Monday, April 27, 2026

ఇనుప కచ్చడాలు II vNASHanam II Telugu Podcast

ఇనుప కచ్చడాలు II vNASHanam II Telugu Podcast

Author Name:vNASHanam

Youtube Channel Url:https://www.youtube.com/@vnashanam3332

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ecCHUx58xcg



Transcript:
(00:00) హలో ఎవ్రీవన్ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా పాపులర్ అయిన ఒక జోక్ తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక రాజుగారి యుద్ధానికి వెళ్తూ రాణిగారి పాతివృత్యం కాపాడటానికి రాణిగారి చేత ఒక ఇనప గోచి కట్టించి దానికి భద్రంగా తాళం వేసి ఆ తాళం చెవిని ఆయన యుద్ధానికి తీసుకెళ్ళకుండా తన నమ్మిన బంటుని పిలిచి ఆ తాళం చెవి ఇస్తూ ఆ చూడు రాణిగారి పాతివృత్యం కాపాడాల్సిన బాధ్యత నీ చేతిలోనే ఉంది.
(00:28) ఈ తాళం చెవిని భద్రంగా ఉంచుకొని దగ్గర నేను యుద్ధాన్న నుంచి వచ్చిన తర్వాత ఈ తాళం చెవి తీసుకుంటాను అని చెప్పి యుద్ధానికి బయల్దేరాడట. రాజుగారు ఒక పద అడుగులు వేసాడో లేదో ఈ నమ్మిన బంటు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజ మహారాజా మీరు ఇచ్చిన తాళం చెవి ఆ గోచి తాళంలో పట్టట్లేదు అన్నాట ఇటువంటి సందర్భానికి సంబంధించిందే తెలుగులో మనక ఒక సామెత ఉంది.
(00:52) ముద్ర ముద్రలాగే ఉంది ముగ్గురు బిడ్డలని కన్నది అని ఈ జోక్ అర్థమైనా కాకపోయినా డెఫినెట్లీ ఒక అనుమానం అయితే వస్తుంది. గోచి క్లాత్ తో చేయకుండా ఇనుముతో చేయడం ఏంటి దాని రాజుగారు రాణి చేత కట్టించడం ఏంటి దానికి అసలు తాళం వేయడం ఏంటి ఇదివరకు రోజుల్లో ఏమనా గోచీలు ఇనుముతో తయారు చేయించే వాళ్ళా అసలు ఈ ఆచారం ఎందుకు మొదలైంది ఎలా మొదలైంది ఏదైనా పుస్తకాల్లో దీని గురించి అసలు మెన్షన్ చేశారా ఎవరైనా అసలు చూశారా ఇన్ని అనుమానాలు మనకు వస్తాయి కదా ఈ అనుమానాలన్నీ తీరాలంటే తాపి ధర్మారావు గారు రాసిన ఇనుప కచ్చడాలు అనే పుస్తకం పుస్తకం గురించి తెలుసుకోవాలి. కచ్చడము అంటే కౌపీనము లేదా
(01:33) గోచి ఈ కౌపీనాన్ని ఇనుపుతో తయారు చేశారు కాబట్టి ఇనుప కచ్చడాలు అన్నారు. ఇంక పుస్తకంలోకి వెళ్లి ఈ ఇనుప కచ్చడాల గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. [సంగీతం] ఆస్తి వారసత్వంగా సంక్రమించే పద్ధతి లేని రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. కుటుంబాలు ఏర్పడి తండ్రి నుంచి కొడుక్కి ఆస్య సంక్రమించే పద్ధతి మొదలైనప్పటి నుంచి అప్పటివరకు ఉన్న పరిస్థితి తలకిందులయి పితృస్వామ్య వ్యవస్థ మొదలైంది.
