*మానవుని కష్టనష్టములు మానవుని కర్మ ఫలముల మూలముగా కలుగుతుంటాయి.అది మనకు శిక్షవలే అనిపించి కొంచెం ఎక్కువే ఇబ్బంది పెట్టవచ్చును.ఎంతటి భక్తుడైనా కొన్నిసార్లు సహనం కోల్పోయి దైవమును నిందించే సందర్భాలూ లేకపోలేదు.అయితే నిజానికి నేడు మనం శిక్ష అనుకున్నదే రేపు మనకు రక్ష అవుతుంది.రోగము తగ్గడానికి వైద్యుడు సూదిమందు ఇస్తాడు.నొప్పిగా ఉందని వైద్యుణ్ణి నిందిస్తామా!లేదుకదా!!అలానే కష్టమో నష్టమో వచ్చిందంటే భగవంతుడు మన కర్మ ఫలితాన్ని కరిగించి మనల్ని కాపాడుట కొరకే తప్ప మనపై కోపముతో కాదు.ఆయన కన్నా మనలను ప్రేమించేవారు ఎవరూ లేరు.కాస్త సహనము వహించాలి.విశ్వాసము దృఢం చేసుకోవాలి.ఆయన తన భక్తుల విషయములో ఆలస్యం చేయడు అలసత్వం వహించడు.త్వరలో అన్నీ చక్కబెడతాడు.సందేహ పడకూడదు...కృష్ణ*
No comments:
Post a Comment