పరాయి వాడి భార్యతో సరసాలాడే వాడి గురించి వేమన పద్యాలు|| Vemana Padyalu with bhavam
Author Name:The nagraj show
Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow
Youtube Video URL:https://www.youtube.com/watch?v=owQVKY1QtuM
Transcript:
(00:01) [సంగీతం] నమస్కారం దినాగరాశ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. వేమన గారు అక్రమ సంబంధాలు స్త్రీలు స్త్రీల పైన వ్యామోహము ఇలాంటి విషయాలపైన ఎన్నో అద్భుతమైన పద్యాలు రాశారు. ఆ పద్యాల్లోంచి అందరికీ ఉపయోగపడే విధంగా నేటి దేశకాలమాన పరిస్థితులకు సరిగ్గా సరిపోలేటటువంటి అద్భుతమైన ఒక మూడు పద్యాలు నాకు లభించాయి.
(00:31) వాటిని అర్థతాత్పర్యం భావం కూలంకశంగా నేడు మనం చర్చించుకుందాం. ఇంగలంబు తోడ నిల సలుపుతోడను పరును యాలి తోడ పతితుడ సరసమాడుటెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినురవేమ ఇంగలంబు తోడ నిలసలుపు తోడను పరును యాలి తోడ పతితు తోడ సరసమాడుటెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినురవేమా ఇంగళంబు తోడ నిప్పు కనికతో నిప్పుతో సరదాగా ఆడుకోవడం ఇల సలుపుతోడను భూమిపై కపటముగా ప్రవర్తించే వాడితో మోసగాడితో [సంగీతం] దుష్టుడితో
(01:15) పరునియాలితోడ ఇతరుని భార్యతో పతితుతోడ నీచమైన నడవడిక గలవాడితో పాపాత్ముడితో చెడిపోయిన వాడితో సరసమాడుటెల్ల పరిహాసములాడుట స్నేహంగా తిరగడం చనువుగా మెలగడం చావుకు మూలము మరణానికి కారణం నాశనానికి హేతువు ఓ విశ్వాన్ని ప్రేమించే అభిరామ వినుము అని వేమన చెబుతున్నాడు. ఓ వేమ నిప్పుకనికతో ఆడుకోవడం భూమిమీద మోసపూరితంగా ప్రవర్తించే దుష్టుడితో సహవాసం చేయడం ఇతరుల భార్యతో చనువుగా ఉండటం నీచమైన పనులు చేసే పతితులతో స్నేహం చేయడం
(02:03) ఇవన్నీ ప్రాణాంతకమైనవి నాశనానికి దారి తీస్తాయి. ఇలాంటి వారితో సరదాగా మెలగడం చావును కొని తెచ్చుకోవడమే ఈ పద్యంలో వేమన మానవులకు కొన్ని ప్రమాదకరమైన సహవాసాల గురించి హెచ్చరిస్తున్నాడు. జీవితంలో కొన్ని విషయాలకు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండడం ఎంత అవసరమో నొక్కి చెబుతున్నాడు. ఇంగరంబు తోడా అంటాడు నిప్పు కనికతో నిప్పుతో చెలగాటం ఆడితే ప్రాణాలకే ప్రమాదం అది చూడటానికి చిన్న కనికలా ఉన్నా దానితో సరదాగా ఆడుకుంటే అది తీవ్రమైన గాయాలను లేదా మరణాన్ని కలిగిస్తుంది.
(02:48) ఇది భౌతికమైన స్పష్టంగా కనిపించే ప్రమాదాన్ని సూచిస్తుంది. తెలిసి తెలిసి ప్రమాదంలోకి వెళ్ళకూడదని దీని అర్థం. ఇలా సలుపుతోడం మోసగాడితో మోసపూరితమైన స్వభావం గల వ్యక్తితో స్నేహం చేయడం కూడా ప్రమాదకరమే అలాంటివారు బయటకు స్నేహితుల్లా నటించినా సమయం చూసి వెన్నుపోటు పడుస్తారు. వారి వల్ల నమ్మక ద్రోహం ఆర్థిక నష్టం లేదా ఇతర కష్టాలు ఎదురవుతాయి.
