Wednesday, April 8, 2026

కొత్తగా పెళ్లి కావలసినవారు, పెళ్లయిన వారు తప్పకుండా వినాల్సిన వేమన పద్యం మరియు కథ|| Vemana Padyalu

కొత్తగా పెళ్లి కావలసినవారు, పెళ్లయిన వారు తప్పకుండా వినాల్సిన వేమన పద్యం మరియు కథ|| Vemana Padyalu

Author Name:The nagraj show

Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gdpmXb_VX5E



Transcript:
(00:01) నమస్కారం ది నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే వేమల పద్యం ఎంతో లోతైన భావాన్ని తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ పద్యం వినడానికి ఎంతో సాధారణంగా అనిపించిన ఇందులో ఉన్నటువంటి లోతైన భావం మనకు స్త్రీల పైన మగవారి పైన వివాహ బంధం పైన గౌరవాన్ని కలిగించేటటువంటి గొప్ప పద్యం ఇది.
(00:25) ఈ పద్య భావానికి సరిగ్గా సరిపో కాశీ మజిలి కథలోనే ఒక గొప్ప కథ ఉంది ఆ కథ కూడా విందాం ఆ కథ ఎంతో లోతైన భావాన్ని మనకు తెలియపరుస్తూనే వివాహ వ్యవస్థ మీద గౌరవాన్ని కలిగిస్తుంది. వేమన పద్యం కూడా అంతే వేమన సాధారణంగా స్త్రీలను విమర్శిస్తున్నట్లుగా ఎన్నో పద్యాలను రాశారు కానీ ఇందులో ఎంతో గొప్ప లోతైన భావాన్ని కలిగి ఉండి స్త్రీలపైన మన గౌరవాన్ని పెంపొందించేటటువంటి అద్భుతమైన పద్యం ఇది.
(00:54) ఇందులో మనం కేవలం వేమణ పద్యాన్ని మాత్రమే కాకుండా వేమణ పద్య భావానికి సరిగ్గా సరిపడే కాశీ మజిలి కథ కూడా తెలుసుకుందాం. కాశీ మజిలి కథలోని భావం వేమడల పద్యంలోని భావం నేటి సమాజానికి యువతకు భార్యా భర్తలకు వీరందరికీ ఎలా ఉపయోగపడుతుంది ఇది మనకు ఏ రకంగా సందేశాన్ని అందిస్తుందో కూలకశంగా తెలుసుకుందాం. నిజంగా ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది.
(01:17) మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి మీకు వీడియో గాని బాగా నచ్చితే లైక్ చేయండి. పద్యంలోకి వెళ్ళిపోదాం రండి. సతి లేని పురుషుడు సంసారియేగాడు మతిలేని పురుషుడు యతియుగాడు గతిలేని పురుషుని బ్రతికేమి బ్రతుకురా విశ్వదాభిరామ వినురవేమ సతిలేని పురుషుడు సంసారియే గాడు మతిలేని పురుషుడు యతియుగాడు గతిలేని పురుషుని బ్రతికేమి బ్రతుకురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం వినడానికి ఎంతో సరళంగా సూటిగా ఉన్నప్పటికీ ఎంతో లోతైన భావాన్ని లోతైన తత్వాన్ని కలిగి ఉంది అదేంటో తెలుసుకుందాం రండి యోగివేమన ఈ పద్యంలో మనిషి జీవితంలోని మూడు ముఖ్యమైన దశలను లేదా మార్గాల గురించి వాటి
(01:58) పరిపూర్ణతకు అవసరమైన అంశాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. మొదటి పాదంలో సతి లేని పురుషుడు సంసారియే గాడు అన్నారు వేమనగారు సంసారం అంటే కేవలం పెళ్లి చేసుకొని జీవించడం కాదు అది ఒక ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం భార్య అంటే సతి అనగా సహధర్మచారిని సహధర్మచారిని లేకుండా పురుషుడు సంపూర్ణ గృహస్తుడు అంటే సంసారి కాలేడు అంటాడు వేమనగారు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడంలో సుఖ దుఃఖాలను పంచుకోవడంలో వంశాన్ని వృద్ధి చేయడంలో భార్య పాత్ర ఎంతో కీలకం ఆమె లేని గృహస్తు జీవితం అసంపూర్ణమైనది అని అర్థం మతి లేని పురుషుడు యతియుగాడు అన్నాడు వేమనగారు యతి
