Wednesday, April 8, 2026

ఈ మనుషులతో జాగ్రత్త! | మనుషుల ప్రవర్తన - సామాజిక బంధాలు | 25 Vemana Padyalu on Human Behavior

ఈ మనుషులతో జాగ్రత్త! | మనుషుల ప్రవర్తన - సామాజిక బంధాలు | 25 Vemana Padyalu on Human Behavior

Author Name:Sahithi Parimalam

Youtube Channel Url:https://www.youtube.com/@sahithiparimalam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SYBsZRng20A



Transcript:
(00:00) అందరికీ నమస్కారం ! మన చుట్టూ వందల మంది మనుషులు ఉండవచ్చు. కానీ వారిలో మన మంచి కోరే వారు ఎంతమంది? పైకి నవ్వుతూ లోపల విషం దాచుకునే వారిని ఎలా గుర్తించాలి? 500 ఏళ్ల క్రితమే యోగి వేమన గారు నేటి కాలపు మనుషుల మనస్తత్వాలను తన పద్యాలలో ఎలా విడమరిచి చెప్పారో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ మొదటి భాగంలో మనుషుల ప్రవర్తన మరియు సామాజిక బంధాల గురించి వేమన చెప్పిన 25 అద్భుతమైనటువంటి పద్యాలను విశ్లేషించుకుందాము.
(00:34) మరి ఇవి మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సాహితీ పరిమళాన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి విభాగము ముసుగు మనుషులు ముసుగు ముఖం నవ్వుతుంది. కానీ లోపల మనసు మాత్రము విషం దాచుకుంటుంది. దీనికి సంబంధించి వేమన చెప్పిన పద్యాలు చూడండి. సోషల్ మీడియాలో ఆదర్శవంతులుగా ఫోజులు ఇస్తూ నిజ జీవితంలో మోసాలు చేసే ఫేక్ వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని వేమన చెప్పినటువంటి పద్యం అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులుఎరుగకున్న ఈశ్వరుడుఎరుగడా
(01:19) విశ్వదాభిరామ వినురవేమా లోపల తప్పులు చేస్తూ బయటకు నీతిమంతుడిలా నటించే వారిని లోకం నమ్మవచ్చేమో కానీ దేవుడు మాత్రము చూస్తూనే ఉంటాడు. మనం ఉద్యోగం చేసే చోట అర్హత లేని వాళ్ళు తమకంటే తెలివైన వారిని ఎలా తొక్కేస్తారో ఉదాహరణగా వేమన చెప్పిన పద్యం అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినెడు కుక్క చెరుకుతీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమా చెప్పు రుచి మరిగినటువంటి కుక్కకు చెరకు తీపి రుచించదు కదా అలాగే నీచుడికి పవర్ వస్తే వాడు చేసే మొదటి పని మంచివాళ్ళను
(02:08) దూరం పెట్టడమే జ్ఞాని మరియు అజ్ఞాని మధ్య తేడాను చెప్పే వేమన పద్యం చూడండి పల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునవి విశ్వదాభిరామ వినురావేమా కంచు మోగినట్లు బంగారం మోగదు కదా బంగారం నిశశబ్దంగా ఉంటుంది. కంచు మాత్రము విపరీతంగా మోగుతుంది. అలాగే ఏమీ లేనివాడే గొప్పలు చెప్పుకుంటాడు.
(02:42) నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ లో ప్రొఫైల్ లోనే ఉంటాడు. మనుషుల బయటి రూపం చూసి మోసపోవద్దు అని వేమన చెప్పిన పద్యం చూడండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కర్పూరము చూడటానికి ఒకలాగే కనిపిస్తాయి కానీ రుచులు మాత్రము వేరు వేరుగా ఉంటాయి.
(03:14) అలాగే మనుషులందరూ కూడా ఒకే విధంగా కనిపించినా అందులో మంచివారు వేరు కాబట్టి మనుషుల రంగు డ్రెస్స చూసి మోసపోకండి. అత్యవసర సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి మనిషిని అంచనా వేయండి. పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న రోడ్డు మీద లేదా తోటి మనుషులతో నీచంగా ప్రవర్తించే వారిని మనం రోజు చూస్తుంటాం కదా అలాంటి వాళ్ళ కోసం వేమన ఏం చెప్పాడో చూడండి. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడు అవగుణంబు మానలేడు బొగ్గు పాలకడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా బొగ్గును పాలతో కడిగినా నలుపు పోదు అలాగే నీచుడికి ఎంత చదువున్నా సరే సంస్కారం