(03:17) వీరితో సాంగత్యం మనశశాంతిని హరించి జీవితాన్ని నాశనం చేస్తుంది. పరుని యాలితోడ పరాయి స్త్రీతో ఇతరుని భార్యతో అనుచితంగా ప్రవర్తించడం చనువుగా మెలగడం నైతికంగా చాలా తప్పు ఇది కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది. సమాజంలో గౌరవాన్ని పోగొడుతుంది. శత్రుత్వాలకు గొడవలకు కొన్నిసార్లు ప్రాణాంతక దాడులకు దారితీస్తుంది.
(03:44) నేడు పత్రికలలో అనేక చోట్ల జరిగినటువంటి ఇలాంటి విపరీతమైనటువంటి సంఘటనలు ప్రాణాల మీదకి వచ్చినటువంటి సంఘటనలు మనం ఎన్నో పత్రికల్లో చదువుతున్నాం. ఇది సామాజిక నైతిక పతనానికి గుర్తు పతితుతోడ అంటే నీచునితో పాపాత్మునితో చెడు నడవడిక నీచ స్వభావం కలవారితో స్నేహం చేయడం వల్ల వారి చెడు గుణాలు మనకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. ముల్లపొద దగ్గర బట్టలు ఆరేస్తే చిరిగిపోతాయి.
(04:15) అట్లా దుర్మార్గులతో సహవాసం మనల్ని కూడా దుర్మార్గపు మార్గంలోకి లాగుతుంది. ఇది నైతిక పతనానికి చివరికి వినాశనానికి కారణం అవుతుంది. సరసమాడుటెల్ల చావుకు మూలం వేమన కేవలం వారితో తీవ్రమైన సంబంధాలనే కాదు కనీసం వారితో సరసమాడటం అంటే చానువుగా స్నేహంగా సరదాగా మెలగడం కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాడు చిన్నపాటి చనువు కూడా చివరికి పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని ఆయన భావం.
(04:52) చావుకు మూలము అనడంలో ఆయా పనుల వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను శారీరక మరణం లేదా గౌరవం, సంపద, నైతికత ఇలాంటి వాటి నాశనాన్ని సూచిస్తున్నాడు. ఈ పద్యం ద్వారా వేమన మానవులు తమ జీవితంలో ఎవరెవరితో స్నేహం చేయాలో ఎవరికీ దూరంగా ఉండాలో తెలుసుకొని మెలగాలని ప్రమాదకరమైన వ్యక్తులతో లేదా విషయాలతో ఏమాత్రం చనువు పనికి రాదని అలా చేయడం వినాశనానికి దారి తీస్తుందని గట్టిగా హెచ్చరిస్తున్నాడు.
(05:24) ఇది జీవితానికి ఎంతో విలువైన నీతి సూత్రం. ఇంచుకంతయోని కెసగడి జనములు కంచముకడ పిల్లి కాచినట్లు పంచభానునింట బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ ఇంచుకంతయోని కెసగెడు జనములు కంచము కడప పిల్లి కాచినట్టు పంచబానునింట బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ ఇంచుకంతా కొంచెమంతా చిన్నదైన యోనికి స్త్రీ జననేంద్రియ కొరకు ఎసగెడు ఆశగా ఎదురుచూసేవాడు ఆతురత పడుతూ ఉండేవాడు జనములు ఇక్కడ ప్రజలు పురుషులు అని అర్థం
(06:11) కంచముకడ అన్నంపల్లెం దగ్గర కాచినట్లు ఓపికగా ఆశగా వేచి చూసి ఉన్నట్లు పంచభానుంట పంచభానుడు అంటే మన్మధుడు కామదేవుడు అతని ఇంట అంటే అతని ఇంట్లో అతని ఆధీనంలో బానిసకుడు కొడుకులు బానిసలు, దాసులు ఇక్కడ కొడుకులు అనేది వ్యక్తులు అనే అర్థంలో వాడబడింది. ఓ విశ్వాన్ని ప్రేమించే అభిరామ వినుమో అని వేమనగారు విశ్వదాభిరామ వినరవేమ అంటున్నారు.
