Tuesday, February 24, 2026

శివుడి మూడవ కన్ను వెనుక ఉన్న సైన్స్ | The Scientific Truth of Third Eye (Ajna Chakra)

శివుడి మూడవ కన్ను వెనుక ఉన్న సైన్స్ | The Scientific Truth of Third Eye (Ajna Chakra)

Author Name:Vaidika Bharatham

Youtube Channel Url:https://www.youtube.com/@vaidikabharatham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EBgT5mUJFkE



Transcript:
(00:03) నమస్కారం వెల్కమ్ టు వైదిక భారతం మిత్రులారా మనకు రెండు గళ్ళు ఉన్నాయి. ఈ రంగుల ప్రపంచాన్ని చూడటానికి అవి చాలు కానీ మీకు తెలుసా మన మెదడు లోపల ఎవరికీ కనిపించని ఒక మూడవ కన్ను దాగి ఉంది. పరమశివుడు మూడవ కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందని అంటారు. అసలు ఆ మూడవ కన్ను అంటే ఏంటి? అది కేవలం ఒక భయంకరమైన అస్త్రమా లేక మనిషికి [సంగీతం] దేవుడు ఇచ్చిన ఒక సీక్రెట్ టెక్నాలజీనా ఒకసారి ఆలోచించండి వేల ఏళ్ల క్రితం ఎలాంటి టెలిస్కోప్ లేని కాలంలోనే [సంగీతం] మన ఋషులు సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని ఎలా లెక్కారు? ఎలాంటి స్కానింగ్ మిషన్లు
(00:50) లేని రోజుల్లోనే తల్లి కడుపులో బిడ్డ వారం వారం ఎలా పెరుగుతాడో గర్భోపనిషత్తులో ఎలా రాశారు? వాళ్ళు వాడిన ఆ అద్భుతమైన పరికరం పేరే ఆజ్ఞ చక్రం. ఈరోజు ఈ వీడియోలో మన ఋషులు దాచిన ఆ రహస్యాలని బయట పెట్టబోతున్నాం. మోడర్న్ సైన్స్ ఇప్పుడు [సంగీతం] దీనినే పీనియల్ గ్లాండ్ అంటుంది. దాన్ని మన వేదాలు ఎప్పుడో ఎలా పట్టుకున్నాయి రండి మన మెదడులోని ఆ రహస్య ద్వారాన్ని తెరుద్దాం.
(01:25) చాలామంది అనుకుంటారు ఋషులు అడవుల్లో కూర్చొని ఊహించుకొని రాశారు అని కానీ [సంగీతం] అది ఊహ కాదు అది దర్శనం అందుకే మన దగ్గర ఫిలాసఫీని దర్శన శాస్త్రం అంటారు. అంటే చూడటం అని అర్థం. దేనితో చూశారు మన కళ్ళకు కనిపించని డైమెన్షన్లు చూడగలిగే [సంగీతం] అగ్ఞ చక్రంతో చూశారు. ఋగ్వేదంలో ఋషులను క్రాంత దర్శులు అన్నారు.
(01:52) అంటే హద్దులు [సంగీతం] లేని దృష్టి కలవారు అని మన మెదడులో రెండు కనుబొమ్మల మధ్య లోపలి వైపు ఒక పవిత్రమైన స్థానం ఉంది. యోగశాస్త్ర ప్రకారం ఇక్కడ ఇడ, పింగళ, సుసిమన అనే మూడు నాడులు కలుస్తాయి. అందుకే దాన్ని శరీరంలో ఉన్న త్రివేణి సంగమం అంటారు. [సంగీతం] యోగచూడామణి ఉపనిషత్తులో స్పష్టంగా రాశారు. ఎప్పుడైతే మనిషి తన ప్రాణశక్తిని వెన్నెముక ద్వారా పైకి లాగి ఈ కనుబొమ్మల మధ్య నిలిపేస్తాడో అప్పుడు అతనికి కాలం ఆగిపోతుంది.
(02:27) మరణం అతని దరిదాపుల్లోకి రాలేదు. ఇది వినడానికి మ్యాజిక్ లా ఉంది కదా కానీ మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయే సైన్స్ వింటే నీ మైండ్ బ్లాక్ అవుతుంది. మన పూర్వీకులు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక బయాలజీ ఉంది. మన మెదడు మధ్యలో సరిగ్గా రెండు అర్ధభాగాల మధ్య ఒక చిన్న గ్రంధి ఉంటుంది. దాని పేరే పీనల్ గ్లాండ్. ఇది చూడటానికి అచ్చం ఒక చిన్న పైన్ కోన్ ఆకారంలో ఉంటుంది.
