Monday, February 23, 2026

Toxic Relationship Part 3: Signs of a Toxic Wife | భార్య ప్రవర్తన ఇలా ఉంటే జాగ్రత్త!

Toxic Relationship Part 3: Signs of a Toxic Wife | భార్య ప్రవర్తన ఇలా ఉంటే జాగ్రత్త!

Author Name:greeshma_guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ucgADCtVNvA



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్, మన టాక్సిక్ రిలేషన్షిప్ సిరీస్ లో ఇప్పటికే టాక్సిక్ హస్బెండ్స్ గురించి రెండు భాగాలు చూసాం. కానీ టాక్సిక్ బిహేవియర్ కి జెండర్ లేదు. అందుకే ఈరోజు పార్ట్ త్రీ లో టాక్సిక్ వైఫ్ అంటే ఎలా ఉంటుంది? ఆ సంకేతాలు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఒక భార్య ప్రవర్తన వల్ల ఇల్లు నరకంలా మారుతుంది. అంటే అది కేవలం ఆ భర్త సమస్య కాదు ఆ పిల్లల మీద ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
(00:32) లెట్స్ డైవ్ డీప్ ఇంటు ద సైకాలజీ ఆఫ్ ఏ టాక్సిక్ వైర్ పాయింట్ వన్ ప్రేమ ఉన్నచోట గౌరవం ఉండాలి. కానీ ఒక టాక్సిక్ వైఫ్ తన భర్తని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది. అతని జీతం అతని డ్రెస్సింగ్ లేదా అతను చేసే చిన్న చిన్న పనులను కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది. దే యూస్ బి లిట్లింగ్ యస్ ఏ వెపన్ నలుగురిలో ఉన్నప్పుడు కూడా నీకేం తెలుసు అని వెటకారంగా మాట్లాడడం వల్ల భర్త తన సెల్ఫ్ ఎస్టీమ్ ను కోల్పోతాడు.
(01:07) ఇది ఒక రకమైన ఎమోషనల్ అబ్యూస్ ఫర్ ఎగజాంపుల్ ఒక భర్త ఆఫీస్ నుండి అలిసిపోయి ఇంటికి వస్తాడు అతను ఒక ప్రమోషన్ గెలుచుకున్నాడు లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అతను ఎంతో ఆశగా భార్యకు ఆ విషయం చెప్తాడు. కానీ ఆమె సరేలే ఆ పక్కింటి ఆయన్ని చూడు ఆయన నీకంటే తక్కువ ఏజ్ లోనే కార్కున్నారు నీకు ఈ చిన్న ప్రమోషన్ వస్తే అంత సంబ్రమా అని అంటుంది.
(01:37) ఇక్కడ ఆమె అతని సక్సెస్ ని సెలబ్రేట్ చేయకపోగా కంపారిజన్ తో అతన్ని కించపరుస్తుంది. దీనివల్ల భట్ట తన ఇంట్లో తను ఒక ఫెయిల్యూర్ అని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. పాయింట్ నెంబర్ టూ టాక్సిక్ పార్ట్నర్స్ కి కంట్రోల్ అంటే చాలా ఇష్టం. భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అతని ఫోన్ పాస్వర్డ్ ఏంటి ఇలా ప్రతి విషయంలో మైక్రో మేనేజ్మెంట్ చేస్తారు.
(02:09) ఇన్నోసెంట్ గా మొదలయ్యే ఈ అన్వేషణ మెల్లగా పొజిసివ్నెస్ గా మారుతుంది. భట్ట తన సొంత తల్లిదండ్రులతో లేదా ఫ్రెండ్స్ తో మాట్లాడినా వీరికి నచ్చదు. దీన్నే మనం సోషల్ ఐసోలేషన్ అంటాం. ఫర్ ఎక్జాంపుల్ భర్త తన పాత స్నేహితులతో కలిసి ఒక సండే బయటకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాడు. అప్పుడు భార్య కావాలనే ఏదో చిన్న గొడవ మొదలు పెడుతుంది.
