Sunday, April 26, 2026

స్త్రీ కి చాణక్యుడు చెప్పిన 7 సూత్రాలు.chanakya niti@nandurihemamalini

స్త్రీ కి చాణక్యుడు చెప్పిన 7 సూత్రాలు.chanakya niti@nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hwHAETctSsQ



Transcript:
(00:00) శ్రీమాత్ర నమః ఒక మహిళ ఎలా ఉంటే విజయాన్ని సాధించగలదు తెలివైన మహిళ ఎలా ఉండాలి అనేది చాణకుల వారు చెప్పారు ఇది ఒక మహిళకు మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది. చాణక్యుడు దృష్టిలో మహిళకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి ఆవిడ సమయము అలాగే శక్తి ఇవి ఖర్చు పెట్టేస్తే తిరిగి మళ్ళీ రావు. బంగారు జింక కోసం సీతమ్మ అడిగినప్పుడు రామచంద్రమూర్తి అది మాయాజింక అని తెలిసి కూడా వెనకాల వెళ్ళారు.
(00:32) శక్తిని కాలాన్ని వృధ చేసి కష్టాలని కొని తెచ్చుకున్నారు ఇది మనకి చెప్తున్నారు అన్నమాట రామచంద్రమూర్తి మనం కూడా ప్రతిరోజు ఎందరో బంగారు జింకల వెనుక పరిగెడుతూ ఉంటాం కదా అంటే అవసరం లేని పనులు అవసరమైన మాటలు ఎవరో మనల్ని ఏదో అన్నారు అని గంటల తరబడి ఆలోచించడం వాళ్ళ వెనకాల పరిగెత్తడం ఇవన్నీ మన సమయాన్ని తినేసే మాయాజిక్కలు దీని వల్ల మన విచక్షణజ్ఞానం నశించిపోతుంది సావిత్రి ఆవిడ భర్త ప్రాణాలు పోయినప్పుడు యమధర్మరాజు వెనకాలే వెళ్ళారు ఆవిడ ఏడుస్తూ కూర్చోలేదు తన శక్తిని వృధా చేసుకోలేదు ఆవిడ శక్తి అంతా వాక్ చాతుర్యం మీద పెట్టారు యముడి వెంట నడుస్తూనే సమయానికి
(01:16) సరైన ప్రశ్నను వేసి యముడిని మెప్పించి తన భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చారు అంటే ఆపదలో ఉన్నప్పుడు ఏడవడం వల్ల మన శక్తి వృధ అయిపోతుంది కానీ ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అని సావిత్రి కథ ద్వారా మనకి తెలుస్తుంది. తెలివైన మహిళ కన్నీటికి ఇచ్చే విలువ కంటే కూడా తన ఆలోచనకి ఇచ్చే విలువే ఎక్కువగా ఉండాలి అప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.
(01:42) ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిలో ఉన్నాము అని అనుకోండి ఆ పనిని వదిలిపెట్టేసి మరి ఎవరైనా ఫోన్ చేశారు అంటే మాట్లాడతాం. పనికవచ్చే పని అలాగే నిజంగానే మనం సమయం వెచ్చించాల్సింది అని అనుకోండి ఎలాగో వెచ్చిస్తాం. కానీ కొన్ని కొన్ని వృధాగా మాటలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో కూడా మనం అత్యంత ముఖ్యమైన పనిలో ఉన్న నో చెప్పలేక అలా మాట్లాడుతూ ఉంటే మన సమయం వృధా అయిపోతుంది కదా ఆ తర్వాత అనుకుంటాం ఫోన్ పెట్టేసాక అబ్బా సమయం వృధా అయిపోయింది సమయాన్ని అనవసరంగా నేను వృధా చేసుకున్నాను అని మనం ఎప్పుడైతే అనవసరంగా వృధాగా సమయాన్ని వదిలి పెడతామో అప్పుడు మన గౌరవం కూడా కోల్పోతాం ఫోన్ లో
(02:19) బ్యాటరీ ఒక 10% ఉందనుకోండి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం ఎంత జాగ్రత్తగా ఉంటాం ఆ శక్తి ఖర్చు అయిపోకూడదని మన శరీరం కూడా అలాంటిదే కదా మన శరీరంలో మన మనసులో ఉండే శక్తి కూడా పరిమితంగా ఉంటుంది కాబట్టి వృధాగా ఖర్చు పెట్టకూడదు మనం ఇతరుల కోసం జీవించడం చాలా గొప్ప కానీ మన అస్తిత్వాన్ని చంపుకొని మరి మనం త్యాగం చేయవలసిన అవసరం లేదు మనం ఎవరికైనా సమయం ఇస్తున్నాము అంటే మన జీవితంలో ఒక భాగాన్ని వాళ్ళకి బహుమతిగా ఇస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి ఆ బహుమతి అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అంటే అర్హులైన వాళ్ళకి మాత్రమే సమయాన్ని ఇవ్వాలి. మనం ఈ
(02:58) ప్రపంచానికి ఒక అద్భుతం అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మన శక్తిని ఇతరుల విమర్శల మీద పనికిరాని చర్చల మీద ఖర్చు పెడితే మన కాలాన్ని మనమే వృధా చేసుకుంటున్నాం. మన కాలాన్ని మన జ్ఞానం పెంచుకోవడం కోసం మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసం పెట్టుబడిగా పెట్టుకోవాలి తప్ప వృధా కాలక్షేపం అస్సలు చేయకూడదు. కాలం అన్నిటికంటా బలమైనదని చాణిక్కుల వారు చెప్తారు.
