4 Major Changes after 40 years leads chronic diseases | damage Sexual Health Explained By Pharmacist
Author Name:VeeraBrahmam
Youtube Channel Url:https://www.youtube.com/@PHARMAANDHEALTH
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pFgQFhtT7x0
Transcript:
(00:04) హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ YouTube ఛానల్ రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో చేశాను. అందులో 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళ శరీరంలో వచ్చే నాలుగు అతి పెద్ద మార్పుల కారణంగా వాళ్ళకి సెక్షువల్ హెల్త్ ఏ విధంగా డామేజ్ అవుతుంది క్రానిక్ డిసీజెస్ ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి షార్ట్ వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
(00:32) అందరూ కూడా ఆ నాలుగు చేంజెస్ గురించి సబ్జెక్ట మొత్తం అంతా అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఒక లాంగ్ వీడియో చేయండి చాలా మందికి యూస్ అవుతుంది అని చెప్పేసి అడిగారు. సో అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు 40 సంవత్సరాలు క్రాస్ అవుతున్న లేదంటే ఆల్రెడీ 40 సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్ళు గాని అది 50 కానివ్వండి 60 కానివ్వండి 70 కానివ్వండి 80 కానివ్వండి మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఇంకా ఆ పుట్టిన రోజు దగ్గర నుంచి అతనికి 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు అతని బాడీలో ప్రతి ఒక్కటి కూడా పెరుగుతా ఉంటుంది. అంటే
(01:11) ఆ వయసు అనేది వచ్చేది అన్నమాట 30 సంవత్సరాల వరకు పెరుగుతా ఉండటం అంటే ఏంటి బోన్ వెయిట్ పెరగటం, మజిల్ వెయిట్ పెరగటం హార్మోన్స్ పెరగటం, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆసిడ్స్ ఇవన్నీ కూడా పెరుగుతా ఉంటాయి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు సో వన్స్ మీరు 30 సంవత్సరాలు క్రాస్ అయ్యారు అనుకోండి ఇంకా 30 సంవత్సరాల దగ్గర నుంచి 40 సంవత్సరాలు ఈ మధ్యలో 10 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాల కాలంలో మీకు ఏవి పెరగటం గాన లేదు అంటే తగ్గటం గాని ఉండదు ఇంకా స్టాండర్డ్ గా నిలబడతాయి.
(01:48) మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా హెల్త్ బాగోక అలా ఉంటే తప్పనిచ్చి మామూలుగా ఇవన్నీ ఏమి పెరగవు తగ్గవు వన్స్ మీరు 40 ఇయర్స్ క్రాస్ అయ్యారు అనుకోండి 40 సంవత్సరాలు దాటారు అనుకోండి అక్కడి నుంచి ఇంకా మీ వయసు అనేది వచ్చే వయసు కాదు పోయే వయసు అన్నమాట అంటే మీ శరీరంలో నుంచి ఒక్కొకటి ఒక్కొకటి ఒక్కొకటి ఒక్కొకటి తగ్గుతా ఉంటుందన్నమాట సో తగ్గుతా తగ్గుతా తగ్గుతా మీకు 70 80 90 సంవత్సరాలు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా డెఫిషియన్సీకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
(02:24) సో వాటి మూలంగా మీ శరీరంలో ఏవైతే మార్పులు వస్తాయో ఏవైతే డిసీజెస్ వస్తాయో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు మీకు ఏం జరుగుతుంది 40 తర్వాత అనేది ముఖ్యంగా మగవాళ్ళల్లో నేను చాలా క్లియర్ గా చెప్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వన్ మోర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కరే చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే 40 క్రాస్ అయ్యి ఇలా హెల్దీగా ఉండాలి 40 తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలి సెక్సువల్ హెల్త్ బాగుండాలి ఏ క్రానిక్ డిసీజెస్ రాకుండా ఉండాలి అనింటే ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్
(03:02) చేయండి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 40 సంవత్సరాల తర్వాత చాలా రకాల మార్పులు అయితే వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా నాలుగు రకాల మార్పుల కారణంగా మనకి క్రానిక్ డిసీజెస్ వస్తాయి అండ్ సెక్సువల్ డిసీస్ సెక్సువల్ డామేజ్ కూడా సెక్షువల్ హెల్త్ డామేజ్ కూడా అవుతుందన్నమాట. వాటిలో ఒకటి అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 1% టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతా ఉంటాయి.