(06:47) ఓ వేమ పురుషులు చిన్నదైన స్త్రీ యోని కోసం అన్నం పల్లెం దగ్గర పిల్లి ఆశగా ఎదురుచూసినట్లు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారు కామదేవుడైన మన్మధుడికి బానిసల వంటివారు అని తెలుసుకో ఈ పద్యంలో వేమన మానవులలో ముఖ్యంగా పురుషులలో ఉండేటటువంటి తీవ్రమైన కామవాంచ లైంగిక కోరిక గురించి అది వారిని ఎలా నియంత్రిస్తుందో సూటిగా కొంత కఠినంగా విమర్శిస్తున్నాడు.
(07:19) తీవ్రమైన కోరిక ఇంచుకంతయోని చిన్నదైన యోని అనే పదాన్ని వాడి ఆ చిన్న అవయవం కోసం పురుషులు ఎంతగా ఎసగెడు ఆశతో ఎదురుచూస్తున్నారో అని చెప్పడం ద్వారా ఆ కోరిక తీవ్రతను అది మనిషిని ఎంతగా ఆవహిస్తుందో మేమన ఎత్తి చూపుతున్నాడు. ఆ వస్తువు చిన్నదైనా దానిపై మోజు మాత్రం విపరీతంగా ఉంటుందని చెబుతున్నాడు. పిల్లిని ఉపమానంగా చూపెడుతున్నాడు.
(07:49) కంచము కడ పిల్లి కాచినట్లు అనే పోలిక చాలా శక్తివంతమైనది. ఆకలితో ఉన్న పిల్లి ఆహారం కోసం ఎంత ఏకాగ్రతతో ఓపికతో ఆశగా ఎదురుచూస్తుందో అలాగే పురుషులు లైంగిక సుఖం కోసం ఆతృత పడతారని వేమన పోలుస్తున్నాడు. ఇది కేవలం కోరిక తీవ్రతనే కాకుండా ఆ సమయంలో మిగతా విషయాలను పక్కన పెట్టి కేవలం ఆ కోరిక తీర్చుకోవడం పైనే దృష్టి పెట్టే మానవ స్వభావాన్ని కూడా సూచిస్తుంది.
(08:24) ఆకలి తీర్చుకోవడం పైనే పిల్లి దృష్టి ఉన్నట్లు కామం తీర్చుకోవడం పైనే వీరు దృష్టి నిలుపుతారని భావం. ఇది ఒక విధంగా ఆశతో ఎదురుచూసే బలహీనతను కూడా సూచిస్తుంది. మన్మధుడికి బానిసలు పంచభానునింట బానిస కొడుకులు అనే చివరి వాక్యం ఈ పద్యానికి కీలకం. కామదేవుడైన మన్మధుడి బాణాలకు కోరికలకు లొంగిపోయి కేవలం లైంగిక సుఖం కోసమే ఆరాటపడేవారు స్వతంత్రులు కారని వారు తమ ఇంద్రియాలకు కోరికలకు బానిసలని వేమన నిక్కచ్చిగా చెబుతున్నారు.
