Monday, April 27, 2026

21 మంది భారతీయ మహిళలకు రహస్యంగా రేడియోధార్మిక ఆహారాన్ని ఎందుకు తినిపించారు? చరిత్రలో భయంకర ప్రయోగం

21 మంది భారతీయ మహిళలకు రహస్యంగా రేడియోధార్మిక ఆహారాన్ని ఎందుకు తినిపించారు? చరిత్రలో భయంకర ప్రయోగం

Author Name:FN-20 TELUGU

Youtube Channel Url:https://www.youtube.com/@FACTNO20

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qdov8FiEFFs



Transcript:
(00:00) బ్రిటన్ లోని ఆక్స్ఫోర్డ్ నగరానికి కొంచెం దూరంలో ఉండే కోవెంట్రీ అనే పట్టణం 1960వ దశకంలో వేల మంది భారతీయ వలసదారులకు ఆశ్రయం ఇచ్చింది. కానీ అదే నగరం సామాన్య భారతీయ మహిళల పాలిట ఒక అంతుచిక్కని ప్రయోగశాలగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. 1969 లో ప్రీతం కౌర్ అనే పంజాబీ గృహిణి కేవలం కొంచెం నీరసంగా ఉందని డాక్టర్ను సంప్రదిస్తే ఆమెకు రక్తహీనత ఉందని చెప్పి ఒక ఉచిత న్యూట్రిషన్ ప్రోగ్రాం్ పేరుతో ప్రతిరోజు ఇంటికి వచ్చి మరి అత్యంత పోషక విలువలు ఉన్న చపాతీలను తినిపించడం మొదలు పెట్టారు.
(00:39) అయితే ఆ చపాతీలు తిన్నారో లేదో తెలుసుకోవడానికి మెడికల్ టీం రోజు ఫోన్ చేసి మరి ఆరా తీసేవారంటే ఆ కార్యక్రమం ఎంత పక్కాగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు భయంకరమైన నిజం ఏమిటంటే ఆ చపాతీలు తింటున్న ప్రీతం కౌర్కు గాని ఆమెతో పాటు ఉన్న మరో 20 మంది భారతీయ మహిళలకు గాని తాము తింటున్నది కేవలం గోధుమ రొట్టెలు కాదని అందులో అత్యంత ప్రమాదకరమైన ఐరన్ 59 అనే రేడియో ధార్మిక పదార్థం కలిసి ఉందన్న విషయం కలలో కూడా తెలియదు.
(01:10) ఒక బక్కా ప్లాన్ ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వపు మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఈ అమాయక మహిళలను ఎంచుకొని వారి శరీరాలు ఐరన్ ను ఎలా గ్రహిస్తాయో తెలుసుకోవడానికి వారిని సజీవ ప్రయోగ వస్తువులుగా మార్చేసింది. అసలు రేడియో ధార్మిక పదార్థాన్ని ఆహారంలో కలిపి ఇవ్వడం వల్ల వారి ప్రాణాలకు మొప్పు ఉంటుందని తెలిసిన సైంటిస్టులు ఈ నిజాన్ని ఎందుకు దాచారు? ఒక గౌరవప్రదమైన డాక్టర్ ద్వారానే ఈ విష ప్రయోగాన్ని ఎందుకు అమలు చేయించారు? ఆ 17 రోజుల తర్వాత ఆ మహిళలను రహస్య అనుపరిశోధన కేంద్రానికి తరలించి ఏ ఏ పరీక్షలు చేశారు.
(01:46) దశాబ్దాల పాటు ఈ అరాచకాన్ని చరిత్ర పుట్టల్లో ఎలా అనిచివేశారు. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ మెడికల్ రేసిజం వెనుక ఉన్న చీకటి కోణాలను ప్రాణాలతో చెలగాటమాడిన ఆ భయంకరమైన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ వివరాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడదాం. ముందుగా మెడికల్ హిస్టరీ లోనే అత్యంత వివాదస్పదమైన ఈ అధ్యాయాన్ని లోతుగా విశ్లేషిస్తే అసలు రక్తహీనత లేదా అనీమియా అనే ఆరోగ్య సమస్య బ్రిటిష్ శాస్త్రవేత్తలను ఎందుకు అంతగా వేధించిందో అర్థమవుతుంది.
