బ్రిటిష్ పైలట్ సన్యాసిగా?#satyanandiraju #sanatandharma #devotional #ytshorts #ytviral #hindu
Author Name:Satya Sanatana Dharma Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5UBsOUphsDc
Transcript:
(00:01) అవి మొదటి ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న రోజులు బ్రిటిష్ పైలట్ రోనాల్డ్ హెన్రీ నిక్సన్ తన విమానాన్ని ఆకాశంలో శత్రు విమానాల మధ్య రివ్వుమని పరిగెత్తిస్తున్నాడు. అన్ని శత్రు విమానాలు చుట్టుముట్టి బాంబులు వేస్తున్నాయి. ఇక తనకు మరణం తప్పదు అనిపించింది. అలాగే విమానం మీద నియంత్రణ కూడా కోల్పోయాడు. అప్పుడే అతనికి అద్భుతంగా ఒక వెలుగు తన విమానం చుట్టూరా కనిపించింది.
(00:26) ఎంతో ఆశ్చర్యంగా అతను ఆ అదృశ్య శక్తి చేత కాపాడబడ్డాడు. దాని తర్వాత అతని ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మికత వైపు ప్రయాణించబడ్డాయి. అప్పుడే అతనికి భారతదేశం వెళ్ళాలి అని అనిపించింది. వెంటనే భారతదేశంలో లక్నో కి వచ్చాడు. యశోదామాయి దగ్గర సన్యాసాన్ని స్వీకరించి శ్రీకృష్ణ ప్రేమగా మారిపోయారు. అలా ఒక మొట్టమొదటి యూరోపియన్ వైష్ణవ మతాన్ని స్వీకరించి ఒక సన్యాసిగా మారి ఈ భారతదేశంలో ఎంతో మందిని శ్రీకృష్ణ భక్తి వైపు ఆకర్షింపజేశారు.
(00:55) అలాగే యశోదామాయితో కలిసి మిల్టోరాలో రాధాకృష్ణ ఆశ్రమాన్ని స్థాపించారు. 1948 లో భగవాన్ రమణ మహర్షిని కలిశారు. అలాగే పాండిచేరిలో మహాయోగి అరబిందువు అని కలిశారు. ఎన్నో ఆధ్యాత్మికత చర్చలు జరిపారు. అలాగే వారు చిట్టచివరి శ్వాసని ఆ మిల్టోరా ఆశ్రమాన్ని వదిలేశారు. అలా ఎక్కడో ఆంగ్ల మూలాలు ఉన్న ఈ వ్యక్తి ఇంగ్లాండ్ లో పుట్టి భారతదేశంలో ఒక సన్యాసిగా మారి శ్రీకృష్ణ భక్తుని వ్యాపింప చేశారంటే మన భారతదేశం యొక్క గొప్పతనం అది.
(01:30) అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన గొప్ప ఆత్మగా కొనియాడారు. ఇలాంటి మహాత్ముల గురించి మరి ఎంతో తెలుసుకుందాం.
No comments:
Post a Comment