(03:32) అలా మీరు సంవత్సరం పెరిగే కొద్ది 1% సంవత్సరం పెరిగే కొద్ది 1% తగ్గుతా ఉంటాయి అన్నమాట టెస్టోస్టరాన్ లెవెల్స్ రెండవది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. సో ఇది 40 సంవత్సరాలు దాటిన తర్వాత 30% 50 సంవత్సరాలు దాటిన తర్వాత 40% 60 సంవత్సరాలు దాటిన తర్వాత 50% నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటుంది.
(03:56) మూడోది ప్రోస్టేట్ హెల్త్ దెబ్బ తింటుంది. అంటే మీకు మగవాడి శరీరంలో మాత్రమే ఉండే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతా ఉంటాయి అంటే అది ఎన్లార్జ్ అవ్వటం గానీ లేదు అంటే దానికి ఇన్ఫెక్షన్స్ రావడం గానీ జరుగుతా ఉంటుంది. నాలుగు మీ బాడీలో 40 సంవత్సరాల తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి డెఫిషియన్సీ వస్తాయి.
(04:19) సో ఈ యాంటీ ఆక్సిడెంట్ డెఫిషియన్సీ రావడం కారణంగా 40 తర్వాత వచ్చే చాలా రకాల క్రానిక్ డిసీజెస్ కి కారణం ముఖ్య కారణం చాలా రకాల కారణాలు ఉంటాయి వాటిల్లో వన్ ఆఫ్ ద ముఖ్య కారణం అనేది యాంటీ ఆక్సిడెంట్స్ డెఫిషియన్సీ రావటం అన్నమాట వీటిలో మనం ఒక్కొక్కటిగా ఫస్ట్ కానుంచి ఫస్ట్ దానికి సొల్యూషన్ ఏంటి సెకండ్ దానికి సొల్యూషన్ ఏంటి అలా నాలుగు నాలుగిటికి సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టోస్టిరాన్ హార్మోన్ మీకు 40 40 సంవత్సరాల తర్వాత మీకు తగ్గకుండా ఉండాలి అనింటే మీరు ఏం చేయాలి అంటే రోజుకి 30 నిమిషాలు సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. అది
(04:56) కూడా పొద్దున 10 గంటలు లేదంటే 11 గంటలు దాటిన దగ్గర నుంచి మధ్యాహ్నం రెండు గంటలు లేదంటేమూడు గంటలు ఆ మధ్యలో ఉండే టైం పీరియడ్ ఉంటది చూసారా ఆ మధ్యలో ఉండే టైం పీరియడ్ లో మాత్రమే మీరు సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ బి రేస్ అనేవి మీ స్కిన్ మీద పడితే అప్పుడు మీకు విటమిన్ డి అనేది ప్రొడక్షన్ జరుగుతుంది.
(05:20) ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొంతమంది ఆ స్కిన్ లో మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ మెలనిన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు డార్క్ కలర్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రేస్ కి అంటే ఎండలో ఎక్కువ ఎక్కువ సమయం నిలబడాలన్నమాట.వెనక వెన్ కంపేర్ టు లైట్ కలర్ లో ఉండే వాళ్ళ కంటే డార్క్ కలర్ లో ఉండే వాళ్ళకి ఆ రేస్ అనేవి తొందరగా స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవ్వలేవు కాబట్టి ఎక్కువ టైం అక్కడ ఎండలో నిలబడితే మీకు విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది.
