Monday, April 27, 2026

అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఉండే తేడా ఎలా అర్థం చేసుకోవాలి?

 అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఉండే తేడా ఎలా అర్థం చేసుకోవాలి?
ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు. కష్టపడేవాడు. కానీ అతని జీవితంలో ఒక సమస్య ఉండేది — తాను ఏ పరిస్థితులలొ ఎలా ప్రవర్తించాలో అతనికి స్పష్టత లేకపోవడం.

ఒక రోజు ఆఫీసులో అతని పని మీద మేనేజర్ చిన్న సూచన ఇచ్చాడు.
“ఇక్కడ కొంచెం మార్చితే ఇంకా బాగుంటుంది,” అన్నాడు.

రవి మనసులో రెండు స్వరాలు వినిపించాయి…

స్వాభిమానము (Self-Respect) చెప్పింది:

“ఇది నీకు ఎదగడానికి అవకాశం… విని, మెరుగుపరుచుకో.”

అహంకారం (Ego) అన్నది:

“నువ్వే బాగా చేశావు… వాళ్లకు ఏమీ తెలియదు!” అని.

రవి కొద్దిసేపు ఆలోచించాడు…

మొదట అతను అహంకారాన్ని అనుసరించాడు.
మేనేజర్‌కి ఎదురు చెప్పాడు:
“నా పని సరైనదే… మార్చాల్సిన అవసరం లేదు.”

కొన్ని రోజులకు, అదే తప్పు పెద్ద సమస్యగా మారింది.
మేనేజర్ అసంతృప్తిగా చూశాడు… సహచరులు కూడా దూరమయ్యారు.

ఆ రోజు రవి ఒంటరిగా కూర్చుని తనలోనే ఆలోచించాడు…

“నిజానికి నేను తప్పు చేశానా?
లేక నా అహంకారం నన్ను అడ్డుకుందా?” అని

ఈసారి అతను స్వాభిమానాన్ని వినాలని నిర్ణయించుకున్నాడు.

తరువాతి రోజు మేనేజర్ దగ్గరకు వెళ్లి చెప్పాడు:
“సర్, నా తప్పు అర్థమైంది… దయచేసి ఎలా మెరుగుపరచాలో చెప్పండి.”

మేనేజర్ నవ్వుతూ ... “ఇదే నిజమైన గ్రోత్.” అన్నాడు

కొన్ని వారాల్లో రవి పనితీరు మారింది…
అతనిపై అందరికీ గౌరవం పెరిగింది.

అప్పుడు రవి గ్రహించాడు:

సత్యం

“స్వాభిమానము మనల్ని ఎదగనిస్తుంది…
అహంకారం మనల్ని అడ్డుకుంటుంది.”

No comments:

Post a Comment