అభిప్రాయాలే బంధాలను నాశనం చేస్తాయి Opinions Destroy Relationships
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=M-f_wy3P274
Transcript:
(00:00) అత్యంత నీచమైన పరిస్థితులు జరిగేది శత్రువుల మధ్య కాదు ప్రేమికులు అనబడే వాళ్ళ మధ్యే సరే మనుషులకి తమ అభిప్రాయాలు ఉంటాయి. ఎవరినైనా ప్రేమిస్తున్నారంటే వాళ్ళపై ఎలాంటి అభిప్రాయం ఉండకూడదు. ప్రేమ అంటే అదే ప్రేమ అంటే మరో జీవాన్ని తీర్చి దిద్దేందుకు సిద్ధపడడం ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా అభిప్రాయం అంటే ఒక వ్యక్తిని ఒక చట్టంలో ఇమర్చడమే ప్రేమ అంటే ఒక వ్యక్తిని ఒక కొత్త సంభావ్యతలోకి వెళ్లేలాగా తోడ్పడడం ఈ రెండు కలిసి సాగలేవు.
(00:33) అది నిజంగా ప్రేమతో కూడిన బంధం అయితే అందులో అభిప్రాయాలకు తావు ఉండకూడదు. కేవలం తోడ్పడడమే ఉండాలి. వారి గురించి ఆ క్షణానికి అవసరమైనట్టు తీర్మానం చేస్తారు మెరుగయ్యేలాగా తోడ్పడడానికి తరువాతి సంభావ్యతకు తీసుకువెళ్ళడానికి అంతేగాని వాళ్ళపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోరు. అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న మరుక్షణమే ఆ జీవాన్ని ఓ కొత్త సంభావ్యతలోకి తీసుకువెళ్ళడంపై మీకు ఆసక్తి ఉండదు.
(00:58) వాళ్ళని మీ అభిప్రాయం అనే గిరిలో ఇమడ్చాలనుకుంటారు. పైగా ఆ విధంగా ఇమడనప్పుడు మీరు నిరాశ పడతారు. అది అలా పని చేయదు. ప్రాథమిక యంత్రాంగమే తప్పైనప్పుడు అది ఎలా పనిచేస్తుంది ఏదో అనుకోకుండా పరిస్థితి కొత్తగా ఉండటం వల్ల అది హనీమూన్ సమయం కాబట్టి బహుశా కొన్నాళ్ళు పని చేయొచ్చు కానీ ఆ తర్వాత అది పని చేయదు
No comments:
Post a Comment