Wednesday, April 8, 2026

భార్య మొసలి, పిల్లలు జలగలు అని వేమన ఎందుకన్నాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? Vemana padyalu with meaning

భార్య మొసలి, పిల్లలు జలగలు అని వేమన ఎందుకన్నాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? Vemana padyalu with meaning

Author Name:The nagraj show

Youtube Channel Url:https://www.youtube.com/@thenagrajshow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ctVH_fx5Q5g



Transcript:
(00:01) నమస్కారం ది నాగరాశ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ముందుగా మన వీక్షకులకు ఒక విన్నపం మన ఛానల్ లో ప్రసారం అవుతున్న వేమన పద్యాల వీడియోల్లోని తమ్ముడైల్ మాత్రమే చూసి వారి అభిప్రాయాన్ని పరుషంగా కామెంట్ బాక్స్ లో వ్యక్తపరుస్తున్నారు. దయచేసి మీరు వేమన పద్యం ఆ వేమన పద్య భావానికి సరిపడే కథ, ఆ కథా భావానికి సరిపడేటటువంటి నేటి జీవన గమనంలో మనకు ఉపయోగపడే నీతి సూత్రాలను విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో వ్యక్త పరచండి.
(00:34) అది మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరచవచ్చును కానీ తంబడేలు మాత్రమే చూసి మీరేదో ఊహించుకొని పరుషంగా మీ అభిప్రాయాన్ని మాత్రం దయచేసి వ్యక్తపరచవద్దని హృదయపూర్వకంగా మనవి [సంగీతం] ప్రతి వీడియో లాగానే ఈరోజు కూడా ఒక మంచి వేమణ పద్యం ఆ వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడే బౌద్ధుల జాతక కథల్లోనే ఒక మంచి కథను ఎంపిక చేసుకొని వాటి మధ్యన పోలికను వివరిస్తూ ఎంతో అందంగా ఈ వీడియోను రూపొందించాను.
(01:11) వీడియో ఆశాంతం చూడండి చాలా బాగుంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా ఇదివరకటి వీడియోల కంటే కూడా మిమ్మల్ని అలరిస్తుంది అని హామి ఇస్తున్నాను. కాబట్టి వీడియో చివరిదాకా తప్పకుండా చూసి మీకు ఈ వీడియో నచ్చినా ఎందుకు నచ్చలేదో నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదో నిర్మోహమాటంగా వ్యక్తపరచండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరాలి అనింటే మీ లైక్ దానికి తోడ్పాటుని అందిస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఈ వీడియోని YouTube వాడు ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాడు కాబట్టి దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు
(01:45) తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సహకరిస్తారని మనవి వేమల పద్యంలోకి వెళ్ళిపోదాం భవము సాగరంబు భార్యయ మకరంబు చేప జలగలగును శిశువులెల్ల భవహరు తలపగ పారమందగలేరు విశ్వదాభిరామ వినురవేమా పద్యం చాలా అందంగా ఉంది కాబట్టి మరొక్కసారి విందాం భవము సాగరంబు భార్యయ మకరంబు చేప జలగలగును శిశువులెల్ల భవహరు తలపగ పారమందగలేరు విశ్వదాభిరామ వినరవేమా ఇంత అందమైన పద్యానికి తప్పకుండా బాగా మంచిగా సరిపోయేటటువంటి బౌద్ధుల జాతక కథల్లోని మంచి కథను ఎంపిక చేసుకొని ముందుగా ఆ కథను విందాం ఎందుకంటే అంటే కథను విన్న తర్వాత కథా భావానికి పద్య భావానికి మనం పోలికలు