(09:06) కామం వారి విచక్షణను ఆత్మ నిగ్రహాన్ని ఉన్నతమైన ఆలోచనలను కప్పేసి వారిని కేవలం శారీరక వాంఛలకు దాసులను చేస్తుందని అతని ఉద్దేశం ఈ పద్యం ద్వారా పురుషులు తమ లైంగిక వాంఛల ఆధీనంలోకి వెళ్లి వాటి కోసం నిరంతరం ఆరాటపడటాన్ని వేమన విమర్శిస్తున్నాడు. అలాంటి వారు మన్మధుడికి బానిసల వంటివారని తమ స్వేచ్ఛను గౌరవాన్ని కోల్పోయి కేవలం కోరికల చుట్టూ తిరుగుతారని సూటిగా బలమైన ఉపమానంతో వివరిస్తున్నాడు.
(09:42) ఇది అదుపులేని కామవాంఛంచపై ఒక హెచ్చరిక. మరియు ఆత్మ నిగ్రహం యొక్క ఆవశ్యకతను గుర్తుచేసే ప్రయత్నం. ఇంటి ఆలు విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు పంటచేను విడిచి పరిగ ఏరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ ఇంటియాలు విడిచి ఇలజార కాంతల వెంట తెరుగువాడు వెర్రివాడు పంటచేను విడిచి పరిగ ఏరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ ఇంటి ఆలు భార్య ఇల్లాలు విడిచి వదిలిపెట్టి ఇలా భూమిపై ఈ లోకంలో జారకాంతులు వేష్యలు చెడు నడవడిక గల స్త్రీలు వెంట తిరుగువాడు
(10:29) వెంబడించేవాడు వారి సాంగత్యం కోరుకునేవాడు వెర్రివాడు మూర్ఖుడు బుద్ధిహీనుడు పంటచేను పంట పండినటువంటి పొలం సారవంతమైన భూమి పరిగా ఒక రకమైన పనికి మారిన గడ్డి లేదా కలుపు మొక్క ఇది ధాన్యం వలె కనిపించిన దానిలో సాార ఉండదు ఉపయోగపడదు ఏరినయట్లు ఏరుకున్నట్లు సేకరించుకున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమన తన పద్యాల చివర ఉపయోగించే మకుటం విశ్వదాభిరామ అంటే విశ్వాన్ని ప్రేమించేవాడు లేదా విశ్వానికి ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం కావచ్చు.
(11:12) అయితే ఇక్కడ వేమన తనను తాను సంబోధించుకుంటూ లేదా తన అంతరాత్మను ఉద్దేశిస్తూ చెప్పేదిగా భావించవచ్చు. వినురవేమ అంటే ఓ వేమా వినుము అని అర్థం. పద్యంలో చెప్పిన నీతిని వినమని తనను లేదా లోకాన్ని కోరుతున్నట్లుగా మనం భావించాలి. ఈ పద్యంలో వేమన సమాజంలోని ఒక దుర్లక్షణం గురించి మరియు దాని పర్యవసానం గురించి స్పష్టంగా విమర్శిస్తున్నాడు.
(11:44) పద్యం యొక్క భావం ఈ రకంగా ఉంది. ఇంటి ఆలు విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు ఈ పాదాలలో భార్యను నిర్లక్ష్యం చేసి సమాజంలో చెడు మార్గంలో నడిచే స్త్రీల వెంట తిరిగే వ్యక్తిని మూర్ఖుడిగా అభివర్ణించాడు. భార్య అనేది కుటుంబ వ్యవస్థకు మూలాధారం. ఆమె ఇంటిని చక్కదిద్దుతుంది. కష్ట సుఖాలలో తోడుగా ఉంటుంది.
(12:15) ధర్మబద్ధమైనటువంటి జీవితానికి సహకరిస్తుంది. అలాంటి ఉత్తమమైన తనకంటూ ఉన్న భార్యను వదిలిపెట్టి కేవలం క్షణికానందాల కోసం తాత్కాలిక ఆకర్షణల కోసం చారకాంతల వెంట పరుగులు తీయడం అనేది అవివేకం. ఇది తన జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకోవడమే అవుతుంది. అలాంటి పని చేసేవాడికి మంచి చెడుల విచక్షణ ఉండదు కాబట్టే అతడిని వెర్రివాడు అని వేమన సూటిగా విమర్శిస్తున్నాడు.