(05:56) విటమిన్ డి అనేది గుర్తుపెట్టుకోండి టెస్టోస్టిరాన్ మీకు ఆ తగ్గకుండా ఉండాలి అనిన్నా డెస్ట్రాయ్ అవ్వకుండా ఉండాలి అనిన్న మీకు విటమిన్ డి అనేది ఎప్పుడూ కూడా 60 నుంచి 70 కి మధ్యలో ఉండే విధంగా చూసుకోండి మేము ఎండకి ఎక్స్పోజ్ అవ్వలేమండి మా వల్ల అవ్వట్లేదు అనింటే అప్పుడు మీరు రోజుకి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ రెగ్యులర్ గా రిక్వైర్మెంట్ మన బాడీకి ఉన్న రిక్వైర్మెంట్ అన్నమాట ఉండే విధంగా మీరు విటమిన్ డి సప్ప్లిమెంటేషన్ తీసుకోండి అంటే నెలకి ఒక 60k యూనిట్స్ కానీ లేదు డెఫిషియన్సీ ఉంటే రోజుకి నాలుగు నుంచి ఐదు ఇంటర్నేషనల్ యూనిట్స్ 5000 ఇంటర్నేషనల్
(06:34) యూనిట్స్ విత్ k2 తో తీసుకోవడం గాని చేయండి మీరు ఏది చేసినా సరే ఫైనల్ గా మీ బాడీలో స్టాండర్డ్ గా 60 నుంచి 70ఎన్జ ఫర్డిఎల్ విటమిన్ డి అనేది మీ బాడీలో మెయింటెనెన్స్ అయితేనే మీకు టెస్టోస్టరాన్ హార్మోన్ మీద ఏ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. రెండవది మీరు తినే ఫుడ్ ఏదైతే ఉందో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అంటే ఏంటి ప్రోటీన్స్ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఇవి నాలుగు కూడా సమపాలల్లో ఉండే విధంగా తీసుకోవాలి చాలామంది అలా కాకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటారు ప్రోటీన్స్ ఫ్యాట్స్ తీసుకోరు అలాంటి వాళ్ళల్లో టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి
(07:13) మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడున్న రోజుల్లో స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది అది ప్రొఫెషనల్ గా కానివ్వండి పర్సనల్ గా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి ఎమోషనల్ గా కానివ్వండి స్ట్రెస్ ని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు స్ట్రెస్ తగ్గించుకోకపోతే దాని కారణంగా మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ బాగా ఇంక్రీస్ అయిపోతుంది.
(07:41) ఆ కార్టిసాల్ ఇంక్రీస్ అయిపోయినప్పుడు టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డిక్రీస్ అయిపోతాయి. మీరు స్ట్రెస్ ని గనుక మేనేజ్ చేసుకోకపోతే ఈ టెస్టోస్టరాన్ ఒక్కటే కాదు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే బాడీలో జరుగుతాయి. సో దాన్ని ఒకసారి స్ట్రెస్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలిఅనేది రీసెంట్ గా ఒక నేను వీడియో చేసి పెట్టాను ఒకసారి అది చెక్ చేయండి.
(08:01) తర్వాత టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలి అనింటే మీకు 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం మీరు ఎనిమిది గంటలు నిద్రపోతున్నాము అని అంటే కనీసం దాంట్లో ఐదు నుంచి ఆరు గంటలు క్వాలిటీ నిద్ర ఉండాలి అలా లేకుండా పద్దాగులు ఏవేవో కలలు వస్తున్నాయండి నిద్ర సరిగ్గా పట్టట్లేదు అండి అంటే కూడా అది కూడా మీకు ప్రాబ్లమే నిద్ర గురించి కూడా నేను చాలా క్లియర్ గా ఒక వీడియో చేశాను అది ఒకసారి మీరు చెక్ చేయండి.
(08:28) తర్వాత ఐదవది ఆల్కహాల్ ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. చాలామంది రోజు తాగుతా ఉంటారు అలా తాగటం వల్ల మీరు వయసులో ఉన్నప్పుడు తాగింది కూడా మీకు వయసు అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మీకు కనబడద్ది టెస్టోస్టరాన్ హార్మోన్ అనేది తగ్గిపోద్ది. ఏడవది చాలామంది ఇది 40 సంవత్సరాల ముందున్న వాళ్ళకి కూడా వర్తించింది.
