Nala Damayanthi Charitra – The Most Heart-Touching Love Story ❤️✨ | @kctalkstelugu
Author Name:KC Talks Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@kctalkstelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EK-oDqmlkiE
Transcript:
(00:00) ఎప్పుడైతే ధర్మరాజు ఆ బృహదర్శుని అడుగుతాడు ఏంటంటే నేను యావత్ భూమండలాన్ని ఏలుతున్న ఒక చక్రవర్తి స్టేజ్ నుంచి నారచీరలు కట్టి ఒంటిమీద బట్టలతో అన్నదమ్ములతో కలిసి అరణ్యవాసం పాలైన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా ఆ మహర్షి అయిన బృహదర్శుడు నేను ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను భార్యా భర్తలు మాత్రమే అరణ్యవాసం చేసిన కథ ధర్మరాజా అని అక్కడ నలదమయంతుల కథని మొదలుపెడతాడు కలిపురుషుడు అత అతను హడావిడి హడావిడిగా వెళ్తుంటే దేవతలు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను నేను కూడా అంటాడు ఆయనకి చెప్తారు ఇంకేం
(00:38) స్వయంవరం రా నాయన మేము ఆ స్వయంవరం నుంచే వస్తున్నాం ఆల్రెడీ దమయంతి నలుడిని వరించింది అని వాళ్ళు ఎలా సుఖంగా కాపురం చేస్తారో నేను చూస్తాను అని వెళ్ళిపోతాడు అక్కడిక ఒకానొక రోజు నలుడు మూత్ర విసర్జనం చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనంలో కూర్చున్న నలుడిని కలిపేసాడు కలిపురుషుడు వెళ్లి పుష్కరుడుని నలుడు యొక్క బాబాయి కొడుకు అతనికి ఎప్పటినుంచో ఈ రాజ్యం మీద ఒక కన్ను ఉంది అతనికి చెప్తాడు నువ్వు అతన్ని మాయాజూదానికి పిలువు అతనిలో కలి ప్రభావం ఉంది కాబట్టి నువ్వు పిలవగానే వస్తాడు వచ్చినప్పుడు దెబ్బకు ఓడిపోతాడు కాబట్టి మొత్తం రాజ్యం నువ్వే లాక్కోవచ్చు పూర్తి
(01:14) కలి ప్రభావంలో నిమగ్నుడు అయిపోయిన నలుడు తన యొక్క మొత్తం రాజ్యాన్ని జనులని అన్ని పెట్టి దెబ్బకు ఓడిపోతాడు పుష్కరుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలేసి వెళ్ళిపోమంటాడు అన్నని వదిన్ని నలుడు తన భార్యని తీసుకొని వేసుకున్న బట్టల్ని వేసుకున్నట్టుగా రాజ్యంలో నుంచి బయటకి వస్తారు. హరే కృష్ణ వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు మనందరం వెయిట్ చేస్తున్న ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి. అదే నలదమయంతుల కథ.
(01:48) దీని కథ అనడం కంటే ఒక లవ్ సాగ అనొచ్చు. చాలామంది చెప్తున్నట్టుగా ఈ నలదమయంతుల కథ వింటే మనకు ఎంతో పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న లవ్ స్టోరీని అసలుకు మనం ఆ పురాణాలతో కంపేర్ చేసి ఎలా చూసుకుంటాము అట్లీస్ట్ ఆ కథ వింటే దాంట్లోనుంచి కొంచెం ఇన్స్పిరేషన్ డ్రా చేసేసి మన లైఫ్ ని బెటర్ చేసుకోవచ్చుఅన్న ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ మనం చేస్తున్నాం.
(02:17) నాతో పాటు మీ అందరూ ఈ కథ విని ఆ కలిపురుషుని ప్రభావం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ జాయిన్ మీ ఫర్ దిస్ కన్వర్సేషన్ హరే కృష్ణ హరే కృష్ణ కేసీ గారు అసలుకు నలదమయంతుల కథ ఎందుకంత స్పెషల్ అండి ఎందుకంటే అది పెద్ద లవ్ సాగా అని చెప్తూ ఉంటారు అందరూ దాని నుంచి ఇప్పుడు మోడర్న్ డే వరల్డ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు ఎందుకు అంత గొప్ప వ్యక్తులు వాళ్ళ గురించి వింటే ఎందుకు పుణ్యం వస్తుంది? ఈ డీటెయిల్స్ అన్నీ మీరు పుస్తకంలో రాసిన్నట్టుగా పూర్తిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
(02:47) ఇప్పుడు మీకు లవ్ స్టోరీ అనగానే ఇప్పుడు ఉన్న కలియుగంలో జనాలందరికీ గుర్తొచ్చే కొన్ని లవ్ స్టోరీస్ లో ఫస్ట్ దేవదాస్ పార్వతి సలీం అనార్కలి వెస్టరన్ వరల్డ్ లో రోమియో జూలియట్ ఇలాంటి ఒక లవ్ స్టోరీస్ ని మనం చాలా గ్రాండియస్ గా అంటే వాళ్ళకు లేని ఒక వైభవాన్ని మనం క్రియేట్ చేసి దాన్ని అద్భుతకరించి అంటే ఎగజాజరేట్ చేసి లేని అసలు ఆ పాత్రలు నిజంగా ఉన్నాయో లేదో అనే ఒక పెద్ద డౌట్ అలాంటి దానికి కలియుగంలో ఉన్నవాళ్ళు దానికి సో కాల్డ్ లవ్ ని ఆపాదించి దాన్ని ఒక పెద్ద లవ్ స్టోరీలా చిత్రీకరించి దాని తర్వాత ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్ లో
(03:26) వాలెంటైన్స్ డే అనేది ఒకటి తీసుకొని వచ్చి దాన్ని పండగలు చేసుకునే రేంజ్ కి మనం వచ్చేసాం కలియుగంలో కానీ అసలు లవ్ అంటే ఏంటి నిజమైన లవ్ స్టోరీ ఏంటి అనేది బృహదర్శుడు అనే ఒక ఋషి పాండవులని అని అరణ్యవాసంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ధర్మరాజు ఆ బృహదర్శుని అడుగుతాడు ఏంటంటే చక్రవర్తి సార్వభౌమత్వాన్ని పొంది నేను యావత్ భూమండలాన్ని ఏలుతున్న ఒక చక్రవర్తి స్టేజ్ నుంచి నారచీరలు కట్టి ఒంటిమీద బట్టలతో అన్నదమ్ములతో కలిసి అరణ్యవాసం పాలైన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని ఆయన అడిగిన ఆ క్వశ్చన్ కి ఆ మహర్షి అయిన బృహదర్శుడు నాయనా నువ్వు నీ తమ్ముళ్ళతో నీ భార్యతో నీ
(04:14) రాజ పురోహితుడైన దౌమ్యుడితో కొందరు వేల మంది బ్రాహ్మణోత్తములతో నువ్వైనా వనవాసం ఉన్నావు కానీ నేను ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను ఆ కథలో వాళ్ళ పక్కన ఎవ్వరూ లేరు భార్య భర్తలు మాత్రమే అరణ్యవాసం చేసిన కథ నీకు ఇప్పుడు ఈ కథ వింటే చాలా మోటివేషన్ వస్తది నీకు చాలా రకాలుగా ఈ కథ నీకు నీ మోరల్ స్పిరిట్ ని పెంచుద్ది ధర్మరాజా అని అక్కడ నలధమయంతుల కథని మొదలు పెడతాడు.
(04:43) సో ఇప్పుడు మన నలదమయంతుల కథలోకి వెళ్ళే ముందు చిన్న బేసిక్ పరిచయం ఏంటంటే నలుడు ఎవరయ్యా అంటే అతను నిషాద రాజ్యపు రాజైన వృషసేనుడి కొడుకు నలుడు అలాగే దమయంతి ఎవరయ్యా అంటే విదర్భ రాజ్యానికి చెందిన భీమ ఆ రాజు పేరు ఆయన కూతురు సో వీళ్ళద్దరు వాళ్ళ వాళ్ళ ఇద్దరు గొప్ప రాజులే అంటే మీ దృష్టిలో అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఒకళ్ళ అంబా అంబానీ అయితే ఒకళ్ళ అదాని లాగా ఇద్దరు పెద్ద పెద్ద రాజ్య కుటుంబాల్లో మహా పెద్ద రాజ్యాలు ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు నలుడు దమయంతులు వాళ్ళ వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళ వాళ్ళ తండ్రుల దగ్గర పెరుగుతున్నారు. అలా పెరుగుతున్న
(05:27) తరుణంలో దమయంతి యొక్క వైభవం గురించి నలుడికి నలుడు యొక్క వైభవం గురించి దమయంతుకి ఈ రాజ్యంలోనుంచి ఆ రాజ్యంలోకి ఆ రాజ్యంలోకి ఈ రాజ్యంలోకి వాణిజ్యంగా వెళ్తున్న కొందరు వ్యాపారుల మాటలు మాట్లాడుకుంటుంటే వాటి ద్వారా వీళ్ళకి తెలుస్తది. సో నలుడికి తెలుస్తది అన్నమాట అంటే విదర్భ రాజ్యంలో చాలా అందమైన ఒక అమ్మాయి ఉంది ఆమె పేరు దమయంతి అట ఆమె చూడటానికి ఇలా ఉంటదంట అలా ఉంటదంట అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే హీరోయిన్ల గురించి గాసిప్స్ మీ దృష్టిలో ఎలా అయితే గాసిప్స్ ఉంటాయో అలాగా మీరు అనుకున్నట్టుగానే అలా నలుడికి తెలుస్తది దమయంతి గురించి అలా దమయంతి
(06:04) వాళ్ళ రాజ్యంలో కూడా కొందరు చిలికిత్తల ద్వారా దమయంతి వింటది అంటే నలుడు నిషాద రాజ్యపు రాజు కొడుకు అంట సో ఆయన చాలా యనో ఒక పరాక్రమవంతుడు అంట విలువిద్యలో ఇలా అంట గుర్రపు స్వారీలు అలా అంట అని వీళ్ళద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ముందునుంచే గాసిప్స్ ద్వారా అంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎగురుతూ వచ్చిన వార్తల ద్వారా వాళ్ళఇద్దరి గురించి తెలుసుకుంటారు.
(06:28) తెలుసుకున్న తరుణంలో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం పెంచుకుంటారు. అలా పెంచుకుంటున్న తరుణంలో ఒకానొక సందర్భంలో నలుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు అక్కడికి కొన్ని హంసలు వస్తాయి. ఆ నీళ్ళల్లో ఆడుకోవడానికి ఆ హంసలు వస్తే ఆ హంసల్ని చూడగానే ఎగసైట్ అయినడు హంసలు అనేవి ఎప్పుడూ మన నార్మల్ సమాజంలో ఉండవు అవి కేవలం హిమాలయాల్లోనో లేకపోతే మానస సరోవరంలోనే తిరుగుతూ ఉంటాయి అనేసి మన శాస్త్రం చెప్తుంది.
(07:00) అందుకనే హంస అనే ఒక జీవి డైనోసర్ లాగా అసలు అది ఉందా లేకపోతే కాలగర్భంలో కలిసిపోయిందా అనేది మనకు తెలియదు కానీ శాస్త్రంలో మాత్రం హంస గొప్పతనాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకలాగా అంటే పాలని నీళ్ళని కలిపేసిన పాలని నీళ్ళని వేరు చేసి పాలు తాగగలిగిన వ్యక్తి ఆ హంస అలాగ అందుకనే ఆ హంస పేరుతోనే మహర్షులకి పెద్ద పెద్ద సన్యాసులకి కూడా పరమహంస అని ఒక బిరుదుని ఇస్తారన్నమాట అంటే సమాజంలో ఉన్న ఇంత చెడు లోంచి మంచిని మాత్రమే వాళ్ళు గ్రహించగలిగిన వాళ్ళు అని అలాంటి హంసలు వాళ్ళ రాజ్యంలోకి వస్తే అవి వాళ్ళకు కూడా ఒక విచిత్రం సో పోయి ఒక హంసని అతను
(07:37) పట్టుకుంటాడు పట్టుకుంటే హంస భయపడి అమ్మో మనిషి కదా నన్ను పట్టుకుంది నన్ను ఏమన్నా చేస్తాడేమో అని ఒక భయంతో నీకు నేను ఒక హెల్ప్ చేస్తాను నన్ను వదిలేస్తే అంటది. ఏ హెల్ప్ చేస్తావు అంటే అతను ఆడుకోవడానికి ఆ అంశాన్ని పట్టుకున్నాడు అంటే నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసులే నీకు దమయంతి ఉంది కదా నేను ఇక్కడి నుంచి విదర్భ రాజ్యానికి ఎగురుకుంటూ వెళ్లి దమయంతికి నువ్వు దమయంతిని బాగా ఇష్టపడుతున్నావని నేను చెప్తాను మీ ఇద్దరికీ లవ్ మెసెంజర్ అవుతాను అని ఇక్కడ మీకు ఇమ్మీడియట్లీ గుర్తుకు రావాల్సింది ప్రేమ పావురాలు అన్నమాట ఎలా అయితే జా జా
(08:10) అలా అయితే అలా కబూతర్ జా జాజా లాగా ఆ ప్రేమ పావురాల్లో వాళ్ళకి వచ్చిన ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడి నుంచి తీసుకున్న అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న ఏ లవ్ స్టోరీలో సబ్స్టెన్స్ తీసుకోవాలన్నా నమదయంతుల కథ నుంచే తీసుకుంటారు అందరూ ఏ రైటర్ అయినా ఇక్కడి నుంచి తీయాల్సింది అంత పెద్ద కావ్యం ఇది నలదమయంతుల కథ సో అలాగా హంసరాయభారం మీకు అక్కడ ఈ హిందీ సినిమాలో పావురాల ద్వారా పావురాల ద్వారా తెలుసుకున్నట్టు ఇక్కడ హంసరాయభారం అన్నమాట సరే హంస అలా అయితే వెళ్ళు చెప్ప చెప్పమంటే ఆ హంస ఎగురుకుంటూ వెళ్లి ఆయనక ఇచ్చిన మాటగా వెళ్లి దమయంతికి నలుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు
(08:48) నువ్వంటే చాలా పిచ్చి నలుడికి అని హంస చెప్తది. ఎప్పుడైతే ఆ దమయంతికి హంస ఈ మాట అందో అప్పుడు వరకు ఉన్న ఇష్టాన్ని ఒక ఆడపిల్ల వైకౌమార దశలో అంటే టీన్స్ లో పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి మనసులోకి ఇంకా విపరీతమైన ప్రేమ ఇన్ఫాక్చుయేషన్ ఎప్పుడూ చూడని నలుని తను ఇమాజిన్ చేసుకుంటున్నది అంతే ఆ రోజుల్లో మీకు చూసినట్టుఇస్గ్ర లోఫేస్బుక్ లో కూడా లేవు రిక్వెస్ట్లు పెట్టడానికి తను ఆ నలుడిని ఊహించుకొని నలుడు యందు ప్రేమ అనురాగం పెంచేసుకుంటది.
(09:23) అంటే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే యవ్వనంలో ఒక అమ్మాయికి ఒక్కసారి ఒక వ్యక్తి మీద ప్రేమ పుడితే ఇంకా ఆ ప్రేమ బాగా దృఢంగా తయారైపోతది దాన్ని మన సినిమా వాళ్ళు ఏంటంటే దాన్ని రకరకాల వర్ణనలుగా చూపించారు. అంటే ఆవిడకి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఆకలి దప్పికలన్నీ పోయి ఆమె ఎక్కడ చూసినా నలుడునే ఊయించుకుంటూ నలుడు యందు ఆమె ఆ శృంగార వికారమును పొంది ఆమె కొన్ని తడిబట్టలతో సరస్సులలోనూ లేదా పూల మీద పడుకుంటున్నట్టుగా ఇలా అన్నీ ఊహించుకొని చెప్పారు.
(10:03) ఏ మూమెంట్లో అయితే హంస నలుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అన్న సంగతి తెలిసిందో తన లోలోతుగా ఇక నలుడునే తన భర్తగా ఊహించేసుకొని తన మీద విపరీతమైన ప్రేమానురాగాలని పెంచేసుకుంది దాన్ని మీరు కొంచెం మన్మద తాపంగా కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడెప్పుడు నల్లుడు వస్తాడు ఎప్పుడు నన్ను ముట్టుకుంటాడు ఎప్పుడు మేము ఆలింగనం చేసుకుంటాం ఇలాంటి ఆలోచనలన్నీ తనలో ఈ దమయంతిలో రావటం మొదలు పెట్టాయి అలా మొదలు పెడుతూ పెడుతూ పెడుతూ ఇంకా తనకు ఆకలి దప్పికలు లేక తిండి రుసించగా ఆమె చిక్కి శీల్యం అయిపోయింది సగం అయిపోయింది అనే సంగతి అక్కడ వర్ణనలో ఉంది.
(10:38) అలా అయిపోతే అప్పుడు విదర్భరాజైన భీముడు చిలికెత్తల ద్వారా తన భార్య ద్వారా ఈ సంగతిని తెలుసుకొని తనకు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అంటే నా కూతురికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది ఆమె ఎవరినో ఇష్టపడుతుంది ఆ ఇష్టపడుతున్న వాడినే తీసుకొని వచ్చి అంటే ఇక్కడ అన్ని స్వయంవరాలలాగా పరాక్రమమైనంత విల్లునో ధనస్సునో ఎక్కువ పెట్టి విరగొక్కలేదు సో రాజులు స్వయంవరానికి వస్తే దమయంతి నడుచుకుంటూ వెళ్లి ఏ రాజు ఇష్టమో ఆ రాజు మెడలో వరమాల వేస్తే ఈ స్వయంవరం అయిపోతది.
(11:10) అసెస్మెంట్ లేకుండా అసెస్మెంట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ తన కూతురు ఒకడిని ఇష్టపడిపోయింది అన్న సంగతి తెలుసు కదా కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. సో అందరూ రకరకాలుగా మంచి బట్టలు వేసుకొని మంచి నగలు వేసుకొని మంచిగా వస్తే తన్ని ఎవరు ఇష్టపడితే వాళ్ళని వేసేస్తది ప్లస్ తన మనసులో నల్లుడు ఉన్నాడు కాబట్టి నలునే కచ్చితంగా వివాహం చేసుకుంటది అనే ఇది అంటే ఇక్కడ మీరు అది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక యవ్వనంలో ఉన్న ఒక కూతురు మనసులో ఒకడు ఉన్నాడు అని తెలుసుకోగానే తండ్రి చేయాల్సిన ఫస్ట్ కార్యం ఏమిటంటే వాళ్ళకి పెళ్లి చేసేయడం
(11:41) ఇప్పటిలాగా కొట్లాటలు యుద్ధాలు అక్కర్లేదు అంటారు అక్కర్లేదు ఎందుకంటే ప్రేమ అనేది వయసు పెరిగే కొద్ది ప్రేమలో కలిషితం వస్తది. మనకి ప్రపంచం తెలియనప్పుడు మనం వయసు పెరుగుతున్నప్పుడు ఆ వైకౌమార దశ అంటే లేట్ టీన్స్ లో ఎప్పుడైతే మీకు ప్రేమ కలుగుతదో ఆ వ్యక్తితో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఇక మంచో చెడో కష్టమో నష్టమో ఇక కాలం చూసుకుంటది అన్నమాట ఇంకా డ్రామా తర్వాత మొదలవుతది.
