చేతులతో తినాలా? | Should you eat with your hands | eat | Sadhguru
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2kjYvIyPd7I
Transcript:
(00:00) ఆహారం తాకడానికే పనికి రానప్పుడు తినడానికి ఎలా పనికొస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీ చేతుల శుభ్రత పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ ఫోర్క్ శుభ్రత పూర్తిగా మీ చేతుల్లో ఉండదు. ఆ ఫోర్క్ ఎవరు వాడారో ఎలా వాడారో దేనికోసం వాడారో మీకు ఏమీ తెలియదు. ఇక వాళ్ళు చేసేదల్లా దాన్ని ఓ టిష్యూతో తుడిచి మీకు ఇవ్వడమే చూడడానికి శుభ్రంగా కనిపిస్తుంది.
(00:26) అన్నిటికీ మించి మీరు ఆహారాన్ని అనుభూతి చెందలేరు. మాకు నేర్పించిన మొదటి విషయం మీ ముందు ఆహారం రాగానే మీ చేతుల్ని ఆ ఆహారంపై కొద్ది క్షణాలు ఉంచాలి. అది ఎలా ఉందో అనుభూతి చెందడానికి నా ప్లేట్లోకి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఇలా స్పర్శిస్తే చాలు ఏం తినాలో ఏం తినకూడదో నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీ శరీరం ప్రతిరోజు ఒకేలా ఉండదు.
(00:49) ప్రతిరోజు ప్రతిక్షణం అది వేరుగా ఉంటుంది. మీరు ఆహారాన్ని అనుభూతి చెందితే మీకు తెలిసిపోతుంది.
No comments:
Post a Comment