(02:42) అంటే సర్వసంఘ పరిత్యాగి ఇంద్రియాలను జయించి జ్ఞాన మార్గంలో పయణించేవాడు అని అటువంటి ఉన్నత స్థితిని పొందడానికి మతి అంటే సరైన బుద్ధి వివేకం జ్ఞానం ఆత్మ నిగ్రహం అత్యంత అవసరము ఈ మానసిక పరిపక్వత లేనివాడు కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన నిజమైన యతి కాలేడు అంటే సర్వసంఘ పరిత్యాగి కాలేడు అని వేమన గారి భావం గతిలేని పురుషుని బ్రతికేమి బ్రతుకురా అన్నాడు.
(03:11) గతి అంటే జీవితానికి ఒక లక్ష్యం గమ్యం లేదా పరమార్థం అది సంసారికి ధర్మబద్ధమైన జీవితం కావచ్చు యతికి మోక్షం కావచ్చు లేదా ఏ మనిషికైనా ఒక ఉన్నత ఆశయం కావచ్చు. ఏ లక్ష్యము గమ్యము లేకుండా జీవించే మనిషి జీవితం వ్యర్థం. అది పశువుల జీవితంలా దిశా నిర్దేశం లేకుండా సాగిపోతుంది అలాంటి బ్రతుకు ఉండి ఏం ప్రయోజనం అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నారు.
(03:41) అయితే ఈ పద్య భావాన్ని మనం సూక్ష్మంగా తెలుసుకుంటే మనిషి ఏ మార్గాన్ని ఎంచుకున్నా దానికి పరిపూర్ణత చేకూర్చే ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. గృహస్తుకు మంచి భార్య యతికి మంచి బుద్ధి సాధారణ మనిషికి ఒక ఉన్నత లక్ష్యం అనేవి జీవితాన్ని సార్థకం చేస్తాయి. ఇవి లేని జీవితాలు అసంపూర్ణమైనవి మరియు నిరర్థకమైనవి అని వేమనగారి పద్యంలోని సూక్ష్మమైనటువంటి భావం మరి పద్య భావానికి సరిగ్గా సరిపడే కాశీ మజిలి కథ ఉంది అన్నాం కదా ఆ కథ ఏంటో విందాం సతి లేని పురుషుడు సంసారియేగాడు మరియు గతిలేని పురుషుని బ్రతుకు అనే పాదాలకు ఈ కథ అద్భుతంగా అర్థం పడుతుంది.
(04:22) పూర్వం మనిసింధుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. అతడు ఒకనాడు స్నానం ఆచరించడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న దుర్వాస మహామునిని చూసి పరిహాసమాడాడు. ఆ అవమానానికి తీవ్రంగా అనుగ్రహించినటువంటి దుర్వాస మహాముని ఓరి గర్విష్టుడా నీ అందంపై నీకు గల అహంకారానికి తగిన శాపం అనుభవింతువు గాక నీ శరీరమంతా కుష్టు రోగంతో నిండి వికారంగా మారిపోదువు గాక అని శపించాడు.
(04:54) మనసింధుడు తన తప్పును తెలుసుకొని ముని పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు అతని వేడుకోలుకు కరిగిపోయినటువంటి దుర్వాసం మహాముని శాంతించి నీ శాపానికి విమోచనం ఉంది. నీ భార్య మహా పతివ్రత. నీతో పాటే భూలోకంలో సంచరిస్తూ ఏదైనా ఒక మహారాజు కొలువులో ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలి.
(05:20) ఆమె శీలానికి సేవకు మెచ్చిన ఆ రాజు ఇచ్చే బహుమానాన్ని స్వీకరించి ఆ వస్తువును కడిగిన నీటిని నీపై చల్లితే నీ శాపం తొలగిపోయి నీ పూర్వ రూపం వస్తుంది అని శాప విమోచనాన్ని చెప్పాడు దుర్వాస మహాముని దుర్వాసుని శాపం తక్షణమే ఫలించింది. మణిసింధుని శరీరం కుష్టు రోగం తోటి నిండిపోయింది. అతని భార్య చాలా గుణవతి మహా పతివ్రత భర్త దుస్థితికి ఎంతో బాధపడ్డది ధైర్యం కోల్పోలేదు.
(05:50) శాప విమోచనమే తన జీవితానికి ఏకైక లక్ష్యంగా మార్చుకుంది. ఆమె భర్తను ఒక కావడిలో కూర్చోబెట్టుకొని దేశ సంచారం చేయడం ప్రారంభించింది. భిక్షాటన చేస్తూ భర్త ఆకలి తీరుస్తూ అతని గాయాలకు సేవ చేస్తూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంది. అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ వారు ఉజ్జైనీ నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని విక్రమార్క మహారాజు పరిపాలిస్తున్నాడు.
