నిమ్మరసం తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!! | Nimmarasam Side Effect | Lemon Water News | iDream
Author Name:iDream News
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamNews1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lrDLMBI5r5o
Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడును. [సంగీతం] నిమ్మకాయ నీరు తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ టైంలో చల్లటి నిమ్మరసం గొంతులో పడితే ఆ కిక్కే వేరు. విటమిన్ సి వస్తుంది బాడీ డీటాక్స్ అవుతుంది అని రోజుకి ఐదు ఆరు గ్లాసులు లాగించేస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి మీరు అమృతం అనుకొని తాగుతున్న ఆ నిమ్మరసం అతిగా తాగితే మీ ఎముకలను గుల్ల చేస్తుంది.
(00:31) మీ పళ్ళను ఊడగొడుతుంది. చివరకు మీ జీర్ణ వ్యవస్థను కూడా నాశనం చేస్తుంది. నిమ్మరసం విషయంలో నిపుణులు చెబుతున్న ఆ షాకింగ్ నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తాగితే మాత్రం ఇన్ని అనర్థాలు ఉన్నాయి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యసిడ్ కడుపులో యాసిడ్ స్థాయిలను పెంచేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్యలు ఉన్నవారు పరిగడుపున తాగితే కడుపులో మంట, వికారం, ఎసిడిటీ గ్యారెంటీ.
(00:56) ఇది ముదిరితే అల్సర్లకి దారితీస్తుంది. నిమ్మరసం అధికంగా తాగడం వల్ల మన బాడీ క్యాల్షియం ని సరిగ్గా పీల్చుకోలేదు. దీనివల్ల ఎముకలు బలహీనపడి ఫ్యూచర్ లో కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇందులోని ఆమ్ల గుణం దంతాల పైన ఉండే ఎనామిల్ పొరను కరిగించేస్తుంది. అందుకే నిమ్మరసం తాగాక పళ్ళు జివ్వు మనడం సెన్సిటివిటీ సమస్యలు వస్తాయి.
(01:18) నిమ్మరసానికి ఫోటో సెన్సిటివిటీని పెంచే గుణం ఉంది. ఇది ఎక్కువ తాగిన వాళ్ళు ఎండలోకి వెళ్తే చర్మం ఎర్రగా కందిపోవడం దురదా వంటివి వేధిస్తాయి. మరి నిమ్మరసం తాగడం మానేయాల అంటే అక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల కంటే ఎక్కువ తాగకండి పరగడుపున కాకుండా భోజనం తర్వాత తాగడం ఉత్తమం. ఆమ్ల ప్రభావం తగ్గాలంటే అందులో కొద్దిగా తేనె కలుపుకోండి.
(01:41) అన్నిటికంటే ముఖ్యంగా నిమ్మరసం తాగిన వెంటనే మంచి నీటితో నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోండి.
No comments:
Post a Comment