(12:07) ముందు డ్రామా అక్కర్లేదు. సో మీరందరూ సినిమాల్లో చూసే లవ్ స్టోరీ అంతా ది ఎండ్ వాళ్ళిద్దరు కలుసుకున్నంత వరకే కలుసుకున్న తర్వాత వేరే సినిమా కదా దాని తర్వాతే అసలు సినిమా మొదలవుతది ఇది ఎండ్ తర్వాత లవ్ స్టోరీస్ లో అలాగా మన ట్రెడిషనల్ అంటే పాత కాలంలో ఉన్న కావ్యశాస్త్రముల నందు తల్లిదండ్రుల్ని ఎదిరించి పోరాడినది లవ్ సాగ కాదు మ్ తల్లిదండ్రులు ఒప్పేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు బ్రతికేదే రియలైన లవ్ సాగ అవును సో అలాగా స్వయంవారాన్ని ఏర్పాటు చేసేస్తారు.
(12:42) ఏర్పాటు చేసేసిన తరుణంలో మొత్తం అన్ని రాజ్యాలకి దండోరా కొడతారు. విదర్భరాజైన భీమసేనుడి యొక్క కూతురైన దమయంతికి స్వయంవరం అని అప్పుడు మొత్తం అందరి రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దమయంతి గురించి ఆల్రెడీ విని ఉంటారు. దమయంతి వైభవం దమయంతి అందం గురించి అందరూ చెప్పి ఉంటారు వాళ్ళకి అదంతా విని అందరూ రాజులు ఇక సంసిగ్ధం అవుతారు. అప్పుడు స్వర్గలోకంలో ఒక చిన్న విషయం జరుగుద్ది.
(13:07) అక్కడికి ఒకానొక మహర్షి వస్తే స్వర్గలోకంలో ఇంద్రుడు అడుగుతాడు ఏమిటి ఈ మధ్య భూలోకంలో యుద్ధాలు జరగట్లేదా యుద్ధాల్లో మరణించిన వాళ్ళందరూ వీర స్వర్గానికి వెళ్తారు. ఏ యుద్ధమైనా ఇవాళ ఇండియా పాకిస్తాన్ కి ఒక యుద్ధం జరిగినా ఒక సైనికుడు ప్రాణత్యాగం చేస్తే అతను స్వర్గ లోకానికే వెళ్తాడు. ఎందుకంటే ఏ ప్రభువు పట్ల విశ్వాసాన్ని చూపించి యుద్ధం చేస్తే నిస్వార్థంగా దాన్ని వీరమరణం అంటారు.
(13:34) వీరమరణం పొందిన ప్రతివాడు వీర స్వర్గం అని స్వర్గంలో ఒక ప్రత్యేకమైన ఒక ఒక సెక్షన్ అది అక్కడికి వెళ్తాడు స్వర్గ భోగాన్ని అనుభవిస్తాడు. అలాగ ఎవరు వీర స్వర్గానికి రావట్లేదే భూమి మీద ఏ యుద్ధాలు జరగట్లేదా అని అడిగితే ఆ మహర్షి చెప్తాడు కింద భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతుంది ఇంద్ర అందరూ స్వయంవరానికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు యాక్షన్ కాదండి లవ్ నడుస్తుంది ఆ ఇప్పుడు అందరి మైండ్ లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అనే ఒక రొమాంటిక్ ఫాసినేషన్ నడుస్తుంది యాక్షన్ సీక్వెన్స్ లేదు ఇక్కడ ఎవరు యుద్ధాలు చేయట్లేదు కింద ఒకసారి ఈ దమయంతి
(14:11) స్వయంవరం అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ మళ్ళీ మళ్ళీ యుద్ధాలు చేసుకుంటారు అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు వస్తారులే స్వర్గానికి అంటాడు. అంటే యావత్ భూమండలము ఒక స్వయంవరానికి ప్రిపేర్ అవుతుంది అంటే ఆమె ఎంత గొప్పగా ఉంటదో అంటే ఆమె గురించి చెప్పిన ఆ మహర్షి యొక్క మాటలు విన్న ఇంద్రుడు యముడు అగ్ని వరుణుడు ముగ్గురు కలిసి ఆశ్చర్యపోతారు అంటే ఇది స్వర్గంలో జరుగుతుంది ఈ చర్చ ఈ మీటింగ్ అయితే అలాంటివా అలాంటి దమయంతిని మేము కూడా పెళ్లి చేసుకుంటాం అని ఇంద్రుడు అంటాడు అంటే మీరు పెళ్లి చేసుకోవడం కాదు ఇంద్రవర్య కింద ఉన్న నలుడు అనే వ్యక్తిని
(14:49) ఆల్రెడీ దమయంతి ప్రేమిస్తుంది అని చెప్తారు చెప్పగానే ఇమ్మీడియట్లీ ఇంద్రుడు విత్ ఈ నలుగురు దేవతల్ని కలిసి అంటే ఎవరు అగ్ని వరుణ యమ ప్లస్ లోకపాలకులు వీళ్ళందరినీ కలిసి అష్టదిక్పాలకులు అంటారు కదా అలా దిక్పాలకులు అందరూ కలిసి కిందకవచ్చి నలుని చూసి నలుని పొగుడుతారు ఏంటంటే ఎంత ధర్మం ఉన్నవాడా ఎప్పుడు అడిగినది లేదనకుండా అందరికీ దానం ఇచ్చేవాడా మాట తప్పని వ్యక్తి అని అతన్ని పొగడగానే నలుడు చాలా ఇంప్రెస్ అయి మీకు ఏం కావాలో చెప్పండి నేను ఖచ్చితంగా ఇస్తాను అంటాడు.
(15:30) సడంగా వచ్చి పొగిడితే డౌట్ రాదా అంటే పూర్వం మన కలియుగంలో లాగా మోసాలు చేసేవాళ్ళు అంత ఎక్కువ మంది రారు కదా కాబట్టి ఎప్పుడో ఒకసారి మోసం చేసేవాళ్ళు వస్తే జనాలు వాళ్ళ మీద డౌట్ పడరు అన్నమాట ప్లస్ రాజు కదా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు మేము ఎవరమో కాదు మేమే ఇంద్రుడు ఫలానా ఈ దేవతలం మేము దమయంతి అని ఒక ఒక ఆడావిడు ఉందంట ఆ దమయంతి ని మేమందరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి నువ్వు మా తరఫున రాయభారానికి వెళ్లి దమయంతిని ఒప్పించవలసినది అని చెప్తారు అది విన్న నల్లుడు ఆశ్చర్యపోతాడు అదేంటది నేను కూడా దమయంతిని ప్రేమించాను కదా
(16:10) అంటాడు అంటే మరి మేము మాట తప్పకుండా అందరికీ ఇచ్చేవాడా అన్నప్పుడు చెప్పండి ఇస్తా అని ఎందుకు అన్నావ్ ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నావ్ అంటే దేవతలు ఒక పరీక్షించడానికి వచ్చారు. ఈ లవ్ స్టోరీ యొక్క ఫస్ట్ పరీక్ష దేవతలే చేస్తున్నారు వీళ్ళకి సో అలాగా అంటే ఇంకా నలుడి దగ్గర ఒక ఆప్షన్ లేక సరే స్వామి అలాగే నేను వెళ్తాను విదర్భ రాజ్యానికి వెళ్లి దమయంతిని కలుస్తాను అని ఆ మాట చెప్పగానే అప్పుడు మా యొక్క శక్తితో అంటే మేమందరం దేవతలం కదా నువ్వు దమయంతి అంతపురానికే డైరెక్ట్ గా వెళ్ళేటట్టుగా ఏర్పాటు మేము చేస్తాం అదృశ్య శక్తిలాగా నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోయేటట్టుగా
(16:48) సో అలాగ నడుచుకుంటూ నలుడు దమయంతి యొక్క అంతప్పురానికి వెళ్తాడు. అంటే ఆమె యొక్క ప్రైవేట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హమ్ చూసిన దమయంతి ఆ నేనే నలుడిని అని చెప్పగానే ఇంకా ఎక్కడి లేని విరహతాపంతో అంటే ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటది కదా ఇనిషియల్లీ ఎక్సైట్మెంట్ అంతా మీరు మీరు ప్రేమించి ఉంటే మీరు మీకు అర్థం అవుతది అన్నమాట నేను ఎప్పుడు అమ్మాయిని కలుస్తానా ఎప్పుడు ఆ అమ్మాయిని చూస్తానా అనే వచ్చే ఒక ఒక ఎమోషన్ అది సో చూడగానే నలుడు కూడా అదే ఫీలింగ్స్ వస్తాయి కానీ అవన్నీ బయట పెట్టుకోలేక
(17:23) యాక్చుల్లీ నన్ను దేవతలు పంపించ ంచారు దమయంతి మీ దగ్గరికి ఇంద్రుడు యముడు వరుణుడు అగ్ని ఈ నలుగురు కలిసి ఏమని పంపించారు అంటే ఇంద్రుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడట సో కాబట్టి మీరు ఇంద్రుడినైనా లేదా ఈ నలుగురిలో ఎవరినైనా మీరు పెళ్లి చేసుకోవలసినదని నాతో రాయభారానికి పంపించారు అని నలుడు చెప్పగానే ఇమ్మీడియట్లీ దమయంతి ఆశ్చర్యపోద్ది అదేంటిది అది నేను ఇంత ప్రేమతో ఎప్పుడెప్పుడు చూడాలి నిన్నని ఆ ఆతృతతో నీ దగ్గరికి వస్తే నువ్వేమిటి వచ్చి ఇంకెవరో నన్ను పెళ్లి చేసుకుంటారంట అని మీడియేషన్ తీసుకొని వస్తావు అని అడుగుద్ది అడిగితే ఆ నలుడు అంటాడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను
(18:09) అంటే అప్పుడు చాలా కఠినంగా దమయంతి ఏమంటది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను చెప్తే నువ్వు వేరేవాళ్ళని పెళ్లి చేసుకుంటావా నన్ను అడుగుతావ ఏంటి అలాంటి మాటలు నువ్వు మాట్లాడకు వినటానికి చాలా వికారంగా ఉంది ఇది నాకు చాలా జిగుప్సగా ఉంది అలాంటి మాటలు నువ్వు మాట్లాడద్దు అంట అప్పుడు నలుడు కూడా న్యాయం చేయాలి కదా వాళ్ళందరూ ధర్మ ప్రభువులు వాళ్ళు ఆయన ఏమంటాడఅంటే నేను మనిషిని అంటే నాకు మరణం ఉంటది.
(18:35) వాళ్ళు దేవతలు వాళ్ళకు అద్భుతమైన శక్తులు ఉంటాయి. వాళ్ళకి మనలాగా మరణం ఉండదు అలాంటి నీ రాతే మారిపోతది దమయంతి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు నార్మల్ మనుషులు కాదు ఇంద్రుడు అతను మొత్తం దేవతలకే రాజు అగ్ని వాయువు యముడు వరుణుడు ఇలాంటి గొప్ప గొప్ప ఆ దేవతలు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అంటే నాలాంటి చిన్న మనిషిని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని చేసుకుంటే ఇంకా సుఖపడతావు అంటాడు అసల నేను ఇంకొక మనిషి అతను దేవత అయినా ఇంకెవరైనా నేను కలలో కూడా ఇంకొక మనిషిని నేను ఊహించలేను ఒక్కసారి ఒక ఆడపిల్ల ప్రేమిచ్చి తన మనసుని
(19:20) ఇచ్చేస్తే ఇంకా ఎప్పటికీ ఆ ఎంత డబ్బు ఉన్నవాడు వచ్చినా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు వచ్చినా ఆ అమ్మాయి వాడిని మర్చిపోలేదు నలమహారాజ నేను ఎవరవచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్న నేను మాత్రం మనసులో నిన్నే పెట్టుకున్నాను నిన్నే చేసుకుంటాను అని అంటది అసలు ఆమె ప్రేమ ఆల్రెడీ ఆ టెస్ట్ పాస్ అయిపోయింది నలుడి దగ్గర అమ్మో ఇంత గొప్ప భార్య నాకు దొరకబోయేది అని నలుడు ఆశ్చర్యం పొందుతాడు అంటే ఇంద్రుడు లాంటి వాడు వచ్చి చేసుకుంటాడు అంటేనే చేసుకోని అంటది ఆ అమ్మాయి అని పోనీ ఎందుకు అంత సందేహిస్తున్నావు నువ్వు నాకు సరిగ్గా చెప్పలేదని వాళ్ళు
(19:54) అనుకుంటారేమో ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ నేను ఉన్నాను కదా నువ్వు సరిగ్గా ప్రయత్నించి మీడియేషన్ సరిగ్గా చేయలేదేమో వాళ్ళని సరిగ్గా అమ్మలేదేమో అని వాళ్ళు అనుకుంటారన్న నువ్వు భయపడుతున్నావ్ అట్లో మొబైల్ ఉంటే రికార్డు చేసి పంపించే వాళ్ళు లేదు కదా అప్పట్లో మొబైల్ ఉంటే రికార్డ్ చేసి వినిపించు నువ్వు నాకు అంతా కరెక్ట్ గా చెప్పావని నా మాటగా పోయి ఇంద్రుడికి వరుణుడికి అందరికీ చెప్పు ఈ దేవతలకి ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా ఎంత పరాక్రమమైన పురుషులు వచ్చినా నా మనసులో నలుడే ఉన్నాడు నేను నలుడినే చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేయి నా మాటగా చాలా సంతోషపడ్డ
(20:27) నలుడు వెనక్కి తిరిగి ఆ దేవతల దగ్గరికి వెళ్తాడు దేవతల దగ్గరికి వెళ్లి జరిగింది జరిగినట్టుగా చెప్తాడు మీరేదో మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి వినిపించినట్టుగా వాళ్ళ వాళ్ళకి వినిపిస్తాడు వినిపిస్తే అరే అవునా ఇంద్రుడిని వరుణుడిని యముడిని అగ్నిని ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని పెళ్లి చేసుకోకుండా నిన్నే పెళ్లి చేసుకుంటాను అందా ఎందుకంటే నేను అంతా ప్రేమిస్తాను అందా అరే అయితే ఈ అమ్మాయిని ఇంకా పరీక్షించాల్సిందే సరే అలాగే కానీ నువ్వు చెప్పింది నమ్మాం మేము నువ్వు స్వయంవరానికి వెళ్ళినప్పుడు మేము కూడా స్వయంవరానికి వస్తాము అంటారు
(21:00) సరే మీరు రండి అని అందరూ స్వయంవరంలో ఉంటారు వరవాళ్ళ చేతిలో పట్టుకొని నలుడు మెడలో వేద్దాం అని చెప్పి ఆ విదర్భరాజు నడిపిస్తుంటే నడుచుకుంటూ వస్తున్న దమయంతి ఎక్కడ నలుడు ఉన్నాడు ఎక్కడ నలు అడ పక్క ఈ పక్క చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒకచోట ఐదుగురు నలు కనపడతారు నలుడు పక్కన ఐదుగురు నలు ఎవరంటే ఇంద్రుడు నలుడు శరీరాన్నే తీసుకొని అగ్ని నలుడు శరీరాన్నే తీసుకొని వరుణుడు నలుడు శరీరమే తీసుకొని యముడు నలుడు శరీరమే తీసుకొని నలుడు పక్కన కాన ఇంకో నలుగురు నలు కనపడతారు ఆమెకి చూస్ ద రైట్ ఆప్షన్ ఇప్పుడు ఇప్పుడు చూస్ ద రైట్ ఆప్షన్ అంటే
(21:40) ఇప్పటివరకు ప్రేమ అనురాగం ఆడపిల్ల ఒక్కసారి ప్రేమిస్తే వెనక్కి తిరిగి వెళ్ళదు ఇంద్రుడు వచ్చినా చంద్రుడు వచ్చినా నేను నిన్నే చేసుకుంటాను అని అంది కదా చూద్దాం ఇప్పుడు ఎలా నిలబడతదో అంటే ఆ దమయంతికి ఉన్న ప్రేమ ఎంతంటే ఇమ్మీడియట్లీ ఆల్రెడీ నలుడు చెప్పాడు కదా ఈ దేవతలు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని ఆ దేవతలనే మనసులో స్మరించుకొని నా రైట్ నలుడిని నేను ప్రేమించిన నలుని కనిపెట్టేటట్టుగా నాకు శక్తిని ప్రసాదించండి అని మనసులో కోరుకుంటది.
(22:12) దేవతలు కదా నేను మీకు ఆల్రెడీ చెప్పాను దేవతలు అనేవాళ్ళు మన శరీరంలోనే ఒక భాగాలుగా బ్రతుకుతారు. బ్రహ్మ మన తలలో అధిష్టాన దేవత బ్రహ్మ. అలా శరీరంలో ఉన్న రకరకాల భాగాలకి రుద్రుడు మన మనసుకి మనోనియామక దేవుడు రుద్రుడు అలా దేవతలందరూ మనలోనే ఉన్నారు వాళ్ళు ఆమెకి ఒక ప్రజ్ఞని ఇస్తారు ఏంటి అంటే దేవతలు కళ్ళు మూసుకోరు మనలాగా వాళ్ళ కనురెప్పలు మనలాగా పడవు బ్లింక్ చేయరు బ్లింక్ చేయరు రెండు దేవతలకి చెమట పట్టదు ఆ కరెక్టే దేవతలు ఎప్పుడు అలిసిపోరు నిత్యం అలాగే అలుపు లేని వ్యక్తులుగా ఉంటారు దేవతలు నించున్నా కూర్చున్నా వాళ్ళ పాదాలు భూమిని అంటావు భూమికి వాళ్ళ పాదాలకి ఒక
(22:53) చిన్న గ్యాప్ ఉంటది. అలాగే ధర్మరాజు యొక్క రథం కూడా ఒక ఒక ఇంచు గాలిలో లెగిసి నడిచేదని మనం మనం వింటాం కదా అలాగ ఈ దేవతల్లో కూడా అంత ధర్మం ఉంటది కాబట్టి వాళ్ళు భూమికి భారం కారు అని చెప్పడానికి ఇది సో వాళ్ళు ఎప్పుడు భూమి మీద కాలు మోపరు వాళ్ళు కాబట్టి ఈ మూడు లక్షణాలని బాగా క్లియర్ గా చూసి నిజమైన నలుడికి చెమటలో పడుతుంటాయి.