(04:02) అనేది రాదు. ఈ కాలంలో భక్తి పేరుతో అరాచకాలు చేసే బాబాల ముసుగులను తీస్తూ వేమన చెప్పిన పద్యం చూడండి. నొసలు బతుడయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగాను శివుని గొలుతునగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమా నోరేమో తోడేలు లాగా మనసేమో భూతం లాగా ఉంచుకొని నుదుట విభూది ధరించి చేసేటువంటి పూజలు వ్యర్థమవుతాయి. అప్పులు చేసి లగ్జరీ లైఫ్ గడుపుతూ బయటకు బిల్డప్ ఇచ్చే నేటి కాలపు డొల్ల జీవితాల గురించి వేమన ఏమన్నాడో చూడండి మేడిపండు చూడ మేలిమై ుండును పొట్టవిప్పి చూడ
(04:50) పురుగులుండు పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమా పైకి మెరిసే మేడిపండుకి లోపల పురుగులు ఉన్నట్లు పిరికివాడి ఆడంబరం కూడా మేడిపండు లాగా బయటకి మాత్రమే అందంగా ఉంటుంది. ఇంకా రెండవ విభాగము మూర్ఖత్వము మరియు నీచ గుణము మూర్ఖుడు అరుస్తాడు కానీ జ్ఞాని మౌనంగా చూస్తాడు. ఇలాంటి వారి గురించి వేమన చెప్పిన పద్యాలు చూడండి.
(05:25) వారసత్వంగా ఆస్తి రావచ్చు గానీ క్రమశిక్షణ లేకపోతే అది నిలవదు అని వేమన చెప్పిన పద్యం ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచువాని వంశమెల్ల చెరకు వెన్ను పుట్టి చెరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమా చెరకు వెన్ను పుట్టి చెరుకులోని తీపిని అంతా నాశనం చేసినట్లు గొప్పవారికి చెడ్డ సంతానం పుడితే వంశం మొత్తం నాశనం అవుతుంది.
(05:56) వాట్ప్ WhatsApp, Facebook లాంటి సోషల్ మీడియా యూనివర్సిటీలో వచ్చే తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మే మూర్ఖులను మార్చడం మనవల్ల కాదు. దానికి సంబంధించి వేమన చెప్పిన పద్యం చూడండి. ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపినా మాట తెలిసి నడచు మర్మమెరిగి మొప్పె తెలియలేదు ముప్పేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమా ఒక ఏడాది నేర్పిస్తే ఎద్దైనా మనం చెప్పినట్లు తెలుసుకొని వ్యవసాయానికి ఉపయోగపడుతుంది.
(06:29) కానీ 30 ఏళ్ళు చెప్పినా సరే మూర్ఖుడు మాత్రము తెలుసుకోలేడు. సహజ గుణాన్ని మార్చలేము అని వేమన చెప్పిన పద్యం కుక్క గోవు కాదు కుందేలు పులి కాదు దోమ గజము కాదు దొడ్డదైనా లోభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమా ఎంత జాతి కుక్క అయినా సరే సాత్వికమైనటువంటి గోవు కాలేదు భయపడి పరుగెత్తేటువంటి కుందేలు పులి కాలేదు తొండం ఉన్నది కదా అని చెప్పి దోమ ఏను ఏనుగు కాలేదు అలాగే పిసిని గొట్టు నుండి దాన గుణాన్ని కూడా మనం ఆశించలేము.
(07:13) నెటిజన్లు గొప్ప వ్యక్తులను కూడా నోటికవచ్చినట్లు ట్రోల్ చేసే విచక్షణ లేని ప్రవర్తన గురించి ఆనాడే వేమన ఏమన్నాడో చూడండి. కుక్క ఏమి రుంగు గురులింగ జంగంబు పిక్కబట్టి ఎడిసి పీకుగాక సంతపాక తొత్తు సన్యాసి నెరుగునా విశ్వదాభిరామ వినురవేమా పిక్కబట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క గురువైనా ఎవరైనా సరే వదలదు అలాగే సంతలో దారిగాచి సంపాదించేటువంటి వేష్య సన్యాసి వద్ద నుండి కూడా డబ్బులు గుంజడం మానదు.
(07:51) సంస్కారం లేని వాడికి ఎవరిని గౌరవించాలో తెలియదు. అనర్హులను సెలబ్రిటీలుగా చేసే నేటి సోషల్ మీడియా ట్రెండ్ గురించి వేమని చెప్పిన పద్యం చూడండి కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా కోతికి కొత్త బట్టలు కట్టి కొండముచ్చులు పూజ చేసినట్లు నీతి లేని నాయకుడి చుట్టూ భజన బృందాలు ఎప్పుడూ ఉంటాయి.
