ఆడదాని.. అందం ఎందులో ఉంటుంది? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pX48xWV6LlU
Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం నీ కథ నువ్వే రాసుకో అవునండి మన కథ మనమే రాసుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు సహజంగా ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారండి అందులోనూ అందమైన ఆడవాళ్ళయతే ఇంకా నోరూరిస్తూ ఉంటారు బంగినిపల్లి మామిడి పండును చూస్తే నోరూరుతుంది చూసారా అలా ఉంటారు. మరి ఆడదాని అందం అంటే ఏమిటసలో ఆడదాని అందం ఎందులో ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం.
(00:32) ఒక స్త్రీకి నిలువెత్తున అందం ఎందులో ఉంటుందో తెలియజెప్పిన సినిమానే తాయి కిలవి మనందరం తప్పక చూడాలి. ఒక స్త్రీకి ఆకారం కంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యమని తేల్చి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ గారు సెంట్రల్ రోల్ పోషించారు. ఆమె నటన అద్భుతం పాత్రకి జీవం పోశారు. ఈ మాటలన్నీ చాలా తక్కువ మరి ఆమె నటనకి కొలమానం ఎలా చెప్పాలి మనం రాధికా గారి నటన చూసి మనం అదే పాత్రలో వదిగిపోయామ అన్నదయతే నిజం అంతగా మనం మనల్ని మనం మర్చిపోతాం అన్నమాట. కాబట్టి సినిమాని తప్పక చూడండి.
(01:12) ఈ సినిమాలో ఆమె ఆకారంతో పాటు ఆమె హావభావాలు చూసి అమ్మ బాబోయ్ అని చెప్పి బెంబేలు పోతాం. ఎందుకంటే ఆమె చాలా పెద్ద హీరోయిన్ గొప్ప యాక్టర్స్ రాధికా శరత్ కుమార్ గారికి మేకప్ వేసిన విషయంలో ఎందులోనూ తీసుకుపోలేదు. ఒక పల్లెటూరు సాధారణ స్త్రీ కష్టజీవి అందులోనూ ఒక ముసలి గడుగ్గాయి అవ్వ ఆ మేకప్ వేశారు. కష్టజీవులు ఎలా ఉంటారో తెలుసు కదా.
(01:42) ఆమె పేరే పౌంతాయ అమ్మ పౌంతాయ్ ఆ మేకప్ చూసి బెంబగలు ఎత్తిపోయా అన్నమాట అంటే ఒక ఏజ్ వచ్చేసరికి ఎవరైనా సరే చర్మం ముడతలు పడిపోయి అందవిహీనంగా అందులోనూ కాయ కష్టం చేసుకునే వాళ్ళు అలాగే ఉంటారు. అటువంటి రోలు ఎంతో గర్వంగా పోషించారు అంటే ఈ రోలు తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు ఆ మేకప్ వేయించుకున్నారు చూసారా అంత అందమైన హీరోయిన్ అందులో మన చిరంజీవి గారి పక్కన పెద్ద హీరోయిన్ ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలతో చేసిన హీరోయిన్ దేనికి సాటి కాదు నేను అని తేల్చి చెప్పేశరు సగౌరవంగా సినిమా ముగింపుక వచ్చేసరికి మొదట్లో మనల్ని భయపెట్టిన ఆ రూపమే స్త్రీ
(02:27) వ్యక్తిత్వాన్ని ఆకాశమంతా ఎత్తుకు చేర్చిన ఒక కాంతి కిరీటం లాగా నిలిచింది. ఆ సన్నివేశాలని చూసే మనం చేతులెత్తి మొక్కుతాం. అంత రసవంతంగా సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ శివకుమార్ గారు ఆయనకి ఇదే మొదటి సినిమా అంట అద్భుతంగా సినిమాని చిత్రీకరించారనే చెప్పొచ్చు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడిన ఏ స్త్రీమూర్తి అయినా సరే ఆమె నిజమైన సౌందర్యానికి రూపమని ప్రతీకని ఈ సినిమాలో నటించిన పౌంతై రూపంలో దగదగా మెరిసిపోయిన రాధికా శరత్ కుమార్ గారు ఈ తరానికి చాటి చెప్పింది అంటే నిజమైన అందం అంటే ఇందులో ఉంటుంది.
(03:15) స్త్రీ గౌరవాన్ని ఎలాగ మనం పెంచుకోవచ్చు అంటే ఒక స్త్రీకి నిజమైన అందం ఆత్మగౌరవం అని చెప్పి ఈ సినిమా మనకి అర్థం చెప్పిందన్నమాట నిజ జీవితంలో కూడా మనం ఇలాంటి సంఘటనల్ని చాలా ఎదుర్కొంటూ ఉంటామండి మన పెద్దవాళ్ళలోనే ఇటువంటి పౌన్తాయల్ని మనం చూసి ఉన్నాము మనం కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము ఈ పవన్ తాయి స్టోరీకి నా లైఫ్ కి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట కాబట్టి బట్టి నేను ఇష్టపడి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది.