(12:49) పంటచే విడిచి పరిగేరినయట్లు విశ్వదాభిరామ వినిరవేమ. ఈ పాదాలలో వేమన తన మొదటి రెండు పాదాలలో చెప్పిన విషయాన్ని ఒక చక్కటి ఉపమానం పోలిక ద్వారా వివరిస్తాడు. పంట చేను అనేది చాలా విలువైనది. దాన్ని రైతులు కష్టపడి సాగు చేస్తారు. అది వారికి ఆహారాన్ని సంపదను అందిస్తుంది. అలాంటి సారవంతమైన ఫలవంతమైన పంట చేనును వదిలిపెట్టి దాని పక్కన పనికిమాలిన కల్ప మొక్కైన పరిగ నేనేరుకోవడం ఎంత అవివేకమో అదేవిధంగా తమ ఇంటి వద్ద ఉన్న ఉత్తమ ఇల్లాలిని వదిలిపెట్టి జారకాంతల వెంట తిరగడం కూడా అంతే మూర్ఖత్వం.
(13:30) పంటచేను శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. అదేవిధంగా భార్య కూడా జీవితాంతం తోడుగా ఉండి కుటుంబాన్ని నిలబెడుతుంది. కానీ పరిగి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అది కేవలం కలుపు మొక్క మాత్రమే అదేవిధంగా జారకాంతల సాంగత్యం కూడా తాత్కాలికమే. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా అది అపకీర్తిని ధన నష్టాన్ని ఆరోగ్య సమస్యలను కుటుంబంలో అశాంతిని మాత్రమే తెస్తుంది.
(14:04) ఈ ఉపమానం ద్వారా వేమన భార్య యొక్క విలువను జారకాంతల సాంగత్యం యొక్క నిష్ప్రయోజకత్వాన్ని చాలా శక్తివంతంగా తెలియజేస్తాడు. తన సొంత కుటుంబాన్ని తన శ్రేయసును కోరుకోకుండా చెడు మార్గంలో నడిచేవాడు తనంతట తానుగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని ఈ పద్యం యొక్క అంతరార్థం. ఈ పద్యం ద్వారా వేమన మానవుని ప్రవర్తనలోని ఒక బలహీనతను ఎత్తిచూపుతూ దాని వల్ల కలిగే నష్టాన్ని కూడా తెలియజేస్తున్నాం.
(14:36) తన సొంత ఇంటిలో తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన భార్యను గౌరవించకుండా ఆమెను నిర్లక్ష్యం చేసి బయట తాత్కాలిక ఆకర్షణలకు లోనయ్యే వ్యక్తి తన వివేకాన్ని కోల్పోయిన మూర్ఖుడితో సమానం ఇది సరిగ్గా పంట పండి దిగుబడినిచ్చేను విడిచిపెట్టి ఎందుకు పనికిరాని కలుపు మొక్కలను ఏరుకోవడం వంటిది తన భార్యను ప్రేమగా గౌరవంగా చూసుకో నిజమైన గృహస్థ ధర్మం మరియు ఆనందకరమైన జీవితానికి మార్గం అనే నీతిని వేమన ఈ పద్యం ద్వారా లోకానికి బోధిస్తున్నాడు.
(15:17) ఇది కుటుంబ విలువల యొక్క ప్రాముఖ్యతను ధర్మబద్ధమైనటువంటి జీవితం యొక్క అవసరాన్ని తెలియజేసే అద్భుతమైన పద్యం. ఇలాంటి అద్భుతమైన మరిన్ని పద్యాలను సేకరించి వాటి తాత్పర్యం అర్థంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్ నీకి [సంగీతం] స్వాగతం దీజ్ఞసోకి స్వాగతం
No comments:
Post a Comment