(08:49) చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ క్యాన్స్ లో వాటర్ స్టోర్ చేసుకుంటా ఉంటారు. సో దాంట్లో ఏంటంటే ఈస్ట్రోజన్ లైక్ కాంపౌండ్స్ ఉంటాయి అంటే మనకి ఈ వాటర్ బాటిల్స్ తయారు చేసే విధానంలో బిస్ఫెనాల్ ఏ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. సో దాని కారణంగా మనం రోజు దాంట్లో స్టోర్ చేసుకొని ఆ వాటర్ ని తాగటం కారణంగా మీకు టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి మగవాళ్ళలో తగ్గిపోతున్నాయి అని చెప్పేసి రీసెర్చ్‌లు చెప్తున్నాయి.
(09:16) కాబట్టి ఆ వాటర్ క్యాన్లు వాటర్ బాటిల్స్ ని రీప్లేస్ చేసుకొని స్టీల్ బిందెలు స్టీల్ వాటర్ బాటిల్స్ ని అలవాటు చేసుకోండి. సో దాని కారణంగా టెస్టోస్టరాన్ లెవెల్స్ పెరుగుతాయి ఇంకా రకరకాల జబ్బులు రాకుండా కూడా మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకొక్క విషయం ఏంటి అంటే ఎనిమిదోది రోజుకి 30 నుంచి 40 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా చూసుకోండి అంతా కూడా ఈరోజుల్లో సెడంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది.
(09:42) సో ఆ లైఫ్ స్టైల్ నుంచి బయటికి వచ్చి కనీసం 30 40 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా చూసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ నైన్త్ ది వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి జింక్ డెఫిషియన్సీ ఉంటుంది. సో జింక్ డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా మీకు టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. సో అలా గనుక మీకు డెఫిషియన్సీ ఉంది అంటే జింక్ ని మీరు రీప్లేస్ చేసుకోవడం కారణంగా మీకు టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ అయితే పెంచుకోవచ్చు.
(10:10) జింక్ లో చాలా రకాల ఫామ్స్ ఉన్నాయి కదండీ మరి మనం ఏ ఫామ్ తీసుకోవాలి అంటే జింక్ పైకోలినేట్ తీసుకోవచ్చు. జింక్ పైకోలినేటు రోజుకి ఒక 30 mg తీసుకోవడం కారణంగా దీన్ని పెంచుకోవచ్చు అన్నమాట టెస్టోస్టరాన్ని ని అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి మీరు జింక్ ని అతిగా కూడా తీసుకోకూడదండి ఒకవేళ జింక్ అతిగా తీసుకున్నా గాన మీకు కాపర్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి జింక్ ను ఒకవేళ ఎక్కువ రోజులు తీసుకోవాలి అనుకుంటే జింక్ కాపర్ ని కలిపి తీసుకోవడం కూడా మంచిదన్నమాట.
(10:39) సో అది టెస్టోస్టిరాన్ కి సంబంధించి రెండు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది 40 సంవత్సరాలు దాటిన తర్వాత తగ్గిపోతుంది అని చెప్పాను. సో నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక కెమికల్. ఇదేంటంటే బ్లడ్ వెసల్స్ ని బ్లడ్ వెసల్స్ ఇలా ఉన్నాయి అనుకోండి ఇలా రిలాక్స్ చేసి బ్లడ్ ఫ్లో ని పెంచుతుంది అండ్ బ్లడ్ లో ఉండే న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా బాడీ మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉపయోగపడుతుంది.
(11:10) అయితే మనకి ముఖ్యంగా మగవాళ్ళల్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడు అవసరం అవుతుంది అని అంటే ఎరక్షన్ టైం లో [గొంతు సవరించుకోవడం] మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది అంగం వైపుకు వెళ్ళాలి. సో అలా బ్లడ్ ఫ్లో అలా వెళ్ళాలి అనింటే నైట్రిక్ ఆక్సైడ్ అని రిలీజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్లడ్ వెసెల్స్ అనేవి ఇలా ఎక్స్పాండ్ అవుతాయి బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరిగి ఎరక్షన్ అనేది బాగా ఉంటుంది.
