😱 ఈ అనుభవాలు ఎంత మందికి వచ్చాయి..? మీకు ఇలా జరిగిందా..! ఇది చాలా సాధారణం 💠
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gXS3OuKWUS8
Transcript:
(00:03) [సంగీతం] హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా శక్తివంతమైన మరియు నిగూడమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే కుండలిని శక్తి గురించి. మీరు ధ్యానం చేస్తుంటే కొన్ని విచిత్రమైన అనుభవాలు వస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే పూర్తి వరకు చూడండి. శరీరంలో వైబ్రేషన్స్ అండ్ కరెంట్ లాంటి ఫీలింగ్ లేదా ఏదో దివ్యమైన ఆనందం.
(00:28) అయితే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాల్సిందే మీరు. ధ్యాన సాధనలో నిమగ్నమయ్యే ప్రతి వ్యక్తి ఒక దశలో ఒక ప్రశ్న అడుగుతాడు. నా లోపల ఏదో మార్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సందర్భాల్లో కుండలిని శక్తి మేల్కొలుపు వైపు తీసుకువెళ్తుంది. [సంగీతం] కుండలిని అనేది మన శరీరంలో నిద్రాణంగా ఉన్న ఒక దివ్యమైన శక్తి.
(00:51) యోగశాస్త్రాల ప్రకారం ఇది మూలాధార చక్రం వద్ద నిద్రిస్తున్న శక్తి. సాధన ప్రాణాయామం ధ్యానం ద్వారా ఈ శక్తి మేల్కొని సుషుమ్న నాడి ద్వారా పైకి ఎగసి సహస్రారాన్ని చేరుతుంది. ఈ ప్రయాణం సాధారణమైనది కాదు. ఇది మన చైతన్యాన్నే పూర్తిగా మార్చే ఆధ్యాత్మిక విప్లవం. ధ్యానంలో మీరు అనుభవించే కొన్ని అసాధారణమైన అనుభూతులు ఈ కుండలిని మేలుకొలుపులకు మొదటి సూచనలు అవ్వచ్చు.
(01:16) ఉదాహరణకు కళ్ళు మూసుకుంటే వెలుగులు కనిపించటం, దేవత రూపాలు దర్శనం ఇవ్వటం లేదా ఎవరూ లేకపోయినా లోపల శబ్దాలు వినిపించడం దీనిని యోగంలో అనాహత నాదం అని అంటారు. అలాగే ఎక్కడి నుండి వచ్చిందో తెలియని ఒక సువాసన లేదా దివ్యమైన రుచి అనుభవం కూడా కలగవచ్చు. ఇవన్నీ మన ఇంద్రియాల కంటే లోతైన స్థాయిలో జరిగే అనుభవాలు. కుండలిని మేలుకొలుపు సమయంలో శరీరంలో కూడా అనేకమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి.
(01:42) ముఖ్యంగా మూలధార ప్రాంతాల్లో ఒక కంబనం లేదా వేడి అనిపించవచ్చు. కొన్నిసార్లు శరీరం అంతా కరెంట్ షాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే వైబ్రేషన్స్ అని చెప్పాను కదా అలా వైబ్రేషన్స్ నరాలలో విద్యుత్ ప్రవహిస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. [సంగీతం] ఇది భయంకరంగా అనిపించవచ్చు కానీ ఇది సహజమైన ప్రాణాశక్తి ప్రవాహం ఇంకా రోమాలు నిక్కబడుచుకోవటం శరీరం స్వయంగా కదలటం వంటి అనుభవాలు కూడా కలగవచ్చు.
(02:06) కొంతమందికి యోగాసనాలు లేదా బంధాలు స్వయంగా జరుగుతాయి. ఉదాహరణకు మూలబంధం, ఉద్యాన బంధం లేదా జలంధర బంధం ఎలాంటి ప్రయత్నం లేకుండా జరుగుతుంటే అది కుమిలని శక్తి యాక్టివ్ అయిన సంకేతంగా భావించవచ్చు. ఈ ప్రక్రియను క్రియలు అని కూడా అంటారు. శరీరం దానంతట తాను యోగ సాధన చేయడం ప్రారంభిస్తుంది. శ్వాసలో కూడా గణనీయమైన మార్పులు వస్తాయి. ఒక దశలో మీరు గమనించవచ్చు.
(02:30) మీరు శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలియకుండానే ఈ స్థితిని అనుభవిస్తూ ఉంటారు. దీనిని కేవల కుంభకం అని పిలవబడుతుంది. ఇలాంటి ప్రయత్నం లేకుండా శ్వాస ఆగిపోవటం కానీ లోపల ప్రశాంతత ఆనందం ఉండటం. ఇది చాలా ఉన్నత స్థాయి అనుభవం ఈ సమయంలో భయపడకూడదు. ఇది [సంగీతం] శరీరం మరియు మనసు పూర్తిగా సమన్వయంలో ఉన్న సంకేతం. కుండలిని మేల్కొల్పు వల్ల మనసులో గొప్ప మార్పులు వస్తాయి.