(03:49) ఎంత వయసు మీద పడినా స్త్రీ తన కాళ్ళ మీద తాను నించోవాలి. తనకంటూ ఒక స్వతంత్రమైన లైఫ్ ని ఏర్పరచుకోవాలి. తన చుట్టూ ఉన్న వారిని చైతన్య పరచాలి. ఇదే నిజమైన స్త్రీ గెలుపు ఒంటరిగా పోరాటం చేయాలి అన్నది ఎంత భయమో ఆ పోరాటంలో విజయం సాధించడం కూడా అంతే భయంమాట విజయం ఊరికే రాదండి ఎన్నో ఓటములు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలితేనే వస్తుంది కాబట్టి ఒక నిజమైన స్త్రీ ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో తన క్యారెక్టర్ ని నిలుపుకుంటూ ఒక జీవితం సాగిస్తుంది చూసారా అది సవాలు అంటే ఆడదాని అందం అందులో ఉంటుంది రంబ ఊర్వసి మేనక తిలోత్తమ అప్సరసలు ఎంతమంది వచ్చినా
(04:33) వీళ్ళకి సాటి రారు ఇదైతే పచ్చి నిజం జీవితం చాలా చిన్నది కానీ పోరాటం చాలా పెద్దదండి వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలే స్త్రీకి నిజమైన ఆభరణాలండి అవి ఉంటే ఎటువంటి బంగారం ఆస్తి అంతస్తు ఇవేమీ పని చేయవున్నమాట మరి వాటిని కాపాడుకోవటాకే జీవితమంతా పోరాటం చేయవలసిందే అని చెప్పి ఈ సినిమాలో రాధిక తేల్చి చెప్పింది. నిజంగా బయట ఉన్న స్త్రీలు కూడా చాలామంది ఇలాగే పోరాటం చేస్తూనే ఉంటున్నారు.
(05:11) పోరాటం అన్నది చిన్నది కాదు అక్కడితో ఆగేది కాదు మనం చచ్చే అంతవరకు అది చేస్తూ ఉండాలనే ఒక అద్భుతమైన సందేశం ఈ సినిమా మనక ఇచ్చింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళా చదువు లేని వాళ్ళా లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళా డబ్బు ఉన్నవాళ్ళా పేదవాళ్ళా గొప్పవాళ్ళా ఒక సాధారణమైన పల్లెటూరి స్త్రీ ఆ లేదా ఒక ఏసు అయిపోయిన ఒక ముసలవ్వా అని కాదండి ఎటువంటి స్త్రీ అయినా సరే సర్వ స్వతంత్రాలతో బతకాలి అని చెప్పి మనకి ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి చేసే పనిలో వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండాలని చెప్పి మనకి చెప్తున్నారు. అప్పుడే ఆ స్త్రీ గెలవగలదని
(05:55) ప్రపంచంలో తనఏంటో నిరూపించగలదని డైరెక్టర్ శివకుమార్ గారు చక్కగా ఒక మొండిగటమైన ముసలవ్వ ద్వారా మనకి ఈ సందేశం ఇప్పించారు. మరి ఇది ఎంత బాగుందో కదండీ ఒక స్త్రీ మూర్తి ఎలా ఉండాలి అన్నది మనకి తెలుసు కానీ ఎంత వయసయినా కూడా జీవితం కోసం ఎలా పోరాడాలి అన్నది ఈ సినిమా మనకి నేర్పిస్తుంది అంటే ఒక యంగ్ ఏజ్ లో ఎలా ఉంటాం మిడిల్ ఏజ్‌లో ఎలా ఉంటాం వయసయపోయాక నాకెందుకులే అని చెప్పి నిర్లక్ష్యంగా మనల్ని మనం పట్టించుకోకుండా వేరొక్కరి మీద ఆధారపడుతూ ఉంటాం.