(02:04) సృష్టిలో ఉన్న అన్ని జంతువులలాగే మనిషి కూడా ఒక జంతువే మన్ ఇస్ ఏ సోషల్ అనిమల్ అంటాం కదా అన్ని జంతువుల్లో ఉన్న లక్షణాలే మనిషిలో కూడా ఉన్నాయి. కానీ మనిషి జంతువుల కంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. దానికోసం ఇంద్రియ నిగ్రహం కోసం తాపత్రయ పడ్డాడు. దీనికోసం రకరకాల పద్ధతులను అవలంబించాడు. ఈ ఇంద్రియ నిగ్రహ ప్రయత్నంలో ఏర్పడినవే ఈ ఇనుప కచ్చడాలు మన దగ్గర ఉన్న బంగారం ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టలో పెట్టి దానికి తాళం వేసి ఆ తాళం చెవిని దాచి పెడతాం పశువుల్ని కూడా మన ఆస్తిలాగే కదా మనం భావిస్తాం మన దగ్గర ఉన్న పశువుల్ని వేరేవాళ్ళు ఎక్కడ
(02:40) వాడేసుకుంటారో అని మన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి వాటిని కట్టేసి పెడతాం కదా అలాగే ఇనుప కచ్చడాల్ని తమని తాము నిగ్రహించుకోవడానికే కాకుండా వాళ్ళకి ఆస్తిగా లభించిన స్త్రీ గాని పురుషుడు కానీ ఎవరు ఆస్తిగా వస్తే వాళ్ళని వేరేవాళ్ళు ఉపయోగించుకోకుండా కాపాడుకోవడానికి అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చదువుకొని వాళ్ళ చేత ఇనప కట్టడాలు కట్టించి వాటికి భద్రంగా తాళాలు వేయడం మొదలు పెట్టారు.
(03:08) మొదట శరీర అవయవాలకే చిల్లులు పెట్టి తాళాలు వేసే ఆచారం ఉండేదిట. కానీ అది చాలా కష్టంగా ఉందని బెల్ట్ పద్ధతి మొదలైంది. పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్లి తర్వాత మాత్రం ఈ పతివ్రత ధర్మాన్ని పాటించడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. పురుషులు అధికారంలో ఉన్నచోట స్త్రీల చేత స్త్రీలు అధికారంలో ఉన్న చోట పురుషుల చేత ఈ ఇనుప కచ్చడాలు కట్టించేవాళ్ళు.
(03:29) కానీ దాదాపు అన్ని పేట్రియార్కిల్ సొసైటీస్ే కాబట్టి పురుషుడు స్త్రీని తన బానిసగా భావించడం మొదలు పెట్టాడు. పాతిమృత్యం గురించి ధర్మ సూత్రాలు వల్లించాడు కావ్యాలు రాశాడు గదుల్లో పెట్టి నిర్బంధించారు అయినా కూడా వాళ్ళ అనుమానం పోలేదు. చివరికి ఇనుప కచ్చడాలు బిగించారు. మగవాడు దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు భార్యను ఒక్కదాన్ని వదిలేస్తే ఏమనా డేంజర్ జరగొచ్చు కదా అందుకని భార్య చేత ఈ ఇనుప కచ్చడం తొడిగించి దానికి తాళం వేసుకుని ఆ తాళాన్ని అతనితో తీసుకెళ్ళేవాడు.
(03:58) వీడియో స్టార్టింగ్ లో ఒక జోక్ చెప్పాను కదా అది ఈ సందర్భానికి సంబంధించింది అన్నమాట. ఆ జోక్ ఏంటో ఇప్పుడు అర్థమయిందా అలా తాళం తీసుకెళ్ళిన భర్త ఒకవేళ చనిపోయి ఇంటికి గనుక తిరిగి రాకపోతే ఆ ఇనప కచ్చడం యొక్క తాళం చెవి తీసేవారు ఎవరు లేక ఆ భార్య చచ్చిపోయేదాకా ఇనప కచ్చడాన్ని అలాగే ఉంచుకోవాల్సి వచ్చేసేది అంతా బానే ఉంది శాసనాల్లో పుస్తకాల్లో చదవటం కచ్చడాలు కట్టుకున్న శిల్పాలు చూడటమేనా లేకపోతే దీనికి అసలు ప్రత్యక్ష ప్రమాణం ఏమన్నా ఉందా అసలు ఎవరైనా కట్టుకున్న మనిషిని చూశారా అని అనుమానం వస్తుంది కదా 1889 లో ఆస్ట్రియా దేశంలో ఉన్న లిన్స్ అనే ఊరిలో