(11:31) సో ఎప్పుడైతే మీకు నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతాయో ఆ బ్లడ్ వెసల్స్ కూడా డైలేషన్ అవ్వటం అనేది తగ్గిపోతుంది బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో దీన్ని మీరు పెంచుకోవాలి అనింటే మీ బాడీలో రెండు రకాల అమినో యసిడ్స్ ఉంటాయి. ఒకటి ఎల్ ఆర్జినైన్ రెండు ఎల్ సిట్రిలిన్ ఇవి రెండూ కూడా అమినో యసిడ్స్ కాకపోతే ఇవి రెండు కూడా మీకు ఒకే విధంగా పనిచేస్తాయి కానీ మెటబాలిజం మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది ఎలా అంటే ఎల్లార్జినైన్ అనేది డైరెక్ట్ గా నైట్రిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ని పెంచుతుంది ఎల్లార్జినైన్ అదే ఎల్
(12:13) సిట్రిలిన్ అనుకో ఎల్ సిట్రిలిన్ అనేది ఫస్ట్ ఎల్ ఆర్జినైన్ గా కన్వర్ట్ అయ్యి ఎల్ఆర్జిన నుంచి నైట్రిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయి నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేది ప్రొడక్షన్ చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి వీటి లెవెల్స్ ఇవి కూడా మీకు 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి వీటి ప్రొడక్షన్ కూడా మీకు తగ్గుతా ఉంటది.
(12:34) సో వీటి ప్రొడక్షన్ మీకు తగ్గకుండా ఉండాలి ఇవి మంచిగా మీ బాడీలో ప్రొడక్షన్ జరగాలి అంటే డైట్ పరంగా మనకి ఇప్పుడు వేసవకాలం నడుస్తుంది పుచ్చకాయలు బాగా బయట దొరుకుతా ఉంటాయి. సో రోజుకి ఒక సగం పుచ్చకాయో లేదంటే చిన్న పుచ్చకాయ ఒక చిన్న పుచ్చకాయ తినడం వల్ల దాంట్లో ఎల్సిట్రులిన్ అనేది ఉంటది మనం ఫుడ్ ద్వారా తీసుకోవాలి అనుకున్నప్పుడు సో దాన్ని మనం ఎక్కువ తీసుకోవడం కారణంగా బ్లడ్ వెసెల్స్ ఆ బ్లడ్ వెసెల్స్ అనేవి బాగా ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ ఫ్లో ని ఇంప్రూవ్ చేస్తుంది పుచ్చకాయ తీసుకోవచ్చు గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయి కదా సో అవి తీసుకోవచ్చు దోసకాయ తీసుకోవచ్చు కర్బూజా
(13:12) తీసుకోవచ్చు ఈ నాలుగు రకాలు ఎక్కువగా మీరు మీ డైట్ లో చేర్చుకోవడం కారణంగా ఎల్సిట్రులిన్ అనేది మీ బాడీలో ప్రొడక్షన్ జరిగి బ్లడ్ వెసల్స్ ని ఎక్స్పాండ్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఒకవేళ మీరు డైట్ ద్వారా కాదు నేను సప్లిమెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎల్సిట్రిలిన్ గాని ఎల్ ఆర్జినైన్ గాని తీసుకోవచ్చు.
(13:33) కానీ నా రికమెండేషన్ ఏంటి అనింటే మీకు ఎల్సిట్రిలిన్ గాని ఎల్ఆర్జినైన్ గాని తీసుకున్నప్పటికీ మీరు అవి వన్ ఆర్ టూ మంత్స్ అవసరమైతే మీకు నీడ్ ఉంటే త్రీ మంత్స్ కూడా యూస్ చేయాల్సి ఉంటది. సో అవి యూస్ చేసినప్పటికీ మీకు 100% సొల్యూషన్ ఉంటదని చెప్పలేను అలాగని పర్మనెంట్ సొల్యూషన్ ఉంటదని చెప్పలేము. ఉంటది బట్ అది పర్మనెంట్ గా ఉంటదా ఉండదా అనేది మాత్రం చెప్పలేము కాబట్టి ఇంక ఇంకొక విషయం ఏంటి అంటే ఎల్ఆర్జిన ఎల్సిన్ సప్లిమెంట్ ఫామ్ మనకి బయట కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి.