(03:27) ఆ కాలాన్ని మనం గౌరవిస్తే రేపు ఈ ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. మనం సమయాన్ని వృధా చేసుకుంటే మనం కూడా వృధాగానే మిగిలిపోతాం. మనం ఎప్పుడైతే కాలాన్ని గౌరవిస్తామో సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటామో మన సామ్రాజ్యం ఆటోమేటిక్ గా నిర్మించబడుతుంది. అలానే మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం ఒక మహిళ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం వల్ల అసలు ఆ పవర్ గురించి చాణుక్యుల వారు ఎంత అద్భుతంగా చెప్తారు అంటే జ్ఞానినాం మౌనం భూషణం ఇది మహిళకి మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది.
(04:06) జ్ఞాని అయినవాడు మౌనాన్ని ఆభరణంగా ధరిస్తాడు. తన శత్రువైనా మిత్రుడైనా ఒకే రకమైన స్థిత ప్రజ్ఞతతో చూడగలిగినప్పుడే ఆ మనిషికి తిరుగులేని శక్తి వస్తుంది. అరిచేస్తే శక్తి ఏమ ఉండదు మనం అరిచేస్తే మాట వినేస్తారా కానీ మనం మౌనంగా ఉన్నాము అని అనుకోండి చాలా శక్తివంతంగా ఉంటుంది. మనం ఎంత తొందరగా స్పందిస్తే మన బలహీనతను ఎదుటివాడు అంతగా అంత తొందరగా ఎన్కేష్ చేసుకుంటాడు.
(04:35) అంతే కదా అందుకే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆలోచించకుండా వెంటనే కోప్పడకూడదు అలా కోప్పడితే మన బలహీనత మన బలహీనతని ఎదుటివాడు చాలా తొందరగా తీసుకుంటాడు అంటే మనల్ని వాడి చేతిలోకి తీసుకుంటున్నాడు రిమోట్ కంట్రోల్ వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు మనం మన కంట్రోల్ ని మనలో ఉంచుకోవాలి తప్ప మన రిమోట్ ని ఎదుటివాడి చేతిలో ఎప్పుడూ పెట్టకూడదు.
(05:00) ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శిస్తే నిశబ్దంగా ఉండి పరిస్థితులను విశ్లేషించి అవసరమైతే అది కూడా సరైన సమయంలో స్పందించడం మాత్రం చాలా బలం అన్నమాట అంతే తప్ప వెంటనే మాత్రం ఎప్పుడూ స్పందించకూడదు. ఒక తెలివైన మనిషి మౌనం అనే ఆయుధాన్ని వాడినప్పుడు ఎదుటి వాళ్ళలో ఒక రకమైన భయం మొదలవుతుంది. అదేంటి నేను ఇంత అంటున్నా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనే సందేహం వాళ్ళలో కలుగుతుంది. అదే అసలైన విజయం.