(02:18) సాధారణంగా మన రక్తంలోని ఎర్ర రక్తకణాలు శరీరమంతటా ఆక్సిజన్ను సరఫరా చేయడానికి ఐరన్ లేదా ఇనుము అనే ఇంధనంలా పనిచేస్తుంది. కానీ శరీరంలో ఈ ఐరన్ తక్కువైతే మనిషి ప్రాణశక్తిని కోల్పోయి నిరంతరం అలసటతో నీరసంతో కుంగిపోతాడు. 1950 మరియు 60 వ దశకాల్లో బ్రిటన్ లోని వైద్యులకు ఒక విచిత్రమైన విషయం అర్థమైంది. అదేమిటంటే అక్కడి స్థానిక మహిళల కంటే కూడా భారతదేశం మరియు ఇతర దక్షిణాసియా దేశాల నుండి వలస వచ్చిన మహిళల్లో ఈ అనీమియా వ్యాధి అత్యంత వేగంగా ప్రమాదకరంగా వ్యాపిస్తోంది.
(02:54) దీనికి కారణం వారి ఆహారపు అలవాట్ల లేక వంశ పారంపర్యంగా వస్తున్న లోపాల అన్నది అప్పట్లో ఒక పెద్ద మెడికల్ మిస్టరీగా మారింది. అప్పట్లో సైన్స్ ఐరన్ లోపాన్ని గుర్తించగలిగింది కానీ మనం తినే ఆహారం నుండి మన శరీరం ఐరన్ ను అసలు ఎలా గ్రహిస్తుంది ఏ ఏ పదార్థాలు తింటే ఐరన్ త్వరగా రక్తంలోకి చేరుతుందనే విషయంలో శాస్త్రవేత్తల దగ్గర సరైన సమాధానం లేదు.
(03:20) ఒకవేళ ఈ ఐరన్ అబ్సర్ప్షన్ గనుక ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా అనీమియాకు తిరుగులేని మందులను కనిపెట్టవచ్చని తద్వారా వైద్య చరిత్రలో తాము చిరస్థాయిగా నిలిచిపోవచ్చని పీటర్ ఎల్వుడ్ లాంటి పరిశోధకులు భావించారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఐరన్ గ్రహించే విధానాన్ని తెలుసుకోవడానికి సాధారణ రక్త పరీక్షలు సరిపోవని ఐరన్ అణువులు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి ఏ ఏ అవయవాల ద్వారా ప్రయాణిస్తున్నాయో నిరంతరం ట్రాక్ చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
(03:49) దీనికోసం వారు ఎంచుకున్న మార్గం అత్యంత భయంకరమైనది. ఒక సాధారణ వ్యక్తి కంటికి కనిపించని శరీరంలోని కణజాలాలను లోపల నుండి ప్రభావితం చేయగల రేడియో ధార్మిక శక్తిని ఆహారంలో కలిపి పంపిస్తే అది లోపల చేసే కదలికలను బయట నుండి మెషిన్ల ద్వారా గమనించవచ్చనే క్రూరమైన ఆలోచన వారిలో మొదలైంది. ఈ ప్రయోగం కోసం వారు ఆరోగ్యంగా ఉన్న తెల్ల జాతీయులను కాకుండా భాషాపరమైన ఇబ్బందులు ఉండి అపరిచిత దేశంలో డాక్టర్లను దైవంగా భావించే అమాయక భారతీయ మహిళలను ఎంచుకోవడం వెనుక ఒక భారి కుట్ర దాగి ఉంది.
(04:24) కేవలం ఒక శాస్త్రీయ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఒక మనిషి ప్రాణం మీద రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిసి కూడా ఏమాత్రం కనికరం లేకుండా 21 మంది మహిళల ప్రాణాలను ఫనంగా పెట్టి ఈ రహస్య ప్రయోగానికి తెరలేపారు. అది కేవలం వైద్య పరిశోధన మాత్రమే కాదు ఒక జాతిపై జరిగిన అనిచివేతకు ప్రారంభం. అదే ఈ కోవెంట్రీ ప్రయోగం యొక్క అత్యంత విషాదకరమైన నిజం.