(14:06) మంచి స్టాండర్డ్ కంపెనీ తీసుకోవాలి అంటే మీకు కాస్ట్ ఎక్కువే అవుతుంది. మూడవది ప్రోస్టేట్ హెల్త్ 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మగవాళ్ళల్లో ఉండే మగవాళ్ళల్లో మాత్రమే ఉండే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో అది ఎన్లార్జ్ అవ్వటం కానీ లేదు అంటే ఇన్ఫెక్షన్స్ రావటం కానీ క్యాన్సర్స్ రావటం గాని ఇలాంటి సమస్యలు అనేవి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయి.
(14:29) సో ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క మెయిన్ ఆ ఫంక్షన్ ఏంటో తెలుసా అండి. యాక్చువల్ గా ఇది మనకి బ్లాడర్ కింద యురెత్ర చుట్టూరు ఉంటుందన్నమాట ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇది దేనికి ఉపయోగం అంటే మన శరీరంలో ఆ సెక్సువల్ యక్టివిటీస్ చేసి ఆ ఎజక్లేషన్ టైంలో మీకు స్పెర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో స్పెర్మ్ సెల్స్ మీకు బయటకి యూరత్రా నుంచి బయటకి రావటానికి సీమెన్ ఉంటుంది కదా ఆ సీమెన్ తయారు చేసేది ప్రోస్టేట్ గ్లాండే సో ఇక్కడి నుంచే మీకు సీమెన్ అనేది స్పెర్మ్ సెల్ తో కలిసి స్పెర్మ్ సెల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సీమెన్ ని తయారు చేసేది ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అన్నమాట.
(15:05) మెయిన్ యూస్ అయితే అది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల గాని ఇన్ఫెక్షన్ రావడం వల్ల గాని ఏమవుద్ది అనింటే ఆ యొక్క సైజు పెరగటం వల్ల ఆ పెరిగిన సైజు వల్ల యురెత్ర మీద పడి యురెత్ర అనేది కంప్రెస్ అవుద్ది ఇట్లా దగ్గరకి వచ్చిద్ది. సో దాని కారణంగా యూరిన్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. లేదు అంటే బ్లాడర్ ఇన్‌కంప్లీట్ అయిన ఫీలింగ్ కలిగిద్ది.
(15:27) ఇట్లాంటి సింటమ్స్ అనేవి వస్తాయి. అయితే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ గురించి దాన్ని ఎలా తగ్గించుకోవాలి దాని సింటమ్స్ ఏంటి ఇన్ డెప్త్ లో నేను చాలా క్లియర్ గా ఒక వీడియో చేశాను ఒక్కసారి అది చూడండి ఇక్కడ ఇంకా మనం దాని గురించి చెప్పుకుంటా పోతే వీడియో అనేది చాలా లెన్తీ అయిపోద్ది అన్నమాట నాలుగవది యాంటీ ఆక్సిడెంట్ డెఫిషియన్సీ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి.
(15:50) మనము ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటా ఉంటాం. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మనం ఏ ఫుడ్ తీసుకున్నా గాని అది మనకి గ్లూకోస్ గా మారి ఏటీపి గా మారుతుంది ఏటీపి అనేది మన శరీరానికి మెయిన్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. సో అయితే ఈ ఎనర్జీ ప్రొడక్షన్ జరిగే సిచువేషన్ లో ఈ క్రమంలో మన బాడీలో కొన్ని రకాల నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి.
(16:12) ఆ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వడం అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో దేన్నైనా డామేజ్ చేయగల కెపాసిటీ వీటికి ఉంటుంది. కానీ ప్రకృతి ఏం చేసింది అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ని మన బాడీని ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం పెట్టింది అదే ఇమ్యూనిటీ పవర్ అన్నమాట.
