నీ మనసు, గుణం బుద్ధి నీ గమనించు//observe your mind character and quality
Author Name:Adhyathmik Auraji
Youtube Channel Url:https://www.youtube.com/@Auraji546
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c-Z5RRIpdRs
Transcript:
(00:01) అందరికీ నమస్కారం మనసు గుణం బుద్ధి మన రోజువారి జీవితంలో ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి మనల్ని అనే దాని గురించి తెలుసుకుందాం. మన రోజువారి జీవితంలో ప్రతి పని చేస్తున్నప్పుడు ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి లేనిది మనం ఏ పని చేయలేము. అవే మనసు గుణం బుద్ధి ఇప్పుడు ముందు మనసు గురించి తెలుసుకుందాం. మనసు అంటే ఏదైనా చూస్తున్నప్పుడో వింటున్నప్పుడో స్పర్శిస్తున్నప్పుడు రుచిని చూస్తున్నప్పుడు వెంటనే స్పందించే ఒక భావం అదే మనసు
(00:47) మనిషినైనా వస్తువునైనా రుచినైనా వాసననైనా ఏదైనా చూసిన వెంటనే నచ్చింది నచ్చలేదు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మనసు యొక్క స్వభావము. ఉదాహరణకు రోడ్డు మీద మన పక్కన ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నాడు ఆ స్మోక్ మనకు పడదు వెంటనే మనం ఏం చేస్తామ అంటే అతని మీద కోపమో చిరాకు పడి పడుతూ ఉంటాం. అలా వెంటనే అభిప్రాయాన్ని గాని ఏదో ఎమోషన్ ని బయట పెట్టేదే మనసు అది తనకు తాను సొంతంగా అప్పటికప్పుడే ఎమోషన్ ని బయట పెట్టుకుంటుంది.
(01:23) మనసు యొక్క స్వభావం ఏంటిది అంటే అది మంచా చెడా అనేది కూడా ఆలోచించదు. రెండవది గుణం ఇప్పుడు గుణం గురించి తెలుసుకుందాం. గుణం అంటే ఇది మనలో ఉన్న ఒక స్థితి ఇది ఎలా ఉంటుందంటే పరిస్థితిని బట్టి అవసరాలను బట్టి సందర్భాన్ని బట్టి ఈ గుణం యొక్క లక్షణం బయటపడుతూ ఉంటుంది. గుణం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందంటే సపోజ్ ఎగ్జాంపుల్ మన మనసు అలసటగానో చికాకు గానో అలా ఉన్నప్పుడు మనసు లక్షణము ఎలా బయట పడుతుందంటే మనలో ఉండే కోపము ద్వేషము ఈర్ష ఈ గుణాలు ఉంటాయి కదా ఇవి వెంటనే బయట పడిపోతాయి. ఈ గుణం యొక్క
(02:08) లక్షణం ఎలా ఉంటుందంటే మన శరీరం అలసటగా ఉన్నప్పుడు మన మనసు అలసటగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మన శరీరం ఉత్సాహంగా ఉన్నప్పుడు ఈ గుణం యొక్క లక్షణం వేరే విధంగా ఉంటది మన మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఈ గుణం యొక్క లక్షణం వేరే విధంగా ఉంటుంది. ఇలా శరీరము మనసు స్థితిగతులను బట్టి గుణం యొక్క లక్షణం మారుతూ ఉంటుంది.
(02:34) ఇప్పుడు మూడవది బుద్ధి ఇది చాలా ముఖ్యమైనది. బుద్ధి యొక్క లక్షణం ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలి ఎలా పని చేయాలని విచక్షణతో అది గమనిస్తూ ఆలోచిస్తుంది బుద్ధి బుద్ధి యొక్క విచక్షణ ఎలా ఉంటుందంటే మనసు స్పందించాలనుకుంటున్న వెంటనే అది ఆలోచిస్తుంది.
(03:10) గుణము ప్రవర్తించాలనుకుంటున్న సందర్భంలోనే బుద్ధి ఆగి ఆలోచిస్తుంది మనిషి ఎలా ప్రవర్తించాలో గుణము ఎలా ప్రవర్తించాలో ఎలా నడవాలో అది బుద్ధి విచక్షణతో దాన్ని వివరిస్తూ ఆలోచిస్తుంది అంతర్లీనంగా ఆ బుద్ధి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుంది కాబట్టి బుద్ధితో ఉండండి అని అంటుంటాము బుద్ధి ఉందా నీకు అని చెప్తుంటాం మనము అంటే బుద్ధి యొక్క ప్రవర్తన బుద్ధి యొక్క విచక్షణ మనకు అన్నిటి పట్ల బాధ్యతగా సామరస్యంగా జీవించేలాగా చేస్తుంది.
No comments:
Post a Comment