ఆశయం మంచిదే కానీ ఆశ మంచిది కాదు కదా నిరంతరం కదిలే నది ప్రవాహం ఆపడం అంత సులువ మరి నీ మదిలో పరిగెడుతున్న ఈ మూర్ఖమైన ఆలోచనను ఆపడం ఎలా అందరికీ శక్తులు కావాలి కానీ నిజమైన శక్తి తమలో ఉందని గ్రహించరు.
(01:07) డబ్బుకి ఆశపడే వాడితో ఒక చెడ్డ పని చేయించవచ్చు. లొంగకుంటే బంగారం ఆశ చూపించవచ్చు. అలా అందరం ఏదో ఒక దగ్గర లొంగక తప్పదు. మరి ఇవి ఏవి వద్దు వైరాగ్య భావనతో ఉన్నవాడు ఎవడు సాధన చేసేవాడికి ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆశ చూపించేవి ఈ సిద్ధులు శక్తులు ఒకసారి స్వామి వివేకానంద దగ్గరికి ఒక సన్యాసి వచ్చి నేను 14 సంవత్సరాలుగా తపస్సు చేశాను.
(01:33) నాకు నీటిమీద నడిచే సిద్ధి లభించింది అని గర్వంగా చెప్పాడు. ఓ పిచ్చివాడా నీ ఈ 14 ఏళ్ల తపస్సు కంటే ఒక 50 పైసలు ఇస్తే ఆ పడవ నడిపేవాడే ఆ నదిని దాటిస్తాడు కదా నీ తపస్సును ఆ శక్తిని ఇంత మూర్ఖంగా వెచ్చించావు కదా అని అన్నాడట. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. బలవంతంగా కుండలిని శక్తిని రెచ్చగొట్టి చక్రాలను యాక్టివేట్ చేయాలి అని చూస్తుంటారు.
(01:58) ఈ మధ్య YouTube లో Instagram లో కూడా ఫ్రీ కుండలిని అవేకనింగ్ క్లాసెస్ చెప్తున్నారు. ఏడు రోజులలో కుండలిని యాక్టివేట్ చేస్తారు అట. అది అంత సులభమైతే ప్రతి ఒక్కరు జ్ఞానులే ప్రతి ఒక్కరు యోగులే సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ డిస్కవరీ అని చాలామంది పుస్తకాల మాటలను వారి గురువులు చెప్పిన మాటలను అప్ప చెప్పినట్టు చెప్తున్నారు. జ్ఞానం పుస్తకాలలోనే లేదు కదా అంతటా ఉంది.
(02:22) వారి సొంత అనుభవం లేకుండా తోచింది చెప్పే సంఖ్య ఎక్కువ. నిజంగా నీ అనుభవం ప్రమాణం అదే శాస్త్రం. నీ ప్రయత్నమే నీ గురువు ఓడిన ప్రతిసారి కొత్త మార్గం కనిపిస్తూనే ఉంటుంది. మనసును కదలకుండా ఉంచడమే సాధన. అలా అది చల్లించక మౌనంగా ఉంటే అదే ధ్యానం. ఆ ధ్యానంలో రమించడమే కదా అసలైన ఆట. అదే సమాధి స్థితి.
(02:47) అలా నీ ఇరుకలో నీ మౌనంలో నీ మదిలో ప్రవహించే శక్తే కుండలిని. అది మేల్కొనటం ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. అలా అని ఇన్ని సంవత్సరాల్లోని చెప్పలేం. ఒక సంఘటన, ఒక శ్వాస, ఒక నిట్టూర్పు, ఒక కన్నీటి బిందువు, ఒక చిన్న విషయం ఇలా ఏదైనా సరే నిన్ను ప్రభావితం చేయవచ్చు. నీ ప్రశ్నలు వాటి తీవ్రత నీ సాధనని ప్రభావితం చేస్తాయి. ఒక మంచి పాట, ఒకరి మాట, ఇవి కూడా నీలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేయగలవు.
(03:16) నీ కుండలిని శక్తిని ట్రిగర్ చేయగలవు. నీ నిశ్వాస ఉశ్వాసలు కూడా ఆ కుండలిని ప్రభావితం చేస్తాయి. గమనించి చూడు నీ వెన్నుల్లో చిన్ని కదలిక అయినా ఉంటుంది. అందుకే కదా ధ్యానం సాధన చేసేవారిని ప్రాణాయామం కూడా చేయమని చెప్పేది. మరి బలవంతంగా ఈ కుండలిని లేపితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. చాలామందికి ధ్యానం చేసే సమయంలో వారి మూలాధార చక్రం దగ్గర వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతూ ఉంటారు.
(03:43) వారి వెన్ను చివరి భాగంలో ఏదో కదులుతున్న అనుభవం వారికి వస్తుంది. అయితే వారి వెన్నుపూసలో వేడి పెరుగుతున్నట్టు లేదా తల మధ్యలో ఒత్తిడి వచ్చినట్టు అనిపిస్తుంది. యోగశాస్త్రం ప్రకారం వెన్ను అడుగున ఒక శక్తి నిద్రపోతుంది. అది మేల్కుంటే చక్రాల గుండా పైకి వస్తుంది. చివరికి సహస్రార చక్రం చేరితే జ్ఞానం వస్తుంది. ఈ జనరేషన్ లో మూడు నిమిషాలు బ్రీతింగ్ టెక్నిక్ తో కుండలిని యక్టివేషన్ అని లేదా ఏడు రోజులలో కుండలిని యక్టివేషన్ అని వింటున్నాం.