(23:16) ఆ ఈమె ఎవరిని ఎంచుకుంటదో అయ్యో నా ప్రేయసి నన్ను ఇంత ఇష్టపడింది నేను ఆమెని ఇష్టపడ్డాను కొంపతీసి ఇంకెవరు నా మెడలో వరమాల గాని వేసేస్తదా అని భయపడుతున్న అల్లుడిని చూస్తది అంటే ఈ పూనిక అంటే ఈ తెలివి తేటలు అందరూ కూడా దేవతలే ఆ అమ్మాయి కలిపించారు వీళ్ళందరూ చిన్న పిల్లలండి పెళ్ళు చేసుకుంటున్నప్పుడు 15 16 సంవత్సరాల వయసు వీళ్ళ అందరి అంతా అంతే కదా ఆ చూసి చెమటలు పడుతున్న నలుడు మెడలో వరమాల వేసేస్తారు అదే వచ్చింది ఆ దమయంతికు ఉన్న ప్రజ్ఞ చూడండి అప్పటినుంచి ఎలాంటి ంటి ప్రజ్ఞతో దమయంతి ఉంది అని అలా వేసేయ్యగానే ఇంక ఇమ్మీడియట్లీ దేవతలందరూ
(23:51) కంగ్రాాచులేషన్స్ మీ ప్రేమ సఫలీకృతం అయింది. సో కచ్చితంగా మీ లవ్ స్టోరీకి మేమందరం సక్సెస్ఫుల్ గా నిలబడతాం మాకు చాలా నచ్చింది మీ లవ్ స్టోరీ ఎంత అంటే అసలు టెంప్టేషన్ే లేదు ఇంద్రుని పెళ్లి చేసుకుంటే నేను స్వర్గంలో ఉండొచ్చు ఆస్తి కానీ అందం కానీ ఐశ్వర్యం ఏమీ లేదు. ఆస్తి అందం ఐశ్వర్యం ఒక్కసారి ఆడపిల్ల ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి కోసం ఎంత దూరంఅన్నా వెళ్తది ఎన్ని పరీక్షలన్నా ఎదురుకుంటది అనేదానికి ఇక్కడ స్టోరీ ఆల్రెడీ మొదలైింది.
(24:24) అలా చేసిన నలుని చూసి ఇలాంటి గొప్ప మనిషి మనసు దోచుకున్నావే నువ్వు నీకు మేమందరం ఆశీర్వదిస్తున్నాం నీకు మేము అన్ని వరాలు ఇస్తున్నాం అని వరుణ దేవుడు అంటాడు నీకు ఎప్పుడు నా అనుగ్రహం ఉంది. అంటే ఆయనకి దప్పిక అనేది ఉండదు. నీళ్ళ అనేవి ఆయన ఎక్కడా తీసుకెళ్లక్కర్లేదు ఇలా అంటే నీళ్ళు వచ్చేస్తాయి అది ఆయనక ఇచ్చిన వరం అగ్ని నేను నిన్ను దహించలేను ఎక్కడ అగ్ని వచ్చినా అది నిన్ను దహించలేదు అలాగా యముడు ఎప్పుడు ధర్మనిష్ట కలిగిన వాడివి నువ్వు అని యముడు ఇంద్రుడు ఎప్పుడు ఐశ్వర్యంలోనే నువ్వు ఉంటావు ఓటమి లేని నలుడిగా నువ్వు ప్రఖ్యాతి చెందుతావని నలుగురు నాలుగు ఆశీర్వాదాలు
(25:03) ఇచ్చారు. ఇప్పుడు నలుడిక వచ్చిన ఇటువంటి ఒక ఆశీసులు ఎవరి వల్ల వచ్చాయి దమయంతి వల్ల అది సో భార్యని ఒక ఆడవాళ్ళను పెళ్లి చేసుకుంటే పురుషుడికి ఎంత ఖ్యాతి వస్తదో అని చెప్పానా నేను అవును అలాంటి ద్రౌపదిని పెళ్లి చేసుకున్న పాండవులు రాజసూయ యాగం చేసి భూమండలాన్ని గెలిచారు అలాగే ఎప్పుడైతే దమయంతి మనసులో నలుడు ఉండి నేను నలుని తప్ప వేరే వాళ్ళని చేసుకోలేనని దమయంతి ఆలోచించిందో అప్పుడే నలుడికి అంతా శుభశకణాలు అంతా మంచి మంచి జరగడం మొదలు పెట్టాయి.
(25:35) ఇప్పుడు అలాంటి భార్య వల్లనే ఆయనకి గొప్ప దేవతావరాలు కూడా వచ్చాయి. సో ఇలాగ హ్యాపీగా వాళ్ళు ఆ పెళ్లి చేసుకొని ఆ నిషధ రాజ్యానికి రాజయ్యాడు నలుడు ఆ రాజ్యంలో యువరాణ అయింది దమయంతి వాళ్ళు కొంతకాలం పాటు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళక ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. ఇంద్రసేన ఇంద్రసేనుడు ఇద్దరు బాగున్నాయి. పేర్లు కదా.
(26:03) ఈ ఇంద్రసేన గురించే నేను మీకు ద్రౌపది వృత్తాంతంలో చెప్పాను నేను సో ఇంద్రసేన నలయాని ఇంద్రసేన అంటే నలుదమయంతులకు పుట్టిన కూతురు అక్కడ మోద్గల్య ఋషికి ఆమె సేవ చేసింది పూర్వజన్మలో ద్రౌపది యొక్క పూర్వజన్మే ఇది అని చెప్పాను కదా నేను అలాంటి ఆ ఇంద్రసేన ఇంద్రసేనుడు అని ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళద్దరితో హ్యాపీగా ఉన్నారు నలుడు కూడా యావత్ భూమండలాన్ని గెలుచుకున్నాడు చాలా ఐశ్వర్యంలో అంతా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ది ఎండ్ కార్డ్ ఆల్రెడీ వాళ్ళకి అక్కడే పడిపోయింది.
(26:35) ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతది. మ్ ఇప్పుడు అలా జరుగుతున్న కాలంలో అంటే వీళ్ళు స్వయంవరం అయిపోయిన రోజుకి ఒకటి జరిగింది ఏం జరిగిందయ్యా అంటే ఎప్పుడైతే దేవతా గణాలన్నీ స్వర్గానికి వెళ్ళిపోతున్నారో అక్కడ కలిపురుషుడు వీళ్ళ కంటపడ్డాడు. కలిపురుషుడు చాలా అందవికారంగా చాలా దరిద్రంగా ఉంటాడు. మ్ ఆయన నల్లగా జుట్టంతా కింద వరకు వేసుకొని చూడగానే మనకి అన్ని రకాల వికారాలు కలుగుతాయి అంత దరిద్రంగా ఉంటాడు.
(27:06) అతను హడావిడి హడావిడిగా వెళ్తుంటే దేవతలు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను నేను కూడా అంటే పెద్ద స్కెచ్చే అంటే అప్పుడు దేవతలు అంటారు నీ మొఖం చూసుకున్నావరా అద్దంలో నిన్ను ఎందుకురా పెళ్లి చేసుకుంటారు అని అని ఆయనకి చెప్తారు ఇంకేం స్వయంవరం రా నాయనా మేము ఆ స్వయంవరం నుంచే వస్తున్నాం ఆల్రెడీ దమయంతి నలుడిని వరించింది అని అంటే కలిపురుషుడి యొక్క లక్షణం ఏమిటంటే జెలసీ మాశ్చర్యం అదే మనం దుర్యోధనుడిలో చూస్తాం అవును పనికి మాలిన మాశ్చర్యం తనకు లేదన్న మాశ్చర్యం తనకు లేదన్న జలస అంతే పక్కోడికి
(27:44) ఉంది పోన్లే వాడు ఏ అదృష్టం చేసుకున్నాడో వాడికి దొరికింది అని అనుకోడు కలిపురుషుడిలో ఉండే వైభవం అది వాళ్ళు ఎలా సుఖంగా కాపురం చేస్తారో నేను చూస్తాను అని వెళ్ళిపోతాడు అక్కడ కలి అలాంటిది ఇప్పుడు వాళ్ళ జీవితాలు బాగా వెళ్తున్నాయి ఇద్దరు పిల్లలు పుట్టారు అన్ని బాగా జరుగుతున్న కాలంలో ఎప్పుడు పట్టుకుందామా ఎప్పుడు పట్టుకుందామా ఈ స్టోరీ అంతా ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ద్వాపర లో స్టార్టింగ్ లో జరుగుతుంది అప్పుడే శ్రయతా యుగం అయిపోయి ద్వాపర యుగం మొదలైింది.
(28:10) ఆ స్టార్టింగ్ లో జరుగుతుంది ఇదంతా అప్పుడు జరుగుతున్న తరుణంలో ఇమ్మీడియట్లీ అక్కడ ఒకానొక రోజు నలుడు అన్ని సక్రమంగా చేస్తున్న నలుడు మూత్ర విసర్జనం చేసుకొని కాళ్ళు కడుక్కోకుండా తన సంధ్యావందనానికి కూర్చుంటాడు. అయ్యో అసలు మామూలుగా అయితే ఎప్పుడు సౌచంతో ఆచమనం చేసి కాళ్ళు కడుక్కొని ఆచనమనం చేసి ప్రాణాయామం చేసి సంధ్యావందనాదిక్రియలు మొదలు పెట్టాలి ఒక పూజ అయినా అంతే చేయాలి.
(28:38) అలాంటిది తొందరపాటులో ఆరోజు అతనికి లేట్ అయింది ఏదో రాజరిక కార్యక్రమాల వల్ల మూత్ర విసర్జనం చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేయాలన్న తొందరపాటులో అక్కడ కూర్చొని సంధ్యావందనంలో కూర్చున్న నలుడిని కలి పట్టేసాడు అంటే ఇంక కలి ప్రవేశం అనేది నలు జరిగిపోయింది. ఇక ఎప్పుడైతే కలిప్రవేశం ఒక మనిషిలో జరుగుద్దో వాడి యందు ఈ షడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాచరాలు అనేవి ఇంకా తారా స్థాయికి చేరుతాయి.
(29:10) సో అలాంటి కలిపురుషుడు ఇప్పుడు లోపల అంటే నలుడిలో నివాసం ఉంటున్నాడు ఇప్పుడు ఎక్కడ లేని గర్వం వచ్చింది నలుడికి ఆ గర్వంలో ఏం జరిగిందంటే ఒకానొక రోజు కలిపురుషుడు వెళ్లి పుష్కరుడు అని నలుడు యొక్క బాబాయి కొడుకు అతనికి ఎప్పటినుంచో ఈ రాజ్యం మీద ఒక కన్ను ఉంది అతనికి చెప్తాడు ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను ఓకే ఆ కాబట్టి నువ్వు అతన్ని మాయాజూదానికి పిలువు ద్వాపరుడు ఇప్పుడు పాచికల్లో ఎంటర్ అవుతాడు ఓకే కాబట్టి ఇప్పుడు నువ్వు వేసే పాచికలు వేస్తున్నట్టే పడతాయి.
(29:45) మళ్ళీ ఆ శకుని టైపు శకుని టైపు కాబట్టి ఇప్పుడు అతను అతనిలో కలి ప్రభావం ఉంది కాబట్టి నువ్వు పిలవగానే వస్తాడు వచ్చినప్పుడు దెబ్బకు ఓడిపోతాడు కాబట్టి మొత్తం రాజ్యం నువ్వే లాక్కోవచ్చు అని కలి ప్రభావం పుష్కరుడిని కూడా చేస్తది అంటే పుష్కరుడికి ముందు నుంచే ఉంది జలసి కానీ కలి ప్రభావం వల్ల ఇంకా ప్రభావితుడు అవుతాడు ఇప్పుడు హెల్ప్ దొరుకుద్ది అని చెప్తున్నాడు కదా ఇమ్మీడియట్లీ నలుడిని పాచగలకి రమ్మంటాడు.
(30:14) అసలైతే నలుడు కావాలంటే తిరస్కరించొచ్చు కానీ నలుడు తిరస్కరించకుండా సరే అంటే అక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి చాలామంది కలి ప్రభావం ఉంది కాబట్టి నలుడు పాచికలకు వెళ్ళాడా అంటే కచ్చితంగా వెళ్ళాడని చెప్పొచ్చు కానీ క్షత్రియులను ఎవరనా పాచికలకు పిలిస్తే దాన్ని ఒక లిమిట్ లో పెట్టుకొని ఆడాల్సిన ధర్మం క్షత్రియులది అంటే విచ్చలవిడిగా అన్ని పెట్టి ఓడిపోమని కాదు అక్కడ క్షత్రియుడు అనేవాడు రాజ్యాన్ని గెలుసుకున్నప్పుడు రాజ్యం మీద అటాచ్మెంట్ పెరిగిపోయి ఇది నాది ఈ రాజ్యం నాది ఈ బంగారం నాది ఇవి నావి అని అనుకోకుండా వాడికి కొంచెం వైరాగ్యం కలిగించాలంటే వాడు ఎవరన్నా వేరే రాజు
(30:53) పాచికలకు పిలిస్తే వెళ్ళాలి వెళ్తే ఏమిటి దాని అర్థం అంటే ఆయనేం పెద్ద అటాచ్డ్ గా లేడు ఈ రాజ్యం పట్ల ఏదో కొంచెం సాత్విక జోదం ఓ నాలుగు రాజ్యాలో లేకపోతే ఒక పెద్ద ఐశ్వర్యమో కోషాగారమో డబ్బో నష్టపోతే వచ్చిన నష్టం ఏం లేదు అందుకు క్షత్రియులని ఎప్పుడన్నా యుద్ధానికి గానీ పాచ రాజకలు గాని పిలిస్తే వాళ్ళు అమ్మో నా ఆస్తి పోతదేమో అన్న భయం లేకుండా వెళ్ళాలనేది అప్పటి ద్వాపర నియమం అది.
(31:20) ఓహో అది అది కూడా ఉంది ఆ నియమం కూడా ఉంది అంటే దాని వెనకాల లాజిక్ చెప్పాను అంటే ఇది నాది అమ్మో ఇది నేను ఇవ్వను అనే ఒక రిస్క్ తీసుకునే మెంటాలిటీ లేకుండా క్షత్రియుడు ఉండకూడదు. ఓకే పోతే పోయింది కానీ విచ్చలవిడిగా ఆడి మొత్తం పోగొట్టుకోమని కాదు అక్కడ దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. సో అలాగ అతను కచ్చితంగా తన బాబాయి కొడుకే కాబట్టి పిలిచాడు కాబట్టి వెళ్తాడు వెళ్లి ఎంతో కొంత వడ్డి ఓడిపోతే వచ్చేయాలి కానీ అతనిలో దంబం ఉంది ఒకటి వేస్తున్నాడు ఓడిపోతున్నాడు మీ అందరికీ గెసిన్లలోకి వెళ్తారు నాలుగుసార్లు ఓడిపోతారు ఒక్కసారి గెలిచారు అనుకోండి మళ్ళీ ఆరోసారి పెడితే
(31:57) మళ్ళీ వస్తదేమో అని మీకు ఒక మీ గ్రీడ్ పెరిగిపోతది కదా అందుకే పాచికలు అనేవి కలి ప్రభావం రెండుసార్లు వడ్డారు ఓడిపోయారు మూడోసారి ఉడ్డగానే వచ్చింది అనుకోండి అక్కడ తాప వెళ్ళిపోతారా ఎవరైనా మళ్ళీ ఆడతారు మళ్ళీ నాలుగోసారి వస్తదేమో నాలుగు ఐదు రాకపోతే ఆరోసారి వస్తదేమో ఆశ పెరుగుద్ది కాబట్టి అలా కలి లోపల ప్రభావం ఉన్న నలుడు అసల ఒక కన్ను మిన్ను ఎరగకుండా అతను వడ్డింది వడ్డినట్టు ఓడిపోతూనే ఉన్న ఒడ్డుతూనే ఉన్నాడు అతను అంటే పంద్యం పెడుతూనే ఉన్నాడు ఓడిపోతూనే ఉన్నాడు ప్రతిదీ ఓడిపోతుంటే అక్కడ ఉన్న కొందరు రాజ అంటే ఆ రాజ్యంలో ఉన్న మంత్రి వాళ్ళ
(32:34) వాళ్ళందరూ కూడా వెళ్లి దమయంతికి చెప్తారు అమ్మ నీ భర్త మొత్తం పెడుతూనే ఉన్నాడు అసలు ఆపనే ఆపట్లేదు పుష్కరుడితో జరుగుతుంది. ఏదో సృహుజూదం అంటే ఒక ఫ్రెండ్లీ జూదానికి వచ్చామా ఒక రెండు మూడు పాచికలు వేసామా నాలుగైదు పేకాట్లు ఆడుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి అతను చాలా రాజసికంగా ఆడుతున్నాడు అమ్మ ఉన్నది మొత్తం పోతది అని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తది తన భర్తని తన భర్త ముఖంలో ఉన్న ఆ ఆ గర్వాన్ని ఆ కోపాన్ని ఆ వికారాన్ని చూసి తనకు అర్థమైపోతది ఇప్పుడు ఏదో నష్టం జరుగుతుందని అప్పుడు ఇమ్మీడియట్లీ నలుడు యొక్క రథసారదైన వర్షేయుడు ఆయన పేరుఆ ఆయన్ని పిలిచి తన
(33:14) పిల్లలైన ఇంద్రసేన ఇంద్రసేనుడిని ఇచ్చి తన తండ్రి అయిన విదర్భరాజు భీముడి దగ్గర వదిలేయమని పంపించేస్తది. పంపించేసింది ఆల్రెడీ గెస్ చేసేసింది తను ఎందుకంటే ఆ రోజుల్లో భర్త ఓడిపోతుంటే కూడా డైరెక్ట్ గా వచ్చి అందరి ముందు చెప్పలేదు కానీ తన సందేశాన్ని పంపిస్తది. ఒక ఒక దూత ద్వారా ఇంకా ఆపేయండి అని కానీ అతను ఈనే పరిస్థితిలో ఎక్కడఉన్నాడు ఇంకా ఒక రజోగుణంలో ఇంకా ఓడే కొద్ది ఇంకా నేను పెడితే గెలుస్తానేమో ఇంకా నేను పెడితే గెలుస్తానేమో ఇదే కలి ప్రభావం కాబట్టి ఎక్కడ తగ్గాలో నేర్పించడు కలి ఎక్కడ నెగ్గాలో ఎక్కడో ఓన్లీ నెగ్గడం వరకే ఆలోచిస్తాడు
(33:52) పూర్తి కలి ప్రభావంలో నిమజ్ఞుడు అయిపోయిన నలుడు తన యొక్క మొత్తం తన యొక్క మంచితనాన్ని కోల్పోయి అంత రాజ్యాన్ని జనులని అన్నీ పెట్టి దెబ్బకు ఓడిపోతాడు. ఆ ఓడిపోయి ఆ వ్రశ్నేయుడు విదర్భరాజు దగ్గర దించి పిల్లల్ని తిరిగి రాజ్యానికి వచ్చే లోపలే మొత్తం అన్నీ ఓడిపోతాయి. ఓడిపోగానే ఈ పుష్కరుడు హిప్పి పుర్రే మొత్తం రాజ్యాన్ని ఎన్ని యుద్ధాలు చేస్తే వస్తది ఇలాంటి రాజ్యం ఇలాంటిది మాయాజూదం కాన్సెప్ట్ తెలియకుండా ఇన్ని రోజులు యుద్ధాలు చేసుకో బ్రతికాను ఇప్పటినుంచి ఏ రాజునైనా జూదానికి పిలిచి ఓడేసి లాగేయొచ్చని ఒక ఐడియా వస్తది కాబట్టి కట్టు బట్టలతో రాజ్యం వదిలేసి
(34:36) వెళ్ళిపోమంటాడు అన్నని వదిన్ని వెళ్ళిపోమంటే తను తన భార్యని తీసుకొని తన అంతపురాన్ని ఖాళీ చేసి వేసుకున్న బట్టల్ని వేసు చేసుకున్నట్టుగా రాజ్యంలోనుంచి బయటకి వస్తారు. బయటికి వస్తే అసలు అంత సాత్వికుడైన నలుడు ఇలాంటి ఒక జూదానికి వెళ్లి ఓడిపోతుంటే కూడా ఆపకుండా వడ్డింది వడ్డి వడ్డి వడ్డి వడ్డి ఓడిపోయిన వాడిని చూసి రాజ్యం అసయించుకుంటది.