(02:37) లేదా నాకు ఒంట్లో బాలేదు వెళ్తే నేను ఒంటరిగా ఎలా ఉంటానో అని సెంటిమెంట్ తో ఆపేస్తుంది. మెల్లమెల్లగా అతను తన ఫ్రెండ్స్ ని కలవడం మానేస్తాడు. చివరికి తన తల్లిదండ్రులకు ఫోన్ చేయాలన్నా భార్య ఏమనుకుంటుందో అని భయపడతాడు. దీన్నే ఐసోలేషన్ టెక్నిక్ అంటారు. మిమ్మల్ని అందరికీ దూరం చేసి మీరు కేవలం ఆమె మీద మాత్రమే ఆధారపడేలా చేయడం ఆమె ప్లాన్ పాయింట్ నెంబర్ త్రీ ఏదైనా గొడవ జరిగినప్పుడు సమస్యను పరిష్కరించుకోకుండా రోజుల తరబడి మాట్లాడకుండా ఉండడాన్ని సైలెంట్ ట్రీట్మెంట్ అంటారు.
(03:19) ఇది చాలా చాలా చాలా డేంజరస్ దీంతో పాటు నువ్వు ఇలా చేయకపోతే నేను పుట్టినికి వెళ్ళిపోతా లేదా నన్ను నేను ఏదైనా చేసుకుంటా అని బెదిరించడం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇది ప్రేమ కాదు ఇది కేవలం ఎదుటి వ్యక్తిని లొంగ తీసుకోవడానికి చేసే ప్రయత్నం. ఫర్ ఎగజాంపుల్ కూరలో ఉప్పు తక్కువైందని భర్త అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఆమె వంటగదిలోనికి వెళ్ళిపోతుంది.
(03:46) ఆ రోజు నుండి మూడు రోజుల వరకు అతను ఎన్ని సార్లు మాట్లాడినా మాట్లాడాలని చూసినా ఆమె కనీసం కళ్ళలోనికి కూడా చూడదు. అతను సారీ చెప్పినా సరే ఆమె ఆ మౌనాన్ని ఒక శిక్షలా వాడుతుంది. ఇది ఒక రకమైన ఎమోషనల్ మనిపులేషన్ ఎదుటి వ్యక్తిని మానసికంగా కృంగదీయడానికి ఈ పద్ధతిని వాడతారు. దీనివల్ల ఇంట్లో ఒక రకమైన సఫకేషన్ కలుగుతుంది.
(04:19) పాయింట్ నెంబర్ ఫోర్ డబ్బు విషయంలో కూడా టాక్సిక్ బిహేవియర్ కనిపిస్తుంది. భట్ట కష్టపడి సంపాదించిన డబ్బును లెక్క లేకుండా ఖర్చు చేయడం లేదా అతని అవసరాలకు కూడా డబ్బు ఇవ్వకుండా కంట్రోల్ చేయడం ఇందులో భాగం. హెల్దీ మ్యారేజెస్ లో ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం స్వార్థం మాత్రమే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భర్త తన పిల్లల ఫీస్ కోసం లేదా ఎమర్జెన్సీ కోసం దాచుకున్న డబ్బును భార్య తన లగ్జరీ షాపింగ్ కోసం ఖర్చు చేసేస్తుంది.
(04:54) అతను అడిగితే నా మీద నీ ప్రేమ లేదు అందుకే లెక్కలు అడుగుతున్నావు అని రివర్స్ లో అటాక్ చేస్తుంది. దీనివల్ల భట్ట ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ లోనికి వెళ్ళిపోతాడు. తను కష్టపడి సంపాదిస్తున్నా కూడా తన అవసరాలకు డబ్బు ఉండదు. పైగా అప్పుల ఊబిలో ఊరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పాయింట్ నెంబర్ ఫైవ్ తప్పు తనదైనా సరే మాట మార్చి భర్తదే తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు.
(05:26) దీన్నే సైకాలజీలో గేస్ లైటింగ్ అంటారు. వారు కావాలనే గొడవ మొదలు పెడతారు. కానీ ఎవరైనా అడిగితే నేనే బాధితురాలిని అన్నట్లుగా కన్నీళ్లు పెట్టుకుంటారు. దీనివల్ల భర్తకి నిజంగా తనదే తప్పేమో అన్న సెల్ఫ్ డౌట్ కలుగుతుంది. ఫర్ ఎగజాంపుల్ భార్య వేరే వ్యక్తితో చాట్ చేస్తుంటే భర్త చూస్తాడు. అతను దాని గురించి అడిగితే ఆమె నువ్వు నా ఫోన్ ని దొంగతనంగా చూస్తున్నావు నీకు నా మీద నమ్మకం లేదు నువ్వు ఒక సస్పెక్టింగ్ హస్బెండ్ వి నీ మైండ్ పాడైపోయింది అని అతన్నే నిందిస్తుంది.