(05:28) మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న విమర్శలను ఎదుర్కుంటాం అది సహజం ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనకి కోపం వస్తుంది కానీ ఆ క్షణంలో మనం కూడా అరిచేసాము అని అనుకోండి వాళ్ళ స్థాయికి మనం పడిపోయినట్లే మౌనం అంటే చేతకాంతనం కాదు సముద్రం చాలా లోతుగా ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సముద్రంలో ఎంత శక్తి ఉంటుంది ఎంత నిక్షిప్తమైపోయి ఉంటుంది శక్తి అలలు మాత్రమే పైకి ఎగురుతూ శబ్దం చేస్తూ వస్తాయి.
(05:58) అందుకే ఆచార్య చాణిక్యులు ఏం చెప్తారు అంటే నీ కళ్ళల్లో కన్నీరు వచ్చిన నీ శత్రువుకు మాత్రం నీ బాధ తెలియనివ్వకు ఎందుకంటే నువ్వు బాధ పడితే ఆ బాధ నీ శత్రువుని ఉత్సాహ పరుస్తుంది నువ్వు చిరునవ్వుతో ఉంటేనే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఈ ప్రపంచంలో మన ప్రశాంతతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికి లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ గా రియాక్ట్ అయిపోతే మన గౌరవం తగ్గిపోతుంది తప్ప పెరగదు.
(06:26) ఏదైనా సమస్య వస్తే ఒక్క క్షణం ఒక్క క్షణం అక్కడ పాస్ పెట్టుకోండి అలా పాస్ పెట్టుకొని మౌనంగా ఉంటే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మన శత్రువుకి మనం ఇచ్చే అతి పెద్ద శిక్ష ఏంటో తెలుసా మౌనం ఆ సైలెంట్ పవర్ ని గుర్తిస్తే సామాన్యులు కూడా శక్తివంతులుగా తయారవుతారు. అలాగే మన నిర్ణయాలు అందరికీ చెప్పుకుంటూ పోయాము అని అనుకోండి మన కాలాన్ని వృధా చేసుకుంటాం మన గౌరవం పోతుంది మనసా చింతితం కార్యం వాచానైవ ప్రకాశయేత్ మంత్రేన రక్షయేత్ గూడం కార్యేచాపి నియోజయేత్ అని మనం ఏదైనా మనసులో అనుకున్నాం అనుకోండి ఆ నిర్ణయాన్ని వెంటనే మనం బయటికి చెప్పకూడదు దాన్ని
(07:06) రహస్యంలా కాపాడుకోవాలి మన పని పూర్తి అయిపోయిన తర్వాత మన పని పూర్తిగా అయిపోయి ఆచరణలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మన పనిని మాత్రమే చూపించాలి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరికీ వివరించి చెప్పేసామ అని అనుకోండి అందులో 100 తప్పులు వెతుకుతారు నువ్వు ఇలా చెయి అలా చెయి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు అలా వాళ్ళు చెప్తుంది వింటూ ఉంటే మన శక్తి పోతుంది మన శక్తి అంతా వాళ్ళకి మళ్ళీ వివరణ ఇచ్చుకోవడానికే సరిపోతుంది కాబట్టి మన మన పని పూర్తి అయిపోయే వరకు ఎవ్వరికీ మన పని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన విజయం మాట్లాడాలి మనం
(07:40) మాట్లాడక్కర్ల కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు ఇతరులకి చాలా తప్పుగా గా అనిపించొచ్చు కానీ మనం తీసుకున్న నిర్ణయం మనం చేరుకోవలసిన లక్ష్యానికి మన కుటుంబ బాధ్యతలకి సరైనది అని అన్నప్పుడు మనం ప్రపంచం కోసం మన నిర్ణయాలని మార్చుకోవాల్సిన అవసరము లేదా వివరించాల్సిన అవసరం ఎప్పుడూ లేదు మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం చేస్తున్న పని ఏంటో తెలుసు ఎందుకంటే మన గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ద్వేషించే వాళ్ళు మనం ఎంత వివరణ ఇచ్చినా దాన్ని వాళ్ళు ఇంకొక విధంగా వక్రీకరిస్తారు మనం వివరణ ఇస్తున్నాము
(08:15) అంటే అవతల వాళ్ళ కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నాము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనం పరోక్షంగా తప్పు చేశాము అని ఒప్పుకుంటున్నట్లు అర్థం అన్నమాట మనం అనవసరంగా వివరణ ఇస్తూ ఉంటే అందుకే ఒక మహిళ తన నిర్ణయం మీద తాను నిలబడాలి అలా నిలబడితే ఎప్పటికైనా విజయం మనదే సింహం వేటాడే ముందు ఎవరికీ వివరణ ఇవ్వదు మనం కూడా సింహంలా ఉండాలి మన విజయమే మన తరపున మాట్లాడాలి వివరణలు ఇవ్వడం మానేయాలి.