(35:04) ఇలాంటి రాజు చేత మేము ఇన్ని సంవత్సరాల నుంచి పాలింపబడుతున్నాం వాడి రాజ్యాన్ని వాడి ప్రజల్ని వాడి భార్యనే కాపాడుకోలేని వాడు వాడు ఒక రాజా అని ఒక నీలాప నిందలు పొందుతాడు అంటే అతను చేసిన దానికి అంటే ఇప్పుడు కలి ప్రభావం లోపల ఉంది కదా ఇక అంతా నెగిటివ్ే ఇంక ఏ పాజిటివిటీ ఉండదు అలాంటిది మూడు రోజులు వాళ్ళు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిన ఎవరు ఒక ఒక పచ్చి గంగ ఇవ్వరు వాళ్ళకి తిండి ఉండదు అలా తిండి లేదు ఆకలి అంత శుద్ధ నీళ్లు లేవు సో అక్కడ ఇక్కడ ఈ సరస్సుల్లో ఆ సరస్సుల్లో నీళ్లుు తాక్కుంటూ వాళ్ళు మూడు రోజులు అయిన తర్వాత దమయంతి ఇంకా విపరీతమైన క్షుద్భాదతో నేను
(35:40) ఇంకా కదలలేను నాకు ఏదో ఒకటి ఫుడ్ ఇంత పడితే తప్ప ఎనర్జీ రాదు ఆ నల చక్రవర్తి నలరాజా అంటది అంటే అప్పుడు తనకి ఒక కింద పంచ తన భార్యకి ఒక నార చీర ఉంటాయి అంతే అలాంటిది పక్కన చూస్తే ఒక బంగారపు రంగులో ఉన్న కొన్ని పక్షులు ఆయనకి కనబడతాయి. కనబడితే పోనీ ఈ పంచ తీసి ఆ పక్షుల మీదకు వేస్తే అవి ఎగరలేక కింద పడిపోతే వాటిని పట్టుకొని ఆ మాంసాన్ని తిందాం ఇద్దరం అని చెప్పి తను భార్య పక్కనే ఉంది కాబట్టి తన పంచను తీసి వివస్త్రంగా ఆ పక్షుల మీదకి వేస్తాడు వేస్తే ఆ పక్షుల మీద గుడ్డ పడుతూ పడుతూ పక్షులు గుడ్డతో సహా గాలిలోకి ఎగిరిపోతాయి
(36:25) అసలు మామూలుగా అయితే పక్షులు అయోమయం చెందాలి ఆ గుడ్డ కింద అయ్యో అయ్యో ఏదో నెట్టు పడినట్టు అవి వాటితో పాటు ఎగిరిపోతాయి ఉంటే ఆశ్చర్యంగా చూస్తే అప్పుడు ఆ పక్షులు చెప్తాయి మేమ ఎవరమో తెలుసా ఆ మాయా పాచికలం ఓ కాబట్టి నీ దగ్గర నీ దగ్గర ఏ రేంజ్లో మేము లాగేసామ అంటే నీ రాజ్యం కాదు ఒంటి మీద గుడ్డను కూడా లాగేసాం మేము ఆఖరికి కాబట్టి ఇంకఎప్పుడనా పాచికలాడతావా బాగైంది బాగైంది బుద్ధి తెచ్చుకున్నావా ఇంకోసారి పాచికలకు వస్తావా నువ్వు ఇప్పుడు చూసావా ఒక నిన్నటివరకు చక్రవర్తివి ఇవ్వాళ వివస్త్రంగా నిలబడిపోయావు బట్టలు లేకుండా నలుడుకు సిగ్గు వేసి అతని మీద ఆయనకి అసయం
(37:05) వేస్తది అసలు ఏమిటి ఈ పరిస్థితి అని ఇది కలిపి నాకు ఈ అసయం వేసింది సో అంటే ఎక్కడ లేని దరిద్రం అంతా ఈ స్టోరీలోనే వస్తుంది అలాగ కట్టుకున్న బట్ట కూడా లేదు ఒక రోజులో అయ్యో రాత్రికి రాత్రికి అంబాని కాస్త బెగ్గర అయిపోయాడు బెగ్గరకన్నా బట్టలు ఉంటాయి నల్లుడు కాయ కూడా లేవు అలాంటిది ఇమ్మీడియట్లీ దమయంతి చూసి తన భర్త పడుతున్న సిగ్గుని చూసి ఆయన ఆమె ఆమె చీరని విప్పి ఆ చీరని సగానికి చింపి కట్టుకోవడానికి బట్టిస్తది.
(37:35) అంటే ఆ సగం చీరని దమయంతి కట్టుకుంటది ఆ సగం చింపిన చీరని నలుడు కట్టుకుంటాడు ఇంకా విపరీతంగా ఏడుస్తాడు అక్కడ అసలు హంస హంసతూలికా పాన్పుల మీద పడుకొని ఎంత వైభవాన్ని అనుభవించిన దమయంతివి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఆఖరికి మన పరిస్థితి అంటే ఒక భర్త భార్యకి తిండి కూడా పెట్టలేని దుస్థితి ఇంక అంతకంటే దరిద్రం అనేది భూమి మీద ఎక్కడ ఉంటది ఆఖరికి ఆ భార్య కట్టుకున్న చీర చింపిస్తేనే తన మానాన్న ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్కి నలుడు దిగజారిపోయాడు అంటే భార్య చీరిస్తే తప్ప బ్రతకలేని పరిస్థితికి వచ్చేసాడు.
(38:11) చీనా జీవితం అని అనుకుంటున్న తరుణంలో ఆ భార్య అసలు ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరనా ఉంటే ఏమంటారు ఆరోజు చెప్పానా నేను మెసెంజర్ తో పంపించానా ఎదవ ఓవర్ యక్టింగ్ చేయొద్దు ఎప్పుడు కాలం ఒకలా ఉండదు బెంజు పోయి కాకరికి కాళ్ళ మీదకి వచ్చేసాం అని ఒక్క మాట కూడా అనదు. అనకుండా అతన్ని ఆలింగనం చేసుకుంటది దమయంతి అతన్ని ఆలింగనం చేసుకొని జరిగింది ఎలాగో జరిగిందండి ఎందుకు అంత బాధపడతారు మీరు నా పక్కన ఉంటే ఇంకా నాకు ఏం కావాలి నాకు మీరు మీకు నేను ఉన్నంత కాలం మనకు ఉండేది ఆనందమే ఏముంది ఇప్పుడు మూడు రోజుల నుంచి తిండి దొరకనందుకా మీరు ఇంత
(38:48) బాధపడుతున్నారు కొన్ని గంటల్లో మళ్ళీ దొరుకుతుంది లేండి పాజిటివ్ మైండ్ మోటివేషన్ చేస్తుంది ఆ అంటే భర్త ఎక్కడ కూడా తను గిల్ట్ లోకి వెళ్ళకూడదని తనను ఒక చిన్న పిల్లాడిలాగా దగ్గరికి తీసుకొని ప్రేమతో ఆయనలో ఆ గిల్ట్ రాకుండా అయ్యో నా భార్యకు కనీసం చీర ఇవ్వలేకపోయానే నేను తిండి పెట్టలేకపోయానే అని అనుకుంటాడని అంత మాతృత్వం ఉంటదండి ఆడవాళ్ళలో అది మీరు గమనించాలి ఎలాంటి చక్రవర్తిని పెళ్లి చేసుకుంది సగం చీరతో ఉంది అప్పుడు దమయంతి ఆయనతో ఒక మాట అంటది పోన్లేండి మనం కాలం కలిసి వచ్చే వరకు విదర్భ రాజ్యానికి వెళ్దాం మా తండ్రి గారు అక్కడ ఉన్నారు కదా
(39:25) మనకు మళ్ళీ మంచి రోజులు వచ్చే వరకు మన తండ్రి గారితో ఉందాంఅని అప్పుడు నలుడు అంటాడు ఒకప్పుడు నీ తండ్రి స్వయంవరం పెట్టినప్పుడు వచ్చాను ఆ రాజ్యానికి ఎలా వచ్చాను నేను అంగరంగ వైభవంగా నా మంది మార్బలంతో వచ్చాను అలాంటిది ఒక చిన్న చీర ముక్కను కట్టుకొని మీ రాజ్యానికి వెళ్ళటమా నేను వెళ్ళలేనమ్మా అలాగా నా మొఖం నేను చూపించలేను అందుకు నీ తండ్రి కన్యాదానం చేస్తూ నా మీద నా కూతురిని చూసుకుంటాడు అని నాకు ఇచ్చాడు అలాంటిది నేనేం చేశాను ఆఖరికి సగం చీరతో చింపేరి జుట్టుతో నిన్ను రోడ్డు పాలు చేశను నేను నాకు మనసు లేదమ్మా నేను రాలేను దమయంతి అంటాడు
(39:59) గిల్ట్ లో ఉంటాడు గిల్ట్ లోనే ఉన్నాడు అయినా సరే ఏమంటది మీకు ఈ డిప్రెషన్ వచ్చింది కదా ఈ డిప్రెషన్ కి మందు ఏంటో తెలుసా నా ప్రేమే మీకు మందు ఆ కాబట్టి మీరు అస్సలు అలా ఆలోచించొద్దు నేను ఆ రోజు ఈ హంసతూలిక పాన్పుల మీద పెద్ద పెద్ద కోటల్లో పెద్ద పెద్ద సామ్రాజ్యాలలో నగలు పట్టుచీరలు కట్టుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇవాళ మీ చెయ్యి పట్టుకొని నేను అరణ్యంలో ఉంటే అంతే ఆనందంగా ఉన్నాను మ్ అసలు ఏం బాధ లేదు తిండి అనేది ఒక చిన్న బాధ కలిగి నేను చెప్పాను అని ఆకలి వల్ల తనకు కలుగుతున్న బాధను కూడా ముఖంలో నవ్వు కింద మార్చుకుంటది దమయంతి అంటే చూడండి
(40:38) అంటే ఆడవాళ్ళ వైభవం ఈ కథలో ఎంత బాగా చూపించారో అవును ఆ గిల్ట్ మళ్ళీ రాకూడదు కదా ఇందాక కాసేపు ఆకలి వేసింది ఇప్పుడు నీళ్లు తాగితే ఆకలి కూడా పోయింది అంటది అని అతన్ని దగ్గర తీసుకొని అతన్ని అచిక బుచ్చికలాడి అతని పట్ల ప్రేమగా మాట్లాడి ఆయనని కౌగిలించుకొని పడుకుంటది ఆ క్షుద్వాదతో అక్కడ పడుకుంటది ఆ పడుకుంటున్న ఆ దమయంతిని చూసి నలుడు ఇంకా విపరీతంగా ఏడుస్తాడు అంటే ఇంకా ఒక బాధ ఇంకా బాధ అంటే ఇంకా ఏ కపులికి ఇంతకంటే ఎక్కువ కష్టం రాకూడదు అలాంటిది అంటే అతను అరణ్య మార్గంలోకి వెళ్తున్నప్పుడు ఒకానొక సమయంలో దమయంతకి చెప్తాడు ఏమని అంటే ఈ
(41:20) ఇటువైపు నుంచి వెళ్తే విదర్భ రాజ్యానికి వెళ్తాం ఇటు నుంచి వెళ్తే చేడ రాజ్యానికి వెళ్తాం ఇటు నుంచి వెళ్తే మన రాజ్యానికి వెళ్తాం ఇటు నుంచి వెళ్తే ఇంకొక రాజ్యానికి వెళ్తాం ఈ నాలుగు దిక్కులు చెప్పగ చెప్పాడు కదా అప్పుడు ఆలోచిస్తాడు ఏమని నేను కనీసం తిండి కూడా నా భార్యకి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను కనీసం నన్ను రమ్మంటుంది నేను వెళ్ళలేను వాళ్ళ తండ్రి దగ్గరికి నేను ఇక్కడ వదిలేస్తే తనన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి సుఖపడతదేమో అనే ఒక ఆలోచన పడుకుంటున్న రమయంతని చూసి అతనికి వస్తది.
(41:50) లెగుస్తాడు తన నుదుటిని నిమురుతాడు తనకి నాలుగైదు ముద్దులు ఇస్తాడు వెళ్తాడు వెనక్కి వస్తాడు మళ్ళీ చూసుకుంటాడు మళ్ళీ ముందుకు వెళ్తాడు మళ్ళీ వస్తాడు తన భార్య పడుకుంటున్నప్పుడు వెళ్ళలేక ఉండలేక వెళ్ళలేక ఉండలేక ఒక రకమైన ట్రోమా నోబిస్తుంటాడు నలుడు ఇంకా కర్ణ కఠోరమైన మనసుని చేసుకొని కలి ప్రభావం ఉంది కదా కలి మిమ్మల్ని ఇలాగే ఏమారుస్తాడు అంటే ఎంత కష్టంలో అయినా నా భర్తని నేను వదలకూడదు అని దమయంత ఎంత అనుకుంది అది ఆమె యొక్క సాత్విక గుణం.
(42:24) కష్టంలో భార్యను వదిలేస్తే కనీసం నా భార్య అయినా పోయి తన తండ్రి దగ్గర కనీసం మంచి జీవితం అనోభిస్తది అంటే కలిపురుషుడు మిమ్మల్ని ఇలా భ్రమించేలా చేస్తాడు. అంటే కలిపురుషుడు ఏమి మిమ్మల్ని నాశనం చేస్తానని మాట్లాడడు. కలిపురుషుడు మీకు చాలా లాజికల్ గా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాడు. ఒక ఏదో నేను మంచి గొప్ప పని చేస్తున్నాను అన్నట్టుగా మిమ్మల్ని భ్రమింపబడేలా చేస్తాడు అలాంటిది నేను ఎప్పటికీ ఈ అమ్మాయి చెయ్యి వదలను అని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నలుడు కనీసం నేను లేకపోతే తను సుఖపడిపోతది అని వదలలేక ఉండలేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని గంటల తర్వాత దమయంతి
(43:01) లెగుస్తది. లెగిస్తే అక్కడ చూడగానే నలుడు పక్కన ఉండడు తనకేం అర్థం కాదు భర్త పోని ఆహారం కోసం ఎక్కడికన్నా వెళ్ళాడేమో కాసేపు చూద్దాం అని చెప్పి అటు ఇటు చిన్న పిల్లలాగా అది ఇది చూసుకుంటుంటది సమయం గడిచే కొద్ది తన భర్త రాడు ఎప్పుడైతే రెండు మూడు గంటలు గడిచిపోయాయో ఆ అమ్మాయికి అర్థమైపోతది. ఏమని ఇక నా భర్త రాడు ఏదో జరిగింది అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా కొంపతీసి అని అప్పుడు వరకు తను నడుచుకుంటూ వచ్చిన అరణ్యంలో తనకి క్రూర మృగాలు కనబడలేదు ఆ తనకు ముళ్ళు కనపడలేదు తనకు ఎంత భయంకరంగా ఉందో అడవి కనపడలేదు తనకు భయం రాలేదు కానీ పక్కన ధైర్యం ప్రేమ అన్ని ఉన్నాయి కదా
(43:45) పక్కన ధైర్యం ప్రేమ అనే ఒక భర్త ఉన్నాడు కదా అలాంటిది ఎప్పుడైతే తనలో తన భర్త పక్కన లేడని చూసుకొని తనలో బాధ మొదలైందో ఇంకా ఏది చూసినా తను భయపడిపోతుంది. చూస్తేనేమో చెట్లుఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి ఈ ముళ్ళఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి రప్పలుఏంటి ఇలా ఉన్నాయి ఈ తేళ్ళఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పి ఇంకా విపరీతమైన భయం భయంగా బిక్కు బిక్కున ఏడిచేయడం మొదలు పెడతది.
(44:11) మైండ్ సెట్ గేమ్ అదే మైండ్ గేమ్ ఎందుకంటే భర్త పక్కన ఉంటే ఆడదానికి ఎక్కడ లేని ధైర్యం అలాంటి భర్త ఒక ఆడదాని పట్ల మనం కలిగించాల్సింది కూడా ఆ భార్యకి భరోసా ఆ భార్యకి ధైర్యం ఒక భర్త అలాంటి భర్త పక్కన లేకపోయేసరికి ఆ భార్య ఇంకా కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. అలాగా కాసేపు ఆగిన తర్వాత ఇంకా లెగిసి కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని కాళ్ళు వేస్తుంటే ముళ్ళు కనబడుతున్నాయి.