(04:36) ఒక చర్చ్ కి రిపేర్ చేస్తూ ఒకచోట తవ్వుతుంటే ఒక కాఫిన్ బయటపడింది. ఆ కాఫిన్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో 16th సెంచురీకి చెందిన ఒక స్త్రీ అస్తి పంజరం బయటపడింది. ఆ అస్తి పంజరానికి ఈ ఇనుప కచ్చడం బిగించి ఉందిట. ఆ టైంలో అక్కడే ఉన్న పచింజర్ అనే ఒక యాంటిక్ డీలర్ ఆ ఇనుప కచ్చడాన్ని కలెక్ట్ చేసి తన యాంటీ కలెక్షన్ లో పెట్టుకున్నాడు.
(04:59) సర్ప్రైజంగ్లీ ఆయన యాంటిక్ కలెక్షన్ లోంచి ఈ ఇనుప కచ్చడం మిస్ అయిపోయింది. అదేకాకుండా అప్పటిదాకా మ్యూజియమ్స్ లో డిస్ప్లే కి పెట్టిన రకరకాల రాణులు వేసుకున్న ఈ కచ్చడాలు స్కాండల్ రావడంతో వీటన్నిటిని తీసేసారు. బాబిలోనియా, సుమేరియా, గ్రీస్, రోమ్ లాంటి ఏన్షియంట్ సివిలైజేషన్స్ తో పాటు ఇప్పటి దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లో కూడా వీటి ప్రచారం బాగా జరిగినట్టు తెలుస్తోంది.
(05:30) 13 సెంచురీ నుంచి 20త సెంచురీ దాకా అంటే 700 ఇయర్స్ పాటు ఈ కచ్చడాలు బాగా వాడుకలో ఉన్నట్టు రికార్డ్ అయింది. ఇటలీకి చెందిన క్యాథలిక్ నన్స్ సెలబసీ ప్రాక్టీస్ చేయడం కోసం వీటిని వాడేవాళ్ళు 1990స్ ప్రాంతంలో న్యూస్ పేపర్ లో ఈ కచ్చడాల గురించి అడ్వర్టైస్మెంట్స్ కూడా బాగా పడేవి. యూరోప్ లో కొన్ని చోట్ల భార్యలు కంప్లైంట్ ఇవ్వటంతో వాళ్ళ చేత ఈ కచ్చడాలు కట్టించినందుకు భర్తలకి జైల్ శిక్షలు కూడా వేశారు.
(05:56) అంతా యూరోప్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఇదేదో వెస్ట్ కి సంబంధించిన విషయం అనుకుంటున్నారేమో ఇటలీలో ఈ కచ్చడాలు పుట్టాయని అంటారు కానీ యాక్చువల్ గా ఇది ఈస్ట్ లో మొదలై వెస్ట్ కి స్ప్రెడ్ అయింది అంటారు రచయిత పిప్పిలచదము అని ఆంధ్ర సంస్కృత కవులు వర్ణించింది కూడా ఈ కచ్చడం గురించే అలాగే జపాన్లో స్నానం చేసేటప్పుడు ఆడవాళ్ళు ధరించే ఆ పరికరం కూడా దీనికి సంబంధించిందే అని చెప్తున్నారు.
(06:20) ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు ఈ రోజుల్లో మన ఈస్ట్ వాళ్ళము అంటే అంత నాగరికత ఎక్కువ లేని వాళ్ళం వెస్ట్ అయితే చాలా నాగరిక దేశం అన్న అభిప్రాయం ఉంది కదా కానీ పాత రోజుల్లో వెస్ట్ వాళ్ళని సంబోధించడానికి అప్రాచుడు అనే పదం వాడేవాళ్ళట ప్రాచి అంటే తూర్పు అని అప్రాచి అంటే తూర్పువాడు కాదు అని అర్థం కానీ ఒక అర్థమే కాకుండా అనాగరికుడు అనే అర్థం కూడా వచ్చేటట్లు ఈ పదాన్ని వాడేవాళ్ళట అంటే పశ్చిమ దేశాలకి చెందిన వాళ్ళు అనావరికులు అని అర్థంలో వాడేవాళ్ళఅన్నమాట.
