సంసారంలో ఉంటూ ముక్తి పొందడం సాధ్యమేనా? The Path of Wisdom for Householders #RamanaMaharshi Teachings
Author Name:Sviya Prerana
Youtube Channel Url:https://www.youtube.com/@Sviya_Prerana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9z4oUJc5vWA
Transcript:
(00:00) భగవాన్ పురాణాలలో జడభరతుడు వంటివారు అడవులకు వెళ్లి తపస్సు చేసుకున్నారు. కానీ మావంటి సామాన్యులం సంసార బాధ్యతల్లో చిక్కుకుపోయాం. ఇన్ని పనుల మధ్య నేను ఎవరు అని విచారణ చేయడం ఎలా సాధ్యం? మాకు ముక్తి లభిస్తుందా? [సంగీతం] నాయనా దానికి శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య జరిగిన ఒక చిన్న సందర్భాన్ని ఉదాహరణగా చెప్తాను విను.
(00:30) ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు కృష్ణ నిరంతరం యుద్ధాలు రాజ్యపాలన చేసే నేను నిన్ను ఎలా చేరుకోగలను బాధ్యతలు లేని సన్యాసులే కదా ధన్యులు అని అప్పుడు కృష్ణుడు అర్జునుని ఒక పెద్ద నూనె గిన్నెను తలపై పెట్టుకొని నగరం మొత్తం చుట్టి రమ్మన్నాడు. కానీ ఒక నిబంధన ఒక్క చుక్క నూనె కింద పడినా నీ తల తెగిపోతుంది అని హెచ్చరించాడు. [కేరింతలు] అర్జునుడు భయం భయంగానే నగరమంతా తిరిగి వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడిగాడు
(01:16) నగరంలో విశేషాలుఏంటి? ప్రజలు ఏం చేస్తున్నారు? ఏమేం చూశవు అని అర్జునుడు అన్నాడు దేవా నా దృష్టి అంతా ఆ నూనె చుక్క మీదే ఉంది. చుట్టుపక్కల ఏం జరిగిందో నాకు తెలియదు అని అప్పుడు కృష్ణుడు నవ్వి జీవితం కూడా ఇంతే నీ బాధ్యతలు నీ తల మీద ఉన్న నూనె గిన్నె లాంటివి. నువ్వు పనులు చేస్తున్న నీ దృష్టి మాత్రం అంతరాత్మ అంటే నూనె చుక్క మీద ఉంటే ఏ సంసార బంధము నిన్ను తాకదు అని బోధించాడు.
(01:56) పనిని వదలడం సన్యాసం కాదు పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను వదలడమే నిజమైన సన్యాసం స్థానం ముఖ్యం కాదు స్థితి ముఖ్యం. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది కాదు నీ మనసు ఎక్కడ ఉంది అన్నది ముక్తికి మార్గం. బాధ్యతలను భగవంతుడి సీవగా భావించు అప్పుడు ప్రతి పని ఒక ప్రార్థన అవుతుంది నాయనా.
No comments:
Post a Comment