(06:34) అలా కాకుండా ఒక 72 ఏళ్ల అవ్వ తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సహాయం అందిస్తూ అలాగే ఒక వడ్డీ వ్యాపారం ద్వారా తన కుటుంబాన్ని నడుపుకుంటూ ముందు కూరగాయలు అమ్ముకుంటూ భర్త లేకపోయినా ముగ్గురు మొగపిల్లలకు దూరంగా ఉన్న కూతురిని భర్త వదిలేసిన దగ్గర పెట్టుకొని జీవనం సాగిస్తూ జీవితంలో ఎలా బతకాలి అన్నది పెద్ద నిధి లాంటి బాండాగారం రమైన బంగారాన్ని ఒక 300 తులాలని ఆమె తన కష్టంతో దాచి అది ఎవరికి ఇచ్చిందో నేను చెప్పనండి కచ్చితంగా మీరు సినిమా చూడాల్సిందే అప్పుడే మీకు ఆ రసపట్ట ఏమిటి అసలు మనిషి అంటే అంటే ఒక ఆడది ఎలా బ్రతకాలి భర్త లేకపోయినా భర్త వదిలేసినా
(07:22) లేదా భర్త చేతకానోడైనా సరే ఈ లోకంలో ఎలా బ్రతికి చూపించాలి అన్నది ఒక ఆడది కచ్చితంగా ఖచ్చితంగా నేర్చుకోవలసిన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి మన మధ్యనే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి ఇటువంటి ముసలవాళ్ళు గడుగ్గగాయలు అంటారు. పిల్లలకి ఆస్తులు ఇవ్వరు అలాని అక్కడ పిల్లలు చెడ్డవాళ్ళు కాదు ఆస్తులు అన్ని ఇచ్చేస్తే పెద్దవాళ్ళని చూడట్లేదు అది చాలా నిజం కానీ ఒక 80 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చేంతవరకు అట్టు పెట్టుకోకుండా రాధిక ఆఖరి నిమిషంలో ఆమె కష్టాన్ని దాచుకొని చాలా మనస్ఫూర్తిగా ఆమె ఉన్నప్పుడే అదంతా సెటిల్ చేసింది
(08:05) అనమాట అటువంటి గొప్ప మనసు కూడా ఉండాలి మనం సంపాదించిందంతా మనమే కట్టుకుపోం కదండీ ఆఖరికి అది పిల్లలకే చెందుతుంది. పిల్లలు ఎటువంటి వాళ్ళైనా దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ పరువుని మీరే తీసుకోకుండా కుటుంబంలో ఒక పెద్ద రోలు పోషిస్తున్నారు కాబట్టి ఆ గౌరవాన్ని మీరు దక్కించుకుంటూ ఇక్కడ మీ సంపాదన అయితే మీకు ఇచ్చే హక్కు ఉండదు అంటే మీ పుట్టింటి నుంచి తెచ్చినా లేదా మీరు కష్టపడి సంపాదించిందైనా రాధిక గారి లాగా మీరు ఎవరికీ ఇవ్వనవసరం లేదు అది మీ సొంతం అది మీ ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మనస్ఫూర్తిగా కానీ ఇక్కడ తరతరాలుగా వచ్చిన ఆస్తుల్ని మామగారు
(08:47) సంపాదించింది భర్త సంపాదించింది ఇంకా తరతరాలు ముందు ముందులు సంపాదించింది కూడా ఇవ్వకుండా కట్టడ చేసేవాళ్ళు ఉన్నారు. మరి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్నది కూడా అర్థం చేసుకోవట్లేదు మరి అటువంటి వాళ్ళందరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలి నీలో మార్పు రావాలి దీనితో పాటు శివకుమార్ గారు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనకి ఇచ్చారన్నమాట అదేమిటంటే పెద్దవాళ్ళ పట్ల పిల్లలు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా ఒక అద్భుతమైన సందేశం వెనకటి రోజుల్లో ఎంత కష్టం వచ్చినా తినటానికి తిండి లేకపోయినా దరిద్రాన్ని అనుభవిస్తున్న సరే పిల్లల్ని
(09:23) ఏ తల్లిదండ్రులు చంపుకోలేదండి వాళ్ళ పోషణ భారం మోస్తూనే ఉన్నారు పిల్లల కోసం బతికారు. మరి పెద్దవాళ్ళ పట్ల పిల్లలు అటువంటి బాధ్యత ఎందుకు వహించట్లేదు తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయేసరికి వాళ్ళు చనిపోవాలని కోరుకుంటున్నారు. అది ఎంత తప్పు అన్నది ఈ సినిమాలో మనకి అర్థమైనట్టు కళ్ళకు కట్టినట్టు చూపించారుఅన్నమాట.
(09:47) ఇది కూడా నాకు బాగా నచ్చింది. మనందరం ఖచ్చితంగా మారాలి. అలాగే ఇటువంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మన మధ్యకి రావాలని దీనినుంచి మనం ఒక మంచి మెసేజ్ తీసుకోవాలని చెప్పి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. తాయికలవి సినిమా చూసి మరి మీరేం నేర్చుకున్నారు మీకు ఎలా అనిపించింది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
(10:13) ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment