Wednesday, April 8, 2026

విపరీతంగా శృంగార వాంఛ ఉన్న వారి గురించి వేమన పద్యం విశ్లేషణ ||vemana padyalu with bhavam

విపరీతంగా శృంగార వాంఛ ఉన్న వారి గురించి వేమన పద్యం విశ్లేషణ ||vemana padyalu with bhavam

Author Name:The nagraj show

Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=efxryL4xPtE



Transcript:
(00:00) వేమల పద్యాలని మనం వినడము అంటే అర్థంలో మన ముఖాన్నే మనం స్పష్టంగా చూసుకున్నట్టు లెక్క కాలు కాలుం గూడి గంటు గంటును గూడి తోలు తోలు గూడి దొమ్ములాడి జిడ్డు జిడ్డు గూడి జీవంబులాయరా విశ్వదాభిరామ వినురవేమ కాలు కాలుంగూడి గంటు గంటును గూడి తోలు తోలు గూడి దొమ్ములాడి జిడ్డు జిడ్డు డుగూడి జీవంబులాయరా విశ్వదాభిరామ వినురవేమ వేమల పద్య భావాన్ని అందులోని లోతైన తాత్వికతని అర్థాన్ని తెలుసుకోబోయే ముందు యయాతికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథను ముందుగా విందాం. ఈ కథ పూర్తిగా
(00:47) వినండి ఎందుకంటే ఈ కథలోని ఆంతర్యం వేమన పద్యంలోని ఆంతర్యం అద్భుతంగా పోల్తాయి. ఇవి మన జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి. తప్పకుండా చివరివరకు వినండి మహాభారతంలోని ఆదిపర్వంలోనూ భాగవతంలోనూ కనిపించే యయాతి మహారాజు కథ కేవలం ఒక రాజు చరిత్ర మాత్రమే కాదు అది మానవ నైజానికి కోరికల అంతులేని స్వభావానికి ఒక గొప్ప అద్దం వేమన చెప్పిన దేహ భ్రాంతి అనే అంశాన్ని ఈ కథ అక్షరాల నిరూపిస్తుంది.
(01:24) యయాతి కథను సంపూర్ణంగా తెలుసుకుందాం. యయాతి చంద్రవంశపు చక్రవర్తి అతనికి ఇద్దరు భార్యలు ఒకరు దేవయాని ఇంకొకరు శర్మిష్ట దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమార్తె శర్మిష్ట అసుర రాజైన వృష పరువుని కుమార్తె మొదట ఈమె దేవయానికి దాసిగా యయాతి వద్దకు వస్తుంది. దేవయాని వల్ల యయాతికి యదువు తురస్వుడు అనే కుమారులు కలుగుతారు. అయితే యయాతి శర్మిష్టను రహస్యంగా వివాహం చేసుకొని ఆమె వల్ల దృహ్యుడు అనువు పూరుడు అనే ముగ్గురు కుమారులను పొందుతాడు.
(02:01) ఈ విషయం తెలుసుకున్న దేవయాని ఆగ్రహంతో తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. తన కుమార్తెకి జరిగిన అన్యాయానికి ఆగ్రహించిన శుక్రాచార్యుడు యయాతిని క్షణకాలంలో ముసలివాడవు అవుతావు అని శేపించేస్తాడు. ఒక్కసారిగా యవ్వనంలో ఉండాల్సిన యయాతి వడలిపోయిన చర్మం తోటి వనికే కాళ్ళతోటి ముసలివాడిగా మారిపోతాడు. అయితే యయాతి తన తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని వేడుకుంటాడు.
(02:33) శుక్రాచార్యుడు శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేక ఒక వెసులుబాటు కల్పిస్తాడు. నీ ముసలితనాన్ని ఎవరికైనా ఇచ్చి వారి యవ్వనాన్ని నీవు తీసుకోగలిగితే నువ్వు మళ్ళీ యవ్వనవంతుడు అవుతావు అని చెప్తాడు. యవ్వనం పట్ల విపరీతమైనటువంటి వ్యామోహంతో ఉన్న యయాతి తన కుమారులను పిలిచి తన ముసలితనాన్ని తీసుకోమని బతిమలాడతాడు. మొదటి నలుగురు కుమారులు యదువు దుర్వసుడు దృహ్యుడు అనువు తమ యవ్వనాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తారు.
(03:07) ముసలితనం వల్ల వచ్చే కష్టాలను తాము భరించలేమని చెబుతారు. చివరివాడైన పూరుడు మాత్రం తండ్రిపై ఉన్న భక్తితోటి నాన్న నీ కోరిక తీర్చుకో నా యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ ముసలితనాన్ని నేను తీసుకుంటాను. ఊరుని యవ్వనాన్ని తీసుకున్న యయాతి వేల సంవత్సరాల పాటు భోగ విలాసాలతోటి మునిగి తేల్తాడు. వేమన గారు చెప్పినట్లు తోలు తోలుగూడి దొమ్ములాడి అనే చందంగా శారీరక సుఖాల కోసం ఎంత ప్రయత్నించినా అతనికి తృప్తి కలగదు.