(08:44) అలాగే ఒక మహిళ తన జీవితంలో అంచనాలను తగ్గించుకోవటం అలాగే ముందస్తు సిద్ధపాటు అంటే ప్రిపరేషన్ అన్నమాట లో ఎక్స్పెక్టేషన్స్ ప్రిపరేషన్స్ ఈ రెండు సూత్రాలని పాటించాలి. ఆచార్య చాణకుడు ఏం చెప్తారు అంటే ఆసానామ మనుష్యానాం కాచిదాశ్చర్య శృంఖల యయాబద్ధ ప్రధావంతి ముక్తస్తిష్టంత పంగువత్ అంటారు ఈ ఆశ అనేది మనకు తగిలించిన ఒక వింతైన గొలుసు అన్నమాట ఈ గొలుసుతో కట్టబడిందాం అనుకోండి మనకు అశాంతి పెరిగిపోతుంది ఆ అశాంతితో అటు ఇటు పరిగెడుతూ ఉంటాం ఆ గొలుసు నుంచి మనం బయటికి వచ్చేసాము అని అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటాం.
(09:22) మనం ఇతరుల మీద ఏదైనా ఒక అంచనా పెట్టుకుంటే మనం మన చేతులకి మనమే వేసుకున్న సంకెళ్లు అన్నమాట. ఆ అంచనా అందనప్పుడు మనం బాధపడతాం మనం కృంగిపోతాం అందుకే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించి మన శక్తి మీద మనం నమ్మకాన్ని పెంచుకోవాలి. పాండురాజు మరణించినప్పుడు కుంతిదేవి ఒంటర అయిపోయారు కదా అడవిలో ఐదుగురు చిన్న పిల్లలతో ఆమె ఉన్న పరిస్థితి అత్యంత దారుణం.
(09:45) ఆవిడ హస్తినాపురానికి తిరిగి వచ్చారు. తన పిల్లల్ని కేవలం రాజకుమారులుగా మాత్రమే కాకుండా ఏ కష్టాన్నైనా తట్టుకునే వీరులుగా తీర్చి దిద్దారు. కుంతిదేవి కౌరవులు తమని ప్రేమిస్తారని అంచనా వేయలేదు వాళ్ళు హాని చేస్తారని ముందే ఊహించి ప్రిపేర్ అయి ఉన్నారు అందుకే తన కుటుంబాన్ని కాపాడుకోగలిగారు. మన సంతోషం కోసం మనం ఎప్పుడూ ఇంకొకరి మీద ఆధారపడకూడదు.
(10:13) ఒకవేళ ఆ మనిషి మనల్ని దూరం పెట్టారు అని అనుకోండి. ఒంటరిగా ఉన్నా మనం సంతోషంగా ఉండేలాగా మనకంటూ ఒక హాబీ గాని ఒక లక్ష్యం గాని ఉండాలి అలా ఉంటే ఎవరైనా మనల్ని దూరం పెట్టినా మనం అస్సలు బాధపడం. నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం చేసే సాయం తిరిగి ఏదో ఆశించి చేస్తే అది వ్యాపారం అవుతుంది.
(10:40) ఏది ఆశించకుండా చేసాము అని అనుకోండి అది మన వ్యక్తిత్వం అవుతుంది. మన విలువని నిర్ణయించే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చామ అన్నమాట. భవిష్యత్తు గురించి భయపడకుండా సిద్ధపడండి ఏం జరిగినా ఎదుర్కోవాలి ఎదుర్కుంటాను అని. తుఫాను రాకముందే గొడుగు సిద్ధం చేసుకునేవాడు తెలివైనవాడు కష్టం రాకముందే మానసిక ధైర్యాన్ని ఆర్థిక స్వతంత్రాన్ని సిద్ధం చేసుకునే మహిళే చాణక్య మహిళ అని చెప్పొచ్చు.