(08:26) తెలివైనవాడు మౌనంగా సాధిస్తాడు ఏమీ తెలియనివాడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తాడు. దీనికి ఉదాహరణగా ఈ వేమన పద్యం గంగ పారుచుండు కదలని గతితోడా మురికి కాల్వ పారు మోతతోడా అధికుడోర్చునట్లు అధముడోర్వగలేడు విశ్వదాభిరామ వినురవేమా ఒక ఆఫీసలో గాని సమాజంలో గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు లీడర్ అనేవాడు గంగల ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతుకుతాడు.
(09:03) కానీ అర్హత లేనివాడు చిన్న సమస్యకే గగ్గోలు పెడుతూ పక్కవాళ్ళని నిందిస్తూ ఆ ప్రాంతమంతా కలుషితం చేస్తాడు. కేవలం తెలివైన వారి సహవాసం ఉంటే సరిపోదు. మనకంటూ సొంత తెలివితేటలు ఉండాలి అంటూ వేమన చెప్పిన పద్యం విద్య లేనివాడు విద్వాంసులకడను ఉండగానే పండితుండుగాడు కొలని హంసలకడ కొక్కెర యున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా పండితుల దగ్గర ఉన్నంత మాత్రాన చదువు లేనివాడు పండితుడు కాడు అలాగే హంసల మధ్య కొంగ ఉన్నంత మాత్రాన అది హంస అవ్వదు.
(09:43) మన వ్యక్తిగత విషయాలు తప్పుడు వ్యక్తులతో షేర్ చేసుకుంటే భవిష్యత్తులో అది మనకే ముప్పు అని వేమన చెప్పిన పద్యం చూడండి హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంతవానికైనా నిడుమ కలుగు ఏగ కడుపు జొచ్చి ఎట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమా తప్పుడు వ్యక్తిని ఇంట్లోకి రాణిస్తే కడుపులో ఏగ వెళ్ళినట్లు కలత తప్పదు కాబట్టి బట్టి ఎవరిని చేరదీయాలి ఎవరిని చేరదీయకూడదు అని తెలుసుకోవాలి.
(10:19) ఇంకా మూడవ విభాగము శత్రుత్వము మరియు లోకజ్ఞానము శత్రువు ఎప్పుడూ ఎదురుగా రాడు చిరునవ్వుతో వెనుకే నడుస్తాడు. దీనికి సంబంధించిన పద్యాలు చూద్దాము. పగతో ప్రతీకారం తీర్చుకోవడం కంటే మన మంచితనంతో శత్రువును సిగ్గుపడేలా చేయడమే ఈ కాలపు తెలివైన రివెంజ్ దీనికి వేమన చెప్పిన పద్యం చూడండి చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవేమా చంపదగినటువంటి శత్రువు మనకు దొరికినా సరే వాడిని చంపకూడదు
(11:03) వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు అదే వాడికి సరైన శిక్ష అవుతుంది. సడన్ గా మనతో అతిగా క్లోజ్ అయ్యే వ్యక్తుల వెనుక ఉండే స్వార్థాన్ని గమనించాలి అని వేమన చెప్పిన పద్యం చూడండి చంపదలచు రాజు చనవగ్గలం బిచ్చు చెరుపనున్న పగర చెలిమిసేయు కరవనున్న పాము నెరిగాచుకొనియుండు విశ్వదాభిరామ వినురవేమా రాజు ఎప్పుడూ కూడా చంపాలి అనుకున్న వాళ్ళతోటి చనువు అధికం చేస్తాడు అలాగే నాశనం చేయాల్సిన శత్రువులతో స్నేహం చేస్తాడు అంటే హాని చేసేవాడు పాములా కాచుకొని ఉండి ముందు అతిగా స్నేహం
(11:50) చేస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్త మన పరిస్థితి బాలేనప్పుడు మౌనంగా ఉండి సమయం కోసం వేచి చూడాలి అందుకు అందుకు వేమన చెప్పిన పద్యం చూడండి చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు బలిమి లేని వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా టైం బాలేనప్పుడు కుక్క కూడా సింహాన్ని హింసిస్తుంది.
(12:23) కాబట్టి బలం లేని సమయంలో పంతాలికి వెళ్ళకూడదు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీకు పట్టున్న రంగంలో కాకుండా సంబంధం లేని చోట అనవసరంగా తలదూర్చితే నీకంటే తక్కువ వాళ్ళ చేతిలో కూడా చులకనైపోతావు అని చెప్పే వేమన పద్యం చూడండి నీళ్లలోన మొసలి నిగిటి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమా మొసలి నీళ్లలో ఉన్నప్పుడు ఏనుగునైనా పట్టుకుంటుంది.