(03:41) అనుభవించే కొద్ది కోరికలు పెరుగుతూనే ఉంటాయి. అవి తగ్గనే తగ్గవు. చివరికి ఒకరోజు యయాతికి ఒక గొప్ప సత్యం బోధపడుతుంది. కోరికలు అనేవి అగ్ని లాంటివి అగ్నిలో నెయ్యి పోసే కొద్దీ అది ఇంకా ప్రజ్వలిలుతుంది మండుతుంది అంతేకానీ చల్లారదు. తన తప్పు తెలుసుకున్న యయాతి ఇట్లా అంటాడు. భోగాలను అనుభవించడం వల్ల కోరికలు శాంతించవు.
(04:08) నెయ్యి పోస్తే అగ్ని పెరిగినట్లు అవి పెరుగుతూనే ఉంటాయి. వెంటనే యయాతి తన యవ్వనాన్ని ఊరుడికి తిరిగి ఇచ్చేసి అతని ముసలితనాన్ని అతను తీసేసుకుంటాడు. ఊరుడికి రాజ్యాభిషేకం చేసి తను వానప్రస్థానికి వెళ్లి తపస్సు చేసుకుంటాడు. ఇక్కడ మనము కథను నిలిపి వేసి వేమన గారి పద్యంలోని తాత్పర్యాన్ని తెలుసుకుందాం. కాలు కాలుం గూడి గంటు గంటును గూడి తోలు తోలు గూడి దొమ్ములాడి జిడ్డు జిడ్డు గూడి జీవంబులాయరా విశ్వదాభిరామ వినరవేమా సృష్టి రహస్యం వేమన చెప్పిన జీవ పాఠం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన అందం తన బలం తన హోదాను చూసుకొని చాలా గర్వపడేవాడు నేను గొప్పవాడిని నా శరీరం
(04:52) వజ్ర సమానం అని విర్రవీగేవాడు. అది చూసిన ఒక యోగి నవ్వి అసలు ఈ శరీరం ఎలా తయారైందో దీని పుట్టుక వెనక ఉన్నటువంటి ముడిసరుకు ఏంటో వివరించడం మొదలు పెట్టాడు. మనిషి పుట్టుక అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. అది ప్రకృతిలోని రెండు శరీరాల కలయిక. కాళ్ళు కాళ్ళతో కీళ్లు కీళ్లతో పెనవేసుకొని అస్తి పంజరాల కలయికతో ఒక భౌతిక ప్రక్రియ మొదలవుతుంది.
(05:25) ఇక్కడ గంటు అంటే శరీరంలోని కీళ్లు లేదా సంధులు అని అర్థం తోలు తోలుంగూడియే అన్నాడు వేమన మనం పైన చూసే రంగు రూపం అంతా కేవలం తోలు చర్మం మాత్రమే ఈ చర్మం మరొక చర్మంతో కలిసినప్పుడు అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగే శారీరక సంపర్కం అంటే దొమ్ములాట అన్నాడు వేమన ఇక్కడ సంభోగం లేదా ఘర్షణ అనే అర్థంతోటి దీన్ని మనం తీసుకోవాలి. స్త్రీ పురుషుల మధ్య జరిగే శారీరక సంపర్కం ద్వారా సృష్టికి పునాది పడుతుంది.
(06:01) మనిషి ఎంత అందగాడైనా ఎంతటి బలవంతుడైనా అతని మూలం ఈ చర్మపు కలేకే అని వేమన మనకు గుర్తు చేస్తున్నారు. జిడ్డు నుంచి జీవం జిడ్డు జిడ్డుంగూడి అన్నాడు వేమన. అంతిమంగా జీవం ఎలా పోసుకుంటుంది? శరీరంలోని సప్త ధాతువుల సారం ఆ జిడ్డు శుక్ల శోనితాలు లేదా జీవకణాలు అవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మాత్రమే ఒక ప్రాణి ప్రాణం పోసుకుంటుంది. ఆ జిడ్డు పదార్థమే రేపు పెరిగి పెద్దదై ఒక మనిషిగా అహంకారంతో నిండిన రూపంగా తయారవుతుంది.
(06:37) ఈ మానవ శరీరం అనేది కేవలం కాళ్ళు కీళ్లు చర్మం మరియు జిడ్డు పదార్థాల కలయిక వల్ల ఏర్పడిన ఒక భౌతిక నిర్మాణం మాత్రమే. ఈ అశాశ్వతమైన అసహ్యకరమైన పదార్థాలతో తయారైన శరీరాన్ని చూసుకొని మనిషి ఎందుకు అంతలా గర్వపడతాడు వేమనా ఈ పద్యం ద్వారా మనకు దేహ భ్రాంతిని వదలమని చెబుతున్నారు. మనం పైన చూసే అందం వెనుక ఉన్నది కేవలం మాంసం, రక్తం, చర్మం మాత్రమేనని ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడని ఆయన ఉద్దేశం.