(04:49) అలానే మెడికల్ హిస్టరీలో అత్యంత క్రూరమైన ప్రణాళికలు రచించిన పీటర్ ఎలూడ్ అనే ఐరిష్ శాస్త్రవేత్త ఆలోచన విధానాన్ని పరిశీలిస్తే సైన్స్ పేరిట మానవ హక్కులను ఎంతలా కాలరాశారో స్పష్టమవుతుంది. ఒకరోజు తన కార్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎల్వుడ్ కు వచ్చిన వింత ఆలోచన ఏమిటంటే శరీరంలోకి వెళ్ళే ఐరన్ అణువులను కనిపెట్టడానికి వాటికి ఒక ట్యాగ్ తగిలిస్తే ఎలా ఉంటుంది అనేది అంటే సరిగ్గా మనం విమానాశ్రయాల్లో లగేజ్ ని ట్రాక్ చేయడానికి ఎయిర్ టాక్స్ వాడినట్లుగా శరీరంలోని ఐరన్ ను రిమోట్ గా మానిటర్ చేయాలని ఆయన భావించారు.
(05:23) ఈ ట్రాకింగ్ పరికరం కోసం ఆయన ఎంచుకున్నది మరేదో కాదు. ప్రాణాంతకమైన రేడియో ధార్మికత కలిగిన FP59 అనే ఐరన్ ఐసోటోప్ ఇది ఒకసారి రక్తంలోకి చేరితే శరీరంలోని ఏ మూలకు వెళ్ళినా వెలుపల నుండి స్కాన్ చేసి గుర్తించవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి ఆయనకు మూడు ప్రధాన అంశాలు అవసరమయ్యాయి. అత్యధికంగా రక్తహీనతతో బాధపడే ఒక వర్గం వారు నిత్యం తీసుకునే ఆహారం మరియు ఆ ఆహారంలో కలిపే రేడియో ధార్మిక పదార్థం.
(05:53) ఈ క్రమంలో కోవెంట్రీ లోని భారతీయ వలస మహిళలు ఆయనకు సరైన సబ్జెక్టులుగా కనిపించారు. ఎందుకంటే వారు ప్రతిరోజు చపాతీలు తింటారు. కాబట్టి అందులో ఈ విష పదార్థాన్ని కలిపి ఇవ్వడం సులభమని ఆయన లెక్కలు వేశారు. అయితే ఒక తెల్ల జాతి శాస్త్రవేత్త నేరుగా వెళ్లి ఇలాంటి ప్రయోగం చేస్తామంటే ఎవరు ఒప్పుకోరని గ్రహించిన ఎల్వుడ్ అక్కడి భారతీయ సమాజంలో ఎంతో గౌరవం ఉన్న డాక్టర్ షా అనే స్థానిక వైద్యుడిని తన కుట్రలో భాగస్వామిని చేసుకున్నాడు.
(06:21) డాక్టర్ షా ఆ మహిళల వద్దకు వెళ్లి ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక అద్భుతమైన ప్రభుత్వ కార్యక్రమం అని ఉచితంగా ఇచ్చే ఈ చపాతీలు తింటే మీ నీరసం మాయమైపోతుందని నమ్మబలికాడు. తన స్వదేశీ వైద్యుడిపై ఉన్న అచంచలమైన నమ్మకంతో ఆ అమాయక మహిళలు ఎలాంటి రాధపూర్వక అంగీకారం లేకుండానే తాము తింటున్న చపాతీల్లోని మరణాయుధం గురించి తెలియకుండానే ఆ ప్రయోగంలో భాగమైపోయారు.
(06:46) ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే టెల్డ్ మరియు డాక్టర్ షా మధ్య జరిగిన ఏ ఒక్క సంభాషణ గాని ఆ మహిళల పేర్లు కానీ రికార్డుల్లో లేకుండా జాగ్రత్త పడటం చూస్తుంటే ఇది ఎంత వ్యవస్థీకృతమైన నేరమో అర్థం చేసుకోవచ్చు. ఒక వైద్యుడే యమధర్వరాజుగా మారి తన రోగులను బలిపీఠం ఎక్కించిన ఈ వైన్యం వైద్య ప్రపంచానికే తీరని కళంకంగా మిగిలిపోయింది.