(13:02) కానీ బయటకు వస్తే కుక్క చేత కూడా భంగపాటు చెందుతుంది. అది స్థాన బలం అవుతుంది కానీ తన బలం కాదు కాబట్టి మన బలం ఉన్న ఫీల్డ్ లోనే మనం రాణించాలి. అంతేకానీ పక్కవాడిని చూసి అనవసరమైన రిస్క్ తీసుకోకూడదు. పది మంది అబద్ధాన్ని కూడా నిజమని ప్రచారం చేస్తే లోకం నమ్ముతుంది. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తూ వేమన చెప్పిన పద్యం చూడండి పదుగురాడు మాట పాటియై ధరచెల్లు ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకుండు వాని నూరెల్లనోపదు విశ్వదాభిరామ వినురవేమా పది మంది మాట చెల్లుబడి అవుతుంది. ఒక్కడు నిజం పలికినా
(13:47) సరే చెల్లుబాటు కాదు ఇంకా ఏం మాట్లాడకుండా ఊరకుండే వాడిని ఊరంతా కలిసి కూడా ఏమీ చేయలేదు కాబట్టి మెజారిటీ మాటే లోకంలో చెల్లుతుంది అని తెలుసుకోవాలి. చెడు సహవాసాల వల్ల కెరీర్ నాశనమయ్యే యూత్ గురించి వేమన ఏం చెప్పాడో తెలుసా వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా వేరుపురుగు వృక్షాన్ని చెరుస్తుంది చీడ చెట్టుని చెరుస్తుంది.
(14:26) అలాగే నీచుడి సావాసం గుణవంతుడిని చెరుస్తుంది. ఇంకా నాలుగవ విభాగము కుటుంబము మరియు బంధాలు బంధుత్వం పేరు ఒకటే కానీ లోపల లెక్కలు వేరే అని తెలియజేసే పద్యాలు బంధుత్వాలు నేడు కేవలం స్వార్థం మీద ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పే పచ్చి నిజం ఈ వేమన పద్యం ఆలివంకవారల ఆత్మబంధువులైరి తల్లి వంకవారు తగినపాటి తండ్రి వంక వారు దాయాదులైరయా విశ్వదాభిరామ వినురవేమా మగవాళ్ళకి పెళ్లియన తర్వాత భార్య వైపు వారు ఆత్మీయులు అవుతారు తల్లి వైపు వారు
(15:12) అంతంత మాత్రంగా ఉంటారు ఇంకా తండ్రి వైపు వాళ్ళయతే పగవాళ్ళ అవుతారు అంటే శత్రువులు అవుతారన్నమాట కుటుంబంలో ఒక్క గుణవంతుడు ఉంటే ఆ కుటుంబమే గంధపు వనంలా మారుతుంది అని చెప్పే వేమన పద్యం కులములోనొకడు గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము వలన వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా గంధపు చెట్టు వల్ల అది ఉన్న వనం అంతా ప్రకాశించినట్లు ఒక్క గుణవంతుడి వల్ల అతని కులం అంతా కూడా ప్రకాశిస్తుంది.
(15:55) అంటే ఒక్క సద్గుణవంతుడు వంశానికి కీర్తి తెస్తాడు. అన్నీ ఇచ్చి పెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసే నేటి పరిస్థితి గురించి వేమన చెప్పిన పద్యం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా పుట్టలోని చెదలు పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి.
(16:30) అదేవిధంగా కనీ పెంచిన తల్లిదండ్రుల మీద కనికరం లేని కొడుకు పుట్టి లాభం లేదు చచ్చినా కూడా నష్టం లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ విజయం వ్యర్థం అని వేమన చెప్పిన పద్యం చూడండి. సుగుణవంతురాలు సుదతియై ుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమా భార్య సుగుణవంతురాలై బిడ్డలు బుద్ధిమంతులై ఉంటే సంసారికి స్వర్గం అవసరం లేదు ఇంటి ఇల్లాలు సంతానము బాగుంటే అదే స్వర్గం అవుతుంది.
(17:19) చూశారు కదా ఈ 25 పద్యాలు నేటి మన సమాజానికి ఎంత దగ్గరగా ఉన్నాయో మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి ముసుగు మనుషులు ఎదురయ్యారా మీ అనుభవం ఏంటో కింద కామెంట్ చేయండి. ఎంతమందికి ఇలా జరిగిందో చూద్దాము. మనుషులను గుర్తుపట్టడంలో వేమన గారి ఈ సూత్రాలు మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. వచ్చే వీడియోలో సంపాదన అప్పుల బాధ మరియు డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది అనే అంశాల పైన మరికొన్ని వేమన పద్యాలను చూద్దాము.
(17:58) ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.

No comments:

Post a Comment