(02:57) మీరు గమనిస్తే [సంగీతం] వాటికన్ సిటీలో ఈజిప్ట్ పిరమిడ్ల మధ్య మన శివుడి జటాజూటంలో కూడా ఈ పైన్ కోన్ ఆకారం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాచీన [సంగీతం] నాగరికతలకు తెలుసు. అదే ఆత్మకు నివాసం అని. 2002వ సంవత్సరం వరకు సైంటిస్టులు [సంగీతం] ఏమనుకున్నారంటే ఇది నిద్రపోవడానికి ఉపయోగపడే మెలటోనిన్ అనే హార్మోన్ ని మాత్రమే ఇస్తుందని కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో పూసినప్పుడు ఒక షాకింగ్ నిజం తెలిసింది.
(03:30) ఈ [సంగీతం] చిన్న గ్లాండ్ లోపల నీటిలో తేలియాడే చిన్న చిన్న పల్సిట్ క్రిస్టల్స్ ఉన్నాయి. అంటే మన మెదడులో చిన్న చిన్న [సంగీతం] స్పటికాలు ఉన్నాయన్నమాట. సైన్స్ ప్రకారం ఈ స్పటికాలకు ఒక స్పెషల్ పవర్ ఉంది. దాని పేరే ఫిజో ఎలక్ట్రిసిటీ అంటే ఈ స్పటికాల మీద గనుక మనం చిన్న ఒత్తిడి కలిగించగలిగితే అవి కరెంట్ ని కాంతిని ఉత్పత్తి చేస్తాయి.
(03:57) శివుడు కన్ను తెరిస్తే అగ్ని వస్తుందని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందా? ఆ అగ్ని ఆ వెలుగు బయట నుంచి రాదు. మీ మెదడు లోపల ఈ స్పటికాల నుంచి పుడుతుంది. [సంగీతం] మరి ఆ స్పటికాలను ఎలా యాక్టివేట్ చేయాలి? దానికి మన ఋషులు [సంగీతం] ఇచ్చిన టెక్నిక్ పేరే తపస్సు ఈ రోజుల్లో తపస్సు అంటే అడవికి వెళ్లి కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు. కానీ తపస్సు అనే పదానికి సంస్కృతంలో అసలు అర్థం వేడిని పుట్టించడం.
(04:27) మీరు రెండు చేతులు [సంగీతం] గట్టిగా రుద్దితే వేడి ఎలా పుడుతుందో ఒక యోగి ప్రాణాయం ద్వారా కుంభకం ద్వారా శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాడు. దీన్నే యోగాగ్ని అంటారు. మనం గాఢంగా శ్వాస తీసుకొని దాని లోపల బంధించినప్పుడు మెదుడులో ఉండే ఒక రకమైన ద్రవం వేగంగా ప్రవహించి [సంగీతం] సూటిగా వెళ్లి ఆ పీనల్ గ్లాండ్ ని డీ కొడుతుంది. ఆ ఒత్తిడికి లోపల ఉన్న స్పటికాలు ఒక్కసారిగా వైబ్రేట్ అవుతాయి.
(05:00) ఎలాగైతే ఒక గ్యాస్ లైటర్ ని నొక్కితే నిప్పు వస్తుందో తపస్సు ద్వారా కలిగే ఆ ఒత్తిడికి ఆ స్పటికాల నుండి ఒక విద్యుత్ క్షేత్రం పుడుతుంది. దీన్నే పురాణాల్లో జ్ఞాన నేనేత్రం తెరుచుకోవడం అన్నారు. మరి ఈ ప్రాసెస్ లో ఓంకారం ఎందుకు వాడాలి? దానికి కూడా ఒక సైన్స్ ఉంది. ప్రతి తాళానికి ఒక చెవి ఉన్నట్టు ఈ ఆజ్ఞ చక్రాన్ని మేలుకొలపడానికి ఒక శబ్దం ఉంది.