(44:38) కళ్ళమట నీళ్ళు కారుతున్నాయి ఎక్కడికి వెళ్ళాలి ఏం చెలి ఎటెళ్ళాలిఅని ఒక అయోమయమైన పరిస్థితుల్లో ఉండగా ఒక కొండశల వచ్చి తన కాలిని పట్టుకొని అమాంతంగా ఒక చెట్టుకేసి కట్టేస్తది ఆ కొండలు ఇంక అంతే పోన్లే మరణం ఇలా వస్తుంది నా దగ్గరికి అని ఎక్కడ ఉన్నా నా భర్త మంచిగా ఉండుగాక అని నేను ఏదైనా తప్పు చేయటం వల్ల నాకే తెలియకుండా నా భర్త నన్ను వదిలేసినట్లయితే తన మనసులో తను మాట్లాడుకుంటున్న మాటలు ఇవి తను నేను ఏదైనా ఒక తప్పు చేసి నా భర్తని మనసు నొచ్చుకొని ఉండుంటే నేను క్షమింపబడుదును గాక అబ్బా అని అంటే కొండ సిలువ చుట్టుకుంటుంటే తన భర్తని ప్రార్థిస్తుంది నేను ఎప్పుడు మీ పక్కనే
(45:21) నుంచి ఉంటానండి నేను ఏమన్నా తప్పు చేసిఉంటే నన్ను క్షమించండి నేను ఇంతకంటే పెద్దగా అడగలేను అని అంటే ఆమె పాతివ్రత్యము ఆమె ప్రేమకున్న వైభవం చూడండి అంటే ఇక్కడికి నా భర్త నన్ను వదిలేసాడు అని అనుకోవట్లేదు అయ్యో నేను ఏదైనా తప్పు చేసిఉంంటే నన్ను మన్నించండి దయ దయచేసి వెనక్కి రండి అని తను తను ప్రార్థిస్తుంటే ఇంకా ఇలాంటి ప్రార్థన ఒక అమ్మాయి చేస్తే భగవంతుడు ఊరుకుంటాడా దేవతా గణం అంతా సపోర్ట్ చేయదు అలాగా ఒక ఎవడో ఒక ఆ అడవిలో ఉండే అడవి మనిషి ఒకడు వచ్చి అక్కడికి తన యొక్క కత్తితో మొత్తం కొండ సిలువని నరికేసి దమయంతి దేవిని రక్షిస్తాడు అప్పుడే కొండ
(46:01) సిలువని చంపిన వాడై వెళ్లి ఒక సరస్సులో మొత్తం స్నానం చేసి అక్కడ ఇక్కడ కోసుకు వచ్చిన పళ్ళు కొంచెం తేన తీసుకొని వచ్చి దమయంతి దేవికి ఇస్తాడు. ఇవ్వగానే ఆయనకి నమస్కారం పెట్టి మూడు నాలుగు రోజుల నుంచి తినలేదు కదా తన భర్తను ఒకసారి తలుచుకొని తను బ్రతకడానికి భోజనం చేయాలి కాబట్టి ఆ పళ్ళను తింటుంది. ఆ పళ్ళని తింటున్న దమయంతి దేవిని ఈ అడవి మనిషి చూస్తాడు చూసి వాడికి కలగరాని కోరిక కలుగుతది ఆ మనిషి మీద అయ్యో వాడికి ఆమెలో అందం కనబడుతది మ్ కనపడి నేను నిన్ను ఈ కొండ సిలువ నుంచి కాపాడాను నీకు భోజనం తెచ్చిపెట్టాను నా కోరిక తీర్చవలసింది అని అడుగుతాడు
(46:41) మ్ అంతే అంటే భర్త పక్కన లేకపోవటం వల్ల తన జీవితంలో ఒక ఒంటరి ఆడది పడుతున్న పాట్లని మన మునులు చెప్తున్నారు చెప్తున్నారు అదే అలాంటి అంటే ఒక భర్త పక్కన ఉంటే ఎంత ఎంత ప్రొటెక్షన్ ఒక ఆడదానికి అలా భర్త పక్కన లేకపోతే ఎంతమంది మగవాళ్ళ కళ్ళు ఆడవాళ్ళ మీద పడతాయి చూడండి అది సింబాలిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది అలాంటిది ఆయన వచ్చి దమయంతిని ముట్టుకోబోతాడు పతివ్రతా శిరోమణి కదా ఆమెయని తాకలన్న ఆలోచనతోనే అతను ఆయువు పడిపోయి అతను కాలిపో పోయి చనిపోతాడు సూపర్ అంత అంత అంత పుణ్యాత్మురాలు దమయంతి ఇక్కడ సో ఈ ఇక్కడ మనం ఇంకొకటి అర్థం
(47:28) చేసుకోవాల్సింది ఏంటంటే ఒకడికి భార్య అయిన ఒక స్త్రీని మనసులోనందు కామంతో చూసిన మానసిక వ్యభిచారం చేసినా వాడి తేజస్సు వాడి ఆయువు పడిపోతాయి అనేది ఇక్కడ శాస్త్రం ఇప్పుడు కూడా అదే జరగాలని రాసుకుందాం. ఎప్పటికీ ఇవన్నీ ప్రకృతి నియమాలుండి ఇవి గ్రావిటేషనల్ ఫోర్స్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లాగా అవి ఎప్పటికీ మారవు అందుకనే తనది తనది కానీ భార్యని తనని కాని స్త్రీని ఏ పురుషుడైనా కామంతో చూస్తే వాడిలోంచి రెండు పడిపోతాయి వాడి ఆయుర్ధాయం తగ్గిపోతది వాడి తేజస్సు తగ్గిపోతది అలాగ ఆ దమయంతి యొక్క పాతివ్రత్యానికి వాడిలో వాడిలో వచ్చిన ఆ వికారానికి అతను కాలి
(48:10) చనిపోయాడు చనిపోయిన వెమ్మటనే భయపడుతూ అప్పుడే అప్పుడే కొంచెం క్షుద్భాద తగ్గింది దమయంతి దేవికి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక మునులు తపస్వులు యోగులు కనబడతారు తనకి మ్ కనబడగానే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇలాగ నేను నా భార్య నా భర్త దగ్గర నుంచి తప్పిపోయాను నా భర్త జాడ చెప్పగలరు అని అడుగుతది.
(48:35) అడగగానే ఆ అమ్మని కళ్ళు మూసుకొని తెరిసి నువ్వు దమయంతివి నలుడు భార్యవి మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి నలుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు మీకు మళ్ళీ పూర్వ వైభవం మీకు వస్తది. మ్ ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే పరీక్ష అని చెప్పి మాయమైపోతాడు అతను ఆహ అనగానే దమయంతికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇప్పటివరకు నేను ఎవరికోసం బ్రతకాలి నేను ఏ తప్పు చేస్తే నా భర్త వదిలేసాడో అని అనుకుంటున్న దమయంతికి ఆయన మాటలే ఇప్పుడు బూస్ట్ హాలిక్స్ అయ్యాయి.
(49:08) చూసారా మైండ్ గేమ్ ఎలా ఉందో అప్పుడే డీమోటివేషన్ ఎవరు లేరని మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే హ్యూమన్ మైండ్ అంతే అంతే సో అలాంటి ఒక మునులు ఆమెకు చెప్పారుగా మళ్ళీ నువ్వు నలుడిని కలుసుకుంటావఅమ్మా నీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తదని ఇప్పుడు ఒక రీజన్ ఉంది బ్రతకడానికి ఎందుకంటే ఆ ఎప్పుడైతే అడవి మనిషి తనని చరచబోయాడో తన తను అర్థమైపోయింది భర్త పక్కన లేనప్పుడు ఇక మృగాలు సమాజంలో ఉన్న మృగాలు నా మీద పడతాయి అని అనుకుంటున్న తరుణంలో తనకు మళ్ళీ అర్థ అయిపోయింది మళ్ళీ నాకు పాత రోజులు వస్తాయి నేను నా భర్తతో నా పిల్లలతో నేను సుఖంగా ఉంటానని ఇప్పుడు తన భర్తను వెతుక్కోవాలి ఇప్పుడు తనక ఒక
(49:45) కాన్ఫిడెన్స్ వచ్చింది ప్లస్ వీళ్ళు మాయమైపోయారు అంటే వీళ్ళు చాలా గొప్ప తపస్సులు అయ ఉంటారు కదా చాలా పెద్ద మున్నులు కదా వాళ్ళు కాబట్టి ముని వాక్యం కచ్చితంగా సక్రమంగా జరుగుతదని అలాగ నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద బాటసారులు అన్నమాట అంటే వాళ్ళు అడవి గుండా ఒక రాజ్యానికి వెళ్తున్నారు వాళ్ళు ఏ రాజ్యానికి వెళ్తున్నారు అంటే చేడి రాజ్యానికి వెళ్తున్నారు ఓకే ఆ చేడి రాజ్యంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళందరికీ తను కనబడతది.
(50:12) కనబడగానే వాళ్ళు దీన్ని చూసి భూతం భూతం అని అరుస్తారు. అంటే అంత గలీజగా ఉంది అప్పుడు దమయంతి సగం చీరతో ఏడ్చి ఏడ్చి జుట్టంతా చింపిరితో మొహంఅంతా మట్టికొట్టుకుపోయి ఆ కొండ సిలువ పట్టుకొని ఆ ఇవన్నీ చూడగానే భూతం భూతం అంటే అప్పుడు అందులో ఉన్న కొందరు బ్రాహ్మణులు వచ్చి లేదు ఈ అమ్మాయి కళ్ళల్లో మాకు తేజస్సు కనబడుతుంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదా ఈ అమ్మాయి ఏం కావాలమ్మా అంటే చెప్తారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మేము పక్కనుండ చేడి రాజ్యానికి వెళ్తున్నాం అయితే మీరు నన్ను కూడా చేడి రాజ్యానికి తీసుకెళ్ వెళ్ళగలరు నేను ఒంటరి ఆడదాన్ని నాకు ఇక్కడ సపోర్ట్ లేదు అని అడుగుతది.
(50:48) సరే అమ్మ మాలో ఒక మనిషిగా నువ్వు ఇక్కడే ఉండమని వాళ్ళందరూ ఒక సరస్సు పక్కన భోజనం అది చేసుకొని తనకు కూడా పెట్టి అందరూ తిని అందరూ సరస్సు పక్కనే పడుకుంటారు. పడుకుంటే ఆ రాత్రి కొన్ని మదపటు గజాలు అంటే ఏనుగులు అక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. నీళ్లుు తాగటానికి వచ్చి అవన్నీ అక్కడున్న జనాల్ని చూసి జన సమూహం అంతా ఈ ఈ ఏరు పక్కనే పడుకున్నాయి కదా అవి అడవి మృగాలు అవి ఎప్పుడు మనుషుల్ని సరిగ్గా చూడలేవు అవి ఎజిటేట్ అయ్యి కోపంతో ఒక్కొక్కడిని తొక్కేసి లెగిసి అరుస్తుంటే వాళ్ళని తొండంతో చుట్టేసి ఇసిరేసి చంపేస్తాయి చంపేసి నీళ్లు తాగేసి వెళ్ళిపోతాయి ఇవన్నీ
(51:28) జరుగుతుంటే అక్కడ అప్పుడే నిద్రలోంచి లెగిసి దమయంతి ఈ ఆశ్చర్యాన్ని అలా అలా చూస్తున్నప్పుడు ప్పుడు తన పక్కన ఉన్న వాళ్ళని ఎదురున్న వాళ్ళని కూడా చంపేస్తాయి కానీ తినను మాత్రం ఏమీ చేయవు. మళ్ళీ ఇదే మాయ ఇదే అంటే భగవంతుడు తనకు చెప్తున్నాడు నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాను నేను అంటే నువ్వు మళ్ళీ నలుడిని కలుసుకుంటావు అని అలా చెప్తుంటే అప్పుడు అలా చేసిన తర్వాత తను షాక్ కి గురవుతది ఏంటి ఇంతమంది చనిపోయారు అని అక్కడున్న కొంతమంది బ్రాహ్మణులు కలిసి విధి ఆడిన వింత నాటకం ఏం చేస్తాం విధిలికితం జనన మరణాలు మన చేతిలో ఉన్నాయా మనం పడుకున్నాం ఈశ్వర ఇచ్చ
(52:06) ఏనుగులు వచ్చాయి కొందరిని జంపాయి ఆ బ్రతికున్న కొందరు కలిసి ఆ చేడి రాజ్యానికి వెళ్తారు. చేడి రాజ్యంలోకి ఎంటర్ అవుతూ అవుతూ ఉండగానే అక్కడ రాణి దగ్గర పని చేసే ఒక ఒక పని మనిషి చూసినని డైరెక్ట్ గా రాణి దగ్గరికి తీసుకెళ్తది. మ్ రాణి తనని చూడగానే తన కళ్ళల్లో చూడగానే తనక ఎక్కడ లేని ఆత్మీయత అన్నమాట. మ్ ఇక్కడలేని ఆత్మీయత కలిగి ఏంటో ఈమని చూడగానే నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి ఈ కళ్ళల్లో నాకు తెలియని అమాయకత్వం ఒక ఒక మంచి సత్వగుణం కనబడుతున్నాయి నాకు సైరంద్రిగా ఉంటావా అని అడుగుతది సైరంద్రి అంటే పక్కనే ఉండే ఒక ఒక చిలికెత్తలాగా
(52:46) అనుకోండి అని అడిగితే తను నేను కచ్చితంగా ఉంటానండి కానీ నేను రెండు పనులు చేయను ఒకళ్ళ ఎంగిలి నేను తినను ఒకళ్ళ కాళ్ళు నేను పట్టను ఈ రెండు పనులు నేను చేయలేనండి అని అడుగుతది పోన్లే అమ్మ అలా అలాగే ఉంది గాని అంటే మూడు నేను కేవలం బ్రాహ్మణోత్తములతో మాత్రమే మాట్లాడతాను. ఎందుకు ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ ఈ అడవి మనిషి తనని చరచబోయాడో తనకి మగవాళ్ళ మీద నమ్మకం కూడా పోయింది.
(53:15) ఇట్స్ ఆల్ సైకలాజికల్ థింగ్ సైకలాజికల్గా అంత ట్రౌమాలో ఉంది తను అవును అమ్మో ఇంక నేను ఎవరితో మాట్లాడలేను ఒంటరి ఆడదాన్ని కాబట్టి నాకు నాకు అసలు ఇక్కడ సురక్షంగా లేదు ఈ సమాజం అని చెప్పి నేను కేవలం బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను అంటే బ్రాహ్మణులు అంటే మళ్ళీ ఇది కులం కాదు ఇది బ్రహ్మజ్ఞానమును తెలుసుకున్న వాళ్ళు శారీరిక వాంచల కోసం బ్రతకని వాళ్ళు సో తను వాళ్ళ దగ్గర సేఫ్ అని అనుకుంది.
(53:39) అంతే ఆ గుణాలు వర్ణాల బట్టే కదా ఆ గుణాలను బట్టి సో అలాగా సరే అమ్మ అలాగే ఉందు గాని అని తనకి తన సైరంద్రిగా తను పెట్టుకుంటుంది చేడి రాజ్యపు యువరాణి దగ్గర సైరంద్రిగా పని చేస్తుంది. ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు మళ్ళీ మీకు గుర్తు చేయడానికి బృహదర్శుడు అనే ఒక ఋషి మళ్ళీ విరాట పర్వంలో ద్రౌపది కూడా సైరంద్రిగా ఉంటది విరాటరాజు భార్య దగ్గర కాబట్టి ముందునుంచే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు ఈ కథ చెప్పి ఆ అర్థమైందా మీకు సో దానికి పేరు కూడా అంటారు కదా ద్రౌపది సైరంద్రి ఇవన్నీ ఆ అలాగా ఈ కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు విదర్భ రాజ్యాధీషుడైన రాజు తన అల్లుడు తన
(54:22) కూతురు అడవి పాలైపోయారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతకవలసినది అని కొందరిని పంపిస్తాడు. పంపిస్తే అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక వ్యక్తి చేడి రాజ్యానికి వస్తాడు. మ్ చేడి రాజ్యానికి వచ్చినప్పుడు ఆ రాజ అంతపురంలో రాణి పక్కన ఉన్న సైరంద్రిగా ఉన్న దమయంతిని చూసి గుర్తుపట్టి ఇమీడియట్లీ దమయంతి అని పిలుస్తాడు.
(54:46) మ్ పిలవగానే తను ఆశ్చర్యంగా చూస్తది. చూసి అప్పటివరకు దమయంతని ఎవరికీ చెప్పలేదు కదా తను అవును చెప్పలేదు చూడగానే అప్పుడు చెప్తాడు అమ్మ బాగున్నావా అని అంత చింపిరి జుట్టుతో ఉన్న ఆవిడని కూడా ఎలా గుర్తుపట్టాడు అంటే అతను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన వ్యక్తి తన రాజ్యంలో ఆయన చూసి గుర్తుపట్టాడు దమయంతి దేవిని గుర్తుపడితే అప్పుడు అతను ఆమెతో మాట్లాడుటం చూసి ఆ చేడి రాజ్యపు యువరాణి పరిగెత్తుకుంటూ వస్తది ఎప్పుడు బ్రాహ్మణులతోనే మాట్లాడతాను అన్న వ్యక్తి ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడుతుంది ఏమన్నా ఇబ్బంది పడిందా అని అప్పుడు అతను చెప్తాడు
(55:20) ఈవిడ ఎవరో తెలుసా అండి మీకు మన విదర్భ రాజ్యాధీశుడైన భీముడి కూతురు నలుడి భార్య దమయంతి అని అనగానే ఇమ్మీడియట్లీ ఆ చేడి రాజ్యపు యువరాణి ఆలింగనం చేసుకొని నేను మొట్టమొదట కలిసినప్పుడే చెప్పానా నువ్వు ఎవరో బంధువులా కనబడుతున్నావు నాకు అని మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళం అమ్మ అని చెప్తది అన్నమాట తిన్న సో అది దేహ సంబంధం అంటే వాళ్ళద్దరికీ రిలేషన్షిప్ ఉంది సో ఇమ్మీడియట్లీ తనని తీసుకెళ్లి తనకు స్నానం చేపించి అమ్మ నువ్వా ఇన్ని రోజులు నాకు సైరంద్రిగా ఉంది ఇంత పెద్ద దానివి నాకు ఒక్క మాట చెప్పకపోతివే నువ్వు సైరంద్రిగా ఉన్నప్పుడు రెడీ అవ్వరా
(56:00) సైరంద్రిగా ఉన్నప్పుడు ఏదో రెడీ అవుతారు అంతే పాపం డిప్రెషన్ లో ఉన్న ఆవిడ ఏం రెడీ అవుతుందండి అవును సో ప్లస్ భర్త ఎక్కడున్నాడో తెలీదు ఆమె ట్రౌమా భర్త గురించి తన బాగు గురించి కాదు ఒక ఆడది ఆలోచించేది ఎప్పుడు కూడా తను సుఖంగా ఉండాలని కాదు తన భర్త ఎలా ఉన్నాడఅనే ఆలోచనలోనే ఉంది ఇంకా తను అవును అలాగ ఉన్నతనని ఆలింగనం చేసుకొని తీసుకెళ్లి అభ్యంగ స్నానాలు అవి చేయించి కొంచెం తనని రెడీ చేసి తన తండ్రి దగ్గరికి పంపేస్తారు.