(07:09) అలానే ఈ భయంకరమైన ప్రయోగం అమలులోకి వచ్చిన తీరును పరిశీలిస్తే ఆ 17 రోజుల పాటు ఆ మహిళల ఇళ్లల్లో ఏం జరిగిందో వింటే ఒళ్ళు గగురుపడుస్తుంది. ఎల్విడ్ బృందానికి చెందిన టామ్ బెన్జమిన్ అనే వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే ఆ 21 మంది మహిళల ఇళ్లలకు వెళ్లి రేడియో ధార్మిక పదార్థం కలిపిన ఆ విషపూరిత చపాతీలను స్వయంగా అందజేసేవాడు.
(07:32) అంతేకాదు వారు ఆ చపాతీలను తిన్నారో లేదో నిర్ధారించుకోవడానికి మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేసి మరి ఆరా తీసేవాడు. సరిగ్గా 17 రోజుల పాటు ఈ నిశబ్ద విష ప్రయోగం నిరంతరాయంగా సాగిన తర్వాత 18 వ రోజు ఉదయం ఒక రహస్య బ్యాన్ ఆ మహిళల ఇళ్లకు వచ్చి వారిని పికప్ చేసుకుంది. తమను ఏదో మెరుగైన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని ఆ అమాయక మహిళలు భావించారు.
(07:56) కానీ ఆ వ్యాన్ వారిని తీసుకెళ్ళింది ఆసుపత్రికి కాదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హార్వెల్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనే అను పరిశోధన కేంద్రానికి అక్కడ ఆ మహిళలను బారి యంత్రాల మధ్య ఉంచి వారి శరీరంలో ఎంత మేరకు రేడియేషన్ వ్యాపించింది ఆ రేడియో ధార్మిక ఐరన్ అణువులు రక్తంలో ఎంతవరకు కలిసాయనే అంశాలను శాస్త్రవేత్తలు అత్యంత శీతలంగా పరీక్షించారు.
(08:20) ఆ సమయంలో తమ చుట్టూ ఉన్నది డాక్టర్లు కాదు అనుశాస్త్రవేత్తలని గాని తాము నిలబడింది ఒక లాబరేటరీలో అని గాని ఆ మహిళలకు ఏమాత్రం అవగాహన లేదు. ఈ పరీక్షలన్నీ ముగిసిన తర్వాత కేవలం డేటా కోసం వాడుకున్న వస్తువుల్లాగా వారిని మళ్ళీ వారి ఇళ్ల వద్ద వదిలేశారు. కానీ అసలైన విషాదం ఇక్కడే మొదలైంది. ఒకసారి రేడియో ధార్మిక పదార్థం శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది కణజాలాలను ఎలా దెబ్బతీస్తుంది భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుందనే ప్రాథమిక ఆలోచన కూడా లేకుండా ఆ మహిళలకు ఎటువంటి వైద్య సహాయం అందించలేదు.
(08:55) కనీసం ఆ ప్రయోగం వల్ల వచ్చిన ఫలితాలను కూడా వారికి చెప్పలేదు సరి కదా ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిన పట్టించుకునే నాదుడే లేడు. శాస్త్ర సాంకేతికత ముసుగులో సాగిన ఈ 17 రోజుల నరకం ఆ మహిళల జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేసిందో ఊహిస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఒక పక్కా ప్రణాళికతో సాగిన ఈ మానవ హక్కుల ఉల్లంఘన వైద్య చరిత్రలోనే ఎన్నటికీ చెరగని మాయని మచ్చగా మిగిలిపోయింది.
(09:20) ఈ దారుణమైన రహస్యం దశాబ్దాల పాటు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ 1995 లో ఒక సాహసోపేతమైన ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రపంచం ముందుకు రావడం ఒక పెద్ద సంచలనంగా మారింది. పీటర్ ఎల్వుడ్ ఆ మహిళల నుండి సేకరించిన డేటాతో తన కెరీర్ లో అత్యున్నత శిఖరాలకు చేరుకోగా జాన్ బ్రౌన్లో అనే బ్రిటిష్ డాక్యుమెంటరీ ఫిల్మ మేకర్ కు అమెరికాలో జరిగిన కొన్ని అమానవీయ రేడియేషన్ ప్రయోగాల గురించి తెలిసి బ్రిటన్ లో కూడా ఇలాంటి అరాచకాలు జరిగాయా అని ఆరా తీయడం మొదలు పెట్టాడు.