(06:15) గుణవతి తన భర్తను ఒక చెట్టు కింద ఉంచి తాను విక్రమార్క మహారాజు కులులో పరిచారికగా చేరి ఎవరికీ తన అసలు కథ చెప్పకుండా ఒక సంవత్సరం పాటు నిష్టగా నిజాయితిగా ఎట్లాంటి జీతం ఆశించకుండా రాజభవనంలో సేవలు చేసింది. ఆమె ప్రవర్తనకు శీలానికి సేవా భావానికి విక్రమార్క మహారాజు ఎంతో సంతోషపడి ముగ్దుడయ్యాడు. సంవత్సరం గడిచిన తర్వాత విక్రమార్కుడు ఆమెని పిలిపించి అమ్మ నీ సేవకు నేను ఎంతగానో మెచ్చితిని నీకు ఏం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అని అన్నాడు అప్పుడు ఆ గుణవతి రాజు మెడలోని అత్యంత విలువైన ముత్యాల హారాన్ని బహుమానంగా కోరుకుంది.
(06:58) రాజు ఆశ్చర్యపోయాడు మాట ఇచ్చాడు కదా మాట తప్పకుండా ఆ హారాన్ని ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. ఆమె ఆనందంగా ఆ హారాన్ని తీసుకొని నగరం వెలుపల చెట్టు కింద ఉన్న తన భర్త వద్దకు పరుగులు తీసింది. ఒక పాత్రలో నీరు తీసుకొని ఆ ముత్యాల హారాన్ని అందులో కడిగి ఆ నీటిని భర్త అయిన మనిసింధుని పైన చెల్లింది. తక్షణమే ఒక అద్భుతం జరిగింది.
(07:22) అతని కుష్టురోగం మాయమైపోయి పూర్వపు గంధర్వ రూపం వచ్చింది. ఇద్దరు కలిసి విక్రమార్క మహారాజు వద్దకు వెళ్లి తమ కథను వివరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి తమ గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళిపోయి ఇదండీ మనిసింధుని కథ ఈ కథ వేమన పద్యానికి అద్భుతమైన వ్యాఖ్యానంలా నిలుస్తది సతి యొక్క ప్రాముఖ్యత ఈ కథలో మనకు తెలియపరిచారు పద్యంలో సతి లేని పురుషుడు సంసారియే గాడు అన్నారు.
(07:51) ఇక్కడ మనిసింధుడు శాపగ్రస్తుడై ఒక అసంపూర్ణమైన నిస్సహాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతని భార్య గుణవతి లేకపోతే అతని జీవితానికి విమోచనం లభించేది కాదు ఆమె కేవలం భార్యగా కాకుండా అతన్ని రక్షించే సహదర్వచారినిగా నిలిచింది. ఆమె పతిభక్తి శీలం మరియు త్యాగం మనిసింధుని జీవితాన్ని తిరిగి సంపూర్ణంగా చేసింది. శాపానికి గురైన మనిసింధుని బ్రతుకు గతి లేని అతనికి రోగ విముక్తి మరియు శాప విమోచనం అనే లక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని స్వయంగా సాధించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అతను.
(08:26) అతని భార్యే అతని గతికి మార్గంగా నిలిచింది. ఆమె తన భర్త విమోచనాన్ని తన జీవిత లక్ష్యంగా చేర్చుకొని ఆ గమ్యాన్ని చేరే వరకు అలుపెరగని పోరాటం చేసింది. అందువల్ల ఒక పురుషుని జీవితానికి సరైన గతిని నిర్దేశించడంలో లేదా ఆ గతిని చేరడంలో సతి పాత్ర ఎంత కీలకమో ఈ కథ నిరూపిస్తుంది. పద్యం ఒక సూత్రాన్ని చెబితే కథ దానికి ఒక ఉదాహరణ ఒక దృశ్య రూపాన్ని ఇచ్చింది.
(08:55) భర్త జీవితం కష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఒక ఉత్తమమైన భార్య ఎలా తన భుజాల పైన ఆ బాధ్యతను వేసుకొని అతని జీవితానికి ఒక సార్థకతను ఒక గమ్యాన్ని చేకూర్చగలదో ఈ కథ స్పష్టం చేస్తుంది. నేటి సమాజానికి ఈ పద్యం మరియు కథ యొక్క వాటిలోని సారం నేటి ఆధునిక సమాజానికి కూడా ఎంతో అవసరం. ఇందులో భాగస్వామ్యపు విలువ ద వాల్యూ ఆఫ్ పార్ట్నర్షిప్ సతి అంటే కేవలం భార్య కాదు ఒక భాగస్వామి నేటి సమాజంలో భార్యా భర్తలు ఇద్దరూ సమానమే ఒకరి లక్ష్యాలను మరొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు మద్దతుగా నిలిచినప్పుడే ఆ సంసారం విజయవంతం అవుతుంది. నేటి యువత వివాహాన్ని ఒక