(11:12) ఈ ప్రపంచం మన అంచనాల ప్రకారం నడవదు మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు మనం నమ్మిన వాళ్ళు మనల్ని వదిలేయచ్చు కానీ మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఏ తుఫాను అప్పుడు మనల్ని ఏది చేయలేదు గౌరవం లేని చోట మౌనంగా అక్కడి నుంచి బయటికి వచ్చేయాలని ఆచార్య చాణిక్యులు చెప్తారు. [గురకలు] యస్మిన్ దేశేన సమ్మానో నవృత్తిర్తచ బాంధవః నచవిద్యా గమః కశచిత్తం దేశం పరివర్జయేత్ ఎక్కడైతే నీకు గౌరవం లభించదో ఎక్కడైతే నీ ఎదుగుదలకు అవకాశం ఉండదో నీ ఆత్మీయులు ఉండరో ఆ ప్రదేశాన్ని ఆ వ్యక్తులను వెంటనే వదిలిపెట్టు మనకి గౌరవం లేని చోట మనం ఉంటే మన ఉనికిని మనం అవమానించుకోవడం అన్నమాట మనం ఎంత మంచి
(11:58) వాళ్ళమైనా ఎదుటివారికి మన విలువ తెలియనప్పుడు అక్కడ ఉండడం వల్ల మన శక్తి క్షీణిస్తుంది తప్ప మార్పు అస్సలు రాదు అందుకే మనల్ని ఎవరైనా సరే ఇగ్నోర్ చేస్తున్నారు అంటే వాళ్ళు మనల్ని మానసికంగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా వాళ్ళు చుట్టూ తిరిగి నేనుఏం తప్పు చేశాను ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు ఎందుకు నాతో ఇలా ఉన్నావు అని అడిగాము అంటే దానివల్ల గౌరవం మరింత తగ్గిపోతుంది.
(12:31) ఎవరో మనల్ని ఇగ్నోర్ చేయడానికి ముందే మనం ఆ విషయాలను తెలుసుకున్నప్పుడు మనమే మన జీవితం నుంచి వాళ్ళని తొలగించేయాలి మానసికంగా మనం పనిలో ఉండి మనం బిజీగా ఉంటే ఏదో ఒక రోజు మనల్ని ఇగ్నోర్ చేసిన వాళ్లే మనకోసం ఎదురు చూస్తారు అలా ఎదురు చూసేలాగా చేయటమే మన జీవితంలో ఎదగడం అన్నమాట మనల్ని తక్కువ చేసి ఎవడైనా మాట్లాడుతున్నాడు అనుకోండి వాడు మన జీవితంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే వాడు మన ఆత్మవిశ్వాసాన్ని నెమ్మది నెమ్మదిగా చంపేస్తాడు.
(13:04) అద్దం పగిలిపోతే అతికించచ్చు కానీ ఆత్మగౌరవం దెబ్బ తింటే ఆ మనిషి బ్రతికున్న సెవెన్తో సమానం గౌరవం లేని చోట మనం ఎంత మంచిగా ఉన్నా మనం మంచితనం చూపించినా అది మన చేతకానితనంఅని ఎదుటివాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి మన మౌనం సమాధానంగా ఉండాలి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతే మన విలువ వాళ్ళకి తెలుస్తుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు బాధ పడలేదు అంటే వాళ్ళకి బాధ లేదు అంటే అసలు అలా బాధపడాలని ఆశించడమే తప్పు కానీ తెలుస్తుంది కదా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాధపడలేదు బాధగా లేరు అంటే అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉండడానికి అర్హులు కాదు అని అర్ధం చేసుకోవాలి మన
(13:45) విలువను ఇతరుల అంచనాలకి ఎప్పుడు వదిలి పెట్టకూడదు ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే వాళ్ళతో వాదించకండి ఒక్క మాట కూడా అనకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోవాలి మనుషులు మన మాటల్ని మర్చిపోవచ్చు కానీ వాళ్ళు మనకఇచ్చిన గౌరవాన్ని మీరు పొందిన అవమానాన్ని కాలం గుర్తించుకుంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం గౌరవించుకోవాలి మనల్ని మనం రాణిలా చూసుకుంటేనే ఈ ప్రపంచం మనకి కిరీటం పెడుతుంది.