(07:15) వేమన శైలి ఎప్పుడు కఠినంగా ఉన్నా గాని ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవాల్ని మొహం మీద కొట్టినట్టు చెప్పడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు మనం ఏయాటి కథ ముందు విన్నాం కదా వేమన పద్య భావాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం కదా వీటి రెండింటి మధ్య సారూప్యతను తెలుసుకుందాం. ఇవి మన జీవితానికి తప్పకుండా అవసరమయ్యేటటువంటి విషయాలు కాబట్టి చివరిదాకా వింటారని హృదయపూర్వక విన్నపం.
(07:44) యయాతి తన భార్య దేవయాని శాపం వల్ల అకాల వృద్ధాప్యాన్ని పొందుతాడు కానీ అతనికి శారీరక సుఖాల పట్ల వ్యామోహం తీరదు. తన వృద్ధాప్యాన్ని ఇచ్చి తమ కుమారుడైన పూరుని యవ్వనాన్ని అప్పుగా తీసుకుంటాడు. వేల ఏళ్ల పాటు శారీరక సుఖాలను అనుభవించిన తర్వాత అతనికి ఒక సత్యం బోధపడుతుంది. కాలు కాలుంగూడి అన్నాడు వేమన. వేమడ పద్యంలో శరీరం అంటే కేవలం ఎముకలు కీళ్ల కలయక అని చెప్పినట్లుగానే యయాతి వేల ఏళ్ల పాటు ఆ శారీరక క్రియల్లో మునిగిపోయాడు.
(08:17) పద్యంలోని దొమ్ములాడి అనే పదం శారీరక కలయకలో ఉండే ఘర్షణను ఆరాటాన్ని సూచిస్తుంది. యయాతి తన యవ్వనం ద్వారా పొందింది కేవలం ఈ భౌతిక స్పర్శ మాత్రమే జిడ్డు జిడ్డు గూడి అన్నాడు మాయా ప్రపంచం వేమన జిడ్డు అని పిలిచింది శరీరంలోని రక్తం శుక్లం వంటి ద్రవాలను యయాతి ఈ జిడ్డు వంటి అశాశ్వతమైన సుఖాల కోసమే తన కొడుకు జీవితాన్ని కూడా లెక్క చేయకుండా యవ్వనాన్ని తీసుకున్నాడు.
(08:48) కానీ చివరికి అతను గ్రహించిన సత్యం ఏంటంటే నెయ్యి పోయడం వల్ల మంట ఆగిపోదు ఇంకా పెరుగుతుంది. అలాగే అనుభవించే కొద్దీ కోరికలు పెరుగుతాయి తప్ప తీరవు అని ఇక్కడ వేమన చెప్పిన జిడ్డు మాయకు సంకేతం ఆ జిడ్డు వల్లే జీవం అంటే అహంకారం, మమకారం ఇవి పుడతాయి అని వేమన గారు హెచ్చరిస్తున్నారు. యయాతి చివరకు తన కొడుకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తూ ఇలా అంటాడు నేను ఇన్నాళ్ళు కేవలం తోలు మాంసం రక్తంతో కూడిన ఈ శరీరాన్ని తృప్తి పరచడమే జీవితం అనుకున్నాను కానీ ఇది ఎండమావి లాంటిది వేమన కూడా తన పద్యంలో ఇదే విషయాన్ని అత్యంత సూటిగా చెప్పాడు. మనం
(09:34) ఎంతో గొప్పగా ఊహించుకునే ప్రేమ కామం లేదా జన్మ దాని వెనక ఉన్నటువంటిది కేవలం కొన్ని భౌతిక పదార్థాల కలయకే అని తెలియజేస్తూ మనల్ని దేహ భ్రాంతి నుంచి బయటకు తీసుకురావడమే ఈ పద్యం యొక్క ఉద్దేశ్యం. శరీరం కేవలం అన్నమయ కోశం అంటే భౌతిక రూపం మాత్రమేనని దాని లోపల ఉన్న ఆత్మను గుర్తించడమే నిజమైన జ్ఞానం అని ఈ పద్యం యయాతి కథ రెండ మనకు బోధిస్తాయి.
(10:07) యయాతికి కలిగిన ఈ జ్ఞానదయం గురించినటువంటి కథ విన్నప్పుడు మనకు భౌతిక సుఖాల పట్ల మన దృక్పతం ఎలా ఉండాలో తెలుసుకోవచ్చును. కాబట్టి కాలు కాలుం గూడి గంటు గంటును గూడి తోలు తోలు గూడి దొమ్ములాడి జిడ్డు జిడ్డు గూడి జీవంబులాయరా విశ్వదాభిరామ వినడరవేమ ఇంత అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరో గొప్ప పద్యాన్ని తీసుకొని ఆ పద్యానికి సంబంధించిన సంపూర్ణమైన విశ్లేషణతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను.
(10:42) అంతవరకు ఈ వీడియోను లైక్ చేసి ఈ కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని మన ఛానల్ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉంటుందని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యస్మి శుభం భుయాత్ [సంగీతం]

No comments:

Post a Comment