Sunday, April 26, 2026

*_"రిప్లై_ఇచ్చే_ముందు 3 సెకన్లు_* *_ఆగు సోదరా"_*
 
*_నాకు అర్థమైంది ఒక్కటే. గెలిచినోడు ఎప్పుడూ ఫాస్ట్‌గా మాట్లాడడు. ఫాస్ట్‌గా ఆలోచిస్తాడు._*

*_చేప ఎందుకు గాలానికి దొరకదు_*.  
*_ఎర చూడగానే లొట్టలేయదు. 3 సెకన్లు ఆగుతుంది_*. *_వాసన చూస్తుంది. దాటిపోతుంది._*

*_నీ లైఫ్‌లో "3సెకన్లరూల్" పెట్టాల్సిన 4 చోట్లు:_*

*_1. వాట్సాప్/FBలో గొడవ స్టార్ట్ అయినప్పుడు..._*  

*ఎవడో నిన్ను తిట్టాడు. వేలు టైప్ చేయడానికి దురద పెడుతుంది*.  
*ఆగు.ఫోన్ పక్కన పెట్టు. మంచినీళ్లు తాగు. 3 నిమిషాలు తర్వాత చూడు*.  
*"వీడి కోసమా నేను టైప్ చేసేది" అనిపిస్తుంది. Delete కొట్టేస్తావ్. BP కంట్రోల్.*

*2. ఇంట్లో ఆవిడ ఫైర్ అయినప్పుడు..*  

*"మీకసలు బుద్ధి లేదు" అంది. నువ్వు వెంటనే "నీకే లేదు" అంటే ఇల్లు యుద్ధభూమి.*  
*ఆగు. 3 సెకన్లు. ఊపిరి తీసుకో. "సరే, కాసేపట్లో మాట్లాడుకుందాం" అని లేచిపో*.  
*హాల్‌లోకి వచ్చి న్యూస్ పెట్టుకో*. *అరగంట తర్వాత ఆమే టీ తెస్తుంది. కేసు క్లోజ్.*

*3. ఆఫీస్‌లో బాస్ కెలికినప్పుడు..*

*మీటింగ్‌లో అందరి ముందు "ఇదేం వర్క్" అన్నాడు. ఈగో దెబ్బతింది.*
*ఆగు. 3 సెకన్లు. లేచి ఎదురు మాట్లాడితే మెమో పక్కా.*
*నవ్వి "చెక్ చేసి రిపోర్ట్ ఇస్తా సార్" అను. వాడి బ్యాటరీ డౌన్. నువ్వు సేఫ్.*

*4. రోడ్డు మీద ఎవడైనా హారన్ కొట్టి తిట్టినప్పుడు..* 

*వెంటనే బండి ఆపి వెనక్కి తిరిగితే పోలీస్ స్టేషన్,* *హాస్పిటల్ రెండిట్లో ఒకటి గ్యారెంటీ.* 
*ఆగు. 3 సెకన్లు. లెఫ్ట్‌కి తీసి పోనివ్వు. 10 సెకన్ల లేట్ తప్ప ప్రాణం దక్కుతుంది*.

*_మా నాన్న లాజిక్:_*

*"ఉడుకు నీళ్లలో చెయ్యి పెడితే కాలుతుందిరా. 3 సెకన్లు ఆగి చూస్తే ఆవిరి తెలుస్తుంది."*
*మనుషుల మాటలు కూడా ఉడుకు నీళ్లే సోదరా. డైరెక్ట్‌గా దూకకు*.

*_#Practical_Hack:_*

*ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలనిపిస్తే ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకో*.  
*టైప్ చేసిన మెసేజ్‌ని Send కొట్టకుండా సేవ్ చేసుకో. 1 గంట తర్వాత చదువు.*
*90% టైమ్ "థాంక్స్ గాడ్ పంపలేదు" అంటావ్.*

*So Be Like The Fish.*

*గాలం = ఇన్‌స్టంట్ రియాక్షన్.*  
*3 సెకన్లు ఆగు.* *వాసన చూడు. సేఫ్‌గా ఈదుకుంటూ పో.*
*సముద్రం అంతా నీదే.*

*నీ లైఫ్‌లో "3 సెకన్లు ఆగి" బతికిపోయిన సీన్ ఏదైనా ఉందా?*
*కామెంట్‌లో చెప్పు. నీ 3 సెకన్లు ఇంకొకడి 3 ఏళ్లు కాపాడొచ్చు.*

No comments:

Post a Comment