(04:12) ఇలా ఫోర్స్ఫుల్ యక్టివేషన్ వలన వచ్చే సమస్యలను చూద్దాం. కొంతమంది ఇలా చేస్తారు. రాపిడ్ హైపర్ బ్రీతింగ్ శ్వాసని ఒక క్రమ పద్ధతిలో ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకొని వదలటం లౌడ్ చాంటింగ్ ఫర్ హవర్స్ గంటల తరబడి జపాలు గట్టిగా చేస్తూంటారు. స్లీప్ కేర్ చేయరు. నిద్ర సరిపోకపోవటం ఫాస్టింగ్ ఎక్స్ట్రీమ్ గా చేస్తుంటారు.
(04:34) సాధనకి అల్పాహారం మిత ఆహారం లేదా మిత భోజనం చేయడం మంచిదే కానీ కడుపు కావాలని కాల్చుకోవడం మంచిది కాదు కదా ఇవి చేయటం ద్వారా నెర్వ్ సిస్టం పైన భారీ స్ట్రెస్ పడతాయి. ఎక్స్ట్రీమ్ యంజైటీ పానిక్ అటాక్స్ హెల్ూజనేషన్స్ అంటే భ్రమలు కలగటం అంత అయోమయంగా ఉంటుంది. స్పిరిచువల్ లాంగ్వేజ్ లో దీన్ని ఎనర్జీ సర్చ్ అంటారు. సైకయాట్రిక్ లాంగ్వేజ్ లో ఇది సైకోటిక్ ఎపిసోడ్ అని అంటారు.
(05:02) ఇలా కుండలిని శక్తిని రెచ్చగొడుతూ తమ సాధనని పెంచితే ఇంకా ఎక్స్పీరియన్సెస్ కూడా దారుణంగా ఉంటాయి. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు ఇంటెన్స్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం వలన ఒకరికి హార్ట్ రైజింగ్ బాడీ షేకింగ్ ఓవర్వెల్మింగ్ ఒంటరిగా ఏడవటం ఇలా కారణం లేకుండా చాలా సమస్యలే ఉన్నాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి డీప్ మెడిటేషన్ వలన బ్రెయిన్ యాక్టివిటీ చేంజ్ అవుతుంది.
(05:27) ఎమోషనల్ మెమరీస్ సర్ఫేస్ అవుతాయి. బాడీ సెన్సేషన్స్ ఎక్కువ అవుతాయి. బట్ ఇప్పటివరకి సైన్స్ ఈ కుండలని శక్తి మన శరీరంలో చేసే మార్పులను దాని ఉనికిని సరిగ్గా ప్రూవ్ చేయలేకపోయింది. మన బ్రెయిన్ కి సేఫ్టీ మెకానిజం ఉంటుంది. ఒక్కసారిగా ఆక్సిజన్ ఇంబాలెన్స్ నిద్ర సరిపోకపోవటం ఎమోషనల్ ట్రౌమా రిలీజ్ ఇవి జరుగుతూ ఉంటే మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది.
(05:53) మనం బలవంతంగా ప్రయత్నించినా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు కదా కొన్ని సందర్భాలలో రకరకాల కలలు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో కొన్ని రోజులు ధ్యానం ఆపమని గురువులు చెబుతారు. వారి ధ్యానం అంత తీవ్రంగా ఉండకూడదు మరి. నేను కూడా కొన్ని రోజులు నా ధ్యానాన్నే ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను లేండి. కానీ ఇవి చెప్పటానికి అసలు వాటి అర్థాలను అర్థం చేసుకోవాలి కదా అనుభవం ఉన్నవాళ్ళు లేదా గురువులు మాత్రమే దారి చూపించగలరు.
(06:22) గురువు అంటే భౌతికంగా అని కాదు మీకే ఆ సమయానికి ఒక మార్గం కనిపిస్తుంది. కుండలనే ఆట కాదు నీ మైండ్ స్టేబుల్ గా లేకపోతే నీకు స్పిరిచువల్ పవర్ హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. రిమెంబర్ దిస్ అవేకనింగ్ ముందు గ్రౌండింగ్ అవసరం. క్రికెట్ ఆడడానికి ముందు ఆ పిచ్ ని గ్రౌండ్ ని శుభ్రం చేస్తారు కదా అలానే ఈ కుండలిన శక్తి మీలో స్వేచ్ఛగా ప్రవహించాలి అంటే మీ మనసును శుభ్రం చేయండి.
(06:49) అహం ఆశ, ద్వేషం, అసూయ ఇలాంటి మలినాలను వదిలేయండి. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇన్స్టంట్ యక్టివేషన్ కాదు స్లో ట్రాన్స్ఫర్మేషన్ నిన్ను నువ్వే మార్చుకునే ప్రక్రియ ఇది. షార్ట్ కట్లు అలా ఏం లేవు. అలా ప్రయత్నించడం మంచిది కూడా కాదు. ఇంతకీ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మరి వచ్చే వీడియోలో ఈ కుండలిని శక్తి చిన్న పిల్లల్లో యక్టివేట్ అవుతే ఏం జరుగుతుందో తెలుసుకుందామా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్సహైగవాహం ధం ప్రవజం ప్రజయామి సహైగబాం ధం ప్రవజం ప్రజయామి సహైగబాహం ధం ప్రవజం ప్రజ
No comments:
Post a Comment