(56:29) సో దమయంతి ఫైనల్లీ తన తండ్రి అయిన విదర్భ రాజు దగ్గరికి చేరింది. మ్ సో ఇప్పుడు నలుడు దమయంతి గురించి మీరు తెలుసుకున్నారు తన ప్రయాణం తన ఎలా చేరిందో నలుడు ఇంకా అదే భార్య దగ్గర నుంచి తీసుకున్న సగం చీరని కట్టుకొని అడవుల్లో తిరుగుతూ తన మొఖాన్ని ఎవరికీ చూపించలేక ఒక ప్రాయశ్చిత్తం అనే ఒక గిల్ట్ లో ఒక డిప్రెషన్ లో ఒక బాధతో అసలు ఎప్పుడూ కూడా ఎటువంటి రాజ్యంలోకి వెళ్లి ఏమ అడగాలి ఎవరినన్నా ఒకప్పుడు నలుడిలా ఒక భూమండలాన్ని ఏలిన వ్యక్తి కట్టుకోవడానికి గుడ్డ లేకుండా ఎవరి ముందు వెళ్లి నిలబడాలి ఎలా దేహి అని ప్రార్థించాలి ఈ మొఖం ఎలా చూపించాలి మీకుఅని ఒక డైలాగ్ వేస్తాం కదా
(57:08) అలాంటి ఒక డిప్రెషన్ లో ఉన్న వ్యక్తికి ఒక దావాగ్ని అంటే అడవిలో వచ్చే ఫారెస్ట్ ఫైర్ కనబడతది. ఫారెస్ట్ ఫేర్ కనపడగానే పోన్లే ఇలాగైనా మరణం వచ్చి మనల్ని దహించివేయు గాక అని అనుకుంటాడు కానీ ఎక్కడ దహిస్తది అగ్ని దహించదు కదా తన్ని అదే కాబట్టి నవ్వుకుంటాడు మనకి మరణం కూడా అంత తేలిగ్గా సంభవించదేమో అంటే డిప్రెషన్ లో వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి అంటే తన భార్య కనీసం తనను వదిలేస్తే ఈ దరిద్రం తనకు అంటకుండా వెళ్లి కనీసం తన తండ్రితో ఉండాలనుకొని చేసిన వ్యక్తి ఎవరికీ మొఖం చూపించడానికి మొఖం చెల్లని వ్యక్తి ఎక్కడైతే పూలు అమ్మా అక్కడ కట్టెలు ఎలా
(57:48) అమ్ముకోగలం అనే ఒక సామెత ఉన్నట్టుగా ఇప్పుడు ఒక చక్రవర్తిగా ఏలిన వ్యక్తి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లి దేహీని ఎలా అడగగలడు అని విపరీతమైన బాధపడి మనాది పడుతున్నాడు తనలో తను ఆ దావాగ్ని లోపల నుంచి ఒక పెద్ద వాయిస్ వస్తది ఏమని నన్ను రక్షించండి నన్ను రక్షించండి అనే పెద్ద అరుపు ఆ అరుపు విన్న ఆ నలుడు ఆ అగ్నిలోకి దూకుతాడు ఎందుకంటే అగ్ని అతన్ని దహించలేదు కదా సో ఎవరు అడుగుతుంది రక్షించండి అని చూడగానే నహుషుడు అంటే అంటే ఎంత పెద్ద సర్పమో అంత అంత పెద్ద సర్పం లోపల ఉంటది.
(58:19) హ హు అది ఒక చెట్టుని చుట్టుకొని ఆ దావాగ్ని మొత్తం మూడు నాలుగు వైపుల అగ్ని మండుతుండగా ఆయన బాధతో ఆ వేడి తట్టుకోలేక ఆ సర్పం నన్ను దయచేసి ఈ అగ్నిలో నుంచి బయట పడివేయవలసినది అని అడుగుతాడు. అంటే నలుడు చూసి ఇంత పెద్ద సర్పాన్ని నేను ఎక్కడ మోయగలను నాయనా అని అనుకుంటే నువ్వు ఏమి ఆలోచించకు నేను చిన్న ఒక చేతిలో పట్టే అంత చిన్న సర్పం పిల్లన అయిపోతాను కాబట్టి నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పి ఒక చిన్న సర్పం అయిపోతది.
(58:48) అతను ఎవరయ్యా అంటే సర్ప కుమారుడు ఓకే అతని చరిత్ర చాలా గొప్ప చరిత్ర సో అలాంటిది ఆ సర్పాన్ని చేతిలో పెట్టుకొని మళ్ళీ అగ్నిలో నుంచి బయటికి దూకేసి తను నడుచుకుంటూ వెళ్తుండగా అతను కింద పెట్టేస్తుంటే ఇక్కడ పెట్టొద్దు ఒక 10 అడుగులు వేసి తర్వాత కింద పెట్టమంటాడు ఒక నీటి సమూహం ఉంటది అక్కడ ఒక పాండ్ ఒక చెరువు ఆ చెరువు పక్కన పెట్టి ఎందుకంటే అతనికి చాలా వేడికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి ఎప్పుడైతే ఆ చిన్న సర్పాన్ని కింద పెట్టాడు అది మళ్ళీ పెద్ద సర్పంగా మారి నలుడు యొక్క నుదుటు మీద కాటేస్తది.
(59:24) కాటేయడంతో ఆ పాము యొక్క విషం అతని శరీరంలోకి వెక్కి అతను నల్లగా అయిపోయి మొత్తం బ్లాకిష్ కలర్ లోకి మారిపోయి అతను వికారంగా తయారయి దాని తర్వాత ఒక గూనివాడిలాగా మారిపోతాడు అంటే మీ అండర్స్టాండింగ్ కి భైరవద్వీపంలో బాలకృష్ణ లాగా ఐ సినిమాలో విక్రం లాగా అయిపోతాడు. ఎవరు గుర్తుపట్టలేని ఒక ఒక జుగుప్సగా తయారవుతాడు. అలా అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ సర్పం చూసి అయ్యా నువ్వు నన్ను రక్షించావు నేను నిన్ను కాటేసాను అని అనుకోవద్దు నా పేరు కర్కోటకుడు నేను నాగలోకంలో ఉన్న నాగకుమారుడిని అంటే నాగపాములకి హెడ్ అయిన వాడి కుమారుడిని నేను కాబట్టి నువ్వు నీ మనసులో పడుతున్న బాధ
(1:00:07) అంతా అర్థం చేసుకున్నాను నేను ఏమని అంటే ఎవరికీ మొఖం చూపించలేక అరణ్యాన్ని వదిలి సభ్య సమాజం లో తిరగలేని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇలాగ నీకు రూపాంతరం చెందితే అంటే నీ రూపం మారితే నిన్ను ఎవరు గుర్తుపట్టలేకపోతే కనీసం నువ్వు సభ్య సమాజంలోకి వెళ్తావు నువ్వు ఒక సభ్య సమాజంలోకి వెళితేనే మళ్ళీ నీ భార్యని మళ్ళీ నీ రాజ్యాన్ని పొందగలవు నువ్వు కాబట్టి వెతుక్కోవచ్చు కాబట్టి నువ్వు నన్ను కాపాడిన దానికి నేను నీకు ఇచ్చే ప్రతి ఉపహారం ఇది అంటే నువ్వు నన్ను కాపాడవు నేను నీకు చేసే ఒక ఉపకారం ఇది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను
(1:00:43) నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే అంటే ఇప్పుడు నిన్ను ఎవరు గుర్తుపట్టలేరు నువ్వు అయోధ్యాదీశుడైన రితుపర్ణుడు ఆ రోజు అయోధ్యని పాలిస్తున్నవాడు ఋతుపర్ణుడు అంటే త్రైతా యుగం తర్వాత రాముడి కాలం దాటిన తర్వాత ఆయన యొక్క జనరేషన్ లో అంటే ఆయన యొక్క వంశవృక్షంలో వచ్చినవాడు ఋతుపర్ణుడు ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళు ఋతుపర్ణుడి దగ్గర చాలా ధర్మాత్ముడు ఋతుపర్ణుడు ఆ ఋతుపర్ణుడి దగ్గర అక్షవిద్య అని ఒక పెద్ద విద్య ఉంది నువ్వు ఆయనకి అశ్వవిద విద్యని ఇవ్వు నీకు గుర్రాలు నడపడం బాగా తెలుసు అది ఆయనక ఇవ్వు ఆయన ఇచ్చిన అక్షవిద్యని నువ్వు తీసుకో నువ్వు అక్షవిద్యని తీసుకున్న
(1:01:23) తర్వాత ఎప్పుడు నువ్వు నార్మల్ రూపంలోకి రావాలని అనుకుంటావో అప్పుడు నన్ను స్మరించు నీకు ఒక స్పెషల్ ఉతరియం వస్తది ఒక గుడ్డ వస్తది ఆ గుడ్డను నువ్వు కప్పుకోగానే మళ్ళీ నీ రూపం నువ్వు చెందుతావు అని నేను ఈ విషం ఎందుకు నీ శరీరంలో కక్కానో కాలం ముందుకు వెళ్లే కొద్ది నీకు అర్థంవుతది కాబట్టి నేను నీకు మంచే చేస్తున్నాను నల్ల మహారాజా నన్ను తిట్టుకోకు దయచేసి నేను చెప్పినట్టు చెయి అంట అనగానే తన ఆ చెరువులో తన రూపాన్ని చూసి నలుడే భయపడతాడు ఓహో నేను ఇలా కనబడుతున్నాను అన్నమాట ఇవాళ అని అలాగే నడుచుకుంటూ ఋతుపర్ణుడు రాజ్యానికి వెళ్తాడు ఆయన ధర్మ ప్రభువు అందుకనే ఇతన్ని చూసి
(1:02:08) అసయించుకోలేదు ఆయన ఏం కావాలయ్యా నువ్వు ఎవరివి అంటే కాలం కలిసి రాక నేను ఇలా మిగిలిపోయానండి నేను శిల్పాలు బాగా చెక్కగలను గుర్రాల్ని బాగా నడపగలను నేను వంట బాగా చేయగలను కాబట్టి మీరు ఎందులో పెట్టుకున్నా నేను మీకు ఏదో ఒక సేవ చేసుకుంటూ నేను ఈ రాజ్యంలో బ్రతుకుతాను స్వామి అని అడుగుతాడు రితుపర్ణుడు అలాగే నాయనా ఏ అవసరం వచ్చినప్పుడు నిన్ను ఆ పనులకు మేము వాడతాము నువ్వు ఇలాగే రాజ్యంలో ఉండుగాక అంటాడు ఇంకా ఎప్పుడైతే తను ఒక రాజ్యానికి వెళ్లి అక్కడ మళ్ళీ ఒక నౌకరి మళ్ళీ ఒక ఉద్యోగం చేశాడో తనకి తన భార్య బాగా గుర్తువచ్చి నిద్రలో భార్యని
(1:02:49) కలవరించడం తనలో తాను మాట్లాడుకోవటం ఇలా చేస్తూ ఉంటాడు అదంతా ఒక డిప్రెషన్ ఫేస్ ఇది మీరందరూ ఆ ఎమోషన్ భార్య నుంచి దూరమయ్యాడు ఇద్దరు పిల్లలు రాజ్యం పోయింది అందవికారంగా తయారయ్యాడు ఒకానొక సందర్భంలో తను పడుకుంటూ తన పక్కన జనాలు ఉండగా తన భార్యని ఊహించుకుంటూ ఏదో మాట్లాడుకుంటాడు అలా మాట్లాడుకుంటుంటే పక్కన జనాలు చూసి మతిస్థిమితం చెంది చెందింది వీడికి వీడే ఇంత అందవికారంగా ఉన్నాడు వీడికి పెళ్లి ఏమిటి వీడికి భార్య ఏమిటి అనుకుంటారు వాళ్ళంతా అర్థమైందా మీకు అతని దౌర్భాగ్యపు స్థితి ఏ రేంజ్ కి వెళ్ళిపోయింది అంటే తనలో తను మాట్లాడుకునే స్థితికి ఒంటరిగా పడుకొని తన
(1:03:26) భార్య గురించి తనను వర్ణించుకుంటుంటే పక్కనఉన్న వాళ్ళు అనుకుంటాడు పిచ్చిమా లోకం వీడు చూడటానికి ఇంత దరిద్రంగా ఉన్నాడు వీడిని అసలు ఎవరైనా ఇష్టపడతారా వీడికి మళ్ళీ భార్య భార్యకి పిల్లలట అని అందరూ నవ్వుతారు అలాంటి ఒక స్థితికి కలి తీసుకొస్తాడండి మనల్ని కలి ప్రభావంలో లో ఉంటే మనం ఎలా అధమ పాతాళానికి పడిపోతామో ఇవన్నీ పరాకాష్ట అయితే ఇలాగ నడుస్తున్న కాలంలో దమయంతికి తనను వెతకమని పంపించిన తన తండ్రి వెతకమని పంపిస్తే తను దొరికింది ఒక రాజ్యంలో అవును కానీ తన భర్త దొరకట్లేదు అంటే తనకొకటి అర్థమైంది అంటే నా భర్త గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడా
(1:04:05) కొంపతీసి ఇలాంటిది ఏదైనా జరిగిందా భర్త బ్రతికే ఉన్నాడు ఎందుకంటే అక్కడ మునులు చెప్పారు మళ్ళీ మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ పూర్వ వైభవం చెందుతావు నువ్వు నీ భర్తని కలుసుకుంటావు అని మళ్ళీ భర్తని ఎతగడానికి ఎంతమందిని పంపించినా భర్త జాడ తెలియట్లేదు అప్పుడు ఇంకా తెలివి తేటలు ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇక్కడి నుంచి మీరు ఒక భారత దేశపు అంటే ఒక భారతీయత సనాతన ధర్మమునందు పాతివ్రత్యంగా బ్రతికిన ఒక ఆడదాని వైభవం ఇప్పుడు భర్తని ఎలా పట్టుకుంటదో చూడండి మీరు అక్కడ ఏం చేస్తది అంటే ఎలా అయితే కొన్ని బ్రాహ్మణ సమూహాలుగా విడిపోయి వెతుకుతున్నారు వాళ్ళంతా అలాగా
(1:04:41) లాగ వాళ్ళందరికీ ఒకటి చెప్తది ఏమని చెప్పాలంటే మీరు ప్రతి రాజ్యంలో ఉన్న నాలుగు వీధుల్లో నిలబడి అరుస్తున్నప్పుడు మీరు ఒకటి చెప్పాలి అంటే భర్త అంటే భార్యను భరించువాడా అలాంటిది ఎంత తప్పు చేసినా ఆ భార్యని నువ్వు వదలకూడదు కాబట్టి అగ్నిసాక్షిగా యావ జీవితము కాపాడతానని చెప్పి పారిపోయినవాడా అర్థమైందా ఎమోషనల్ ఆ నీకు కట్టుకోవడానికి బట్ట లేకపోతే తన చీరను చించివిస్తే ఆ చీర కట్టుకొని తిరుగుతున్నవాడా అంటే తను తెలుసుకోవాలి తన గురించే మాట్లాడుకుంటున్నారని అన్ని హింట్స్ అన్ని ఇస్తున్నారు.
(1:05:18) నువ్వు ఎక్కడ ఉన్నా ఆ అమ్మని నువ్వు వెళ్లి కలుసుకోవలసినది అని వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఏ రాజ్యంలో ఎవరు బదులు చెప్పడు ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఈ రాజ్యానికి వస్తారో అయోధ్య రాజ్యానికి వస్తారో అక్కడ ఋతుపర్ణుడు దగ్గర పని చేస్తున్న బాహుకుడు అనే పేరు మార్చుకొని బ్రతుకుతున్న నలుడు లెగిసి ఆ అందవికారంగా ఉన్నవాడు లెగిసి అతను ఏ పరిస్థితుల్లో వదిలేసాడు భార్య అంటే ఎప్పుడు భర్త తప్పు చేసినా మనసులో పెట్టుకొని కాపాడాల్సిన మనిషి అలా భర్తని బయట పెట్టకూడదు అని తనకు చెప్పండి అని చెప్తాడు.
(1:06:00) ఆ దొరికిపోయాడు అర్థమయిందా మీకు సో ఎప్పుడైతే వీళ్ళు ఈ డైలాగ్ కొట్టారో భర్త అంటే భరించాల్సినవాడా సగం భార్య చీర కట్టుకొని తిరుగుతున్నవాడా అంటే తన గురించి అడుగుతున్నారు అని అలిసిపోయింది. ఇప్పుడు అతను బదులిచ్చాడు ఏమని భార్య అంటే భర్త ఎంత తప్పు చేసినా మనసులో పెట్టుకోవాలి గాని బయట చెప్పుకోకూడదు. ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు మాట్లాడకూడదు అతను ఏ పరిస్థితుల్లో వదిలేసాడో ఆ కాబట్టి ఇలా భర్తని బయట పెట్టుకోవద్దు అని చెప్పండి అన్నాడు దొరికిపోయాడు ఆ బాహుకుడిని చూసిన వాళ్ళు వెళ్లి దమయంతి దేవికి చెప్పారు మాకు ఋతుపర్ణుడి రాజ్యంలో ఒక వ్యక్తి
(1:06:37) కనపడ్డాడు అతను ఇలా రిప్లై ఇచ్చాడు అని అనగానే కానీ అతను నలమహారాజులాగా లేనే లేడండి గూనివాడు చాలా అందవికారంగా ఉన్నాడుఅని చెప్పారు వీళ్ళందరూ ఈ దూతలు వచ్చి చెప్పగానే సరే అయితే ఒక పని చేద్దాం మళ్ళీ ఇప్పుడు అదే అయోధ్య రాజ్యంలో నించొని భర్త వదిలేసి వెళ్ళిపోయిన కారణంగా దమయంతి దేవికి విదర్భరాజైన భీముడు రెండవ స్వయంవరాన్ని ప్రకటించాడు అంటే చాలామంది ఏమంటారు సనాతన ధర్మమునందు భర్త చనిపోతే ఆడవాళ్ళకి గుండు కొట్టి వాళ్ళకి తెల్లబట్టలు వేసి గాజులు పగలకొట్టి ఉప్పు కారాలు పెట్టకుండా లోపల పెట్టుకుంటాను అని చెప్పారా అవును అలాంటిది భర్త వదిలేసిన భార్యకు
(1:07:21) పునర్వివాహం అనే సంప్రదాయం ఉందని ఈ కథలో తెలుస్తుంది మన సంప్రదాయంలో ఇలాంటి కట్టుబాట్లు ఏమి లేవు ఏదో కాలక్రమేపి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఏమనా జరిగి ఉండొచ్చు దాన్ని హైలైట్ చేసుకొని సనాతన ధర్మంలో ఆడవాళ్ళని ఇలా చూశారు అని చెప్పుకునే వాళ్ళందరూ ఒక దౌర్భాగ్యులు అన్నమాట కాబట్టి ఇలాగ స్వయంవరం ప్రకటిస్తున్నాడు విదర్భరాజు రెండవ పెళ్లికి సంసిద్ధమవుతున్న దమయంతి దేవి ఆ అనగానే ఇమ్మీడియట్లీ రితుపర్ణుడి రాజ్యంలో ఇది చెప్పగానే రితుపర్ణుడు ఎప్పుడు స్వయంవరం అంటే రేపు పొద్దున స్వయంవరం ఆ వందమడాల దూరం అది అంటే అది ఇంగ్లీష్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ అయోధ్య ఎక్కడ
(1:08:03) విదర్భ అయోధ్య ఉత్తరప్రదేశ్లో విదర్భ మహారాష్ట్రలో సో మధ్యలో ఛత్తీస్గడ్ మధ్యప్రదేశ్ ాన్సీ ఇవన్నీ క్రాస్ అయ్యి వాళ్ళు కిందకి రావాలి. అంటే ఆ అంటే అయోధ్య ఎక్కడో ఉత్తరప్రదేశ్ పైన ఉంది అవును మధ్యలో ఇవన్నీ క్రాస్ అవ్వాలి దాని తర్వాత ఈ విదర్భ అంటే మీ నాగపూర్ ఉండేది విదర్భ ఉమ్ మహారాష్ట్రలో ఉన్న ప్లేస్ సో మధ్యలో ఎన్ని రాష్ట్రాలు క్రాస్ అయి రేపటికల్లా రావాలి.