(06:53) మన తూర్పు దేశాల నుండే పాశ్చాత్య దేశాలకి ఎలా వెళ్ళింది అనేదానికి ఆధారాలు కూడా చూపించాలి కదా అందులో భాగంగానే ఈ రిలీజియస్ క్రూసైడ్స్ గురించి చెప్పారు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మధ్యన చాలా రిలీజియస్ క్రూసైడ్స్ జరిగాయి కదా 13 సెంచురీ టైంలో ఈ రెండు కమ్యూనిటీస్ జెరూసలేం కోసం ఫైట్ చేస్తునే టైంలో చాలా మంది యూరోపియన్స్ ఈస్ట్ కి వచ్చారు.
(07:15) ఇక్కడున్న ఈ కచ్చడాల పద్ధతి చూసి ఇక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని కచ్చడాలు కూడా వాళ్ళతో తీసుకెళ్ళారు. గ్రాడ్యువల్ గా వాటిని అందంగా తయారు చేయటానికి డిజైన్స్ మాడిఫై చేసుకుంటూ వచ్చారు. ప్రపంచం అంతా ఈ కచ్చడానికి రకరకాల నగిశీలు చెక్కి దీని అందమైన ఒక నగలాగా తయారు చేయటం మొదలు పెట్టారు. ఆడవాళ్ళు కూడా వీటిని చూసి అసహించుకోవాల్సింది పోయి ఈ అందం చూసి ఇదేదో గొప్ప నగలాగా అనుకని భర్తల్ని కొనిపెట్టమని గొడవ చేసే సిట్ుయేషన్ మగవాళ్ళు క్రియేట్ చేశారు.
(07:45) ఈ ఇనుప కచ్చడంలో ముందున్న ముక్క నుంచే ఈ రోజుల్లో ఆడపిల్లలకి మనం వేసే సిగ్గుబిళ్ళ వచ్చింది అని అంటారు రచయిత ఇప్పుడు ఇనుప కచ్చడాలు లేవు వాటికి తాళాలు వేసే పద్ధతి లేకపోయినా కానీ మగవాళ్ళ అనుమానాలు మాత్రం పోలేదు అకారణమైన అనుమానాల వల్ల వాళ్ళ మూర్ఖత్వం వల్ల ఈ మగవాళ్ళు చాలా రాక్షస కృత్యాలకు దిగుతున్నారు అని చెప్తూ పుస్తకాన్ని ఎం చేశారు.
(08:09) పుస్తకం లాస్ట్ పేజ్లో యూరోప్ లో వాడిన రకరకాల కచ్చడాల పిక్చర్స్ ఇచ్చారు. ఈ ఇనుప కచ్చడాల్ని ఇంగ్లీష్లో చాస్టిటీ బెల్స్ అంటారు. ఈ బెల్ట్స్ ఆర్ కచ్చడాలు అసలు చాస్టిటీ కోసం వాడలేదు అలా అనుకోవడం అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది అని కొంతమంది పుస్తకాలు కూడా రాశారు. ఇది ఇవాల్టి పుస్తకం ఇనుప కచ్చడాలు 77 పేజెస్ ఉన్న చిన్న పుస్తకం చాలా తేలిగ్గా చదివేయొచ్చు.
(08:32) పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు సిరీస్ లో వచ్చిన రెండో పుస్తకం అన్నమాట ఇది నాకు ఫస్ట్ రాసిన బుక్ పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు కానీ ఈ పుస్తకం మాత్రం చాలా బాగుంది వెరీ వెల్ రిసర్చ్డ్ బుక్ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీలో ఎవరైనా ఈ పుస్తకం చదివి ఉంటే ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి.
(08:54) నెక్స్ట్ వీడియోలో ఇంకొక పుస్తకం తో కలుద్దాం.

No comments:

Post a Comment