(09:39) సామాజిక కట్టుబాటుగా కాకుండా ఒక బలమైన భాగస్వామ్యంగా చూడాలి. కెరీరు వ్యక్తిగత లక్ష్యాలు మరియు కుటుంబ బాధ్యతలలో ఒకరికొకరు తోడుగా నిలబడాలి కష్టకాలంలో నిలబడడం రిజైలెన్స్ ఇన్ అడ్వర్సిటీ మనిషినికి కుష్టిరోగం వచ్చినప్పుడు అతని భార్య వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. నేటి సమాజంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు మానసిక ఒత్తిడి వంటివి వచ్చినప్పుడు సంబంధాలు బీటలు వారిపోతున్నాయి.
(10:09) ఈ కథ కష్టకాలంలో కలిసి నిలబడడం దాని ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టే ముందు సుఖాల్లోనే కాకుండా కష్టాలలో కూడా కలిసి నిలబడతామని మానసికంగా సిద్ధపడాలి. కౌన్సిలింగ్ తీసుకోవడం ఒకరికొకరు సమయం కేటాయించడం వంటివి బంధాన్ని బలోపేతం చేస్తాయి. శీలం మరియు విలువల ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వాల్యూస్ గుణవతి తన శీలం నిజాయితి వలనే రాజును మెప్పించి బహుమానం పొందగలిగింది.
(10:42) నేటి భౌతిక ప్రపంచంలో ధనం అందం హోదాకు ఇస్తున్న ప్రాధాన్యత వ్యక్తిత్వానికి నైతిక విలువలకు ఇవ్వడం లేదు కానీ ఏ బంధానికైనా పునాది నమ్మకం నిజాయితి మాత్రమే. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వారి గుణగణాలకు వ్యక్తిత్వానికి విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అవే శాశ్వతంగా నిలిచిపోతాయి. హైవింగ్ ఏ పర్పస్ గతి జీవిత లక్ష్యం గతిలేని బ్రతుకు వ్యర్థం అన్న వేమన వాక్కు నేటికి సత్యం లక్ష్యం లేని జీవితం గాలికి కొట్టుకుపోయే పడవలండి అది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరడం పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దడం సమాజ సేవ చేయడం ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత తమ
(11:26) జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం దిశగా ప్రయాణించడం జీవితానికి ఒక అర్థాన్ని సంతృప్తిని ఇస్తుంది. కుటుంబంలో భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఉమ్మడి లక్ష్యాలను ఏర్పరచుకుంటే ఆ బంధం మరింత దృఢపడుతుంది. మానసిక పరిపక్వత మతిలేని పురుషుడు యతియుగాడు అన్నట్లు ఏ రంగంలో రాణించాలన్నా సరైన బుద్ధి వివేకం మరియు మానసిక సమతోల్యత అవసరం.
(11:55) కుటుంబ జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలను ఆవేశపడకుండా మతితో అంటే వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కోపం, అహంకారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకొని సంయమనంతో వివేకంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇది కుటుంబంలోని శాంతిని, సామరస్యాన్ని నిలుపుతుంది. విన్నారు కదండీ వేమన గారి పద్యంలో ఉన్నటువంటి లోతైన భావం.
(12:22) అలాగే కాశీ మజిలీ కథలో మనం తెలుసుకునేటటువంటి నీతి ఇది నేటి యువ సమాజానికి నేటి నూతన దంపతులకు ఎంతో ఆవశ్యకమైనటువంటి పద్యాలు కథ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని రాసి నేను ఇంకా ఎలాంటి వీడియోలు రూపొందించాలో నాకు తెలియపరచండి. అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్ [సంగీతం]

No comments:

Post a Comment