(1:08:30) మరి అప్పుడు ఫ్లైట్లు ట్రైన్లు ఏం లేవు కదా లేవు కదా ఆ సో అది దాని వెనకాల ఒక రహస్యం ఉంది అనగానే ఇంకా ఋతుపర్ణుడు ఇమ్మీడియట్లీ లెగిసి తీయండిరా గుర్రాల్ని దమయంతి దేవికి పునస్వయంవరం ప్రకటించారు వెళ్ళాలి మనం అంటాడు అనగానే ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద క్యారెక్టర్ ఎంట్రీ అవుతది ఏంటి ఆ క్యారెక్టర్ అంటే ఎవరైతే తన పిల్లల్ని తీసుకొని వెళ్లి ఆ వాళ్ళ రాజ్యంలో పెట్టమని ఆ నలుడి యొక్క రథసారధిని ఇచ్చి పంపించిందో వచ్చారు ఆ ఆ వ్రష్నేయుడు అతను వస్తాడు ఎవరి ముందుకి ఋతుపర్ణుడు ముందుకి నలుడు చూసి ఆశ్చర్యపోతాడు ఇక్కడ ఏం చేస్తున్నాడుఅని ఏంటంటే ఎప్పుడైతే అతను
(1:09:11) పిల్లల్ని వదిలేసి రాజ్యంలో ఇక్కడికి వచ్చాడో తిరిగి అప్పుడు పుష్కరుడు దగ్గర పని చేయడం ఇష్టం లేక అలాంటి అధార్మికుడు దగ్గర పని చేయడం ఇష్టం లేక నలుడు అరణ్యవాసాలు అయిపోయాడు కాబట్టి ఇంకా అక్కడ పని చేయలేక అక్కడ ఉన్న ధార్మిక రాజులలో అయోధ్య రాజు ధార్మికుడు అని తెలుసుకొని అతను ఋతుపర్ణుడి దగ్గరికి వచ్చేసాడు ఓ అక్కడ రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాడు అన్నమాట రిజైన్ చేయలే అప్స్కాండ్ అప్స్కాండ్ డైరెక్ట్ గా అక్కడి నుంచి వీడి దగ్గర వాడు పని చేస్తాడు నా రాజుని ఓడించాడు పాచికల్లో అని ఆ వ్రషనేయుడు ఋతుపర్ణుడి దగ్గర పని చేస్తున్నాడు
(1:09:42) సో తీసి కొత్త గుర్రాలు ప్లస్ అదే రథం ఎక్కి సంసిద్ధంగా ఉన్నాడు అక్కడికి బాహు కూడా వచ్చాడు బాహుడికి వచ్చి రాజా ఈ గుర్రాలు నువ్వు అనుకుంటున్నట్టుగా ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వెళ్ళలేవు ఆ కాబట్టి ఈ ఈ గుర్రాల్ని కట్టండి అని చెప్తాడు అంటే ఆయన గుర్రాలు అప్పటికి రాజ్యంలో ఉంటాయి ఉంటే ఆయనకి రథసారధ్యమునందు అంత నైపుణ్యం ఉంది రథ సారధ్యంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు నలుడు కృష్ణుడు శల్యుడు వీళ్ళ ముగ్గురికి అక్కడ రథసారధ్యంలో ఎక్సలెన్స్ ఉందన్నమాట ఎలాంటి గుర్రాలని ఎంచుకోవాలి ఏ గుర్రాలని ఎలా పరిగెత్తించాలి ఎంత వేగంగా అవి పరిగెడతాయి ఇలా ఉంది అలాగే నలభీమ పాకం
(1:10:20) నలుడికి వంట అంత బాగా తెలుసు భీముడికి అంత బాగా తెలుసు అక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ సో ఇమ్మీడియట్లీ ఆబా బాహుకుడిని పిలుసుకొని వచ్చి సరే నువ్వు రథసారధ్యం చెయ్ అనగానే ఆ రథసారధ్యం అతను చేస్తా ఉంటే రథం భూమిమీద వెళ్తుందా గాలిలో ఎగురుతుందా అన్నట్టుగా తెలియనట్టు ఉంటది. అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ తన ఉతరియం ఎగిరిపోతే ఆ వృష్నేయుడు ని రథం దిగి ఆ ఉతరియం తీసుకురారా ఎగిరిపోయింది అంటే బాహుకుడు అలియాస్ నలుడు చెప్తాడు రథం ఆపడం కుదరదు నీ ఉత్తర్యం పడిపోయిన నాటికి ఇప్పుడు నువ్వు చెప్పేటటికి మనం ఒక యోజనం క్రాస్ చేసేసాం అంత జెడ్ స్పీడ్ లో
(1:11:00) జెట్ స్పీడ్ లో అంత ఫాస్ట్ గా నడుపుతున్నాడు ఆ గుర్రాల్ని అనగానే ఇమ్మీడియట్లీ ఋతుపర్ణుడు చూసి ఇదేమి రథసారధ్యం రా నాయనా నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి నేను నీకుొక విద్యని ఇస్తాను నువ్వు నాకు అశ్వవిద్యను నాకు ఇవ్వు ఎందుకంటే రాజుగా ఆయనకు అవసరం కదా నేను నీకు ఒక విద్యని ఇస్తాను అక్షయ విద్యని నీకు ఇస్తాను అంటాడు అంటే ఏమిటి అంటే నువ్వు ఆ చెట్టు చూస్తున్నావు చూడు ఆ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో నేను ఇక్కడ చూసి చెప్పగలను అంటాడు అదెలాగా అంటాడు అనగానే అతను ఆ చెట్టు స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆ చెట్టుని చూసి ఇక్కడ 10150 ఆకులు ఉన్నాయి అంటాడు
(1:11:39) హ్మ్ ఆ నలుడికి అర్థం కాదు అసలు ఫస్ట్ ఇతను చెప్తుంది ఏంటి విద్య ఏంటి చాలా వింతగా ఉందని అన్నే ఆకులు ఉంటాయి ఆ ఇమ్మీడియట్లీ ఆయన సాష్టాంగ నమస్కారం చేసి రితుపర్ణుడికి నాకు ఈ అక్షవిద్య కావాలంటాడు ఎందుకంటే కర్కోటకుడు చెప్పాడు ఆయన దగ్గర అక్షవిద్య ఉంది నీకు అక్షవిద్య ఇస్తాను అని అప్పుడు ఎప్పుడైనా ఒక రాజు ఇచ్చి పుచ్చుకుంటాడు తప్ప ఫస్ట్ తీసుకోడు కాబట్టి ఆయనకి ఫస్ట్ అశ్వవిద్యని ఇచ్చి కూర్చోబెట్టుకొని దాని తర్వాత ఆయన నుంచి అక్షయని అక్షయ విద్యను నేర్చుకుంటాడు సో ఎప్పుడైతే రితుపర్ణుడి దగ్గర ఆ అక్షయ విద్యని నేర్చుకున్నాడో ఇమ్మీడియట్లీ
(1:12:14) బాహుక అలియాస్ నలుడు శరీరం నుంచి ఒక విషం అనేది తన శరీరాన్ని ఏదైతే నల్లటి విషం కమ్మి ఉందో ఆ విషం బయటికి వస్తది. ఆ విషం బయటిక వచ్చిన మరుక్షణం అతనిలోనుంచి కలిపురుషుడు బయటికి వచ్చేస్తాడు. ఓ ఆ కలిపురుషుడు బయటిక వచ్చి కలిపురుషుడు అప్పుడు నలుడితో మాట్లాడతాడు నాయనా నేను ఇన్ని రోజులు నీకు తెలియకుండా నీ శరీరంలో నివసించాను నీ శరీరవాసం చేశాను దానివల్లనే నువ్వు ఆ మాయాజూదానికి వెళ్ళావు దమ్మంతో వడ్డీ వడ్డి ఓడిపోయావు సమస్తం దానివల్లనే నీ భార్యని వదిలేసావు నువ్వు నన్ను క్షమించవలసినది అంటాడు అంటే నిన్ను ఎలా క్షమిస్తానురా నాయనా నాకు ఈ
(1:12:57) పరిస్థితి పట్టి నేను వచ్చి ఒకళ్ళ దగ్గర చేరి రథసారధ్యం చేస్తున్నాను అంటే అన్ని రకాలుగా పడిపోయాను అంటే అది నీ వల్లనే పడిపోయాను నేను నీకు తగిన గుణపాఠం చెప్తానని చెప్పగానే రాజాని శరీరంలో ఉండి కర్కోటకుడు కలిసిన విషం నిత్యం తింటూ తాగుతూ నేను చిక్కి శీల్యం అయిపోయాను నేను విపరీతమైన బాధ ఆల్రెడీ అనుభవించాను ఇందులో ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా బయటికి వద్దామా అని నిరంతరం ఎదురు చూశాను ఎప్పుడైతే అక్షయ విద్య నువ్వు నేర్చుకున్నావో ఎందుకంటే అక్షయ విద్య అనేది రిగ్వేదంలో వచ్చి వచ్చే ఒక సూక్తం దాని వల్ల అతనికి పుణ్యఫలం పెరిగి ఆయన దేహ
(1:13:33) శుద్ధి జరిగింది. ఎప్పుడైతే ఆ దేహ శుద్ధి జరిగిందో ఆ లోపల ఉన్న కర్కోటికుడు విషం ఆ లోపల ఉన్న కలిపురుషుడిని చాలా బాధించింది. ఆహ అది అందుకనే కరకోడకుడు అన్నాడు ఇది నీకు మంచి చేస్తది నేను ఎందుకు విషం కక్కాను నీ శరీరంలో నీకు అర్థం అవుతది అని ఎందుకంటే ఆ దేహంలో ఇంకొకడు నివసిస్తున్నాడు కదా వాడిని తినేసింది ఆ కలిపురుషుడిని ఆ కలిపురుషుడిని తినేయటం వల్ల నేను చాలా బాధపడ్డాను చక్రవర్తివి నువ్వు నన్ను క్షమించవలసినది అని అటు నుంచి ఏ వృక్షాన్న అయితే వాళ్ళు వెక్కి చెట్లు చెట్టు మీద ఉన్న ఆకులన్నీ లెక్కపెట్టారో దానిని సంస్కృతంలో విభీతిక అంటారు విభీతికి
(1:14:07) చెట్టు తెలుగులో తాండ్ర చెట్టు ఆ తాండ్ర చెట్టులోకి ప్రవేశిస్తాడు కలిపురుషుడు మళ్ళీ కనబడితే మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తాడేమో అని అని అశరీరంగా కలి ఇప్పుడు చెప్తున్నాడు ఏమని ఎవరైతే నలదమయంతుల కథ వింటారో ఎవరైతే నలదమయంతులను తలుచుకుంటారో వాళ్ళ వైభవాన్ని స్తుతిస్తారో నా ప్రభావం ఎప్పటికీ కలి ప్రభావం వాళ్ళ మీద పని చేయుదు గాక ఓకే పని చేయదు పని చేయదు అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు కలిపురుషుడు ఇంకా ఇంకా ఇమ్మీడియట్లీ ఆయన రంగు మారింది ఆయన దేహం కొంచెం వరకు మారింది కానీ పూర్తిగా ఇంకా ఆయన ఆయన నార్మల్ నలులాగా అవ్వలేదు.
(1:14:49) ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా విషం మాత్రమే పోయింది ఇప్పుడు అవును అవుతుంది కానీ తప్పుకున్నప్పుడే వస్తుంది ఆ కానీ ఆకారం పోలేదు ఇమ్మీడియట్లీ ఎక్కి ఆ రథాన్ని వెక్కి ఆ ఋతుపర్ణుడిని తీసుకొని శరవేగంతో వెళ్లి అక్కడ దమయంతి దేవి ఉన్న విదర్భ రాజ్యానికి వెళ్తాడు. ఉమ్ రాజ్యంలోకి వెళ్ళగానే ఋతుపర్ణుడికి ఏమి అక్కడ స్వయంవరం జరుగుతున్న ఏర్పాట్లు కనపడవు పెద్దగా రాజులు ఉండరు స్వయంవరానికి ఏర్పాట్లు లేవు ఏమి లేవు డెకరేషన్ ఏం కనపడదు డెకరేషన్ ఏమీ లేదు నడుచుకుంటూ భీముడి దగ్గరికి వెళ్తాడు విదర్భ రాజైన భీముడి దగ్గరికి వెళ్లి అతను అప్పుడు అనుకుంటాడు
(1:15:24) అమ్మ నేను ఎంత భ్రమపడ్డాను నేను నలదమయంతులు అంటే ఎవర్రా నాయన చక్రవర్తి సార్వభౌములు ఒక మంచి యునో గృహస్థ ఆశ్రమంలో ఉన్న రాజర్షివై వైభవం కలిగిన వాళ్ళు అలాంటి పతివ్రత అయిన దమయంతికి స్వయంవరం అని వాళ్ళు చెప్పడం ఏమిటి నేను పిచ్చివాళ్ళలాగా శరవేగంతో రావడం ఏమిటని సిగ్గుపడి అసలు ఈ మాట భీముడితో అనకుండా అంటే విదర్భు విదర్భ రాజు అయిన భీముడికి చెప్పకుండా అతను పోయి మా అంతపురం ఎక్కడ మేము పోయి లోపల పడుకుంటాం అంటాడు ఆయన అప్పుడు భీముడికి అర్థమైపోతది రితుపర్ణుడికి చాలా సిగ్గుగా ఉంది అలా ఎలా వచ్చేసానురా బాబు అంటే అది ఒక మాయ భగవత్ భగవత వంతుడు ఏర్పాటు అది వీళ్ళని
(1:16:06) కలపాలని ఈయన ద్వారా కలుపుతున్నాడు అంతే లోపలికి వెళ్తే అప్పుడు దమయంతి దేవికి వార్త అందుద్ది ఏమని ఇప్పుడు నిన్న ప్రకటిస్తే ఇవాళ పొద్దునకి రితుపర్ణుడిని తీసుకొని వచ్చాడు ఇంత శరవేగంతో హశ్వాలను స్వారీ చేసేవాడు కేవలం నల చక్రవర్తి మాత్రమే చేయగలడు కాబట్టి వచ్చినవాడు నలుడే ఇప్పుడు రెండో టెస్ట్ పాస్ అయ్యాడు ఏంటంటే అక్కడ చెప్పాడు కదా అలా భర్త అతని బయట పెట్టుకోవద్దు అని బయటపడ్డాడు కదా ఇప్పుడు రెండో టెస్ట్ లో ఎవరైతే ఋతుపరుని తీసుకొని వచ్చేసాడో అంత ఫాస్ట్ గా అతనే నలుడు అని ఆమెకు అర్థమయింది.
(1:16:44) ఇప్పుడు తన చెలికెత్త అయిన ఆమె పేరు కేసిని ఆ చిలికెత్తను పిలిచి ఇప్పుడు అక్కడ ఉన్న బాహు కూడా అంటున్నారు అతను నలుడు ఆకారంలో కూడా లేడు అతన్ని చూసి అతనితో మాట్లాడవలసినది అని పంపిస్తది. పంపిస్తే అక్కడికి కేసిని వెళ్తది. వేసిని వెళ్లి మీరు ఎవరు మీరు ఇంత బాగా రథసారధ్యం ఎలా చేశారు దాని తర్వాత ఋతుపర్ణుడి రాజ్యంలో మీరు ఎన్ని రోజులుగా పని చేస్తున్నారు అని ఆల్రెడీ రితుపర్ణుడు దగ్గర వర్షనేయుడు అని ఒక రథసారధి ఉన్నాడని మేము విన్నాము చాలా బాగా రథాలు దోల్తాడని అతను పూర్వం నలమహారాజు దగ్గర పని చేశడని విన్నామే అంటే ఎక్కడైనా బయట పడతాడేమో అని
(1:17:25) అడుగుతుంది అంటే అప్పుడు ఎక్కడ బయట పడకుండా నలుడు అంటే బాహు లాగా ఉన్న నలుడు ఏమో నల చక్రవర్తి దగ్గర రథసారధ్యం చేసిన మాట నిజమే ఆయన రాజ్యం పోగొట్టుకున్న తర్వాత వచ్చి ఋతుపర్ణుడి దగ్గర జాయిన్ అయినట్టున్నాడు మరి ఏం తెలుసు మనకి అంటే ఎందుకు వచ్చారు అసలు మీరు ఇక్కడికి అంటే ఎక్కడైనా అతని యొక్క క్రోధన్ని బయటికి కక్కుతాడేమో అంటే ఈ మహా తల్లి ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతుందట అది అక్కడ అనౌన్స్ చేశారు అందుకే మా రాజుని తీసుకొని వచ్చాం అని మొఖంలో ఏదైనా చిట్లించుకుంటూ చూపిస్తాడేమో అని ఇంకొకసారి బయట పడతాడేమో చూద్దాం అని అడిగితే చాలా కాముగా పీస్ఫుల్ గా దమయంతి
(1:18:08) దేవికి రెండో స్వయంవరం అట దానికి ఆల్రెడీ ఆహ్వానం వచ్చింది కాబట్టి ఋతుపర్ణ మహారాజుని తీసుకొని వచ్చానని కేవలం మొఖంలో ఒక చిన్న వికారం లేకుండా చెప్తాడు అని చెప్పగానే ఇమ్మీడియట్లీ కేసినికి అర్థం కాదు అసలు ఎక్కడా బయట పడట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట అంటది కేసిని ఏమని అంటది అంటే అసల ఎప్పుడైతే నలుడు వదిలేసాడో దమయంతిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కిందే పడుకుంటూ అసల కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన గంజి కావలసిన పాలు కావలసిన పళ్ళు మాత్రమే తినుకుంటూ అదే చీర ఎప్పుడైతే తను కట్టుకొని నలుడితో బయట పడిందో ఆ చీరనే మళ్ళీ మళ్ళీ ఉతుక్కొని
(1:18:50) వేసుకుంటుంది తప్ప అసల ఎటువంటి భోగభాగ్యాలను అనుభవించట్లేదు దమయంతి అంటాడు ఎప్పుడైతే ఈ వార్త ర్త విన్నాడో బాహుకుడు ఇక బయట పడిపోతాడు అన్నమాట అంటే తన కళ్ళమ్మట నీళ్ళ వచ్చేసి తను కేసిని చూడకుండా పక్కకు తిరిగి ఆ కంటి కన్నీరు శ్రవం కారుతుంటే తుడుచుకుంటాడు అది గమనించిన కేసిని వెళ్లి అమ్మ కచ్చితంగా ఈ మారుమనిషి అంటే నలుడు లాగా కనబడని ఈ మనిషి కచ్చితంగా నలుడే అయి ఉండాలి.