(05:28) అదే ఓం మనం మామూలుగా మాట్లాడేటప్పుడు నాలుక పళ్ళను తగులుతుంది. కానీ మీరు ఓం [సంగీతం] అని దీర్ఘంగా అన్నప్పుడు గమనించండి. ఆ శబ్దం మీ గొంతులో నుంచి అంగళ ద్వారా నేరుగా మెదడు మధ్యలోకి ప్రయాణిస్తుంది. మాండుక్య ఉపనిషత్తు ఏం చెబుతోందంటే ఓంకార నాదం మన మెదడులోని నరాలను శుద్ధి చేస్తుంది. ఆ వైబ్రేషన్ వెళ్లి పీనల్ గ్లాండ్ ను తాకినప్పుడు అది నిద్రలేస్తుంది.
(06:00) మనకు కటయోగ ప్రదీపిక లో శాంభవి ముద్ర గురించి చెప్పారు. అంటే కళ్ళు తెరిచే ఉంటాయి కానీ చూపు మాత్రం లోపలి వైపు రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే కనుగుడ్లను అలా పైకి తిప్పి ఉంచడం వల్ల కంటి నరాలు పీనర్ గ్లాండ్ ని భౌతికంగా స్టిములేట్ చేస్తాయట. అంటే వేల ఏళ్ల క్రితం మన ఋషులు కనుగొన్నది [సంగీతం] మతపరమైన ఆచారం కాదు అది ఒక న్యూరో సైన్స్ టెక్నిక్ సముద్ర మదనంలో అమృతం పుట్టింది అని విన్నాం కదా యోగశాస్త్ర ప్రకారం ఆ మదనం మన వెన్నెముకలో జరుగుతుంది.
(06:38) ఎప్పుడైతే కుండలిని శక్తి పీనల్ గ్లాండ్ ని తాకుతుందో అక్కడ అమృతం స్రవిస్తుంది. దీన్నే మోడర్న్ సైన్స్ డిఎంటి అంటోంది. దీన్ని స్పిరిట్ మాలిక్యూల్ అంటారు. మనిషి పుట్టేటప్పుడు చనిపోయేటప్పుడు మాత్రమే ఇది సహజంగా మెదుడులో విడుదలవుతుంది. అందుకే చనిపోయే ముందు చాలా మందికి వెలుగు కనిపిస్తుంది. చనిపోయిన బంధువులు కనిపిస్తారు.
(07:04) కానీ ఒక యోగి ఈ dఎంటి ని ధ్యానం ద్వారా తనకు కావాల్సినప్పుడు ఉత్పత్తి చేసుకోగలడు. ఎప్పుడైతే ఈ రసాయనం విడుదలవుతుందో మనిషికి ఈ భౌతిక ప్రపంచం మాయలా అనిపిస్తుంది. విశ్వమంతా తనలోనే ఉందన్న సత్యం బోధపడుతుంది. శివుడు విష్ణువు వేరు కాదు అంతా ఒకటే శక్తి అన్న అద్వైత స్థితి కలుగుతుంది. సో మిత్రులారా గమనించారా మూడవ కన్ను అంటే [సంగీతం] నుటి మీద ఇంకొక కన్ను మొలవడం కాదు అది ఒక ఉన్నతమైన చైతన్యం మన ఋషులు మనకఇచ్చిన ఆస్తి ఈ యోగవిద్య దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు కైలాసంలో లేడు.
(07:46) ఆయన నువ్వు అణువున ఉన్నాడు. ముఖ్యంగా మీ మెదడులో ఆ చిన్న స్పటికాల రూపంలో [సంగీతం] జ్యోతి స్వరూపంలో మీలోనే ఉన్నాడు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోజుకి కనీసం 10 నిమిషాలు కేటాయించండి. కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ఆజ్ఞ చక్రాన్ని గమనించండి. మీ లోపల ఉన్న శివుడిని మెలుకొల్పండి. మన సనాతన ధర్మంలోని సైన్స్ ని ఈ వైదిక రహస్యాలను అందరికీ తెలియజేయడమే వైదిక భారతం లక్ష్యం.
(08:18) ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన నాలెడ్జ్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధ్యానం చేసేటప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయో కింద కామెంట్స్ లో చెప్పండి. మరో అద్భుతమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త [సంగీతం] సుఖినో భవంతు స్వస్తి.

No comments:

Post a Comment