(16:35) సో అదిఏం చేస్తది అంటే ఈ ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సరిగ్గా హెల్దీ ఫుడ్ తీసుకోమో హెల్దీ లైఫ్ స్టైల్ మనం తీసుకోమో అప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వడం అనేది బాగా ఎక్కువయపోతుంది. సో బాగా ఎక్కువ అయిపోయినప్పుడు ఈ ఇమ్యూనిటీ సిస్టం ఏదైతే ఉందో అది చేతులు ఎత్తేస్తుంది.
(17:00) ఆ ఇమ్యూనిటీ సిస్టం చేతులు ఎత్తేసినప్పుడు మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. అప్పుడు మనకి చానా రకాల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఇమ్యూనిటీ సిస్టం ఆ చేతులు ఎత్తేసిన తర్వాత ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడడానికి మధ్యలో ఒక హీరో ఎంటర్ అవుతాడు వాడే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఆ ఎక్కువైన ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి ఈ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసి మనం హెల్తీగా ఉండేలాగా చేస్తాయి. సో ఎప్పుడైతే
(17:40) ఇమ్యూనిటీ పవర్ చేతులఎత్తేసి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి డెఫిషియన్సీ వస్తాయో అప్పుడు మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువయపోయి మనకి చాలా రకాల క్రానిక్ డిసీజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చాలా క్లియర్ గా నేను వీడియో చేశాను బట్ ఇందులో 10 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటిలో ముఖ్యంగా మెలటోనిన్ ఒకటి, విటమిన్ సి ఒకటి, విటమిన్ ఈ ఒకటి, కోఎంజైమ్ క్యూ10, ఆస్టాక్జంతన్, విటమిన్ ఏ, సెలీనియం, గ్లటాతయోను,ఆర్ఏఎల్ఏ బ్రెస్వెరట్రాలు 10 రకాలు చెప్పాను కదా ఈ 10 రకాల్లో కేవలం నాలుగు రకాలు మాత్రమే మన
(18:20) బాడీ తనకు తానుగా తయారు చేసుకుంటుంది. ఆ నాలుగు రకాలు ఏంటివి మెలటోనిన్, కోయంజోమ క్యూటెన్, గ్లటతయోను, ఆర్ఏఎల్ఏ ఈ నాలుగు రకాలు మాత్రమే మన శరీరంలో నాచురల్ గా తయారవుతాయి. ఈ నాలుగు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మీ బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతా ఉంటాయి. వన్స్ మీరు 40 క్రాస్ అయిన తర్వాత ఈ నాలుగు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఏజ్ పెరిగే కొద్దీ వీటి యొక్క ప్రొడక్షన్ మన బాడీలో తగ్గిపోతా ఉంటుంది.
(18:50) కాబట్టి మనం బయట నుంచి వీటిని రీప్లేస్ చేసుకోవాలి. ఇవి నాలుగు కాకుండా ఇంకా ఆరు రకాలు ఉన్నాయి కదా ఆ ఆరు రకాలకు కూడా స్పెసిఫిక్ ఆ ప్రాబ్లమ్స్ ని తగ్గించే కెపాసిటీ ఉంటుందన్నమాట. వాటి గురించి ఇన్ డెప్త్ లో నేను ఒక 15 నిమిషాలు వీడియో చేశాను. అది కూడా ఇంకా ఇక్కడ చెప్పాలి అంటే టైం మనకి సరిపోదు కాబట్టి ఒకసారి ఆ ఇవి వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోస్ కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంటే ప్రోస్టేట్ హెల్త్ గురించి గాని లేదు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి గాని ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్
(19:24) చేయండి. ఇంకా వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫోర్ యప్ లో నుంచి కానీ లేదు అంటే కన్సల్టేషన్ తీసుకొని గాని కాల్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను వీడియోలో చెప్పని విషయం ఏదైనా ఉండి అది వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అది నేను రిప్లై ఇచ్చేదయితే రిప్లై ఇస్తాను లేదు వీడియో చేయాల్సింది అయితే వీడియో చేస్తాను.
(19:45) సో అంతవరకు సెలవు మరి నమస్కారం నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫాక్సి
No comments:
Post a Comment