(1:19:19) ఎందుకంటే మీ గురించి చెప్పగానే మీరు ఇలా ఉన్నారని చెప్పగానే అతని కంటెంట నీరు వచ్చింది. అంటే అన్ని మ్యాచ్ అవుతున్నాయి కానీ మనిషి మాత్రం నలులాగా లేడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని మళ్ళీ దమయంతి అంటే ఒక్కొక్క మహాతల్లికి ఉండాల్సిన తెలివి ఆమె మహా పతివ్రత కాబట్టి ఆమె ప్రేమలో ఉన్న నిజాన్ని మనందరం అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఎలా అయినా తన భర్త బయట పడాలిని నేనే అమ్మ నల్లుడిని అని కాబట్టి అతను వంట చేస్తుంటాడు కదా ఆ వంట చేస్తున్నప్పుడు చూడు కేసిని అందరిలాగా వంట చేయడు నలుడు ఎందుకంటే ఆయనకి స్పెషల్ సిద్ధులు ఉంటాయి అని పంపిస్తాడు. అలా వెళితే అక్కడ నలుడు
(1:19:54) ఏంటి అతనికి వరుణదేవుడి శక్తి ఉంది. ఆ వరుణదేవుడి శక్తి ఏంటి అతను నీళ్ళ తోడి పోయక్కర్లేదు చేతులతో ఇలా అంటే నీళ్ళు పడిపోతాయి. అగ్ని అతను ఏమి రాపాడిచ్చో లేకపోతే ఒక మ్యాచ్ బాక్స్ తోనో అగ్ని స్టార్ట్ చేయక్కర్లేదు చేతితో ఇలా అంటే అగ్ని వచ్చేస్తది వచ్చేస్తది సో అతను వంటంతా వింత వింతగా చేస్తుంటాడు. అవన్నీ చూడు కేసీని వచ్చి చెప్తాది మీరు అన్నది రైటే అతను దేన్ని ముట్టించి వేయలేదు మంట దానంతట తన చేతులతో వచ్చేసింది.
(1:20:20) నీళ్ళు బయట నుంచి బాయి నుంచి అక్కడి నుంచి తోడేయట్లేదు. ఏదో చేతుల నుంచి ఇలా అంటే ట్యాప్ లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నట్టు వచ్చేస్తున్నాయి కాబట్టి నాలుగవసారి ఇతను రూపం ఏదో రకంగా మారింది కానీ ఇతనే నలుడు అని ఒక 90% నమ్మకం వచ్చేసింది వీళ్ళకి ఇంకా ఒకటే ఒక పర్సెంట్ ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్లి తండ్రి ముందు చూపించమని అడుగుద్ది కేసినిని ఆ ఎప్పుడైతే కేసిని ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళితే ఆ ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా అది చూసిన నలుడు బావుకులాగా ఉన్న నలుడు ఇప్పుడు విపరీతమైన ఎమోషనల్ అయిపోయి ఇక పిల్లల్ని చూసి తట్టుకోలేక వచ్చి వాటేసుకొని విలవిలా
(1:20:59) ఏడ్చేస్తాడు. ఆ ఏడిచేస్తే కేసిని వచ్చి ఎవరనుకొని ఎవరిని ముట్టుకుంటున్నావ్ వాళ్ళు రాజకుమారులు వాళ్ళు నలుడి యొక్క పిల్లలు ఆ ఎవరనుకొని ఎవరిని ముద్దులాడుతున్నావ్ అంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కదా నేను ఆ పిల్లల్ని చూడగానే నా మనసు చెలించిందమ్మా నాకే పిల్లలు ఉంంటే ఈ వయసులో ఉండేవాళ్ళు అని చెప్పి ముట్టుకున్నానమ్మా అని చెప్పి కళ్ళు తిడుచుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు పూర్తిగా బయట పడిపోయాడు అర్థమైందా మీకు సో ఇప్పుడు పూర్తిగా బయట పడిపోయినవాడు ఇక 100% కాన్ఫిడెన్స్ తో పోయి విదర్భరాజైన భీముడికి చెప్తది ఆ మారువేషంలో ఉన్నవాడే నలుడు అన్ని రకాల పరీక్షలు చేసి నేను
(1:21:39) నిర్ధారించాను ఆయనే నా భర్త అయిన నలుడు తీసుకురావలసినది అంట అప్పుడు రాజుగారు పిలుస్తారు వచ్చి నించుంటాడు నించుంటే అప్పుడు తను అడిగే ప్రశ్న నేను ఏమి చేశాను పాపం నేను నా భర్తని జూదం ఆడవద్దు అన్నాను అయినా సరే నా భర్త అంటే తనకి మొత్తం గుర్తు తెస్తుంది తన పాస్ట్ మొత్తం దేవతలే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు అని నా భర్త అడిగినా నేను ఎప్పుడూ దేనికి టెంప్ట్ కాలేదే నాకు నలుడే కావాలి నా భర్తగా అని నేను ఏరి కోరి దేవతలందరూ వచ్చి నలులాగా నించున్నా మీ నేను నలుడు మెడలోనే వలమాలు వేశను నా భర్త మెడలోనే వేశను ఎంత కష్టం వచ్చినా ఆయన
(1:22:21) పక్కన నిలబడ్డానే ఆయన మాయాజూదం ఆడుతున్నప్పుడు కూడా నేను ఆడద్దని చెప్పినా నా మాట వినకుండా ఆయన సమస్తం కోలిపోయి ఆయన రాజ్యాలని వదిలేసి కట్టు బట్టలతో అరణ్యం పాలైనా సరే నేను ఎన్నడూ నోరు తెరిచి ఒక మాట అనలేదే అలాంటిది మూడు రోజులు నిద్రా దప్పిక ఆకలి లేకుండా క్షుద్భాద నోబిస్తున్న ఆయన కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నా బట్టలో సగం చింపి ఆయనక ఇచ్చానే నేను ఎక్కడ అన్యాయం చేశాను నా భర్తకి ఎందుకు నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ భర్త గుర్తొచ్చి నేను క్షణం క్షణం ఈ రాజ్యంలో ఉన్నాను అన్న మాటే గానీ నాకు ఆకలి నాకు నిద్ర నాకు నాకు
(1:22:59) తిండి రుచించట్లేదు నాకు నీరు తాగాలనిపించట్లేదు తిండి తినాలనిపించట్లేదు అనుక్షణం ఆ భర్త గుర్తుక వచ్చి నేను పడరాని పాటలు పడుతున్నాను అని ఏడ్చేస్తది. అలా ఏడ్చిన తన భార్యను చూసిన నలుడు అప్పుడు ఓపెన్ అప్ అవుతాడు ఓపెన్ అప్ అయిపోయి నేనే నలుని నేనే ఈ మారువేషన్లో ఉన్నాను మరి అంత రోధిస్తున్నావే తల్లి ఆ నలుడిని మిస్ అయ్యి నలుడు గుర్తొచ్చి క్షణక్షణం అన్నిట్లోనూ తినే పళ్ళెంలో నలుడు కనబడుతున్నాడు తాగే నీళ్లలో నలుడు కనబడుతున్నాడు ఇంట్లో నుంచి బయట చూస్తే నలుడు కనిపోతున్నాడు అంత విరహతాపాన్ని పొంది నువ్వు ఇంత డిప్రెషన్ లో ఉన్నావే
(1:23:34) మరి అలాంటప్పుడు స్వయంవరానికి ఎందుకు సంసిద్ధమయ్యావు తల్లి అని అడుగుతాడు ఆ అంటే అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న విదర్భ రాజ్యపు రాజైన తన మామగారైన భీముడు చెప్తాడు ఇదంతా దేనికి నాయనా అంటే నిన్ను బయట పడేయడానికి నిన్ను తీసుకురావడానికే ఈ గోలంతా మాది అనగానే అప్పుడు ఇమ్మీడియట్లీ తను ఒక మాట కూడా మాట్లాడకుండా నేనే ఆ నలుని నేను ఈ ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం నా భార్యకు కనీసం ఒక తిండి గుడ్డ కూడా ఇవ్వలేని దుస్థితికి పడిపోయి పోయినప్పుడు నా యందు కలి ప్రవేశించి నా చేత నా భార్యని వదిలేసేలాగా ఇలాంటి వికృతమైన పని చేసింది నేను మళ్ళీ మీకు మొఖం చూపించలేనంత గిల్ట్
(1:24:17) నాలో మిగిలిపోయింది ఇదంతా ఆ కలి ప్రభావం వల్ల జరిగింది ఇదంతా అనగానే పైనుంచి ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు వచ్చి ఇన్నాళ్ళు నీ భార్యని కంటికి రెప్పలాగా కాపాడిన వాళ్ళం మేమే అందుకనే ఆ ఋషులు ఆ తపస్సులు వచ్చారు వాళ్ళు చెప్పారు అమ్మా నీకేమి కాదు అని అందుకనే తన కంటి చూపు పడగానే తనని ముట్టుకోవడానికి వచ్చిన ఆ అడవి మనిషి మసయిపోయాడు మృగాలన్నీ వచ్చి అన్నిందరినీ చంపాయి కానీ ధమయంతిని మాత్రం ముట్టుకోకుండా వెళ్ళిపోయాయి అనుక్షణం ఆమెని మేమే రక్షిస్తూ వచ్చాం మహా పతివ్రతయ్యా ఈమె ధమయంతి భర్తని ఒక్క మాట కూడా అనకుండా భర్త మళ్ళీ తిరిగి ఎలా
(1:24:59) రావాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది మాతృమూర్తి ఇలాంటి భార్యని పెళ్లి చేసుకుందామని మేము ఆ రోజు అనుకున్నాం ఇవాళ నీ భార్య మాకు తల్లితో సమానం ఇలాంటి తల్లిని ఎప్పుడూ నువ్వు వదలకూడదు అని నలుడికి చెప్పి ఎప్పుడైతే దేవతలందరూ కలిసి మా ప్రొటెక్షన్ లోనే మీ దమయంతి దేవి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అని ఆయనకి చెప్పారు అప్పుడు తన కర్కోటకుడిని తను ప్రార్థించగానే కర్కోటకుడు ఒక ఉతర్యాన్ని ఇవ్వగా ఆ ఉతర్యాన్ని ఆయన వేసుకోగానే మళ్ళీ ఆ నలమహారాజు రూపాన్ని ఆయన వైభవం ఆయనకి వచ్చాడు ఆయన వైభవం ఆయనక వచ్చేసింది ఆయన ఆయన నలమహారాజు రూపం సంతరించింది. అది చూడగానే ఋతుపర్ణుడు
(1:25:43) మామూలుగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఋతుపరుడికి ఇన్ని రోజులు నా దగ్గర పని చేసి నా గుర్రాలన్నీ నాకు వంట చేసినవాడు నలుడా అయ్యో అని చెప్పి వచ్చి నలుడు యొక్క చేతులు కాళ్ళు పట్టుకుంటాడు పడుకుంటే ఏమి తప్పు లేదు ఋతుపర్ణ మహారాజా మీరు ధర్మాత్ములు నాకు కర్కోటకుడు చెప్పాడు నువ్వు రూపం మారితే తప్ప ఇంకొక రాజ్యంలో ఒకళ్ళ కింద పని చేయవు అసలు రూపం మారితే తప్ప నువ్వు అడవి నుంచి బయటికి వెళ్ళవు నీ మొఖం నలుగురికి చూపించవు అందుకు కర్కోటకుడు నా యందు విషాన్ని ప్రయోగం చేసి నా రూపం మారి వచ్చి మీ దగ్గర పని చేసేటట్టు చేశాను మీకు ఎటువంటి దోషం
(1:26:17) ఉండదండి మీ వల్లనే ఇవాళ నేను మళ్ళీ ఈ రాజ్యానికి వచ్చాను నా భార్యని మళ్ళీ తీసుకున్నాను అని చెప్పి రితుపర్ణుడికి ఆయన నమస్కారాలు ఆయన మిత్రత్వాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసి తర్వాత కొన్ని రోజుల పాటు నలుడు దమయంతి ఆ విదర్భ రాజ్యంలోనే ఉంటారు. ఉన్న తర్వాత కొంతకాలానికి ఆయన ఒక పెద్ద ఆయన దగ్గర ఉన్న రథం ఈ అశ్వాలు ప్లస్ వాళ్ళ మామగారు ఆయనక ఇచ్చిన కొన్ని ఏనుగులు కొంతమంది సైన్యం కొన్ని గుర్రాలు అన్ని తీసుకొని పుష్కరుడి దగ్గరికి వెళ్తాడు.
(1:26:49) ఓకే వెళ్లి ఒకటి నాతో యుద్ధం చేయాలి లేదా నువ్వు పాచికలు ఆడాలి అని అడుగుతాడు అని అడిగితే అసల యుద్ధం చేయొచ్చు పుష్కరుడు కానీ వాడి మనసులో ఒక వికారం ఉంది ఇవాళ అది బయట పడాలి. ఆ బయట పడాలి కాబట్టి వాడేమంటాడు అయితే పాచకలే ఆడదాం అంటే వాడికి తెలియదు కదా పుష్కరుడికి ఈయనకు అక్షయ విద్య అక్షయ విద్య ఉంది ఇప్పుడు ఈయనని ఎవరు మోసం చేయలేరు అని అనుకుంటా అని తెలియక వాడు పాచకలే ఆడదాం సరే కానీ పెట్టడానికి నీ దగ్గర ఏముంది నీ భార్య తప్ప అంటాడు పుష్కరుడు అప్పుడు ఇప్పుడు అక్షయ విద్య తన చేతిలో ఉంది తనని ఎవరు ఓడించలేరు అతను తర్వాత యముడు చెప్పాడు ఆయనకి ధర్మం ఎప్పుడు నీ
(1:27:30) వైపే నిలబడి ఉంటది అని అవును అందుకు ఆయ అయన తన భార్యను పెట్టి పెట్టింది మొత్తం లాగేసుకున్నాడు వెనక్కి పుష్కరుడి దగ్గర నుంచి పుష్కరుడు అర్థం కాలా ఈసారి ఏంటి నేను మోసం చేయలేకపోయాను అని అనుకున్నాడు కానీ ఈసారి అక్షయ విద్య ఈయన వైపు ఉండటం వల్ల ఆయన ఆయనకి తెలుసు ఎలాగో ఓడిపోనని ఆయనకి ఎలాగో తెలుసు ఓడిపోనని అందుకు మళ్ళీ ఏ దమయంతి అయితే ఆయనకి ఫస్ట్ నుంచి అన్ని రకాల వైభోగాలు ఇచ్చిందో ఆ దమయంతే ఆఖరికి పద్యంలో నిలబడి రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేలా చేసింది.
(1:28:06) అందుకు మనం దమయంతి అనే ఒక క్యారెక్టర్ ఆడవాళ్ళకు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కావాలి ఒక ఆడదాని వైభవం ఆడదాని ప్రేమ ఆడదాని త్యాగం ఆడదాన్ని ఔన్యత్యం అనేది కేవలం దమయంతి అనే ఒక స్టోరీ తో మన సమస్త హిందూ జాతి సనాతన ధర్మం భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడదానికి ఇలాంటి ఒక దమయంతి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఇప్పుడు చెప్పండి ఈ లవ్ స్టోరీ బాగుందా మీకు ఆ రోమియో జూలియట్లు లైలా మజ్నూలు లవ్ స్టోరీలు బాగున్నాయా అవి అసలుకు మనం విన్నామా సగం సగన్ స్టోరీస్ కదా ఇది ఏంటి అద్భుతం దీనినుంచే కదా మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ అనేది కాబట్టి ఇందుమూలంగా నలదమయంతుల కథ నుంచి
(1:28:46) మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యని గౌరవించడం ప్రేమానురాగాలతో సంసారం చేయడం వల్ల ఆ భార్య భర్తలు కలిసి ఒక ప్రేమ బంధంలో ఉంటే కలిపురుషుడు ప్రభావం కూడా వాళ్ళ మీద పని చేయదు. అంతేగా అంతేగా కాబట్టి కాబట్టి నలదమయంతులు అనేవాళ్ళు అదొక ఇదొక లవ్ స్టోరీ ఇదొక లవ్ సాగా ఇది మనం ప్రతి మనిషికి పెళ్లిళ్లు చేసుకునే ముందు ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీలోకి వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు టీనేజ్ వాళ్ళందరికీ ఈ కథ చెప్పాలి.
(1:29:18) వావ్ అండి నాకు అసలుకి ఈ ఎపిసోడ్ ఎప్పుడు అయిపోయిందో తెలియట్లేదు అలా స్టోరీ వింటూ ఉండిపోయాను. దీంతో మనం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు కదా ఈ ఎపిసోడ్ లో కూడా ఒకటి వచ్చేసి కలి ప్రభావం మన మీద పడ్డప్పుడు మనకి ఏం జరిగినా మనక అంత తెలియట్లేదు. సో కచ్చితంగా ఈ పాడ్కాస్ట్ విన్నాక మనందరి మీద కలి ప్రభావం తగ్గుతుందని అనుకుంటున్నాను.
(1:29:41) ఇంకొకటి అసలుకు ఆ నలదమయందుల లవ్ స్టోరీ ఏంటండి అంత అన్కండిషనల్ లవ్ ఏంటండి భార్యా భర్తల మధ్యలో ఆ రిలేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా మౌల్డ్ చేసుకున్నారండి ఐ థింక్ ఇవన్నీ మనం కూడా మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ అర్పణమస్తు [ప్రశంస]
No comments:
Post a Comment