(02:53) సాధారణంగా మనం అనేకమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటాం. కానీ ఈ శక్తి మేల్కొన్నప్పుడు ఆలోచనలు తగ్గుతాయి లేదా పూర్తిగా [సంగీతం] ఆగిపోతాయి. మనసు ప్రశాంతంగా స్థిరంగా మారుతుంది. కొన్నిసార్లు ఓం అనే నాదం కూడా మన లోపలే స్వయంగా జపించబడుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మనసు అంతర్ముఖంగా మారుతున్న సంకేతం. ఈ దశలో వ్యక్తి లోక విషయాలపై ఆసక్తి కోల్పోతాడు.
(03:16) ఇంతకుముందు ముఖ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు అంతగా అనిపించవు. మనసు లోపలికి మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇది ఒక రకమైన వైరాగ్యం కాదు ఇది ఉన్నతమైన చైతన్యానికి సంకేతం కుండల్ని మేలుకొలుపు వల్ల జ్ఞానం కూడా విస్తరిస్తుంది. మీరు చదివిన శాస్త్రాలు వేదాలు లేదా ఆధ్యాత్మిక గ్రంథాల అర్థం అకస్మాత్గా స్పష్టంగా అర్థమవుతుంది.
(03:39) ప్రకృతి రహస్యాలు అర్థమవుతాయి. చాలా రోజులుగా ఉన్న సందేహాలు ఒక్కసారిగా తొలగిపోతాయి. దీనినే అంతర్దృష్టి అంటారు ఇన్సైట్. శరీర స్థాయిలో కూడా మీరు మార్పులను గమనిస్తారు. శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. అలసట తగ్గిపోతుంది. చాలా పని చేసినా కూడా శక్తి తగ్గదు. ఇది ప్రాణశక్తి బ్యాలెన్స్ [సంగీతం] అవుతుందని సూచన. కొంతమందికి ధ్యాన సమయంలో శరీరం గాలిలో తేలుతున్నట్టు అనిపించవచ్చు.
(04:04) భావోద్వేగ స్థాయిలో ఒక అపూర్వమైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. దీనినే దివ్యానందం అంటారు. ఇది సాధారణ సంతోషం కాదు. ఇది కారణం లేకుండా వచ్చే ఆనందం. ఈ స్థితిలో వ్యక్తి కవిత్వం రాయడం, గీతాలు పాడడం లేదా లోతైన ఆలోచనలు చెప్పడం ప్రారంభిస్తాడు. మనిషి సృజనాత్మకత పెరుగుతుంది. కొంతమందికి మాట్లాడే శక్తి పెరుగుతుంది. వారు మాట్లాడితే ఇతరులపై ప్రభావం పడుతుంది.
(04:26) ఇది అంతర్గత శక్తి బయటకు వ్యక్తమవుతున్న సంకేతం. ఈ దశలో వ్యక్తి ఇతరులకు ప్రేరణగా మారవచ్చు. అయితే కుండలిని మేల్కొలుపు అనేది చాలా శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఒక అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శనం చాలా ముఖ్యం స్వయంగా ప్రయత్నించడం లేదా బలవంతంగా శక్తిని మేలుకొరపడానికి ప్రయత్నించడం ప్రమాదకరం కావచ్చు ధ్యాన సమయంలో వచ్చే ప్రతి అనుభవాన్ని కుండలిని అని భావించడం కూడా తప్పు కొన్నిసార్లు మానసిక ప్రతిచర్యలు కూడా ఉంటాయి.
(04:55) అందువల్ల స్థిరంగా సాధన చేయడం శరీరాన్ని మరియు మనసుని సమతుల్యంగా ఉంచడం చాలా అవసరం. అంటే మైండ్ ని బాడీని బాలెన్స్ చేయడం చాలా ముఖ్యమని. ముఖ్యంగా భయం వద్దు. కుండలిని శక్తి మనలో ఉన్న దైవశక్తి అది మనకు హాని చేయడానికి కాదు మనను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి కాబట్టి ఎలాంటి అనుభవం వచ్చినా శాంతంగా జాగ్రత్తగా గమనించండి. [సంగీతం] చివరిగా ఒక్క మాట కుండలిని మేలుకొలుపు అనేది అనుభవాల కోసం కాదు ఇది ఆత్మ సాక్షాత్కారం కోసం మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఈ మార్గంలో శ్రద్ధ భక్తి సహనం ఉంటే ప్రతి ఒక్కరు ఈ దివ్య అనుభవాన్ని పొందగలరు. మరి వచ్చే
(05:30) వీడియోలో మరొక టాపిక్ తో కలుసుకుందాం. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తా అంటే ప్రతి కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం.
(05:52) మీరు కామెంట్ లో పెట్టండి సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చాలా మంది మన వీడియోస్ లో చూసేవాళ్ళు 90% వరకి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటది మోటివేషన్ లా ఉంటది. మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది.
(06:10) తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ రుద్రాపత్రి యే వృక్షేషు సస్తించరాలగ్రీవాభావిరోహితాః యే భూతానామధిపతయో విశిసగవర్తినః యహసహైగవాంజం [సంగీతం] ప్రజయామిసహైగవాంజం [సంగీతం] బ్రజయానియసహైవం ప్రవజంయ [సంగీతం]
No comments:
Post a Comment