(09:48) ఈ క్రమంలో ఆయనకు 1970 నాటి ఒక పాత మెడికల్ రిపోర్ట్ దొరికింది. అందులో 21 మంది దక్షిణాసియా మహిళలకు రేడియో ధార్మిక చపాతీలు తినిపించినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ వారి పేర్లు గాని చిరునామాలు గాని ఎక్కడా నమోదు చేయబడలేదు. అంటే ఆ మహిళలను కేవలం కొన్ని అంకెలుగా మాత్రమే చూశారనేది స్పష్టమైంది. జాన్ బ్రౌన్ లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కోవెంట్రీ వీధుల్లో అన్వేషణ సాగించి చివరకు అప్పటి బాధితురాలైన ప్రీతం కౌన్ను కనుగొనడంతో అసలు నిజం వింటే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
(10:23) మా ఆరోగ్యానికి మంచిదని చెప్పి మాకు విషం తినిపించారా అని ఆమె కన్నీరు మున్నీరు అవ్వగా అదే ప్రయోగంలో పాల్గొన్న మరో మహిళ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిందన్న భయంకరమైన నిజాన్ని ఆమె కుమార్తె బయట పెట్టింది. ఈ వ్యవహారం మొత్తం మీడియాలో దావానలంలా వ్యాపించడంతో బ్రిటన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఎంఆర్సి విచారణకు ఆదేశించింది.
(10:46) కానీ ఆ విచారణ నివేదిక బాధితుల గాయాల మీద ఉప్పు చల్లినట్లుగా ఉంది. వారు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అది 60వ దశకం కాబట్టి అప్పట్లో నిబంధనలు ఇలాగే ఉండేవని మేము ఇచ్చిన రేడియేషన్ మోతాదు చాలా తక్కువ కాబట్టే దానివల్లే ఎలాంటి ప్రమాదం లేదని నమ్మశక్యం కానీ వివరణ ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అలస్ టీవర్ట్ ఈ రిపోర్టును పచ్చి అబద్ధంగా కొట్టిపారేస్తూ ఇది ముమ్మాటికి మెడికల్ రేసిజం అని వారికి ఇంగ్లీష్ భాష రాదనే బలహీనతను ఆసరాగా చేసుకొని కేవలం పేద వలసదారులు కాబట్టే వారిని ప్రయోగశాల ఎలుకల్లాగా వాడుకున్నారని తీవ్రంగా
(11:22) గర్జించారు. రోగుల కనీస వివరాలు కూడా ఉంచకుండా ప్రయోగం తర్వాత వారిని గాలికి వదిలేయడం అనేది శాస్త్రీయ చరిత్రలో అత్యంత క్రూరమైన మరియు అనైతికమైన చర్యగా మిగిలిపోయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒక నాగరిక దేశం తన సొంత పౌరుల పైనే ఇంతటి కుట్రపూరితమైన విష ప్రయోగానికి ఎలా ఒడికట్టిందో అర్థం చేసుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగురుపడవడం కాయం.
(11:46) ఈ కథ కేవలం ఒక మెడికల్ ప్రయోగం గురించి మాత్రమే కాదు ఇది మెడికల్ రేసిజం అంటే వైద్యరంగంలో వివక్షకు ఒక నిలువుట అద్దం. తెల్ల జాతీయుల ప్రయోజనాల కోసం వలస వచ్చిన భారతీయులను కేవలం వస్తువుల్లా వాడుకున్నారు. 2023 లో కూడా బ్రిటిష్ పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరిగింది. కానీ ఇప్పటికీ ఆ 21 మంది మహిళల కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు. చరిత్రలో కలిసిపోయిన ఈ 21 మంది మహిళల కాదా మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తుంది.
(12:14) సైన్స్ ఎంత ఎదిగినా మానవత్వం లేని ప్రయోగం ఎప్పుడూ నేరమే అవుతుంది.

No comments:

Post a Comment