(14:20) మన ఆత్మ గౌరవమే మన కిరీటం ఆ మాట ఎప్పటికీ ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అలాగే ఆర్థిక స్వాతంత్రం ఒక మహిళకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి ఇది కేవలం అవసరం మాత్రమే కాదు అది ఒక ఆవశ్యకత అర్థాత్ సర్వాణి కార్యాన్ని సిద్ధ్యంతి నాత్ర సంశయః ధనం ఉంటేనే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలామంది అంటూ ఉంటారు డబ్బు ఉంటేనే జీవితమా అని డబ్బు ఉంటేనే జీవితమా కాదు డబ్బు ఉండాలి ఖచ్చితంగా డబ్బు లేకపోతే విలువ ఉంటుందా చెప్పండి ఇక్కడ చాణక్యుడు దృష్టిలో లో ధనం అంటే కేవలం విలాసం కాదు అది ఒక రక్షణ కవచం ఒక మహిళ తన అవసరాల కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం ఇంకొకరి మీద
(15:04) ఆధారపడినప్పుడు ఆమె తన స్వేచ్ఛని నిర్ణయాధికారాన్ని పరోక్షంగా కోల్పోతుంది. పరిస్థితులు అనుకూలించలేదు అని అనుకోండి అనుకూలించనప్పుడు అది ఒక మహిళ కాదు ఎవరైనా సరే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే అలా ఆర్థిక స్వాతంత్రం లేని వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. ఎంతోకంత సంపాదించు న్యాయంగా సంపాదించు నీ సంపాదన నువ్వు ఎంత న్యాయంగా సంపాదిస్తావో అది నీ గౌరవాన్ని పెంచుతుంది.
(15:37) సంపాదిస్తే దాన్ని అహంకారంగా మనం ఎప్పుడూ పరిగణించకూడదు. అది ఆత్మవిశ్వాసంగా పరిగణించి మనం మన కాళ్ళ మీద నిలబడితే సమాజం మనల్ని గౌరవిస్తుంది. మనం సంపాదిస్తున్నప్పుడు మన మాటకి ఉండే గౌరవం ఎదుటివాళ్ళు అడిగేటప్పుడు ఉంటుందా మనం సంపాదిస్తే మనకి విలువిస్తారు. అదే మన దగ్గర ఏది లేనప్పుడు ఎదుటి వాళ్ళ ముందు చేయి చాచామ అని అనుకోండి ఇది ఎప్పుడ అడుగుతూనే ఉంటుంది అని అనుకుంటారు కదా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనారోగ్యం రావచ్చు అనుకొని ఆపదలు రావచ్చు అప్పుడు మనం ఎవరి దగ్గరో చేయి చాచకుండా మన దగ్గర ఉండే చిన్న ఆదాయమే మనల్ని మహారాణి లాగా నిలబడుతుంది. సంపాదన అంటే లక్షల్లో
(16:17) ఉండక్కర్లా మనకున్న ఏదో ఒక స్కిల్ అది వంట కావచ్చు కుట్టు పని కావచ్చు ప్రైవేట్లు చెప్పడం కావచ్చు ఏదైనా సరే ఏదైనా సరే మీకంటూ ఒక ఖర్చు పెట్టుకోగలిగే స్వతంత్రం ఉండాలి ఆర్థిక స్వతంత్రం అంటే ఎవరినో ఎదిరించడం కాదు ఎవరికీ తలవంచకుండా బ్రతకటం ఈ రోజు నుంచే ఏదో ఒకటి నేర్చుకోండి మనకంటూ ఒక చిన్న ఆదాయ మార్గాన్ని సృష్టించుకుంటే చాణక్యుల వారు చెప్పినట్టు ధనమే ప్రపంచానికి వెలుగు ఆ వెలుగు మన చేతిలో ఉంటే మన జీవితంలో చీకటి అనేది ఉండదు.
(16:54) మనం ఎవరి మీద ఆధారపడనప్పుడు మన ఆత్మవిశ్వాసం ఆకాశంఅంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలలో అంటే ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం వల్ల గాని మనల్ని గౌరవించకుండా మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసం చేయటం గాని మనం నో అని చెప్పలేకపోవటం వల్ల పడిన ఇబ్బందులే గాని ఇవి ఎవరైనా ఏదైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. మీరు పడిన ఇబ్బంది ఇంకొకరు పడకుండా వాళ్ళు కూడా ముందు జాగ్రత్త తీసుకోవడానికి మీ కామెంట్ ఎంతో ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment