*కొంతకాలం జీవించిన తరువాత జీవితం ఒక యాంత్రికమయిన దినచర్యగా మారడం మొదలవుతుంది. జీవితంలో కొత్తదనం కనిపించదు*.
*ఒక వలయం పూర్తయినప్పుడు, మరొక వలయం ప్రారంభం అవుతుంది. ఆ వలయాలు కొత్తవిగా, విభిన్నంగా ఉండవచ్చు. కానీ వాటన్నిటిలో విషయం మాత్రం ఒక్కటే ఉంటుంది*.
*మొదట మనిషి ప్రాధమికమయిన అవసరాలయిన కూడు, గూడు, గుడ్డ కోసం పని చేస్తాడు. అవి తీరిన తరువాత రుచికరమయిన భోజనం, విలాస వంతమయిన నివాసం, ఖరీదయిన బట్టలకు అలవాటు పడి పని చేస్తాడు*. *వీటిలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు*.
*అప్పుడు పెళ్లి చేసుకుని భార్య పిల్లలకు కూడా విలాసవంతమయిన కూడు, గుడ్డ, గూడు ఇవ్వడానికి పని చేస్తాడు. పిల్లలు పెరిగి పెద్దవారై వెళ్ళిపోతారు*.
*అప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వర్తమానంలో అస్తమానం సంపాదనలో మునిగి తేలుతూ, పెరుగుతున్న వయస్సుని, తరుగుతున్న ఆయుష్షుని, చెడిపోతున్న ఆరోగ్యాన్ని, పడిపోతున్న ప్రశాంత జీవనాన్ని పట్టించుకోకుండా పేరు ప్రఖ్యాతుల కోసం, విలాసవంతమయిన జీవనం కోసం తన విలువైన కాలాన్ని కాలరాసేస్తుంటాడు*.
*అంతలో జీవితం సాయం సంధ్యలోకి ప్రవేశిస్తుంది. శారీరక శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. మనసులో ఒంటరితనం చోటు చేసుకుంటుంది. మనసు మనుషుల కోసం వెదుకుతుంది. గతాన్ని తవ్వి చుస్తే సాధించింది పెద్దగా ఏమీ లేదని అనిపిస్తుంది. భవిష్యత్తు వైపు చుస్తే బ్రతికి ఉన్నంత వరకూ బ్రతుకుని ఈడ్చడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదనిపిస్తుంది*.
*మొదట్లో సంపాదన బతకడం కోసమే. మధ్యలో బ్రతకడం సంపాదన కోసమే. చివరలో బ్రతకడం బ్రతకడం కోసమే అన్నట్లుగా ఉంటుంది*.
*ఆలా కాకుండా బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలలో, ప్రతి దశలో ఆ దశ యొక్క విలువను పరమార్ధాన్ని గమనించి తదనుగుణంగా జీవిస్తే ప్రతి జీవిత దశ ఒక అందమయిన అనుభూతిని అందిస్తుంది*.
*అందుకే వేదాలు దర్మ అర్ధ కామ మొక్షాలు అనే నాలుగు పురుషార్ధాల రూపంలో మానవ జీవన గమ్యాన్ని మనకు తెలియ చేసాయి. ముందుగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న అంతరాన్ని అర్థం చేసుకోవాలి. కుటుంబం కోసం ధర్మంగా సంపదను(అర్ధం) సృష్టించాలి.ధర్మంగా సృష్టించిన సంపదతో దర్మ బద్ధమయిన కోరికలను (కామం)తీర్చుకోవాలి. కోరికల పర్వం ముగిసిన తరువాత కోరికలను మోక్షం వైపు మళ్ళించాలి*.
*బ్రహ్మచర్యం,గృహస్తం వానప్రస్తం మరియూ సన్యాసం అనే నాలుగు ఆశ్రమ ధర్మాలను ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకు అందించాయి*.
*బ్రహ్మచర్యం వ్యక్తిత్వాన్ని (character) వ్యవస్తాపితం చేసుకోవడం కోసం, గృహస్తం సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం కోసం, వానప్రస్తం సమైక్య జీవనం నుంచి ఏకాంత జీవితం వైపు దృష్టి సారించి అంతర ప్రపంచం వైవు ప్రయాణించడం కోసం, సన్యాసం ఇక్కడి నుంచి వచ్చామో తెలిసికొని, దేని కోసం మనిషి తన జీవితం అంతా వెచ్చించాడో అర్థం చేసుకొని,ఆ అనంత ఆనంద సాగరంలో చేరి అదృశ్యం కావడం కోసం*.
*బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలు అనే నాలుగు జీవిత దశలను, వేదాలు వివరించాయి*. *ఒక్కొక్క దశ దేని కోసమో నిర్ధిష్టంగా నిర్ణయించాయి*. *బాల్యంలో శీలసంరక్షణ(character)*
*యవ్వనంలో సంపాదన, కౌమారంలో కుటుంబ పరిరక్షణ, వార్ధక్యంలో ఆధ్యాత్మిక అవగాహన అని స్ప్రష్టం చేసాయి*.
*కాబట్టి మనిషి మర లాగా కాకుండా మన ఆధ్యాత్మిక శాస్త్రాలను అర్థం చేసుకుని అర్థవంతంగా జీవిస్తే జీవితం వ్యర్థ జీవితం కాకుండా సమర్ధవంతమయిన జీవితమవుతుంది*.
*శుభోదయం*
No comments:
Post a Comment