(06:00) ఇక్కడ తప్పు చేసింది ఆమె కానీ ఆ నిందను అతని మీద నెట్టి అతని మానసిక స్థితి మీదే డౌట్ వచ్చేలా చేస్తుంది. చివరకు అతను నేనే పొరపాటు పడ్డానేమో అని నమ్మేలా చేస్తుంది. పాయింట్ నెంబర్ సిక్స్ భట్ట ఆఫీస్ లో స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీస మర్యాద లేదా కేర్ చూపించకపోవడం ఏ టాక్సిక్ ఫైర్ ఇస్ ఆఫెన్ ఎమోషనలీ అన్అవైలబుల్ ఆమెకు తన అవసరాలే ముక్షం తప్ప భర్త భావాలతో సంబంధం లేదు.
(06:41) ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ పార్టీలో ఉన్నప్పుడు లేదా రిలేటివ్స్ మధ్యలో ఉన్నప్పుడు భర్త పర్సనల్ విషయాలను లేదా అతని బలహీనతలను అందరి ముందు చెప్పి నవ్వుతుంది. ఈయనకు అసలుఏమీ తెలిీదు అంతా నేనే చూసుకోవాలి అని అతన్ని ఒక చిన్న పిల్లాల అందరి ముందు ట్రీట్ చేస్తుంది. దీనివల్ల అతని సోషల్ ఇమేజ్ డామేజ్ అవుతుంది. బయట గౌరవం ఉన్న వ్యక్తి కూడా ఇంట్లో భార్య ఇచ్చే పబ్లిక్ హ్యుమిలియేషన్ వల్ల డిప్రెషన్ లోనికి వెళ్లే అవకాశం ఉంది.
(07:13) గుర్తుంచుకోండి ఈ లక్షణాలన్నీ ఒకరిలో ఉంటే వారు టాక్సిక్ అని అర్థం కానీ వీటిని ఎలా డీల్ చేయాలి? ఆబ్జెక్టివ్ అనాలసిస్ ముందుగా ప్రశాంతంగా ఆలోచించండి. ఆమెకు నిజంగా ఏవైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేక కావాలనే ఇలా చేస్తుందా నో రియాక్షన్స్ వారు గొడవ పడాలని చూసినప్పుడు మీరు రియాక్ట్ అవ్వకండి. మీరు ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే వారికి అంత ఎక్కువ పవర్ దొరుకుతుంది.
(07:41) సెల్ఫ్ కేర్ మీ హాబీస్ ని మీ కెరీర్ ని నిర్లక్ష్యం చేయకండి. మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ పరిస్థితిని ఎదుర్కోగలరు. సెట్టింగ్ బౌండరీస్ ముందుగా మీరు మీ హద్దులను సెట్ చేసుకోవాలి. ఏది సహించాలో ఏది సహించకూడదో స్పష్టంగా చెప్పాలి. ఓపెన్ కమ్యూనికేషన్ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీ ప్రవర్తన నన్ను బాధ పెడుతోంది అని చెప్పండి.
(08:07) ప్రొఫెషనల్ హెల్త్, పరిస్థితి మరీ చెయ్యి దాటిపోతే కపుల్ కౌన్సిలింగ్ లేదా థెరపీ తీసుకోవడంలో తప్పులేదు. మీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేవి ఒక విషయం లాంటిది. అది భర్త అయినా భార్య అయినా మార్పు అనేది అవతలి వారు కోరుకున్నప్పుడే సాధ్యం. ఈ టాక్సిక్ రిలేషన్ సిరీస్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని ఐ అగ్రీ విత్ యు అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి.
(08:32) ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని సైకాలజీ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోల కోసం క్రీస్మస్ గైడెన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బీ స్ట్రాంగ్ బి హ్యాపీ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్.

No comments:

Post a Comment