Thursday, May 28, 2026

 చిత్తశుద్ధి!
********
ఉదయాన్నే లేచి 
వేమన్న కు 
నమస్కరిద్దాం!

నమస్కారంతో 
సరిపెట్టొద్దు 
ఆచరిద్దాం!

సమాజం తీరును 
ప్రజలభాషలో 
గుండెలోతుల్లో!

ఉన్న నిజాన్ని 
చిన్నమాటల్లో 
విన్నవించాడు!

ఆత్మశుద్ధిలేని 
ఆచారమదియేల?
ఇదీ ప్రశ్న!

చిత్తశుద్ధిలేని 
శివపూజలేల?
మరోప్రశ్న!

ఆత్మశుద్ధిని 
చిత్తశుద్ధిని 
ప్రశ్నించాడు!

లేచింది మొదలు 
పూజలు!పూజలు!
చిత్తం స్వార్ధం!

సమాజాన్ని 
మార్చాలన్నా 
'శుద్ధి'అవశ్యం! 

'శుద్ధి' లేనిచోట 
'సిద్ధి' అసాధ్యం 
వందేళ్ళైనా!

ఏ సాధనకైనా 
చిత్తశుద్ధి కావాలి!
వేమన్నకు జై!

విజయానికి 
తొలిమెట్టు 
చిత్తశుద్ధి!
  *****
-తమ్మినేని అక్కిరాజు 
      హైదరాబాద్ 
       23-5-2026

No comments:

Post a Comment