(02:30) తెలుసుకుంటే పద్యంలోని ఆంతర్యం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ముందుగా కథను విందాం రండి పూర్వం ఒకానొక సమయంలో బోధిసడు ఒక పెద్ద సరస్సులో చేపల రాజుగా జన్మించాడు. ఆయన చాలా తెలివైనవాడు దూరదృష్టి కలవాడు తనతో పాటు ఆ సరస్సులో వేలాది చేపలు బంధు మిత్రులతో నివసిస్తున్నాయి. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక తీవ్రమైన కరువు ఏర్పడ్డది.
(02:55) రోజు రోజుకు సరస్సులోని నీరు ఆవిరైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. సరస్సులోని బురద తప్ప నీరు కనిపించని స్థితి ఏర్పడ్డది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బోధిసత్వుడు తన బంధువులైన చేపలన్నింటిని ఒకచోట చేర్చి ఇట్లా అన్నాడు. మిత్రులారా చూడండి మన సరస్సు ఎండిపోతుంది ఆహారం దొరకడం లేదు నీరు వేడెక్కిపోతుంది.
(03:19) ఇదే అదనుగా కొంగలు గద్దలు మనపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడే ఉంటే మనందరం ప్రాణాలు కోల్పోవడం కాయం. ఇక్కడికి దగ్గరలో ఎప్పటికీ ఎండిపోని ఒక పెద్ద నది ఉంది. ఈ బురదలో దొర్లుకుంటూ కష్టపడి ప్రయాణిస్తే మనం ఆ నదిని చేరుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు. నా మాట విని నాతో రండి అన్నది. కానీ మిగిలిన చేపలు ఆయన మాటలను పెడచేవి పెట్టాయి.
(03:44) అవి గర్వంగా ఇట్లా అన్నాయి ఓ రాజా నువ్వు అనవసరంగా భయపడుతున్నావ్ మేమఅందరం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఈ బుర్ర మాకు తల్లి లాంటిది ఈ సరస్సు మా ఇల్లు ఇంతకాలం మమ్మల్ని కాపాడిన ఈ నేలను వదిలి మేము ఇక్కడికి రాము ఏదో ఒకరోజు పెద్ద వర్షం పడి మన సరస్సు మళ్ళీ నిండిపోతుంది. అప్పటివరకు ఓపిక పడదాం. ఈ సుఖమైన నివాసాన్ని వదిలి ఆ కష్టాల ప్రయాణం మావల్ల కాదు అన్నాయి చేపలన్నీ ముక్తఖండంగా వారి మూర్ఖపు అనుబంధాన్ని గుడ్డి నమ్మకాన్ని చూసి బోధిసత్వుడు జాలిపడ్డాడు.
(04:20) సరే మీ ఇష్టం కానీ నేను నా మాట విన్న కొందరితో కలిసి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు అని చెప్పి తనను అనుసరించిన కొన్ని తెలివైన చేపలతో కలిసి ఆ రాత్రే బురదలో దొర్లుకుంటూ అతి కష్టం మీద ప్రయాణించి తెల్లారేసరికల్లా ఆ మహానదిని చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఒక పెద్ద కొంగ ఎండిపోతున్న సరసుని చూసింది.
(04:48) అందులో వేలాది చేపలు బురదలో చిక్కుకొని కదలలేక మెదలలేక ఉండడాన్ని అది గమనించింది. దానికి అప్పుడు పండుగ అయిపోయింది. వెంటనే కిందికి దిగి తన పొడవైన ముక్కుతోటి ఆ చేపలన్నింటిని ఒక్కొక్కటిగా పొడుచుకుంటూ కడుపు నిండా తినేసింది. మిగిలిన వాటిని తన పిల్లల కోసం తీసుకొని పోయింది. అట్లా తాము పుట్టిన ప్రదేశం పై ఉన్న గుడ్డి అనుబంధంతో మూర్ఖత్వంతో కాలాన్ని ప్రమాదాన్ని గుర్తించలేకపోయిన చేపలన్నీ ప్రాణాలు కోల్పోయినాయి.
(05:21) బోధిసత్తుడి మాట విన్నవారు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఇదండీ కథ. ఇప్పుడు ఈ కథకి పద్య భావానికి మనం పోలికను పోల్చి చూసుకుందాం. ముందుగా పద్య భావాన్ని మీకు తెలియపరుస్తాను తర్వాత పోలికను తెలియపరుస్తాను. భవము సాగరంబు అన్నాడు వేమన భవము అంటే ఈ సంసారం ఈ ప్రాపంచిక జీవితం ఇది ఒక అంతులేని మహాసముద్రం లాంటిది భార్యయౌ మకరంబు అన్నాడు వేమన ఈ సంసారం సముద్రంలో భార్య ఒక మొసలి లాంటిది మొసలి నీటిలో తన పట్టుతో ఎలా బంధిస్తుందో భార్య పైన ఉండే అనురాగం మోహం ఇవి మనిషిని సంసారంలో అట్లాగే బంధించి ఉంచుతాయి అని అర్థం. చేప జలగలగును శిశువులెల్ల అన్నాడు
(06:07) వేమన ఇక్కడ పిల్లలు చేపలు జలగల లాంటివారు అని వారు తమ ప్రేమతో అవసరాలతో నిరంతరం మనల్ని అంటి పెట్టుకొని ఈ సంసార సాగరాన్ని దాటనియకుండా చేస్తారు అని ఈ పద్యం యొక్క ఈ పాదం యొక్క ఆంతర్యం భవహరు తలపక పారమందలేరు అన్నాడు వేమనగారు భవహరుడు అంటే భవాన్ని అంటే సంసారాన్ని హరించేవాడు ఎవరు ఈశ్వరు లేదా పరమాత్మ ఆ భగవంతుని స్మరించకుండా ఆధ్యాత్మిక చింతన లేకుండా ఈ బంధాలతో నిండిన సంసార సాగరాన్ని ఎవ్వరు దాటలేరు క్లుప్తంగా చెప్పాలంటే ప్రాపంచిక బంధాలు అనుబంధాలు మనల్ని ఒక సుడిగుండంలో బంధిస్తాయి అని వాటిని దాటడానికి దైవ
(06:55) చింతన అనే నావ అవసరమని వేమన గారి యొక్క భావన పద్య భావానికి కథకి ఎట్లా పోలిక సరిపోతుంది ఒకసారి సారి తెలుసుకుందాం భవము సాగరము సంసారం అనే సముద్రం పద్యంలోని సంసార సాగరమే కథలోని ఎండిపోతున్న సరస్సు రెండు చూడడానికి నివాసయోగ్యంగానే ఉన్నప్పటికీ వాటిలో ప్రమాదం పొంచి ఉంది. సంసారం దుఃఖాన్ని ఇస్తుంది. సరస్సు మృత్యువుని ఇచ్చింది చేపలకి భార్య శిశువులు బంధాలు అనే మొసలి జలగలు పద్యంలోని భార్య పిల్లలు అనే బంధాలు కథలోని చేపలకు తమ సరసుపై బురదపై ఉన్న గుడ్డి అనుబంధం మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే ఉంటాం అనే మమకారం ఆ మోహం వారిని
(07:41) కట్టిపడేసింది. ఆ అనుబంధమే వారిని ఆ సరస్సు అనే బంధనం నుంచి బయట పడనీయలేదు. అదే వారి పాలిట మృత్యుపాసం అయింది ఇట్లాగే భార్య శిశువులు భావ బంధాలు అనేటివి కూడా మనిషిని మరో వైపు లాక్కెళ్తాయి అని వేమన గారి భావం మరి ఇలాంటివారు బయట పడాలంటే ఆ బంధాల నుంచి వాటి యొక్క వ్యామోహం నుంచి బయట పడాలంటే ఏం చేయాలి భవహరు తలబగ పారమందగలేరు అన్నాడు వేమన ఇక్కడ వేమన సమస్యను తెలుపుతూ పరిష్కారాన్ని కూడా సూచిస్తున్నాడు వివేకం లేకపోతే పోతే దాటలేరు పద్యంలో భవహరుని తలవడం అంటే జ్ఞానంతో వివేకంతో ఆలోచించడం కథలో బోధిసతుడు
(08:28) ఎవరు చేపల రాజు ఆ వివేకానికి ప్రతిరూపం ఆయన ప్రమాదాన్ని ముందే పసిగట్టి బయటపడే మార్గాన్ని చూపించాడు. ఆయన మాట వినడమే భవహరుని తలవడం ఆయన మాటను వినని చేపలు అంటే వివేకాన్ని ఉపయోగించని జీవులు అన్నట్టు ఇక్కడ ఆ సంసారం అనే సరస్సులో చిక్కుకొని నశించిపోయాయి. అట్లాగే మనుషులు కూడా అలాగే అవుతారు కాబట్టి భార్య పిల్లలు అనేటటువంటి సంసార బంధాలను మనం ఈదాలి అంటే మనకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది ఆ పరమాత్మను శరణు వేయడం ద్వారా ఆ పరమాత్మను స్మరించడం ద్వారా మనకు ఈ భవ బంధాల అన్నింటిని కూడా దాటుకొని పోయేటటువంటి వాటన్నింటిని కూడా ఈదేటవంటి శక్తి భగవంతుడు మనకు కల్పిస్తాడు
(09:15) అని వేమనగారు సమస్య పరి పరిష్కారం రెండింటిని ఒకే పద్యంలో అద్భుతంగా వర్ణించారు. వేమన చెప్పిన సంసార సాగరం బంధాలు అనే ముసలి దైవచింతన అనే నావ ఈ మూడు అంశాలు జాతక కథలోని ఎండిపోతున్న సరస్సు పుట్టిన నేల మీద మమకారం బోధిసత్వుని మార్గదర్శకత్వం అనే రూపంలో ప్రతిబింబిస్తాయి మనకు ఈ పద్యం మరియు కథలో నేటి సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ఏమున్నాయి మరి ఈ కథ వేల సంవత్సరాల నాటిదే అయినప్పటికీ వాటిలోని ఆంతర్యం సందేశం నేటి ఆధునిక సమా సమాజానికి నూటికి నూరు పాళ్లు వర్తిస్తుంది.
(09:55) ఈ పద్యంలో వేమన గారు చెప్పింది కుటుంబాన్ని వదిలేయమని కాదు అనుబంధం వేరు గుడ్డి అనుబంధం వేరు అంటే మోహం వ్యామోహం వేరు మనల్ని ముందుకు నడిపించేది అనుబంధం మనల్ని ఒకే చోట కట్టిపడేసి మన వినాశనానికి కారణమయ్యేది మోహం ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడమే వివేకం కంఫర్ట్ జోన్ ఎండిపోతున్న సరస్సే నేటి మన కంఫర్ట్ జోన్ చాలామంది తమకు నచ్చని ఉద్యోగాలలో ఎదుగుదల లేని వాతావరణంలో అనారోగ్యకరమైన సంబంధాలలో కేవలం అలవాటయపోయింది ఇది తప్ప ఇంకేం చేయాలో తెలియదు అనే గుడ్డి అనుబంధంతో ఉండిపోతున్నారు.
(10:36) బోధిసత్వంలా ఎవరైనా మంచి మార్గం చూపిస్తే మార్పుకు భయపడి అక్కడే ఉండిపోయి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మా తాతలు తండ్రులు ఇలాగే చేశారు మేము ఇలాగే చేస్తాం అని గుడ్డిగా అనుసరించే సంప్రదాయాలు నమ్మకాలు కూడా ఎండిపోతున్న సరస్సు లాంటివే మారుతున్న కాలానికి అనుగుణంగా జ్ఞానాన్ని వివేకాన్ని ఉపయోగించి మనల్ని మనం మార్చుకోకపోతే ఆ పాత నమ్మకాలే మన పతనానికి కారణం అవుతాయి.
(11:10) మనం నివసించే ఇల్లు వాడే వస్తువులు మన హోదాపై పెంచుకునే విపరీతమైన మోహం కూడా మనల్ని బంధించేవే ఇవి శాశ్వతం కావని అసలైన ఆనందం వీటిలో లేదని గ్రహించకపోతే జీవితంఅనే ప్రయాణంలో మనం అస్సలు ముందుకు సాగలేము. పరిస్థితిని అంచనా వేయడంలో వివేకము మార్పును స్వీకరించడంలో ధైర్యము బుడ్డి అనుబంధాన్ని వదిలించుకోవడంలో వైరాగ్యము ఈ మూడు సురక్షితమైన ఉన్నతమైన జీవితానికి పునాదులు మనం కూడా మన జీవితంఅనే సరస్సును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
(11:49) అది ఎండిపోతుందా ప్రమాద గంటికలు మోగిస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. మోహం అనే బురదలో కూరుకుపోకుండా వివేకమఅనే బోధిసత్వని మాట విని ఉన్నతమైన లక్ష్యాలనే మహానది వైపు మనం ప్రయాణించాలి. ఇదే ఈ పద్యం ఈ కథ మనక ఇచ్చే గొప్ప జీవన సందేశం ఇలాంటి ఆసక్తికరమైన అంశంతో మరొక పద్యం మరొక కథ తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి మీ సమయాన్ని కేటాయిస్తారని మీ అమూల్యమైన సమయాన్ని ఇంతవరకు మీరు కేటాయించారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు 10 మందికి చేరే విధంగా షేర్ చేస్తారని మన ఛానల్ కు కొత్తగా వచ్చిన
(12:35) వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యోస్మి శుభం భుయాత్ [సంగీతం]

No comments:

Post a Comment